September 27, 2013

జగన్ పర్యటనల గురించి వైసీపీ ముందే ప్రకటనలు చేస్తోందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ వదిలి వెళ్లరాదన్న నిబంధనలను కోర్టు సడలిస్తుందని వైసీపీకి ముందే తెలుసా అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. విభజన తీర్మానం ఆమోదం పొందడం కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని ఆయన ఆరోపించారు. విభజనకు సహకరిస్తున్న జగన్ పార్టీలో కాంగ్రెస్ నేతలు ఎలా చేరతారని యనమల ప్రశ్నించారు.


జగన్ విభజనకు ఒప్పుకున్నందునే హైకమాండ్ కేబినేట్‌నోట్‌ను వేగవంతం చేసిందన్నారు. పొత్తుల గురించి ప్రస్తుతం టీడీపీ ఆలోచించడంలేదని, తెలుగు జాతి మధ్య ఏర్పడ్డ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదే తమ ఎజెండా అని ఆయన తెలిపారు. వ్యతిరేక ఓటు విధానం ఉండాలన్న సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ మేరకు చట్టాలలో సవరణ చేయాలని యనమల కోరారు.

హైదరాబాద్ వదిలి వెళ్లరాదన్న నిబంధనలను కోర్టు సడలిస్తుందని వైసీపీకి ముందే తెలుసా......?

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించుకునేవాళ్లని అయితే రాజీనామాలపై ఏబీఎన్‌లో వచ్చిన కథనంతో వైసీపీ తోకముడించదని టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తెలుగు జాతిని చీల్చడానికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు అని ఆయన ప్రశ్నించారు.


దొంగలంతా కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీలు చవట దద్దమ్మలని దేవినేని మండిపడ్డారు. కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు చేతులు కాలాక ఇవాళ ఏడిస్తే ఏం లాభమని దేవినేని ఎద్దేవా చేశారు.

కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.