October 9, 2013


Sri N Chandrababu Naidu Nirahara Deeksha Live from Delhi

రాష్ట్ర విభజనకు సంబంధించి జాతీయస్థాయిలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని అన్నా. ఇరు ప్రాంతాల జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చించాలని ఆయన సూచించారు. టీడీపీని కించపరిచే విధంగా దిగ్విజయ్ మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీని దెబ్బతీయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుందని తెలిపారు. తన సొంత రాష్ట్రంలో గెలవలేని దిగ్విజయ్ ఏపీ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

సొంత రాష్ట్రంలో గెలవలేని దిగ్విజయ్ ఏపీ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తారు.........


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చిం చేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో సమన్యాయం పేరుతో ఢిల్లీలో నిరాహారదీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు తన మద్దతుదారులతో మాట్లా డుతూ, అత్యంత క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన సంయుక్త కార్యాచరణ కమిటీలు (జెఎసిలు)తో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ''కేవలం ఆరు మాసాల్లో యుపిఎ ప్రభుత్వం వెళ్లిపోతుంది. ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఈ పార్టీలు ఏం చేస్తాయి. ఆ పార్టీల నిబద్ధత ఏమిటి? జాతీయస్థాయిలో అఖిల పక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేక పోతున్నారు. ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించలేక పోతున్నారు? మా డిమాండ్‌ అదే. తక్షణం అఖిల పక్షం ఏర్పాటు చేయాలి'' అని చంద్రబాబు అన్నారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్‌ పార్టీ ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. ''కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమిటంటే, ఇరు ప్రాంతాల జెఎసిలను కూడా పిలిచి మాట్లాడాలి. సరైన పరిష్కారంతో వస్తే మేం కూడా హర్షిస్తాం'' అని బాబు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి తప్పుడు వాగ్దానాలు ఇవ్వకుండా ఏం చేయబోతున్నదో స్పష్టం గా చెప్పాలని కోరారు. ఎలాంటి విధివిధానాలను పాటించకుండానే తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకు న్నారని, ఇది కేవలం ఓట్లు,

సీట్ల కోసమేనని దుయ్యబట్టారు. పాలక కాంగ్రెస్‌ పార్టీకి, జగన్మోహన్‌రెడ్డికి మధ్య 'మ్యాచ్‌ఫిక్సింగ్‌' జరిగిందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జైల్లో దీక్ష చేపట్టిన జగన్‌పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఉదయం, సాయంత్రం హెల్త్‌బులిటెన్లు ఇచ్చారని విమర్శించారు. 'ఇది దేనిని సూచిస్తుంది? ఇది కచ్చితంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌. ఒకప్రక్క టిఆర్‌ఎస్‌, మరోప్రక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌. తన కుమారుడిని ప్రధానమంత్రి చేయాలని సోనియాగాంధీ కోరుకుంటున్నారు. ఇది సహేతుకమేనా? సమంజమేనా? దీనినే నేను ప్రశ్నిస్తున్నాను' అని చంద్రబాబు అన్నారు. అనైతిక రాజకీయాలను ప్రజలు ఆమోదించరని అన్నారు. దిగ్విజరుసింగ్‌ చేసిన విమర్శలపై స్పందిస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తన సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నందున ఆయన టిడిపి లక్ష్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 'వాళ్ళ సొంత ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారు. సిఎం, కేబినెట్‌, కేంద్రమంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపీలు, ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. మీ సొంత పార్టీ వారిని నువ్వు బుజ్జగించలేవా అని నేను దిగ్విజరును అడుగుతున్నాను. అలాంటప్పుడు మమ్ములను విమర్శించే హక్కు మీకెక్కడిది?' అని సూటిగా ప్రశ్నించారు. దేశ రాజధానిని దీక్షకు వేదికగా తాను ఎందుకు ఎంచుకున్నారో వివరణ ఇస్తూ తెలంగాణపై నిర్ణయం ఇక్కడే జరిగింది...పరిష్కారం కూడా ఇక్కడే లభించాలని అన్నారు.

''కేవలం ఆరు మాసాల్లో యుపిఎ ప్రభుత్వం వెళ్లిపోతుంది. ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.