January 17, 2013

నేడు నల్లగొండకు వస్తున్నా మీ కోసం

వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న 'మీకోసం వస్తున్నా' పాదయాత్ర గురువారం నల్లగొండ జిల్లాలో ప్రవేశించనుంది. పాదయాత్రకు ఖమ్మం జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. వరంగల్ జిల్లా నుంచి ఈ నెల 8వ తేదీ రాత్రి తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం నుంచి జిల్లాలో చంద్రబాబు అడుగుపెట్టారు. ఈ నెల 9వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. బుధవారం రాత్రి నేలకొండపల్లి మండలం పైనంపల్లి వరకు పాదయాత్ర సాగింది. గురువారం పైనంపల్లిలో జిల్లా టీడీపీ నేతలతో కృతజ్ఞతా పూర్వకంగా సమావేశమై అనంతరం నల్గొండ జిల్లా కొదాడ వైపుగా పాదయాత్ర సాగనుంది.

జిల్లాలో చంద్రబాబుయాత్ర సుమారు 114 కిమీలకు పైగా ఇప్పటికే సాగింంది. చంద్రబాబునాయుడు మాదిరిపురం, బచ్చోడు, కూసుమంచి, మద్దులపల్లి, ఖమ్మం సెంట్ జోస్పప్ స్కూల్, లక్ష్మిపురం, అమ్మపేట క్రాస్‌రోడ్డు, అప్పల నర్సాపురం, పైనంపల్లిలో రాత్రి పూట చంద్రబాబు బస చేశారు. చంద్రబాబు యాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాదిగ దండోర, బంజార గిరిజన సంఘం, అదివాసి గిరిజన సంఘాలు సంఘీబావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నాయి. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మాదిరిపురంలో 9న 100 అడుగుల స్తూపాన్ని అవిష్కరించారు. ఖమ్మంలో సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబబు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలం రాయినిగూడెంలో చంద్రబాబు పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. 1982లో టీడీపీ అధినేత ఎన్‌టీఆర్ చైతన్యరధంపై యాత్రలు సాగించినప్పుడు రాత్రివేళ కూడా జనం నీరాజనం పలికినట్టు.. వస్తున్నా మీ కోసం యాత్రలో చంద్రబాబుకు జనం నీరాజనం పలుకుతున్నారని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు లేఖలు: జిల్లాలో గ్రామ గ్రామాన వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్‌కు లేఖలు ద్వారా చంద్రబాబు నాయుడు పంపిస్తున్నారు. వీటికి ఇప్పుడు పరిష్కారం లభించకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని బాబు హామీ ఇచ్చారు.