January 17, 2013

జిల్లా ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు ఎన్నటికీ మర్చిపోలేనని.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి చూపిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. జిల్లాలో ఎనిమిదో రోజు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా నేలకొండపల్లి మండలంలో పాదయాత్ర చేపట్టారు. నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం నుంచి బుధవారం ఉదయం 11.30కు బయలుదేరిన చంద్రబాబు పాదయాత్ర అప్పల నర్సాపురం, రాయిగూడెం, బుద్దారం, చెరువుమాదారం, పైనంపల్లికి చేరుకుంది. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. చెరువు మాదారంలో మాట్లాడుతూ 'నిరుపేదలమైన తాము వేల రూపాయలు ఖర్చుచేసి తమ పిల్లలకు ప్రైవేటు చదువులు చెప్పించలేకపోతున్నామని ఓ మహిళ నా దృష్టికి తెచ్చింది.. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుపేద వర్గాల పిల్లలకు పాఠశాల స్థాయిలోనే ఆంగ్లమాధ్యమంలో చదువులు చెప్పిస్తామ'ని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఒక రైతు విద్యుత్ కోత వలన పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కు రావడం లేదని చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సోలార్ విద్యుత్ మోటార్లు సబ్సిడీపై ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు.. ఆడపిల్ల పుడితే ఆ బాలిక పేరిట రూ.5వేలు డిపాజిట్ చేసే పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇప్పుడది అమలు కావటం లేదు. మేం అధికారంలోకి వస్తే చదువుకునే అడ పిల్లలకు లేదా పెళ్లి సమయంలో రూ.50వేలు నగదు అందించే విషయం పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు వ్యవసాయంకోసం బ్యాంకుల్లో తెచ్చిన రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.1లక్ష ఇస్తామని, గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకం ద్వారా అన్ని గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా తన మూడో సంతకం సుజల స్రవంతి పథకం ఫైలుపైనేనని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై ఇప్పటివరకు కట్టిన వడ్డీని వాపస్ చేస్తామన్నారు. రజక, పద్మశాలి, బెస్త, ముదిరాజ్, తదితర బీసీ ఉప కులాల వారందరికీ ఉచితంగా పనిముట్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ, జగన్‌లపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అవినీతి విధానాలపై ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని, ఆయనకు ఏ అంశంపైనా కనీస అవగాహన లేదని విమర్శించారు. మంచి బియ్యం ఇప్పుడు ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు.. ఇప్పటివరకు పురుగు పట్టిన బియ్యం ఇచ్చినందుకు ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ పాలనలోనే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆయన అవినీతి దోపిడీ విధానాల వల్ల లక్ష కోట్లు సంపాదించుకొని జగన్ జైలుకు వెళ్లాడు. ఆయన్ని విడిపించుకునేందుకు జడ్జీలను, లాయర్లను బెదిరించారు. అన్ని అడ్డదారులూ తొక్కి చివరకు.. సంతకాల పేరిట రాష్ట్రపతిని కూడా కలిశారు. హత్యలు చేసినవారు.. సంతకాలు సేకరించి రాష్ట్రపతికి చూపిస్తే.. కేసులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు.

అడుగడుగునా జన నీరాజనం

చంద్రబాబు పాదయాత్ర బుధవారం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగింది. మంగళవారం రాత్రి ముదిగొండ మండల సరిహద్దు వల్లభి గ్రామశివార్లలో బస చేసిన బాబు బుధవారం ఉదయం 11.30కు బయలుదేరి నేలకొండపల్లి మండలంలో పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి అర్దరాత్రి నల్గొండ జిల్లా సరిహద్దుకు చేరుకున్నారు. ప్రతి గ్రామంలో చంద్రబాబుపై పూల వర్షం కురిపిస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మొదట అప్పల నరిసింహాపురం, రాయగూడెం సభల అనంతరం బాబు మధ్యాహ్న భోజనం కోసం 3గంటలకు ఆగారు. సాయంత్రం 5.30కి పాదయాత్ర మళ్లీ మొదలైంది. రాత్రి వరకు బుద్ధారం, చెరువు మాదారం, పైనంపల్లి గ్రామాల్లో బాబు పాదయాత్ర సాగింది. పలుచోట్ల చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాలు, పార్టీ జెండాలు ఆవిష్కరించారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి మద్యం ముడుపులు ముట్టాయని ఆరోపించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆదిలాబాద్ పార్టీ ఇన్‌చార్జ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే బాబును కలిశారు.

నేలకొండపల్లి/ఖమ్మం అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రం అభివృద్ధికి దూరమవుతోందని చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం రాత్రి చెర్వుమాదారంలో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

వెళ్ళొస్తా .. 'మీకోసం' మళ్ళీ వస్తా

నేలకొండపల్లి : తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర బుధవారం నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురంలోకి ప్రవేశించింది. బాబుకు అప్పలనర్సింహాపురంలో ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా బాబుకు జనం పూల వర్షం కురిపించారు. పాదయాత్రలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడంతో చంద్రబాబులో ఉత్సాహం పెల్లుబుకింది. తెలుగుయువత కార్యకర్తలు బండారు వంశీ, బండారు శ్రీకాంత్, యలగల రా ంబాబు, శీలం వెంకటనర్సయ్య, వంశీకృష్ణల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రోజా, వెంకటేశ్వర్లు దంపతులు తమ పాపకు నాయకరణం చేయాలని బాబును కోరగా సరిత అని పాపకు నామకరణం చేశారు. రాయగూడెం గ్రామ సరిహద్దులో మాజీ ఎంపీపీ తీగ వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ నంబూరి సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు వెన్నబోయిన లక్ష్మణ్‌రావు, నంబూరి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో బాబుకు ఘనస్వాగతం లభించింది. బాబు నడిచినంత సేపు పూలు చల్లుతూ డప్పువాయిద్యాలతో జనం స్వాగతించారు. బుద్దారం గ్రామంలో ఆలెకట్ల కొండల్‌రావు, గురునాధం, ఏ. రవి, నర్సింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు ఘనస్వాగతం పలికారు. పైనంపల్లిలో నల్లాని మల్లికార్జునరావు, నల్లాని వెంకటేశ్వర్లు, యడవెల్లి సైదులు, మేళ్లచెర్వు కృష్ణ, చిల్లంచర్ల నరేష్్, గెల్లా జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో బాబుకు స్వాగతం పలికారు. బాబు వెంట ఎంపీ నామ నాగేశ్వరరావు, ఖమ్మం - సత్తుపల్లి ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఇన్‌ఛార్జి స్వర్ణకుమారి, గ్రామ నాయకులు బండారు విశ్వనా ధం, బండారు రా ంబాబు, భూషఁయ, సత్యం, తీగ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు నెల్లూరి భద్రయ్య, మైసా శంకర్‌లు మండలంలో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

పసుపు మయమైన గ్రామాలు

చంద్రబాబు పాదయాత్రను పురస్కరించుకుని పాదయాత్ర సాగిన అప్పలనర్సింహాపురం, రాయగూడెం, బు ద్దారం, చెర్వుమాదరాం, పైనంపల్లి గ్రా మాలు పసుపుమయంగా మా రాయి. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున పసుపుతోరణాలు కట్టారు. అదే సంఖ్యలో ఫ్లె క్సీలు ఏర్పాటు చేశారు. బాబు రాకతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావర ణం కన్పించింది. బాబు యాత్రతో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో ఆత్మస్థైర్యం పెరిగింది. యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో దేశం శ్రేణులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.

పల్లెల్లో బాబుకు ఘన స్వాగతం

వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న 'మీకోసం వస్తున్నా' పాదయాత్ర గురువారం నల్లగొండ జిల్లాలో ప్రవేశించనుంది. పాదయాత్రకు ఖమ్మం జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. వరంగల్ జిల్లా నుంచి ఈ నెల 8వ తేదీ రాత్రి తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం నుంచి జిల్లాలో చంద్రబాబు అడుగుపెట్టారు. ఈ నెల 9వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. బుధవారం రాత్రి నేలకొండపల్లి మండలం పైనంపల్లి వరకు పాదయాత్ర సాగింది. గురువారం పైనంపల్లిలో జిల్లా టీడీపీ నేతలతో కృతజ్ఞతా పూర్వకంగా సమావేశమై అనంతరం నల్గొండ జిల్లా కొదాడ వైపుగా పాదయాత్ర సాగనుంది.

జిల్లాలో చంద్రబాబుయాత్ర సుమారు 114 కిమీలకు పైగా ఇప్పటికే సాగింంది. చంద్రబాబునాయుడు మాదిరిపురం, బచ్చోడు, కూసుమంచి, మద్దులపల్లి, ఖమ్మం సెంట్ జోస్పప్ స్కూల్, లక్ష్మిపురం, అమ్మపేట క్రాస్‌రోడ్డు, అప్పల నర్సాపురం, పైనంపల్లిలో రాత్రి పూట చంద్రబాబు బస చేశారు. చంద్రబాబు యాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాదిగ దండోర, బంజార గిరిజన సంఘం, అదివాసి గిరిజన సంఘాలు సంఘీబావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నాయి. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మాదిరిపురంలో 9న 100 అడుగుల స్తూపాన్ని అవిష్కరించారు. ఖమ్మంలో సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబబు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలం రాయినిగూడెంలో చంద్రబాబు పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. 1982లో టీడీపీ అధినేత ఎన్‌టీఆర్ చైతన్యరధంపై యాత్రలు సాగించినప్పుడు రాత్రివేళ కూడా జనం నీరాజనం పలికినట్టు.. వస్తున్నా మీ కోసం యాత్రలో చంద్రబాబుకు జనం నీరాజనం పలుకుతున్నారని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు లేఖలు: జిల్లాలో గ్రామ గ్రామాన వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్‌కు లేఖలు ద్వారా చంద్రబాబు నాయుడు పంపిస్తున్నారు. వీటికి ఇప్పుడు పరిష్కారం లభించకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని బాబు హామీ ఇచ్చారు.

నేడు నల్లగొండకు వస్తున్నా మీ కోసం

నాకే భలే ఆశ్చర్యంగా ఉంది! నేనేనా..!? ఇన్ని కిలోమీటర్లు నడిచేశానా? అని కూడా అనిపిస్తోంది! ఖమ్మం జిల్లా రాయిగూడెం గ్రామంలో నా పాదయాత్ర 1700 కిలోమీటర్లు దాటడం మరో గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఈ జిల్లాలోనే వంద రోజుల మైలురాయిని అధిగమించడం.. మాదిరిపురంలో వంద అడుగుల స్థూపాన్ని ఆవిష్కరించడం మరచిపోలేని తీపి జ్ఞాపకం. సంక్రాంతి వేడుకలను కూడా జిల్లా ప్రజలతోనే జరుపుకోవడం, సొంత ఇంటిని మరిపించేలా ఈ జిల్లా ఆడపడుచులు చూపిన ఆదరణను, అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను.

పాదయాత్ర యావత్తూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అపూర్వమైన ఆదరణను చూపారు. రైతులు.. కూలీలు.. నిరుపేదలు.. యువత.. ఒకరనేమిటి.. దాదాపు అన్ని వర్గాలూ అర్ధరాత్రి వేళ కూడా గంటల తరబడి నా కోసం వేచి ఉండడం చూస్తే.. ఈ ప్రభుత్వం వారిని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో అర్థమవుతోంది. ఖమ్మం జిల్లాలో మాదిగ సోదరులు టీడీపీ కార్యకర్తలతోపాటు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఎస్సీ వర్గీకరణ చేసి వారి రుణం తీర్చుకుంటా.

ఈరోజు అప్పల నరసాపురంలో బస చేసి వస్తుంటే, అక్కడి ఎస్సీ కాలనీవాసులు తమ కాలనీకి రావాలని పట్టుబట్టారు. గ్రామంలో కర్నపూడి పెదగురవయ్య ఇంటికి వెళ్లాను. ఎస్సీ మహిళలంతా నావద్ద కూర్చుని తమ బాధలను వివరిస్తుంటే చలించిపోయాను. మా బతుకులు ఎట్లాగూ చదువుల్లేకుండానే తెల్లారాయని, కనీసం పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనుకుంటే, ప్రైవేటు స్కూల్లో ఇంగ్లీషు మీడియం చదివించాలంటే ఫీజులు, బట్టలకే రూ.15 వేలు అవుతున్నాయని లక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

టీడీపీ అధికారంలోకి వస్తే, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పిస్తానని హామీ ఇచ్చా. రాయిగూడెం వస్తుంటే కరెంటు కోతలతో పంటలు పండడం లేదని, సోలార్ పంపుసెట్లు కావాలని ఓ రైతు అడిగాడు. అధికారంలోకి వస్తే, రైతులకు సోలార్ పంపుసెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పా. గురువారంతో ఖమ్మంలో పాదయాత్ర పూర్తవుతోంది. తీపి జ్ఞాపకాలతో నల్లగొండలో అడుగు పెడుతున్నా.

తీపి జ్ఞాపకాల ఖమ్మం

టీడీపీ అధినేత చంద్రబాబు తన రికార్డును తానే బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నారు. 'వస్తున్నా మీకోసం' యాత్రలో 1700 కిలోమీటర్ల మైలురాయిని ఆయన అధిగమించారు. గత ఏడాది అక్టోబర్ 2న అ నంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం వద్ద 1700 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఈనెల 9న జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో యాత్ర వందరోజులు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా 1700 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా గ్రామస్థులు చంద్రబాబుకు బంతి పూల తివాచీ పరిచి స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశానికి కూడా మాదిరిపురమే వేదికైంది. ఇక చంద్రబాబుకు ఖమ్మం నగరంలో ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో ఘన స్వాగతం లభించింది. సంక్రాంతి సంబరాలు కూడా చేసుకున్నారు. జిల్లాలో 8రోజులపాటు 114కిలోమీటర్లు సాగిన యా త్ర గురువారం నల్లగొండ జిల్లాలో ప్రవేశించనుంది.

చంద్రబాబు @ 1700 కి.మీ!


 "అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన జగన్‌ను తప్పించేందుకు వైఎస్ విజయలక్ష్మి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి ఇచ్చారు. తన కొడుకు నిజాయతీపరుడని ఆమె నిరూపించగలరా?'' అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. సంతకాలు సేకరిస్తే కేసులు మాఫీ అవుతాయా? అని ప్రశ్నించారు. 'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా బుధవారం ఆయన ఖమ్మం జిల్లా అప్పల నర్సింహాపురం, రాయిగూడెం గ్రామాల్లో మాట్లాడారు.

జగన్‌కు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని మోసగించేందుకు ప్రయత్నించారని, అలాంటి వారికి ఓట్లేసి వ్యవస్థను దిగజార్చొద్దని ప్రజలను కోరారు. తనను గుర్తుంచుకుని అవకాశమిస్తే పెద్ద కొడుకులా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ అమలుచేస్తానని, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని, డ్వాక్రా మహిళలకు వడ్డీ వాపస్‌తోపాటు బీసీ డిక్లరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించి అన్ని కులవృత్తుల వారికి ఉపాధి చూపిస్తామని, ఎస్సీ వర్గీకరణకు సహకరించి మాదిగలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

పేద ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లకు రూ.50 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నది దోపిడీ దొంగల ప్రభుత్వమన్నారు. "విద్యుత్ సర్‌చార్జీలు, చార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేస్తూ దోచుకోవడమే దాని పని. చార్జీలు చెల్లించలేని దుస్థితిలో ప్రజలుంటే.. మరోసారి పెంచాలని చూస్తోంది'' అని మండిపడ్డారు. నిన్నటిదాకా రూపాయికి కిలో బియ్యం అన్న సీఎం కిరణ్.. ఇప్పుడు 'మన బియ్యం' అంటూ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

నీ కొడుకు నీతిగలవాడా?నిరూపిస్తారా?.. విజయలక్ష్మికి బాబు సవాల్