March 21, 2013


కొయ్యలగూడెం:వ్యాట్‌ను రద్దు చే సి వస్త్ర వ్యాపారస్తులను ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ మొడి యం శ్రీనివాస్ కోరారు. గురువారం కొయ్యలడూడెంలో వ్యాట్‌ను నిరసి స్తూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న వ్యాపారస్తులకు టీడీపీ ఆద్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్బగా ఆయన మా ట్లాడుతూ వ్యాట్ వల్ల వ్యాపారస్తులు నష్టపోతారన్నారు. ఎంతో మంది వ్యా పారస్తులు, వర్కర్లు వస్త్ర వ్యాపారంపై నే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో రైతులకు, వ్యాపారస్తులకు మనుగడ లేదని విమర్శించా రు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాట్ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు గంగిరెడ్లమెగళాదేవి, మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి రామారావు, టీడీపీ మండల ప్రదాన కార్యదర్శులు రాచూరి మదన్, బొబ్బ ర రాజు, న్యాయవాది సోబన్‌బాబు, రామకృష్ణ, రాజు, నీలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

వ్యాట్‌ను రద్దు చేయాలి


నిన్నటివరకు నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర జిల్లాలో కొనసాగిన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చింది. నియోజకవర్గాల వారీగా జరిపిన సమీక్షలు కొంతమేరకు సత్ఫలితాలు ఇచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కార్యక్రమాలపై దృష్టి సారించడంతో పాటు ప్రజలలోకి వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారు.

(జంగారెడి ్డగూడెం

జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ముగిసిన మరుసటిరోజే కరెంటు కోతలకు నిరసనగా ఆందోళనలు, ఆధార్ కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంపై ధర్నాలు వంటివి చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్ళాలనే కృతనిశ్చయంతో తెలుగు తమ్ముళ్ళున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించనున్న తరుణంలో పార్టీ కేడర్‌లో చంద్రబాబు నింపిన ఉత్సాహం టానిక్‌లా పనిచేస్తున్నది. స్తబ్దతగా ఉన్న ముఖ్యమైన కేడర్‌లో కదలిక వచ్చింది. గ్రామ కమిటీలను యాక్టివ్ చేయడంతో పాటు పూర్తి స్థాయి కమిటీలను సమర్థవంతంగా పనిచేయించాలనే సంకల్పంతో తెలుగు తమ్ముళ్ళు ముం దుకు కదులుతున్నారు. చంద్రబాబు పాదయాత్ర కారణంగా నెలకొన్న ఉత్సాహం సడలిపోకుండా కొనసాగించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలో నెలకొన్న గ్రూపు విబేధాలకు చెక్‌పెట్టి కేడర్‌నంతా ఏకతాటిపైకి తెచ్చేందుకు సీనియర్‌లు ప్రయత్నిస్తున్నారు. గత సొసైటీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్య కార్యకర్తలకు కర్తవ్యబోధ చేస్తున్నారు. పంచాయతీల వారీగా సామాజిక వర్గాలను విశ్లేషిస్తూ బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు.

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ ఇటీవలే జరిగిన మండల టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు జరిపిన సమీక్షలో క్షేత్రస్థాయి కమిటీల బా ధ్యులు హాజరు కాకపోవడంపై ఆయ న ఒకింత అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కింది నుంచి పై స్థాయి వరకు ఉన్న పార్టీ బాధ్యులను కార్యోన్ముఖులను చేసేందుకు సీనియర్లు నడుం బిగించారు. ఎలాగైనా సరే రానున్న స్థానిక పోరులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గానికి నాయకత్వలేమి ఉందంటూ కార్యకర్తలు బాబు దృష్టికి తీసుకువచ్చిన విషయంపై స్పందించిన ఆయన ఏడుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. 2014లో జరగనున్న సాధారణ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై కూడా సమన్వయ కమిటీ దృష్టి సారించనుంది. ధీటైన అభ్యర్థిని అన్వేషించే పనిలో నియోజకవర్గ సమన్వయకర్తలున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని పార్టీ కేడర్ కు దిశా నిర్ధేశం చేసేందుకు న్నద్దమవుతున్నారు ఏయే కార్యక్రమాలను ఎపుడెపుడు నిర్వహించాలనే అంశంపై ఒక ప్రణాళిను రూ పొందించే పనిలో పడ్డారు. ముందుగా కేడర్‌ను సమాయత్త పరిచి తరువాత ప్రజలలోకి వెళ్లాలనే భావనలో తెలుగు తమ్ముళ్లున్నారు. మొత్తం మీద చంద్రబాబు పాదయాత్ర పార్టీ కేడర్‌లో నూతనోత్సాహన్ని నింపింది.

పదండి ముందుకు

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు రాజమండ్రి అమలాపురం పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. రాజమండ్రికి ఇప్పటికే ప్రజల్లో పనిచేస్తున్న ప్రముఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్‌ను పేరును గతంలోనే ఖరారు చేశారు. కాగా, అమలాపురం లోక్‌సభ నియోజక వర్గానికి గొల్లపల్లి సూర్యారావును ఇన్‌చార్జిగా నియమించారు.

అంతేకాక ఆయనే పార్టీ అభ్యర్థి అని ప్రకటించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని వెల్లడించారు. సూర్యారావు కు మాజీ మంత్రిగా అనుభవం ఉండడమే కాక పలుకుబడి, సమర్థత ఉన్న నాయకుడన్నారు. బాలయోగిలా ధైర్యంగా పనిచేయాలని సూర్యారావుకు సూచించారు.

రాజమండ్రికి మురళీమోహన్.. అమలాపురానికి గొల్లపల్లి


విశాఖపట్నం: ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ శుక్రవారం నగరానికి రానున్నారు. శనివారం పాయకరావుపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఇందులోభాగంగా ముందుగానే నగరానికి వస్తారు. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు విమానాశ్రయానికి చేరుకుని పార్కు హోటల్‌లో బస చేస్తారు. కాగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఎయిర్‌పోర్టుకు రావాల్సిందిగా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు కాళ్ల శంకర్ ఒక ప్రకటనలో కోరారు.

నేడు విశాఖకు బాలయ్య రాక

రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో దొరికింది. నేను కంబాల చెరువు వెళ్లినప్పుడు ఒక ఆడపడుచు వ్యక్తం చేసిన ఆవేదన నేటి ఏలికల తీరును ఎండగట్టింది. "రాష్ట్రంలో అసలు పాలన అనేది ఉంటే... పాలకులు సమర్థులైతే నేను ఈరోజు నడిరోడ్డు పైకి వచ్చి మీకు మొర పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు'' అని ఆ మహిళ వాపోయింది.

ఇంతకంటే ఈ రాష్ట్ర దుస్థితికి నిదర్శనం ఇంకేం కావాలి? ఆ మహిళ ఒక్కరే కాదు.. "ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం, కానీ.. ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది'' అని దారిపొడవునా ఎందరో పేదలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. సామాన్యుల దుస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రాన్ని దోచుకున్నవారు మాత్రం బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రాజభవనాలను తలపించేలా ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఈ పేదలకు వాళ్లు ఒరగబెట్టింది ఇదేనా?

కొందరు విద్యుత్ ఉద్యోగులు గురువారం నన్ను కలిశారు. ఆ శాఖలో మాదిరిగానే వారి ముఖాల్లోనూ వెలుగులు లేవు. ప్రజలపై తమ చేతులతో భారం వేయాల్సి వస్తోందన్న బాధ ఒకవైపు.. తమ బతుకులు సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్న వ్యథ మరోవైపు వారిలో కనిపించింది. "ఈ దుర్మార్గ పాలనలో మేం నిమిత్త మాత్రులం. మా సమస్యలకే అతీగతీ లేదు'' అని వారు నాతో చెప్పుకొని గుండెల్లో భారాన్ని దించుకున్నారు. వీరందరినీ చూశాక నాకు అనిపించింది ఒక్కటే.. 'ఈ వ్యవస్థకు గత వైభవం తేవాలి' అని!

ఈ వ్యవస్థకు గత వైభవం తేవాలి

బ్రాహ్మణుల కోసం నిధి
వారికి చట్టసభల్లోనూ పదవులిస్తాం
తూర్పు పాదయాత్రలో చంద్రబాబు హామీలు
ప్రజా కోర్టులో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను చిత్తు చేయండి
యువతకు టీడీపీ అధినేత పిలుపు

 రాజమండ్రి: యువతే మనదేశానికి బలమని, అటువంటి శక్తివంతమైన యువత అవినీతిపై పోరాటం చేయాలని టీడీ పీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకప్పుడు సమాజాన్ని శాసించిన బ్రాహ్మణులు ఇవాళ అన్ని విధాలుగా వెనుకబడిపోయారని వారికి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారి కోసం ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 'వస్తున్నా మీకోసం' అంటూ ఆయన చేపట్టిన పాదయాత్ర తూ ర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా గురువా రం ఆయన పలు చోట్ల ఉద్వేగభరిత ప్రసంగాలు చేశారు.

ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి అవినీతి ఆటంకంగా మారిందని, యువత.. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, ఫూలే, ఎన్టీ రామారావు వంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఒక రుగ్మతగా మారిన అవినీతిపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కిరికిరి సీఎం కిరణ్ రాజీవ్ యువ కిరణాల పేరిట కోటి ఉద్యోగాలు ఇస్తున్నానని కోతలు కోస్తున్నారని విమర్శించారు. కిళ్లీ షాపులు, కాఫీ హోటళ్లు, బట్టల కొట్లు మద్యం దుకాణాలు, ప్రైవేట్ కంపెనీల్లో చేరిన వారందరి జాబితా తయారుచేసి వీరందరికి తానే ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నారని, ఇదంతా ఓ ఫార్స్ అని చంద్రబాబు విమర్శించారు.

తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం తెచ్చిన ఎన్టీ రామారావు కుగ్రామమైన నిమ్మకూరులో పుట్టి సైకిల్ మీద వెళ్లి చదువుకుని రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించారని, అక్కడ అవినీతిని చూసి భరించలేక రాజీనామా చేశారన్నారు. తరువాత సినిమారంగంలోను, రాజకీయాల్లోను తనదైన ముద్రను వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తన వద్ద పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎన్నికల ప్రధాన అధికారులుగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్‌లుగా ఎదిగితే వైఎస్ వద్ద పనిచేసిన వారు జైలుపాలయ్యారని చెప్పారు.

ఇంకా సచివాలయంలో కొందరు దొంగలు ఉన్నారని వాళ్లు కూడా జైలుకు పోతే సచివాలయం ఖాళీ అయిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు దోపిడీ చేసిన రాజశేఖరరెడ్డి కొడుకు జైలు పాలయ్యాడని అతనికి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపై పోరాటం చేసి.. పిల్ల, తల్లి కాంగ్రెస్‌లను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టి చిత్తుగా ఓడించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. వైఎస్ అల్లుడు మత గురువు ముసుగులో దోపిడీ చేస్తున్నాడని, బావమరిది ఎర్రచందనం స్మగ్లింగ్, కల్తీ ఎరువుల వ్యాపారం చేస్తున్నాడని ఇటువంటి వారి మాటలు నమ్మితే యువతకు శిక్షణ ఇచ్చి జేబు దొంగలుగా తయారుచేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

ఇవాళ యువ నా యకత్వం ఎంతైనా అవసరముందని 33 శాతం సీట్లు యువకులకే ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. పలు బ్రాహ్మణ సంఘాలు కోరుతున్న విధంగా బ్రాహ్మణ నిధి ఏర్పాటు, పూజారుల ఉద్యోగ విరమణ వయస్సు పెంచే విషయం ఆలోచిస్తానని, అగ్రకుల పేద విద్యార్థులందరికి వసతి గృహ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. రాజమండ్రిలో ఆయన పాదయాత్రకు అనూహ్యస్పందన లభించింది. మహిళలు హారతులు ఇవ్వగా,యువత నీరాజనం పట్టారు.

విశాఖలో వచ్చే నెల 20నపాదయాత్ర ముగింపు

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను వచ్చే నెల 20న విశాఖలో ముగించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటే జేబుదొంగలవుతారు

157 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర. అలుపెరగని కష్టం. జనం అభిమానం ముందు చంద్రబాబు జిల్లాలో పన్నెండు రోజులు పడిన కష్టం పార్టీకి కలిసొచ్చింది. ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న కార్యకర్తల్లో కసి పెంచింది. నాయకుల కాళ్లు అరిగేలా చేసింది. రాబోయే ఎన్నికలకు ఈ పాదయాత్ర తొలి శ్రీకారం చుట్టింది. జనం సమస్యలు తెలిశాయి. వారిలో పార్టీని గెలిపించాలన్న కాంక్ష బయటపడింది. ఇతర పార్టీలపై ఉన్న అసంతృప్తి రహస్యం బట్టబయలైంది. గత కొద్దికాలంగా టీడీపీలో ఒక నిరుత్సాహకర వాతావరణం బాబు పాదయాత్రతో కొంతలో కొంతైనా తొలగింది. పార్టీ అధినేతే స్వయంగా పాదయాత్ర చేస్తుండటంతో ఆయనను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కన్వీనర్లు, సీనియర్ నాయకులకు కూడా పని తగిలింది.

ఉదయం, అర్ధరాత్రి ఎమ్మెల్యేలు, కన్వీనర్లకు చంద్రబాబు హాజరు వేశారు. దీంతో తప్పించుకోలేని వీళ్లంతా కాళ్లరిగేలా ఆయన వెంటే నడిచారు. సుమా రు 157 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో పార్టీ ముఖ్యులంతా నిరంతరం కొనసాగారు. ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, శివరామరాజు, టీవీ రామారావు, చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లు అనుసరించారు. వయసు పైబడినా ఖాతరు చేయకుండా డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, డాక్టర్ బాబ్జీ కూడా ఆది నుంచి తుది వరకు బాబు వెంటే ప్రయాణించారు. మోకాళ్లు ఇబ్బంది పెడుతున్నా తణుకు కన్వీనర్ వై.టి. రాజా పాదయాత్రలో ఆసాంతం కొనసాగారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పీతల సుజాత, మేఘలాదేవి, సరళాదేవి, డాక్టర్ రాజ్యలక్ష్మి, రాధ వంటి మహిళా నేతలు ఎక్కడా వెనకడుగు వేయలేదు.

బహుదూరపు బాటసారి బాబునే అనుసరించారు. పార్టీ కన్వీనర్లు గాదిరాజు బాబు, ముళ్లపూడి బాపిరాజు, గన్ని వీరాంజనేయులు, శ్రీరాములు, అంబికా కృష్ణ, ముడియం శ్రీనివాస్ తదితరులంతా కాళ్లకు పనిచెప్పారు. అధినేత పాదయాత్ర చేస్తున్న మార్గంలో వీరంతా రోడ్డుకు ఇరువైపులా ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది మందిని సమన్వయ పరిచారు. వీరు బాబుకు చేరువయ్యేలా పన్నెండు రోజుల పాటు అర్ధరాత్రి వరకు శ్రమిస్తూనే వచ్చారు. వీళ్లంతా ఒక ఎత్తయితే పార్టీ సీనియర్ నేతలు పాలి ప్రసాద్, జగదీష్‌బాబు, నాయుడు రామచంద్రరావు, పాకలపాటి గాంధీ, ఏపూరి దాలయ్య, బడేటి బుజ్జి, కొక్కిరిగడ్డ జయరాజు, వీరవాసరం దాసు వంటి వారు అధినేతను అనుసరించిన వారిలో ఉన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే వీరందరిలోనూ ఎన్నికల ఉత్సాహం కన్పించింది. చంద్రబాబు పాదయాత్ర పార్టీలో యువతలో ఉత్తేజం రేకెత్తించింది. నియోజకవర్గాల సమీక్షల్లో పార్టీ నేతల పనితీరు కూడా బట్టబయలైంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇప్పుడే స్థితిలో ఉందో కార్యకర్తలే స్వయంగా పార్టీ ర్రాష్ట అధ్యక్షుడి దృష్టికి నేరుగా తీసుకువెళ్లారు. కొన్ని సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఖారారు చేసే విషయంలో జాప్యం వద్దంటూ కీలక సూచనలు అధిష్టానం ముందుంచారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న లుకలుకలు కార్యకర్తల నోట విన్న చంద్రబాబు ఆయా నియోజకవర్గాల కన్వీనర్లకు చురకలు అంటించారు. పాదయాత్ర నిరంతరాయంగా కొనసాగడం ఒక ఎత్తయితే ప్రజల నుంచి వచ్చిన మద్దతు సహజంగానే పార్టీ నేతలందరికీ పూర్తి సంతృప్తినే ఇచ్చింది. పార్టీకి మంచి రోజులు వచ్చాయన్న సంకేతాలనిచ్చింది. నాయకుల్లో ఉన్న నిరుత్సాహం స్థానంలో చురుకుదనం పుట్టించింది. దీనికి తోడు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనడం కూడా పార్టీకి శుభసంకేతంగా భావిస్తున్నారు.

కాళ్లు అరిగినా తృప్తి మిగిలింది


నరసరావుపేట రూరల్: రాబోయే పంచాయతీ, మండల, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీదే విజయమని మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పమిడిపాడు గ్రామంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ వద్ద గ్రామస్తులనుద్దేశించి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ 175 రోజులుగా అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నాడని, 63 సంవత్సరాల వయస్సులో ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడన్నారు.

రైతులు, రైతు కూలీలు, దళితులు, మైనార్టీలు చంద్రబాబు నాయుడికి ఆశీస్సులు అందిస్తున్నారన్నారు. వ్యవసాయదారులు అప్పుల్లో కూరుకుపోయారని, పండించిన ధాన్యం, మిర్చి, పత్తికి గిట్టుబాటు ధర లేదన్నారు.

రైతు వద్ద ధాన్యం ఉన్న సమయంలో రూ. 750 అమ్మితే ఇప్పుడు అదే ధాన్యం రూ. 1800 పలుకుతుందని, దీంతో దళారీలు బాగు పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం రుణమాఫీపై చేస్తారన్నారు. గ్రామంలో అనేక రోడ్లు, కాలనీలు, పొలాలకు రోడ్లు వేయించామని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాన ఏం పనులు చేశారో అడగాలన్నారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను వదిలి వేశారని, మంత్రి, మంత్రి కుమారుడు దోచుకుంటున్నారని, ముడుపులు ఇస్తేనే నరసరావుపేటలో పని జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కూలీ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన పమిడిపాడు గ్రామస్తులకు చెందిన 400 ఓట్లు అధికారులు తొలగించారని, మన ఓట్లు చేర్చుకొని దొంగ ఓట్లు తొలగించాలన్నారు. సహకార ఎన్నికల్లో ఆందోళన చేస్తే లాఠీ చార్జీలు చేసి, కేసులు పెట్టి జైలులో పెట్టినా భయ పడలేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు జైలుకు వెళ్తున్నారని, భ్రస్టుపడిన ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహనరెడ్డి లక్ష కోట్లు సంపాదించటం దుర్మార్గమని, అది అంతా పేద ప్రజల డబ్బేనన్నారు. గ్రామంలో పారా నాగేశ్వరరావు, శంకరయ్య, అప్పారావు, మరో వందమంది టీడీపీలో చేరటాన్ని ఆయన ఆహ్వానించారు. పూలు చల్లుతూ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మహిళలు తిలకందిద్ది హారతులు పట్టారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూనాటి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నరమాల శ్రీను, మాజీ జడ్పీటీసీ పెండ్యాల అప్పారావు, ఇస్సపాలెం మాజీ సర్పంచ్ పమిడి జగన్నాధం, బత్తుల వెంకటేశ్వర్లు, చల్లా పాపారావు, చల్లా అంజయ్య, సాంబయ్య, కేతు పుల్లయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రి యాదవ్, షేక్ బాబు, కొట్టా కిరణ్ కుమార్, కొల్లి ఆంజనేయులు, శీలు బాబూరావు, కళ్యాణం రాంబాబు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయం : కోడెల

చారిత్రక నగరమైన రాజమండ్రిని హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తానని ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటుచేయడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి ఇక్కడ వారికే ఇక్కడే ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు హమీ ఇచ్చారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద సెంటర్‌లో ఆశేష ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇది పారిశ్రామిక వ్యాపారిక కేంద్రమని, ఇక్కడ గ్యాస్ ఉంది. నీళ్లు ఉన్నాయి. బాగా పనిచేసే మీరు ఉన్నారు ఇంకేటి ఇక్కడ అభివృద్ధి సంగతి తాను చూసుకుంటానన్నారు. రోడ్లు, డ్రైనులు, ఇళ్లుతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో మంచి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

అపూర్వ స్వాగతం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. ఏకంగా గోదావరి బ్రిడ్జి మీద నుంచి కొవ్వూరువైపునకు వెళ్లి ఆయనతో కలిపి పాదయాత్ర చేసుకుంటూ జిల్లాలో ప్రవేశించారు. మొదట చంద్రబాబు కేక్ కట్ చేసి ప్రజలు స్వాగతం అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, సీనియర నేత గన్ని కృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చిన్నరాజప్ప, మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అనేక మంది నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

గోదావరి బ్రిడ్జి మీద బాబు పాదయాత్ర: రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద చంద్రబాబు నాయుడు సుమారు రెండున్నర గంటలపాటు పాదయాత్ర చేశారు. సుమారు 4 కిలోమీటర్ల పొడవు వున్న ఈ బ్రిడ్జి మీద జన తాకిడితో ఈ పాదయాత్ర చాలా ఉత్సాహంగా సాగింది. బాబు ఉల్లాసంగా ఎవరో ఒకరితో మాట్లాడుతూ మధ్యమధ్యన ప్రజల స్వాగతాన్ని స్వీకరించి పాదయాత్ర సాగించారు. మధ్యలో ఆయనకు రైతులు నాగలి బహూకరించారు.

మహిళలు హారతి ఇచ్చారు. గోదావరిలో వందలాది పడవలకు పసుపు జెండాలు అలంకరించి మత్స్యకారులు స్వాగతం పలికారు. బ్రిడ్జికి అలంకరించిన పసుపు జెండాలు చల్లటి గాలికి రెపరెపలాడడంతో పాటు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో బాబు యాత్ర ఉత్సాహంగా సాగింది. మధ్యమధ్యలో బాబు గోదావరిని చూస్తూ తగ్గిన నీరును అక్కడ మత్స్యకారులను, చుట్టు వున్న పరిసరాలను కూడా పరిశీలించారు

మహానుభావులను స్మరిస్తూ...

రాజమండ్రి: చంద్రబాబు రాజమండ్రిలో ప్రవేశించగానే ప్రకాశపంతులు, ఆదికవి నన్నయ్య, వీరేశలింగం, రాజరాజనరేంద్రుడు వంటి మహానుభావులను స్మరించారు. వారితో ఈ చారిత్రక రాజమండ్రితో వున్న సంబంధాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు కూడా ఈ ప్రాంతమంటే ఎంతో ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ తెలుగును బాగా మాట్లాడవారే, ప్రేమించేవారు ఇక్కడ అధికంగా ఉన్నారన్నారు.

మంచి సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న ప్రాంతమని గోదావరి పుష్కరాల సమయంలో ఎంతో అభివృద్ధి చేశానని కాని ఇవాళ కాంగ్రెస్ దొంగలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఇక్కడ పరిస్థితిని చూస్తే బాధకలుగుతుందన్నారు. రోడ్ కం రైలు బ్రిడ్జి మీద ఎవరైనా గర్భవతి వస్తే ఆసుపత్రి అవసరం లేకుండా డెలివరి అవుతుందని బ్రిడ్జి పరిస్థితిని విశదీకరించారు. కందుకూరి వీరేశలింగం సాంఘిక విప్లం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం ఈ ప్రాంతానిక గత చరిత్రగా మిగిలిపోయాయనని కాని ఈ ఇవాళ గజదొంగల పాలనలో ఈ ప్రాంతం అణగారిపోతుందన్నారు.

రాజమండ్రిని హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తా..

'పేదవాడి ప్రాణం కంటే నా ప్రాణం గొప్పకాదు. పేదల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నాను. నాకేం కోరికలు లేవు. పదవీ కాంక్ష కూడా లేదు. మీ దయవల్ల తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. మీ సమస్యలే నా సమస్యలు, మీ కష్టాలే నా కష్టాలుగా చూస్తున్నాను. అప్పట్లో మనల్ని చూసి బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఈ కాంగ్రెస్ దొంగలు అధికారంలోకి వచ్చి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని జైల్లో నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ' అని చంద్రబాబు విమర్శించారు

చంద్రబాబు 'మీ కోసం వస్తున్నా' 170వ రోజు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 13 కిలోమీటర్ల మేర సాగింది. ఈసందర్భంగా చంద్రబాబు విద్యుత్ కోతల గురించీ, చార్జీల వడ్డన గురించీ, గ్యాస్ సమస్యల గురించీ ప్రస్తావించారు. కాంగ్రెస్ దొంగల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయన్నారు. ధరల పెరుగుదలతో పేద, సామాన్య వర్గాలు సతమతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 'నేను మీ ఇంట్లో పెద్దకొడుకులాంటివాడ్ని. ప్రయోజకుడైన కొడుకు ఎలా కుటుంబాన్ని ఆదుకుంటాడో.. రేపు అధికారంలోకి వచ్చాకా నేనూ ఆ పని చేస్తాను. ఎన్నికల ఒక్క రోజూ నాకివ్వండి.. ఐదేళ్లూ మిమ్మల్ని ఆదుకునేందుకు నేను కష్టపడతాను..' అన్నారు.

జన గోదావరి

దేవీచౌక్ చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్ళు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాలతో పాటు నగర మంతా టీడీపీ జెండాలతో నింపేశారు. చంద్రబాబుకు ముందు పసుపు రంగుల చిచ్చుబుడ్డులు ఏర్పాటు చేశారు. పసుపు బుడగలు, గాలిలో ఎగిరే విధంగా ఏర్పాటు చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ జెండాలు చేతపట్టి చంద్రబాబుకు స్వాగతం పలికారు. యువకులు ద్విచక్రవాహనాలపై సందడి చేశారు. కొండరు కార్యకర్తలు కొవ్వూరు, రాజమండ్రికి బైక్ ర్యాలీతో హల్‌చల్ చేశారు.

దేవీచౌక్ : రాజమండ్రి మెయిన్ మార్కెట్‌లోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. షాపులో పని చేసే మహిళలు, మార్వాడీలు చంద్రబాబుకు హారతులు పట్టారు. చంద్రబాబును చూడటానికి ఆసక్తి చూపారు. ఒక్కసారి మాట్లాడాలని కోరడంతో చంద్రబాబు వారివద్దకు వెళ్ళి పలకరించారు. వాళ్ళ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అంతా పసుపుమయం


రాజమండ్రి : తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షసపాలనలో అందరికీ ఇబ్బందులే. ఓ వైపు కరెంటు ఉండదు. మరో వైపు వేలకు వేలు కరెంటు బిల్లులు. కిరికిరి ముఖ్యమంత్రి పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఇలాంటి పాలన నుంచి మనకు విముక్తి కలగాలంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను పాతాళంలోకి తొక్కాలి. నాకు కాళ్లు నొప్పులు పుడుతున్నాయ్. అయినా మీ అభిమానమే నడిపిస్తోంది. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను.,, అంటూ చంద్రబాబు నాయుడు ఉద్వేగంగా మాట్లాడారు. వస్తున్నా మీ కోసం 170వ రోజు యాత్ర రాజమండ్రిలో 13 కిలోమీటర్ల మేర సాగింది. ఈ యాత్రలో భాగంగా బుధవారం రాత్రి నగరంలో అనేక వర్గాల జనంతో బాబు మమేకమయ్యారు.

కోటిపల్లి బస్టాండ్‌లో వేలసంఖ్య జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఆనందోత్సాహాలతో ప్రసంగం చేశారు. పావుగంట మాట్లాడాలనుకున్న ప్రసంగాన్ని జనం ఉత్సాహాన్ని గమనించి ముప్పావుగంట సేపు ప్రసంగించారు. జనం ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. మీ కష్టాలు నేరుగా చూసి సంఘీభావం తెలపడానికి వచ్చానంటూ అన్నివర్గాల జనాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. పేదల కష్టాలను ఎక్కడిక్కడ ప్రస్తావించడం.. టీడీపీ అధికారంలోకి వస్తే వాటిని ఏవిదంగా పరిష్కరిస్తారో వివరించి చెప్పడంలో చంద్రబాబు జనాన్ని ఆకట్టుకున్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో అందరికీ ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు.

దొంగల పార్టీ అది: దొంగే దొంగ.. దొంగ అన్నరీతిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. ఎమ్మెల్యేలను కొంటున్నారు. నీచరాజకీయాలు నడుపుతున్నారు. జైలుకె ళ్లి ఆ పార్టీలో కలుస్తారా? ఎంత దారుణం? అని చంద్రబాబు ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ హయాంలో దోచుకున్న సొమ్మును రికవరీ చేసి పేదలకు పంచుతామన్నారు. త్వరలో పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌లో కలిసిపోతుందని చంద్రబాబు జోశ్యం చెప్పారు.

అల్లుడా మజాకా: బ్రదర్ అనిల్ పేరుకు మతగురువు. చేసేది దోపిడీ.. అని చంద్రబాబు ఆరోపించారు. అనిల్ అక్రమాలకు అంతులేదన్నారు.పులివెందుల రాజకీయాలు రాష్ట్రంలో చేయాలంటే కుదరదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రౌడీలు, గూండాలను ఏరిపారేస్తామన్నారు.

మురళీమోహన్‌ని గెలిపిస్తే... పేదలకు సేవచేస్తున్న మురళీమోహన్‌ని గెలిపించి ఉంటే రాజమండ్రికి మేలు జరిగేదని చంద్రబాబు అన్నారు. పేద విద్యార్థులకు ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్న మురళీమోహన్‌ని చంద్రబాబు అభినందించారు. అలాంటి మంచి మనిషిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

బాబు వెంట నేతల పరుగులు: చంద్రబాబు పాదయాత్రలో పార్టీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గరికపాటి మోహనరావు, చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, గన్ని కృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు. కిలోమీటరు కూడా నడకుండానే చాలామంది నేతలు వాహనాలు ఎక్కేశారు.

పసుపు మయం: చంద్రబాబు పాదయాత్రలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు వేలాదిమంది బాబు వెంట నడిచారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్, కోటగుమ్మం, దేవీచౌక్, నం దం గనిరాజు జంక్షన్, ఏవీఏ రోడ్, దానవాయిపేట, టి నగర్, కంబాలచెరువు తదితర ప్రాంతాలు జెండాలతో పసుపుమయమయ్యాయి. నగరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, మాదిగ దండోర డప్పులు.ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

గోదారమ్మకు వందనం

రాజమండ్రి,: ప్రజా సమస్యలపై అవిశ్వాసం పెట్టాలి కాని స్వలాభం కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు అన్నారు. రాజమండ్రి పాదయాత్రలో ఆయన ప్రభుత్వంలో ని ప్రతీ లోపాన్ని ఎత్తిచూపి ఇది నిజమా కాదా, నిజమైతే చేతులెత్తండి అంటూ అభిప్రాయాన్ని కోరడంతో ప్ర జల నుంచి విశేష స్పందన లభించిం ది. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడకోసం అవిశ్వాసం పెట్టాలి కాని స్వలాభం కోసం కాదన్నారు. వైఎస్సార్‌సీపీ జైలులో వున్న వ్యక్తికి బెయిల్ కోసం అవిశ్వాసం పెడి తే టీఆర్ఎస్ బ్లాక్‌మెయిల్ చేయడం కోసం అవిశ్వాసం పెట్టిందన్నారు.

ఏకధాటిగా 48 నిమిషాలు పాటు సాగిన బాబు ప్రసంగంలో అనేకసార్లు ప్రజల అభిప్రాయాలను కోరారు.

తనకు అధికారం మీద వ్యామో హం లేదని తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగానూ, మరో తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నానని తన రికార్డును ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే మరో 20ఏళ్లు పడుతుందన్నారు. తా ను చెప్పేవి నిజం కాదని మీరు చెబితే ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోతానని, నేను చెప్పేవన్ని నిజమేనని ఒప్పుకుంటే చేతిలెత్తాలని ప్రజల ను కోరారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నరా లేదా అని ఆయన ప్రశ్నించగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు జవాబు ఇచ్చారు. రాజమండ్రిని పుష్కరాల సమయంలో ఎంతో అభివృద్ధి చేసానని తరువాత ఇప్పటి వరకు కాంగ్రెస్ దొంగలు ఏమైనా పట్టించుకున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఇక్కడ పరిస్థితులను చూస్తుంటే బాధేస్తుందన్నారు.

1999 నుంచి విద్యుత్ కొరత ఉంటే తరువాత విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి విద్యుత్ కొరత లేకుండా చేసానని చెప్పారు. పేదలు, మ«ధ్యతరగతి కుటుంబాలు ఇంకా అనేక వర్గాలు వి ద్యుత్ దీపం కూడా వెలిగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటువంటి సమస్యలు మీద పోరాడాల్సిన అవస రం ఉందన్నారు. ఇవాల్టి రాష్ట్ర పరిస్థితులకు వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు కారకులేనని, ము డుపులు కోసమే విద్యుత్ వ్యవహారం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు గ నులను దోచుకున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకే గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను దేశమంతా సరఫరా చేస్తూ ఇక్కడ ప్రజలకు మాత్రం ఇవ్వడంలేదని విమర్శిం చారు.

ఇక సైకిలే గతిని, మీరు సైకిల్‌కు రిపేరు వస్తే బాగుచేయించుకుని ముందుకు వెళ్లునట్లుగా నా కాళ్లకు నొప్పులు వస్తున్నా రిపేరు చేయించుకుని మీ కోసం ముందుకు వస్తున్నానన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తాను ఉన్నప్పుడు కేజీ రూ.10 వున్న సన్న బియ్యం రూ.50, రూ.12 వున్న చక్కెర రూ.45, రూ.22 వున్న పప్పుడు రూ.80, రూ.2వున్న ఉప్పు రూ.12 అయిపోయాయని అన్నారు. గతంలో జేబు నిండా డబ్బు తో సంతకెళ్లి సంచినిండా సరుకులు తెచ్చుకునేవారమని కానీ ఇవాళ సంచినిండా డబ్బు తీసుకెళ్లినా జేబు నిండ సరుకులు రావడం లేదని ఇది నిజమా కాదా అని ప్రశ్నించగా నిజమే నిజమేనని జనం సమాధానం చెప్పారు.d

36మంది ఎంపీలు, 10 మంది మంత్రులు ఉండి దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి రాగానే పాత విధానం కొనసాగిస్తానని, డ్రైవర్లకు వడ్డీలేని రుణం ఇస్తామని, చనిపోయిన డ్రైవర్‌కు రూ. 5లక్షలు బీమా చేయిస్తామన్నారు. సా మాజిక న్యాయం, పేదరిక నిర్మూలనే తమ సిద్ధాంతమని, అదే ఎన్టీఆర్ సి ద్ధాంతమన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తామేనని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, మాలలకు న్యాయం చేస్తామని, రైతులకు, గిరిజనులకు ముస్లీంలకు రక్షణగా ఉంటామని చెప్పారు. మీరంతా సహకరిస్తే ఆరు నెలల్లోనే ప్రభుత్వాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.

స్వలాభం కాదు.. ప్రజా సమస్యలపై అవిశ్వాసం కావాలి

శింగనమల: టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు పార్టీలో కష్టపడే వారికి ఎలాంటి మోసం చేయకుండా న్యాయం చేస్తారని ఎమ్మెల్సీ పామిడి శమంతకమణి పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఎంపికైన తరువాత ఆమె మొ దటి సారిగా జిల్లాకు రావడంతో బుధవారం టీడీపీ శింగనమల మ ండల కమిటీ అధ్యక్షుడు అమ్మలదిన్నె చితంబరిదొర ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు లోలూరు క్రాస్ వ ద్ద పూలమాలలతో బాణాసంచాలు, పూల వర్షంతో పెద్ద ఎత్తున ఘన స్వా గతం పలికారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు.

ఆమె మా ట్లాడుతూ... పార్టీలో దళితులకు ప్రత్యే క స్థానం కల్పించడంతో చంద్రబాబు నాయుడుకు ఎదురులేదన్నారు. రాబో యే స్థానిక ఎన్నికల్లో పార్టీ జిల్లాలో విజయదుందుభి మోగిస్తుందన్నారు. తాను ఎ మ్మెల్సీ కావడానికి సహకరించిన తమ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు జి ల్లా ప్రజలకు రుణపడి ఉన్నానన్నారు. ఈ అవకాశంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నా రు. ప్రజలకు ఎలాంటి సమస్యలైనా ప్ర జలకు, కార్యకర్తలకు వచ్చినా వెనువెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఈశ్వరరెడ్డి, మారుతి నాయుడు, మదిరేపల్లి రవీంద్రరెడ్డి, రాఘవరెడ్డి, డేగల కృష్ణమూర్తి, మాసూల చంద్రమోహన్, దాసరి గంగాధర్, అబ్దుల్ జిలానీ, ర హంతుల్లా, విజయ్‌కుమార్, సిీ వెంకటేష్, మండల నాయకులు నాగముని, విజయ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, నాగరా జు, బొల్లనాగేంద్ర, నాగభూషణ, వెం కటరమణ, రామచంద్ర, నాగేంద్ర, బా బునాయుడు, గుర్రం లక్ష్మినారాయణ, నాగేంద్ర, నల్లప్ప, రామాంజినేయు లు, వెంకటనారాయణ, అశ్వర్థ, నారాయణస్వామి, నాగరాజు, పిల్లసాయబ్, వెంకటరమణస్వామి, కుళ్ళాయప్ప, పెద్దన్న, తిరుమలదాసు, వీరనారాయణప్ప, హనుమంతు, చౌదరి, జయ రాం, శ్రీనివాసులు, గుర్రప్పస్వామి, చెన్నారెడ్డి, ఆదినారాయణ, సత్యనారాయణ, జయరాం, ఎద్దుల వెంకటపతి, ఎర్రిస్వామి, సైదా, నన్నె పాల్గొన్నారు.

పామిడి: శాసన సభ్యుల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పామిడి శ మంతకమణికి టీడీపీ స్థానిక నాయకులు పామిడిలో బుధవారం ఘనంగా స్వాగతం పలికారు.

కొండాపురం రో డ్డులోని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపట స్థూపానికి ఆమె పూలమాలలు వేశారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో టీడీపీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... టీడీపీతోనే మహిళలకు గుర్తింపు వ చ్చిందన్నారు. టీడీపీతోనే భవిష్యత్తు తరాలకు పునాదులు సాధ్యమన్నారు.

పూర్వ వి ద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పూర్వ విద్యార్థులు పట్రా శ్రీనివాసులు, ఏకనాథం, శర్మాస్ ఆమెకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్‌చౌదరి, ఆంజనేయులుగౌడ్, సంజీవకుమార్, టైలర్ భాస్కర్, నల్లబోతుల శ్రీనివాసులు, రా మ్రాంనేయులు, లంగాలగౌస్, కరూ రు శివశంకర్, రంగస్వామి యాదవ్, హుస్సేన్‌పీరా, మోహన్ కృష్ణ, బాబా ఫకృద్ధీన్(పాపులు), హమాలీ గోపాల్, శ్రీరాములు, సుంకప్ప పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

శమంతకమణికి స్వాగతం పలికేందుకు తరలివెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు

నార్పల: ఎమ్మెల్సీ పదవి చేపట్టి హైదరాబాద్ నుంచి నార్పలకు వస్తున్న శమంతకమణికి ఘనంగా స్వాగతం పలికేందుకు సుమారు 30 వాహనాలతో తెలు గు తమ్ముళ్ళు తరలివెళ్లారు. టీడీపీ అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చై ర్మన్ ఆలం నరసానాయుడు మాట్లాడుతూ... శమంతకమణికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం హర్షిందగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని దళితులకు టీడీపీ పెద్ద పీట వేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆ కుల ఆంజనేయులు, రామ్మోహన్ చౌదరి, జాఫర్ వలి, ప్రతాప్ చౌదరి, పిట్టురంగారెడ్డి, నాయనపల్లిరాజు, బండి చంద్రమోహన్, చికెన్ గోపాల్, కొట్టం నరసింహ, పీఎల్ లక్ష్మినారాయణ, చంద్రబాబు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కోసం కష్ట పడేవారిని టీడీపీ మోసం చేయదు