May 2, 2013

హైదరాబాద్
: మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి గురువారం అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన నివాసానికి వెళ్ళి సుమారు అరగంటపాటు భేటీ అయినట్లు సమాచారం. కడియం కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా లేరు. విశాఖ సభకు కూడా వెళ్లలేదు. దీంతో ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ నేతలు కూడా ఆయనను కలిసి మాట్లాడారు. కానీ ఈ ప్రచారానికి భిన్నంగా ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పార్టీ వ్యవహారాలపైనే మాట్లాడినట్లు ముక్తసరిగా చెప్పారు.

బాబును కలిసిన కడియం!

హైదరాబాద్

పార్టీ రాష్ట్ర నాయకులు టీడీ జనార్దనరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్, ఇ.పెద్దిరెడ్డి, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాంబాబు, కాంతారెడ్డి, జీహెచ్ఎంసీకి చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఆయనకు పుష్పగుచ్ఛాలను అందించారు. జీహెచ్ఎంసీకే చెందిన ఒక కార్మికురాలు తన బిడ్డను ఆశీర్వదించాలని కోరడంతో చంద్రబాబు ఆ పసికందును తన ఒళ్లోకి తీసుకుని ముద్దాడారు. ఈ క్రమంలో బుధవారం ఆయనను కలిసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు తారస్థాయిలో ఉత్సాహం ప్రదర్శించారు. బుధవారం మధ్యాహ్నం 12.30కే చంద్రబాబు రాష్ట్ర కార్యాలయానికి వచ్చేలా పార్టీ నేతలు కార్యక్రమం షెడ్యూలు నిర్ణయించినా.. ఇంటివద్ద ఓ ఆంగ్ల చానల్‌కు ఇంటర్వూ ఇవ్వడంతో కొంత ఆలస్యమైంది. సరిగ్గా 1.30 గంటలకు రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1.40 గంటలకు ప్రసంగం ప్రారంభించి చంద్రబాబు 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత 2.10 గంటలకు పార్టీ నేతలతో మాట్లాడి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

నేడు ఆస్పత్రికి బాబు: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం 6.30 గంటలకు సోమాజిగూడలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. సుదీర్ఘ పాదయాత్ర నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింది. కాళ్లవాపులతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తినట్లు సమాచారం. వైద్యులు వారించినా వినకుండా ఆయన అవిశ్రాంతంగా నడుస్తూనే ఉన్నారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోడానికి ఉదయాన్నే ఏషియన్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లనున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకుడు ఎల్వీఎస్సార్కే ప్రసాద్ తెలిపారు. అక్కడ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రసాద్ చెప్పారు.
: టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తమ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. 'వస్తున్నా... మీ కోసం' పేరుతో ఆయన 207 రోజుల పాటు దాదాపు రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. తర్వాత ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే దాదాపు 208 రోజులపాటు ఆయన పార్టీ కార్యాలయం ముఖం చూడలేకపోయారు. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బుధవారం రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు ఆయనను స్వాగతించేందుకు పోటీపడ్డారు. చంద్రబాబు వాహనం దిగిన దగ్గరనుంచి వేదిక వరకు కార్యకర్తలు తోడ్కొని వెళ్లారు.

సుదీర్ఘ విరామం తర్వాత.. పార్టీ ఆఫీసుకు బాబు

హైదరాబాద్

అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇళ్ళు, వారి పిల్లల చదువులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్‌లో సంఘం అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ప్రసంగించారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో పరిశ్రమలను, విద్యాసంస్థలను అభివృద్ధి చేశామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైందని ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు మేలు జరగాలన్న ఉద్దేశంలో భాగంగా 'నాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్)' సంస్థను ఏర్పాటు చేశామన్నారు.

భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.1,150 కోట్లను వాడుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ఆ డబ్బును కార్మికులకే వ్యయం చేయాలని డిమాండ్‌చేశారు. 'ఆ రోజు చంద్రబాబు కూడా భూములనిచ్చారంటూ వైసీపీ నాయకురాలు విజయమ్మ ఆరోపిస్తున్నారు. కానీ పరిశ్రమలు స్థాపించని పక్షంలో భూములను వెనక్కు తీసుకుంటామన్న నిబంధనతోనే సెజ్‌లకు భూములనిచ్చాం. ఆ రోజు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాం.

కానీ దొంగలు దోచుకోవడానికి కాదు. అయితే ఆ తర్వాత ఆ దొంగలే దోచుకున్నారు' అని చంద్రబాబు వెల్లడించారు. సభలో పార్టీ నాయకులు నన్నపనేని రాజకుమారి, తీగల కృష్ణారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్, టీడీ జనార్ధన్‌రావు, లాల్ జాన్‌బాషా, పెద్దిరెడ్డి, కేఈ కృష్ణమూర్తి, జైపాల్‌యాదవ్, శోభాహైమావతి, అరవింద్‌కుమార్ గౌడ్, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతారెడ్డి తదితరులు ప్రసంగించారు. కాగా, ఏపీపీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితిని సడలించాలని చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. బుధవారం ఈ మేరకు సీఎం కిరణ్‌కు ఒక లేఖ రాశారు.
: ఉద్యోగులకు, కార్మికులకు త్వరలో ఓ 'డిక్లరేషన్'ను ప్రకటించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులు, పింఛనుదారులకు, అసంఘటిత కార్మికులకు కూడా ఓ విధానాన్ని రూపొందించనున్నామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ప్రత్యేకంగా ఓ సమాఖ్యను ఏర్పాటు చేస్తామన్నారు. అసంఘటిత రంగంలో ఎవరైనా డ్రైవర్ మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లుచేస్తామన్నారు. డ్రైవర్లకు వాహనాల కొనుగోలుకు వీలుగా సబ్సిడీతో కూడిన రుణాలను నామమాత్రపు వడ్డీలకే అందిస్తామని వెల్లడించారు.

ఉద్యోగ, కార్మికులకు డిక్లరేషన్ : బాబు