May 2, 2013

సుదీర్ఘ విరామం తర్వాత.. పార్టీ ఆఫీసుకు బాబు

హైదరాబాద్

పార్టీ రాష్ట్ర నాయకులు టీడీ జనార్దనరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్, ఇ.పెద్దిరెడ్డి, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాంబాబు, కాంతారెడ్డి, జీహెచ్ఎంసీకి చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఆయనకు పుష్పగుచ్ఛాలను అందించారు. జీహెచ్ఎంసీకే చెందిన ఒక కార్మికురాలు తన బిడ్డను ఆశీర్వదించాలని కోరడంతో చంద్రబాబు ఆ పసికందును తన ఒళ్లోకి తీసుకుని ముద్దాడారు. ఈ క్రమంలో బుధవారం ఆయనను కలిసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు తారస్థాయిలో ఉత్సాహం ప్రదర్శించారు. బుధవారం మధ్యాహ్నం 12.30కే చంద్రబాబు రాష్ట్ర కార్యాలయానికి వచ్చేలా పార్టీ నేతలు కార్యక్రమం షెడ్యూలు నిర్ణయించినా.. ఇంటివద్ద ఓ ఆంగ్ల చానల్‌కు ఇంటర్వూ ఇవ్వడంతో కొంత ఆలస్యమైంది. సరిగ్గా 1.30 గంటలకు రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1.40 గంటలకు ప్రసంగం ప్రారంభించి చంద్రబాబు 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత 2.10 గంటలకు పార్టీ నేతలతో మాట్లాడి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

నేడు ఆస్పత్రికి బాబు: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం 6.30 గంటలకు సోమాజిగూడలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. సుదీర్ఘ పాదయాత్ర నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింది. కాళ్లవాపులతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తినట్లు సమాచారం. వైద్యులు వారించినా వినకుండా ఆయన అవిశ్రాంతంగా నడుస్తూనే ఉన్నారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోడానికి ఉదయాన్నే ఏషియన్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లనున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకుడు ఎల్వీఎస్సార్కే ప్రసాద్ తెలిపారు. అక్కడ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రసాద్ చెప్పారు.
: టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తమ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. 'వస్తున్నా... మీ కోసం' పేరుతో ఆయన 207 రోజుల పాటు దాదాపు రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. తర్వాత ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే దాదాపు 208 రోజులపాటు ఆయన పార్టీ కార్యాలయం ముఖం చూడలేకపోయారు. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బుధవారం రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు ఆయనను స్వాగతించేందుకు పోటీపడ్డారు. చంద్రబాబు వాహనం దిగిన దగ్గరనుంచి వేదిక వరకు కార్యకర్తలు తోడ్కొని వెళ్లారు.