May 21, 2013

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్ర మంత్రి మహ్మద్‌ అహ్మదుల్లా సోదరుడు మహ్మద్‌ ఇనయతుల్లా మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పటి పీసీసీ అధ్యక్షులు మహ్మద్‌ రహమతుల్లా కుమారులే అహ్మదుల్లా, ఇనయతుల్లాలు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌, పూర్వ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహారెడ్డితో కలిసి ఆయన చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయనతో పాటు కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు కరీముల్లా మహబూబ్‌, బాషా, హాజీబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు.

అదేబాటలో మరికొందరు..

టీడీపీలో చేరేందుకు వేర్వేరు పార్టీలకు, సంస్థలకు చెందిన మరి కొందరు నేతలు లైన్‌లో ఉన్నట్లు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, మాజీ ఎంపీ చాడ సురేష్‌ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. అలాగే సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత మురళి సైతం త్వరలో టీడీపీలో చేరనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఓయూ జేఏసీలో కీలక భూమిక పోషించిన నేతలు రాజారాం యాదవ్‌, పిడమర్తి రవి సైతం త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారిలో రాజారాం నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అదే విధంగా పిడమర్తి రవి ఖమ్మం జిల్లాలోని మధిర సీటును కోరుతున్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి మేడ్చల్‌లో పార్టీ అభ్యర్థిత్వం కట్టబెట్టిన పక్షంలో చేరేందుకు సిద్ధమని 'దేశం' నేతలకు సంకేతాలు పంపినట్లు తెలిసింది. అధినేత చంద్రబాబు నాయుడు సైతం వారి ఆకాంక్షల పట్ల సానుకూలంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే వారంతా సభ్యత్వం స్వీకరించవచ్చు. ఈ పరిణామాలతో 'దేశం' శిబిరంలో ఉత్సాహం నెలకొంది.

తెలుగుదేశం గూటికి మంత్రి సోదరుడు

 నాయకుడు లేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆత్మరక్షణలో పడిందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసుతో కలిసే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ పుట్టిందే కాంగ్రెసు పార్టీ వ్యతిరేక పునాదుల పైన అన్నారు. ఆత్మరక్షణలో పడిన జగన్ పార్టీ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.

తాము అవినీతి పైన ఇప్పుడే పోరాటం ప్రారంభించలేదని వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండే పోరాడుతున్నామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరితే జగన్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. తాము జగన్ పార్టీ పుట్టినప్పటి నుండి అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించలేదన్నారు.

ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు మంత్రివర్గం పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ధర్మాన కేబినెట్‌ను తప్పు దోవ పట్టించారనే అభియోగాలు ఉన్నాయన్నారు. సబితకు తెలిసే క్యాప్టివ్ పదం తొలగించబడిందని ఆయన ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో తన కుటుంబ సభ్యుల పేర ఉన్న విల్లాల పేర్లను ధర్మాన బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. తాను అమాయకుడిని అని చెప్పే ముందు ధర్మాన తన ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు.

కచ్చితంగా వారిని తాము కళంకింత మంత్రులుగానే చూస్తామన్నారు. కళంకింత మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పినా తాము వినే ప్రసక్తే లేదన్నారు. వారివి జైల్ కాంగ్రెసు, బెయిల్ కాంగ్రెసులు అని ఎద్దేవా చేశారు. కళంకిత మంత్రులను తొలగించే వరకు ఉద్యమిస్తామన్నారు. ఓబుళాపురం మైనింగ్ పైన తాము మొదటి నుండి పోరాటం చేస్తున్నామన్నారు. అవిశ్వాసం విషయంలో తాము కడియం శ్రీహరియో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీయో చెబితే వినమన్నారు. ఏం చేయాలనేది తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

జగన్ పార్టీకి ఉలుకెందుకు : పయ్యావుల


హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోక్‌ష్ నాయుడు మంగళవారం మహబూబ్‌నగర్, కొత్తకోటలో మిని మహానాడుకు వచ్చిన ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ భవానీ ఆలయంలో లోకేష్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడ నుంచి కోత్తకోట చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

మహబూబ్‌నగర్‌లో లోకేష్ నాయుడుకు ఘన స్వాగతం


కొత్తకోట: మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తకోటలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ఉద్వేగంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని లోకేష్‌ ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే యువత, పిల్లల భవిష్యత్‌ ఆందోళనకరంగా మారుతుందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్‌ అవినీతికి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలా మరికొంత కాలం కొనసాగితే పారిశ్రామిక వేత్తలు మన మన రాష్ట్రాన్ని పూర్తిగా మరిచిపోతారు. మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వచ్చేది టిడిపి సర్కారేనన్న చినబాబు !



మహబూబ్‌నగర్‌ : వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తనయుడు లోకేష్‌బాబు అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే యువత, పిల్లల భవిష్యత్‌ ఆందోళనకరంగా మారుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ అవినీతికి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కొత్తకోటలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

వచ్చేది టీడీపీ సర్కారే : లోకేష్‌


తెలుగుదేశం లో చేరడానికి ఒక మంత్రిగారి సోదరుడు ముందుకు రావడం విశేషంగా ఉంది. కడప జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా సోదరుడు ఇనయతుల్లా టిడిపి లో చేరవచ్చని కదనం. ఆయన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ను కలిశారు. అలాగే టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి కూడా టిడిపిలో చేరాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్.పి ఇప్పటికే టిఆర్ఎస్ నుంచి సస్పెండైన చాడ సురేష్ రెడ్డి కూడా టిడిపిలో చేరబోతున్నారు.వీరు ముగ్గురు విడివిడిగా చంద్రబాబుతో భేటీ అయ్యారు.

టిడిపిలోకి మంత్రి సోదరుడు!