March 21, 2013

స్వలాభం కాదు.. ప్రజా సమస్యలపై అవిశ్వాసం కావాలి

రాజమండ్రి,: ప్రజా సమస్యలపై అవిశ్వాసం పెట్టాలి కాని స్వలాభం కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు అన్నారు. రాజమండ్రి పాదయాత్రలో ఆయన ప్రభుత్వంలో ని ప్రతీ లోపాన్ని ఎత్తిచూపి ఇది నిజమా కాదా, నిజమైతే చేతులెత్తండి అంటూ అభిప్రాయాన్ని కోరడంతో ప్ర జల నుంచి విశేష స్పందన లభించిం ది. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడకోసం అవిశ్వాసం పెట్టాలి కాని స్వలాభం కోసం కాదన్నారు. వైఎస్సార్‌సీపీ జైలులో వున్న వ్యక్తికి బెయిల్ కోసం అవిశ్వాసం పెడి తే టీఆర్ఎస్ బ్లాక్‌మెయిల్ చేయడం కోసం అవిశ్వాసం పెట్టిందన్నారు.

ఏకధాటిగా 48 నిమిషాలు పాటు సాగిన బాబు ప్రసంగంలో అనేకసార్లు ప్రజల అభిప్రాయాలను కోరారు.

తనకు అధికారం మీద వ్యామో హం లేదని తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగానూ, మరో తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నానని తన రికార్డును ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే మరో 20ఏళ్లు పడుతుందన్నారు. తా ను చెప్పేవి నిజం కాదని మీరు చెబితే ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోతానని, నేను చెప్పేవన్ని నిజమేనని ఒప్పుకుంటే చేతిలెత్తాలని ప్రజల ను కోరారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నరా లేదా అని ఆయన ప్రశ్నించగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు జవాబు ఇచ్చారు. రాజమండ్రిని పుష్కరాల సమయంలో ఎంతో అభివృద్ధి చేసానని తరువాత ఇప్పటి వరకు కాంగ్రెస్ దొంగలు ఏమైనా పట్టించుకున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఇక్కడ పరిస్థితులను చూస్తుంటే బాధేస్తుందన్నారు.

1999 నుంచి విద్యుత్ కొరత ఉంటే తరువాత విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి విద్యుత్ కొరత లేకుండా చేసానని చెప్పారు. పేదలు, మ«ధ్యతరగతి కుటుంబాలు ఇంకా అనేక వర్గాలు వి ద్యుత్ దీపం కూడా వెలిగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటువంటి సమస్యలు మీద పోరాడాల్సిన అవస రం ఉందన్నారు. ఇవాల్టి రాష్ట్ర పరిస్థితులకు వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు కారకులేనని, ము డుపులు కోసమే విద్యుత్ వ్యవహారం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు గ నులను దోచుకున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకే గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను దేశమంతా సరఫరా చేస్తూ ఇక్కడ ప్రజలకు మాత్రం ఇవ్వడంలేదని విమర్శిం చారు.

ఇక సైకిలే గతిని, మీరు సైకిల్‌కు రిపేరు వస్తే బాగుచేయించుకుని ముందుకు వెళ్లునట్లుగా నా కాళ్లకు నొప్పులు వస్తున్నా రిపేరు చేయించుకుని మీ కోసం ముందుకు వస్తున్నానన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తాను ఉన్నప్పుడు కేజీ రూ.10 వున్న సన్న బియ్యం రూ.50, రూ.12 వున్న చక్కెర రూ.45, రూ.22 వున్న పప్పుడు రూ.80, రూ.2వున్న ఉప్పు రూ.12 అయిపోయాయని అన్నారు. గతంలో జేబు నిండా డబ్బు తో సంతకెళ్లి సంచినిండా సరుకులు తెచ్చుకునేవారమని కానీ ఇవాళ సంచినిండా డబ్బు తీసుకెళ్లినా జేబు నిండ సరుకులు రావడం లేదని ఇది నిజమా కాదా అని ప్రశ్నించగా నిజమే నిజమేనని జనం సమాధానం చెప్పారు.d

36మంది ఎంపీలు, 10 మంది మంత్రులు ఉండి దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి రాగానే పాత విధానం కొనసాగిస్తానని, డ్రైవర్లకు వడ్డీలేని రుణం ఇస్తామని, చనిపోయిన డ్రైవర్‌కు రూ. 5లక్షలు బీమా చేయిస్తామన్నారు. సా మాజిక న్యాయం, పేదరిక నిర్మూలనే తమ సిద్ధాంతమని, అదే ఎన్టీఆర్ సి ద్ధాంతమన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తామేనని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, మాలలకు న్యాయం చేస్తామని, రైతులకు, గిరిజనులకు ముస్లీంలకు రక్షణగా ఉంటామని చెప్పారు. మీరంతా సహకరిస్తే ఆరు నెలల్లోనే ప్రభుత్వాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.