February 8, 2013

అన్నదాతా! సుఖీభవ అంటారు. రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనేది భావం. ఎన్ని కష్టాలకైనా ఓర్చి పంట తీస్తాడు కాబట్టే జవాను తరువాత జాతిమొత్తం గుర్తించేది కిసానునే. వెనిగండ్లలో అడుగుపెట్టిన సమయంలో ముప్పెరగా ముసురుకున్న ఆలోచనలివి. ఆ రైతును చూసినప్పుడు ఆయనతో పాటు నా కళ్లూ తడిచాయి. బెండకాయలను గుప్పిట్లో పట్టుకొని వచ్చాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు గానీ, గొంతు పూడుకుపోవడంతో మాట పెగలలేదు. పరిస్థితి అర్థమయింది. ఆయన మూగవేదనను ఒక రైతుబిడ్డగా మాటలతో పని లేకుండానే తెలు సుకోగలిగాను. భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెప్పాను. ఆయనా, చుట్టుపక్కల రైతులు చెప్పిన దాన్నిబట్టి, యాభై వేలు అప్పుచేసి రెండు ఎకరాల్లో బెండ నాటాడు. అంత డబ్బు పోసినా కాయ సరిగ్గా ఎదగలేదు. నకిలీ విత్తనాలే కారణమట. షాపు యజమానిని నిలదీయగా, "కావాలంటే రెండు సంచుల విత్తనాలు తీసుకెళ్లు. అంతకుమించి నన్నేమి అడగొద్దు'' అని తరిమేశాడట. ఎంత కష్టం.. ఎంత నష్టం!

వేసిన పంట కాపుకు రాలేదనేది ఒకరి బాధ అయితే, ఎదిగిన బిడ్డను ఇంట్లో పెట్టుకున్నట్టుగా, పండిన పత్తిని ఇంట్లో పెట్టుకోవడంపై కుమిలే గుండె మరొకరిది. ఆ రైతు నన్ను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. నాకు మర్యాద చేయడానికి చూశాడుగానీ, ఇల్లంతా పత్తితో నిండిపోవడంతో మంచం వేయడానికీ జాగా కనిపించలేదు. "'ధర లేదు. ఏం చేయమంటారు సార్. ఇలా ఎన్నాళ్లు పెట్టుకోవాలో అర్థం కావడం లేదు'' అని వాపోయాడు. ఇలా రైతులు కన్నీరుపెడుతుంటే, ఇక ఈ భూమి ఎలా సస్యశ్యామలం అవుతుంది?

ఈ నేలంతా రైతు కన్నీరే..!

రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికలకు సంబంధించి అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులను పోటీ పెట్టాలని జిల్లా నాయకత్వాలను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో చిత్తూరు జిల్లా నేతలతో శుక్రవారం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వవద్దని, ఎవరి నుంచీ తీసుకోవద్దని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన ప్రతిచోటా పార్టీ గెలిచిందని చెప్పారు. దీనిని గుణపాఠంగా తీసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారి రుణం తీర్చుకొంటామని హామీ ఇచ్చారు.

ఎవరెన్ని లక్షలు ఇచ్చినా మన పార్టీ నేతలు అమ్ముడుపోరన్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. నిబద్ధత, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పని చేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లు గెలుచుకొనే సత్తా టీడీపీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి కేడర్ లేదని సహకార ఎన్నికలతో తేలిపోయిందని, ఆ పార్టీ బతికి బట్ట కట్టగలిగే పరిస్థితి లేదని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. టీడీపీ కాస్త కష్టపడి ఉంటే సహకార ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన కొన్ని స్థానాలు కూడా గల్లంతు అయి ఉండేవన్నారు.

మద్దతు ఇవ్వొద్దు.. తీసుకోవద్దు:బాబు

సీఎం.. చర్చకు వస్తావా?
రైతు సంక్షేమంపై తేల్చుకుందాం..రా
సాగు గురించి నీకేం తెలుసు?
నీ వల్ల రోజుకు ఐదు ఆత్మహత్యలు
దొంగలను కాపాడుతున్నావు
'అవినీతి' ధర్మానతో సమీక్షా?
గుంటూరు జిల్లా పాదయాత్రలో నిప్పులు

రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ సాధ్యం కాదన్న సీఎం కిరణ్ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. "అసలు వ్యవసాయం అంటే నీకేం తెలుసు? నీ వల్ల రోజుకు ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు'' అంటూ నిప్పులు చెరిగారు. రైతు సంక్షేమం కోసం ఎవరేమి చేసిందీ చర్చించడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా పెదకాకాని నుంచి శుక్రవారం పాదయాత్ర ప్రారంభించిన బాబు.. ఆసాంతం ప్రభుత్వం, సీఎం కిరణ్‌పై విమర్శలు గుప్పించారు. "మేము వ్యవసాయానికి 9 గంటల కరెంటిస్తే నేడు 2 గంటలు కూడా ఇవ్వట్లేదు. డీఏపీ బస్తా రూ.400లకు ఇస్తే అది రూ.1300లకు పెంచారు. రుణమాఫీ సాధ్యం కాదంటున్నావు'' అని విమర్శించారు.

నీలం తుఫాను, కరువు, వరదలు ముంచెత్తినా కేంద్రం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. వాన్‌పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు సీఎం అడ్డుపడ్డారన్నారు. సీఎం అనుమతి అవసరం లేదని ఒకవైపు కోర్టు చెబుతున్నా, సదరు మంత్రిని పిలిచి సమీక్ష చేయడం ఏమిటని ప్రశ్నించారు. దొంగలను కాపాడుతూ సీఎం దొంగలకు దొంగగా మారారని తీవ్ర ఆరోపణ చేశారు. గట్టిగా చర్య తీసుకొంటే మంత్రులంతా చంచల్‌గూడ జైలుకు పోవడం ఖాయమని పేర్కొన్నారు. జైలు పార్టీని గెలిపిస్తే మనందరి జీవితాలూ జైలుపాలు కావడం ఖాయమన్నారు.

"2004 ఎన్నికలకు ముందు తాను అప్పుల్లో ఉన్నానని, బంజారాహిల్స్‌లోని జాగాను అమ్ముకొని రుణాలు తీర్చుకొనేందుకు అనుమతి కోసం వైఎస్ నాకు లేఖ రాశారు. అది కబ్జా భూమి అని తేలడంతో ఆ దరఖాస్తు పక్కన పడేశాను. అలాంటిది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే రూ.లక్ష కోట్లు దోచేశారు'' అని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే వంట గ్యాస్ ధర దిగి వచ్చేలా చేస్తానని మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. "నేను చెబుతున్న విషయాలను కుటుంబంలో అందరూ చర్చించుకొని నమ్మితే నాకు ఓటు వేయండి. లేకుంటే మీ ఇష్టమ''ని వ్యాఖ్యానించారు.

11నుంచి జిల్లా నేతలతో సమీక్షలు
హైదరాబాద్: ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లాల నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న నిజామాబాద్, 12న కరీంనగర్, 13న మెదక్, 14న రంగారెడ్డి, 15న మహబూబ్‌నగర్, 16న వరంగల్ జిల్లాల సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, జిల్లా ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర జరిగే ప్రదేశంలో ప్రతి రోజు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. కాగా, ఆదిలాబాద్ జిల్లా సమీక్ష మాత్రం శుక్రవారం జరిగింది. ఇటీవలి సహకార ఎన్నికలు, పల్లె పల్లెకూ తెలుగుదేశం కార్యక్రమం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సమీక్షల్లో చర్చించారు.

రుణమాఫీపై చంద్రబాబు సవాల్

రుణ మాఫీ చేసి చూపిస్తా
రైతుకోసం ఎవరు ఏం చేశారో చర్చకు రెడీ
కిరణ్‌కు చంద్రబాబు సవాలు

రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దాం రమ్మని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారంనాడు సవాలు విసిరారు. సహకార ఎన్నికలలో రైతుకోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంవల్లే గెలిచామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారంనాడు ప్రకటించడంతో చంద్రబాబు ఇలా స్పందించారు.

రైతులకు ఏదో చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు, కిరణ్ రైతులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం చేతకానితనం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుంటే అది అసాధ్యం అని కిరణ్ గురువారంనాడు వ్యాఖ్యానించడాన్ని బాబు తప్పు పట్టారు. మీ అనుభవం ఎంత ? పాలనలో మీ అనుభవం ఏమిటి ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ ఎలా చేయవచ్చే తాము చేసి చూపిస్తామని ఆయన అన్నారు.

నీలం తుపాను, వరదలవల్ల రైతులు నష్టపోయినా ఈ ముఖ్యమంత్రి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని చంద్ర బాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. ఇది కిరణ్ అసమర్థత అని ఆయన చెప్పారు, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సులను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నదని ఆయన విమర్శించారు.

ఇటు కాంగ్రెస్, అటు జగన్ కాంగ్రెస్ రెండూ గజ దొంగ పార్టీలు అని ఆయన అభివర్ణించారు. వారికి ఓటేస్తే ఊళ్లు కూడా అమ్మేస్తారని ఆయన విమర్శించారు. 2014 ఎన్నికలలో విజయం తెలుగుదేశం పార్టీదేనని ఆయన చెప్పారు. కుప్పంలో లాగా అన్ని చోట్లా ముందుగా ఒక ప్రణాళిక ఉన్నట్టయితే సహకార సంస్థల ఎన్నికలలో మరిన్ని సీట్లు సంపాదించేవారిమని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ జైలులో పెట్టి ఆనందిస్తున్నారని ఆయన ఆక్షేపించారు,

2014లో విజయం మనదే,

జిల్లాలో చంద్రబాబు తన రెండో రోజు పాదయాత్ర మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభించారు. ఎన్‌హెచ్-5 మీదుగా నడుస్తూ చినకాకాని గ్రామంలోకి ప్రవేశించారు. రెండు చోట్ల టీడీపీ జెండాలను ఆవిష్కరించి ఎన్‌టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రసంగించారు. సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా తాము ముందుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించి అన్ని విధాలుగా దెబ్బ తీసిందని చెప్పారు.

ఇక్కడి మిర్చి రైతులు తమను ఆదుకోమని అడుగుతున్నారంటే చేత కాని అసమర్థ ప్రభుత్వం రైతుల నడ్డి ఏ విధంగా విరిచిందో స్పష్టమౌతోందన్నారు. వెనకబడిన వర్గాలకు రూ. 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తానన్నారు. గతంలో ఎస్‌సీ వర్గీకరణ అమలు చేసి 24 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, కాంగ్రెస్ పార్టీ 44 ఏళ్లలో కేవలం 14 వేల ఉద్యోగాలే ఇచ్చిందన్నారు. మరలా ఎస్‌సీ వర్గీకరణ అమలు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.చంద్రబాబు తన ప్రసంగాల ద్వారా మహిళల నాడి పట్టుకొనే ప్రయత్నం చేశారు. తాను డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించి న్యాయంగా డబ్బులు సంపాదించే మార్గం చూపించానని, కాంగ్రెస్ వాళ్లు మాత్రం డబ్బు పొగొట్టుకొనే దారి చూపించారని ఎద్దేవా చేశారు. ఆడపిల్లలపై వివక్ష పోగొట్టేందుకు నాడు అమ్మాయి పుడితే రూ. ఐదు వేలు బ్యాంకులో డిపాజిట్టు చేయించానని గుర్తు చేస్తూ నాడు ఇంటింటికి తలుపు తట్టి 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించానన్నారు. తన పాలనలో ఏరోజూ గ్యాస్ ధరను పెరగనీయలేదని, నేడు రూ. 475 అయిందని, అది కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తాంటున్నారని చెప్పారు. మున్ముందు ఆధార్‌తో లింకు పెట్టి గ్యాస్ వినియోగదారులను ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మరలా కట్టెల పొయ్యిలు వెలిగించే పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కేంద్రం రూ. 400 పెన్షన్ ఇస్తే వీళ్లు రూ. 200 మాత్రమే ఇస్తూ మిగతాది కొట్టేస్తున్నారని ఆరోపించారు.

వ్యవసాయాధారిత


పరిశ్రమలు తీసుకొస్తా


గుంటూరు, విజయవాడ మధ్యన అవుటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేసి వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకొస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలానే ఆటోమొబైల్ పరిశ్రమ నెలకొల్పుతామన్నారు. విజయవాడ-గుంటూరును కలిపేసి మహానగరంగా అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకొన్న పిల్లకలు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా బాధ్యత తీసుకొంటానని చెప్పారు.

అన్ని ఇళ్లకు కృష్ణాజలాలు

కృష్ణానది చెంతనే ఉన్నా గుంటూరు జిల్లా తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంట్లోకి కృష్ణా జలాలు తీసుకొచ్చి తాగునీటి సమస్య లేకుండా చేస్తానని చంద్రబాబు హామీఇచ్చారు.

చినకాకాని వద్ద ఫ్లైవోవర్

చినకాకాని గ్రామం వద్ద ఎన్‌హెచ్-5పై ఫ్లైవోవర్ లేక సబ్ వే నిర్మాణానికి చర్యలు తీసుకొంటానని చెప్పారు. దీని వలన ప్రజలు రోడ్డుకు అటువైపున ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకొనేందుకు సమస్య తొలగిపోతుందన్నారు. చంద్రబాబు వెంట పాదయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, షాలిని, వైవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కాజలో

టీడీపీ క్రిస్టియన్ సెల్ ఏర్పాటు


మంగళగిరి రూరల్: ఒక రాజకీయ పార్టీ అన్ని మతాలను గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయడు చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో భాగంగా కాజ గ్రామంలో ఆయన ప్రసంగించారు. కాజలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఏర్పాటైన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదరికం ఎక్కడ వుంటే అక్కడ న్యాయం జరగాలని అన్నారు. పేద వాడికి సహాయ పడాలనే విషయం బైబిల్‌లో స్పష్టంగా చెప్పారన్నారు. భారతదేశంలో వివిధ మతా లు, ప్రాంతాలు వున్నాయని, మనందర్ని దేవుడు పుట్టించాడని తెలిపారు. పలానా కులంలో పుట్టాలనేది ఎవరి చేతుల్లో లేదన్నారు. మతమనేది ఒక విశ్వాసం. ఒక రాజకీయ పార్టీగా అన్ని మతాలను గౌరవించాలి. భారతదేశం మత సామరశ్య దేశమని, వివిధ మతాలు, ప్రాంతాలు, కులాలు వున్నాయన్నారు. క్రిస్టియన్స్ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక పరిపుష్టి లభించే చర్యలు చేపట్టాలన్నారు. నూతన కమిటీ ప్రతి క్రిస్టియన్ హృదయాల్లోకి చొచ్చుకుపోవాలని సూచించారు. రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఏర్పాటై కాజ గ్రామం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. క్రిస్టియన్స్‌కు నూతన అధ్యయనం ప్రారంభించేందుకు వీలుగా నిర్దిష్టమైన విధానాలను రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు జేఆర్.పుష్పరాజ్, పెద్దిరెడ్డి, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డేవిడ్ శాంతరాజు, జనరల్ సెక్రెటరీ జాన్ వెస్లీ, ఉపాధ్యక్షుడు పీఎండీ.వరప్రసాద్, సెక్రెటరీలు హేలెన్‌బాబు, రాజ్‌కుమార్ చిట్టి, పాస్టర్లు, బిషప్‌లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

జైలు పార్టీతో జాగ్రత్త..

అలుపెరుగక ప్రజల సమస్యల కోసమే ఈ పోరాటమంటూ చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర జిల్లాలో రెండో రోజు ప్రారంభమైంది. బుధవారం 16 కిలోమీటర్లు నడిచి అలసిన బాబు గురువారం 11 గంటలకు బస్ నుంచి బయటికొచ్చారు. ఎన్నారై ఆసుపత్రిలోని ధన్వంతరి స్వామి దేవాలయం అర్చకస్వామి కందాళ శ్రీనివాసాచార్యులు చంద్రబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి పట్టు వ్రస్తాలు, ప్రసాదంను చంద్రబాబుకు బహూకరించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డి శ్రీహరినాయుడు, పూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్ పి ప్రకాశ్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి టి మాధవి, గడ్డి పద్మావతి చంద్రబాబును కలిశారు. అనంతరం ఎన్నారై వైద్యకళాశాల విద్యార్థులతో ఫొటోలు దిగి మాటామంతి కలిపారు. మాదల రాజేంద్రయూత్ ఆధ్వర్యంలో యువకులు 100 బైక్‌లతో ర్యాలీ ఏర్పాటుచేశారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, సీపీఐ కార్యకర్తలు ర్యాలీలో హైలైట్‌గా నిలిచారు.

రెండో రోజు పాదయాత్రలో చంద్రబాబుకు జాతీయ రహదారిపై పనిచేస్తున్న కార్మికులతో, దారి వెంట ఉన్న వికలాంగులతో మాట్లాడారు. చినకాకాని సెంటర్‌కు చేరేసరికి గ్రామస్తులు డప్పు వాయిద్యాల నడుమ గజమాలతో చంద్రబాబును గ్రామంలో కి ఆహ్వానించారు. జాతీయ రహదారి నుంచి ఊరు పొడవునా పూల వర్షాలు కురిపించారు. స్కూలు చిన్నారుల కేరింతలతో చంద్రబాబుకు అభివాదం తెలిపారు. గ్రామంలోని కిరా ణా దుకాణదారులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. చినకాకానిలో ఏర్పాటుచేసిన ఎన్టీ ఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి ప్రసంగించారు. అనంతరం గ్రామస్తులు, కొంతమంది కార్యకర్తలు కృష్ణుని విగ్రహాన్ని, గొర్రెపిల్ల, కోనంకి గణేష్ ఈము పక్షి గుడ్డును చంద్రబాబుకు బహూకరించారు. పాదయాత్రను కొనసాగిస్తూ మార్గమధ్యలో గౌరుబోయిన కృష్ణారావు కూల్‌డ్రింకు షాపులోకి వెళ్లి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మరో ఇంటికివెళ్లి మహిళను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా వుంటున్న 90 ఏళ్ల చింకా వెంకటరత్నం అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుని 4వేల ఆర్థికసాయం అందజేశారు. హాయ్‌లాండ్ ఎదురుగావున్న కొత్తూరులో మరో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నుండి వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చంద్రబాబును కలిశారు.

చినకాకాని నుంచి బయలుదేరి కొత్తూరుకు చేరేసరికి మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు ఇచ్చి, తిలకం దిద్ధి ఘన స్వాగతం పలికారు. ముస్లిం మహిళలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అ నంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఎన్టీ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు చినకాకా ని చివరలో జాతీయ రహదారి పక్కన భోజ న విరామం తీసుకున్నారు. సాయం త్రం 4.30కు పాదయాత్ర కొనసాగించారు. జాతీయ రహదారి వెంట విజయవాడకు బస్సులో వెళ్తున్న ప్రయాణికులు చంద్రబాబుకు విజయసంకేత అభివాదాన్ని తెలిపారు. దారి పొడవునా బాబును చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాజ దళితవాడకు రావాలని ఎమ్మార్పీ ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, పట్టుబట్టి తమ కాలనీకి ఆహ్వానించారు. కాలనీలో బాబూ జగజ్జీవనరామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కాజా గ్రామంలో జెండా ఆవిష్కరించి కాసేపు ప్రసంగించారు. గ్రామమంతా మైకులహోరులతో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడవునా పూల జల్లులతో చంద్రబాబు ముందుకు సాగారు. కాజ గ్రామ సెంటర్‌లో చుట్టూ భవనాలపై కిక్కిరిసిన మహిళల మధ్య చంద్రబాబు ఎన్టీ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బాబును కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాజ గ్రామ శివారులో టీడీపీ క్రిస్టియన్ సెల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి క్రీస్తును కొనియాడుతూ ప్రార్ధన గీతం ఆలపించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలోకాజ నుంచి నంబూరు వైపు పాదయాత్రను కొనసాగించారు.

అడుగడుగునా నీరాజనాలు


 అయ్యా... రోజంతా కష్టపడినా చేతికి రూ. 100 కూడా రావడం లేదంటూ పారిశుద్ధ్య కార్మికులు. టైలరింగ్ నేర్చుకొని కుట్టుమిషన్లు లేక ఖాళీగా ఉండిపోవాల్సి వస్తోందని మహిళలు. గ్యాస్ కనెక్షన్లు కావాలంటే రూ. ఏడు వేలు అడుగుతున్నారు. బియ్యం రూ. 50కి చేరాయి. ఈ పరిస్థితుల్లో మేము ఎలా బతకాలంటూ పలువురు మహిళలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తమ గోడు వెళ్ళబోసుకొన్నారు. గురువారం చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గంలోని చినకాకాని, కాజా గ్రామాల్లోని పలువురు మహిళల వద్దకు వెళ్లి 'ఏమ్మా... ఎలా ఉన్నారంటూ' అప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకొన్నారు.

హైవే మీద పని చేస్తోన్న కార్మికులు తాము రోజంతా ప్రాణాలను లెక్క చేయకుండా కష్టపడుతున్నా రూ. 100 కూడా చేతికి రావడం లేదని వాపోయారు. చినకాకానిలో పలువురు దర్జీలు తాము కుట్టు శిక్షణ నేర్చుకొన్నామని, ప్రభుత్వం కుట్టుమిషన్లు ఇవ్వకపోవడంతో ఖాళీగా ఉంటున్నామన్నారు. గ్యాస్ సిలిండర్లు కావాలంటే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. పొదుపు సక్రమంగా పాటిస్తున్నా రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం లేదన్నారు. ఇళ్లు కట్టుకొన్నా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. ఊళ్లో కాలువలు లేక పారిశుధ్య సమస్యలు తలెత్తి అనారోగ్యం భారిన పడుతున్నామన్నారు. సంవత్సరానికి రూ. 1.50 కోట్లు పంచాయితీకి పన్నులు రూపంలో తాము చెల్లిస్తున్నా కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. బియ్యం, కూరగాయలు, నూనెలు, పప్పుల ధరలు పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో తామెలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు.

చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు ఆలకించి కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని ప్రజలు ఇప్పుడు తెలుసుకొంటున్నారని వ్యాఖ్యానించారు. ఒకపక్క రైతులకు గిట్టుబాటు ధర రాకుండా దగా చేస్తూ మరోవైపు వినియోగదారులపై పెనుభారం మోపు తూ నడ్డి విరుస్తోందన్నారు. పనికిమాలిన ప్రభుత్వం మన జీవితాలతో ఆడుకొంటోందని చెప్పారు. అసలు విద్యుత్ సరఫరా చేయకుండా బిల్లులు, సర్‌చార్జ్‌లు వేస్తూ ప్రజల నెత్తిన బాంబులు వేస్తోందన్నారు. తాను వస్తుంటే ప్రజలు ఒక సోదరుడిగా భావిస్తూ మహిళలు వారి కష్టాలు చెప్పుకొంటున్నారని చెప్పారు. మగవాళ్లతో సమానంగా మహిళలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటానని, విద్యార్థులు చదువుకొన్న తర్వాత నెలకు కొంతమొత్తం వారికి ఇప్పించే ఏర్పాటు చేస్తానన్నారు.

మేం బతికేదెలా?


చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో సాఫీగా సాగిపోయేలా చేస్తుండటంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. నాయకులు ముందుగానే బాధ్యతలను పంచుకొని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. పాదయాత్ర పొడవునా చంద్రబాబు కోసం నిరీక్షించే వారిని సాధ్యమైనంత వరకు ఆయన్ని కలిసి సమస్యలు చెప్పుకొనేలా అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర నాయకుడికి తమ సమస్యలు నివేదించగలిగామని ప్రజలు, పాదయాత్ర వెంట వేలాది మంది తరలి వస్తుండటంతో అధినేతను సంతోషానికి గురి చేస్తోంది.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబు వెంట నడుస్తూ ఎక్కడికక్కడ స్థానిక నేతలను పరిచయం చేస్తూ గ్రామ సమస్యలను ఆయనకు నివేదిస్తున్నారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ చంద్రబాబు కంటే కాస్త ముందుగా పాదయాత్రలో నడుస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుసుకొంటూ వారితో కరాచలనం చేస్తూ ఉత్సాహం నింపుతున్నారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చంద్రబాబు ప్రసంగించే వేధికల వద్దకు వెళ్లి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు రూట్‌మ్యాప్, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సాదారణ కార్యకర్తలతో మమేకమై పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేస్తున్నారు. మార్గమధ్యలో మహిళలను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చి వారి సమస్యలను పార్టీ నాయకురాలు ములకా సత్యవాణి చెప్పిస్తున్నారు.

200 మంది తెలుగు యువత వలంటీర్లు

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వ్యక్తిగత సిబ్బం ది, పోలీసు భద్రత ఉన్నప్పటికీ జనం ముందుకు వస్తుండటంతో వలంటీర్లు రక్షణగా నిలబడుతున్నారు.

నేతల సమన్వయంతో సాఫీగా పాదయాత్ర

చంద్రబాబు తన పాదయాత్రలో గురువారం మంగళగిరి మండలంలోని చినకాకాని, కాజ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులను ఆయన పలకరించి సమస్యలను సావధానంగా విని తనదైన శైలిలో స్పందించారు. ఓ చోట దర్జీబాబుగా, మరోచోట దయగల బాబుగా, మరోచోట బొండాం తాగి పాదయాత్ర కొనసాగించారు. చినకాకానిలో పాదయాత్ర చేస్తుండగా ఓ చోట టైలరింగ్ చేస్తున్న మహిళను గమనించిన బాబు కొద్దిసేపు మిషన్ కుట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్లిన అనంతరం పాకలో ఒంటరిగా వుంటున్న 90 ఏళ్ల వృద్ధురాల్ని పలకరించి యోగక్షేమాలు విచారించి రూ.4 వేల ఆర్థికసాయాన్ని అందించి దయగల బాబుగా మన్ననలు పొందారు. అనంతరం కాజ గ్రామం వెళుతూ మార్గ మధ్యంలో కొబ్బరిబొండాం తాగుతూ పాదయాత్ర కొనసాగించారు.

దర్జీ బాబు...

నేను చినకాకాని ఊరంతా తిరిగాను. అందరితో మాట్లాడా. మీరు చూపిస్తోన్న అభిమానం నాకు కొండంత బలాన్ని ఇస్తోంది. అయితే మీ కష్టాలు చూస్తే దుఃఖం తన్నుకొస్తోంది. మండుటెండ మిమ్మల్ని చూసి భయపడుతోంది. మీ అభిమానం చూస్తే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని చినకాకాని గ్రామస్థులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చినకాకానిలో పాదయాత్ర ముగింపు సమయంలో స్థానిక సమస్యలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ గ్రామ రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో నెట్టి వేయబడ్డారని చెప్పారు. క్యాలీఫ్లవర్‌కు ఇక్కడ ధర లేదు. బజారకు వెళితే కొనలేని పరిస్థితి కొనసాగుతోందన్నారు.

చినకాకాని గ్రామానికి 127 ఇళ్లు మంజూరు చేశారని, వాటిల్లో సగం కాంగ్రెస్ దొంగలు కొట్టేశారని ఆరోపించారు. న్యాయబద్ధంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. చివరికి పంచాయితీ ఆదాయం కూడా తినేసే పరిస్థితికి వచ్చారని చెప్పారు. నాడు ఎన్‌హెచ్-5ను తానే నిర్మించానని, దాంతో భూముల ధరలు పెరిగాయన్నారు. అంతేకాకుండా గ్రామస్థుల పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించి విదేశాలకు, బెంగుళూరు, హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. అయితే నేడు ఉద్యోగాలు లేకుండా చేసి, వ్యవసాయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారంగా మార్చేసిందన్నారు. రైతులను అన్ని విధాలుగా కాంగ్రెస్ నాశనం చేసిన నేపథ్యంలో వారు బ్యాంకుల్లో చేసిన అప్పులన్నింటిని మాఫీ చేసేందుకు తాను రుణమాఫీ హామీ ఇచ్చానన్నారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీ పైనే ఉంటుందని స్పష్టం చేశారు.

మీ కష్టాలు చూస్తే దుఖం