April 30, 2013

టీడీపీఅధ్యక్షుడు చంద్రబాబు ఏడు నెలల తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అడుగు పెట్టబోతున్నారు. బుధవారం మేడే సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి కార్మిక విభాగం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ రెండో తేదీన పాదయాత్రకు బయలుదేరి వెళ్లిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి రావడం ఇదే మొదటి సారి.

నేడు పార్టీ కార్యాలయానికి బాబు

తన పిల్లలు ఏం కావాలంటూ సీబీఐ అధికారులను ప్రశ్నించిన వైఎస్ భారతి తన భర్త, మామ వల్ల అక్రమ కేసుల్లో ఇరుక్కొన్న ఇతరుల పిల్లల గురించి ఏనాడైనా ఆలోచించారా అని తెలుగు యువత నేతలు ప్రశ్నించారు. "రూ. లక్ష కోట్లకు వారసులైన మీ పిల్లలే పిల్లలా......మిగిలినవారి పిల్లలు పిల్లలు కాదా ''అని వారు అడిగారు. తెలుగు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంగళవారం ఇక్కడ ఒక ప్రకటన చేశారు. 'పులివెందుల నియోజకవర్గంలోని వేల్పులలో టీడీపీ నేతలు సతీష్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డిపై మీ కుటుంబ సభ్యులు అక్రమ కేసులు పెట్టి.. జైలుపాలు చేశారు. వీరెవరికి పిల్లలు లేరా? ఈ వ్యవహారాలతో మీ భర్త, మామలకు సంబంధం లేదని మీ పిల్లలపై ప్రమాణం చేస్తారా?' అని వారు భారతికి సవాల్ విసిరారు.

పిల్లలు మీకేనా? మిగిలిన వాళ్లకు లేరా?: టీడీపీ

రూపకర్తలు వేమూరు శిల్పులు

వేమూరు: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని మే 7వ తేదీన పార్లమెంటులో ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన శిల్పి దేవు శంకర్, ఆయన కుమారులు మయాచార్య, నాగమయ నారాయణాచార్యులు, మరో ఇద్దరు శిల్పుల సహకారంతో రూపొందించారు. టన్ను బరువు కలిగిన తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారు చేసేందుకు ఆరు నెలలు పట్టింది. రూ.13 లక్షల విలువైన ఈ విగ్రహాన్ని వేమూరులోని సత్య శిల్పశాల నుంచి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో మంగళవారం ఢిల్లీకి తరలించారు.

పార్లమెంటుకు ఎన్టీఆర్ విగ్రహం

మారిన మనిషిని!
1999కు మునుపు చంద్రబాబును
సత్వర ఫలితాల కోసమే నాడు తాపత్రయం
ఆ ఆత్రుతలోనే తప్పులు దొర్లాయి
పాదయాత్రతో చాలా నేర్చుకున్నాను
ఇచ్చిన హామీలన్నీ అమలుకు సాధ్యమే
అదెలాగో ప్రత్యేక ప్రణాళిక ప్రకటిస్తాను!
రాష్ట్రాన్ని బాగు చేయడం తెలుగుదేశానికే సాధ్యం
కేసీఆర్‌కు టీడీపీ అంటే భయం..అందుకే పదేపదే విమర్శలు


హైదరాబాద్: "నేను మారాను. పాదయాత్ర మరింత మార్పు తీసుకొచ్చింది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము అమలు చేసిన విధానాలు సరైనవేనన్నారు. కానీ, వాటి ఫలితాలు ప్రజలకు చేరలేదని, ఈసారి వాటిని సరిచేసుకుని ముందుకు వెళతామని వివరించారు. ప్రజల కష్టాలు తీర్చడం, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి సంబంధించి టీడీపీపై చరిత్రాత్మక బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు. పాదయాత్ర ముగిసినా.. ప్రజల కష్టాలు ఇంకా కళ్లల్లోనే తిరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుతో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ మంగళవారం నిర్వహించిన 'బిగ్ డిబేట్'లో చంద్రబాబు అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు, కొందరు విశ్లేషకులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు.

ఆ వివరాలు.. ఏడు నెలల పాదయాత్ర తర్వాత మామూలుగానే ఉన్నారా? నడక అలవాటై నిద్రలో కూడా నడుస్తున్నారా? 
 మామూలుగానే ఉన్నా. నా మైండ్, బాడీ ఎప్పుడూ నా నియంత్రణలోనే ఉంటాయి. లక్ష్య సాధనలో వెనకబడొద్దనే నిశ్చయంతోనే ఉంటాను. కానీ, కొన్ని ఇబ్బందులు. కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి. ఈ నొప్పి జీవితాంతం ఉంటుందన్నారు. అది శాశ్వతం కాకుండా జాగ్రత్త పడుతున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో మీరు, వైఎస్ సమకాలికులు. పాదయాత్ర ద్వారా ఆయన సీఎం అయ్యారు. మీరు ఒకసారి సీఎంగా చేసి, మరోమారు సీఎం అవడానికి పాదయాత్ర చేశారు.

మరి ఆ పదవిని అందుకోబోతున్నారా? 
రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవాన్ని ప్రజలు నాకిచ్చారు. తొమ్మిదేళ్లు సీఎంగా చేశాను. రెండుమార్లు ప్రతిపక్ష నేతను. సంపదను ఎలా సృష్టించాలి? ఆ సంపదను ప్రజలకు ఎలా అందించాలన్న దిశగా నేను చేసిన కృషిని ప్రపంచమంతా గుర్తించింది. ఈరోజు తప్పులు చేసిన వాళ్లు రోడ్లెక్కి నవ్వుకుంటూ తిరుగుతున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసింది.

ఇవన్నీ చెప్పడానికే పాదయాత్ర చేశాను. ప్రజల్లో తెలివి తేటలున్నాయి. పదవి నాకు ముఖ్యం కాదు. అలాగని, పదవి వద్దని నేనడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రావాల్సిందే. ప్రజల కష్టాలు చూసిన తర్వాత టీడీపీ మీద చరిత్రాత్మకమైన బాధ్యత ఉందని భావించాను. ప్రజల కష్టాలు తీర్చడం, భావితరాల భవిష్యత్తును కాపాడడమన్నవి ఆ బాధ్యతలు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఆ విషయమే కార్యకర్తలతో కూడా చెబుతూ వచ్చా. అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో, దానికంటే రాష్ట్రాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.

పాదయాత్ర నుంచి ఏం నేర్చుకున్నారు? 
చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మారిన మనిషిని. నేను మాట్లాడటం తగ్గించుకుని ఎదుటివారు చెప్పేది ఎక్కువగా వింటా ను. వాటి నుంచి నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను. అందరినీ కలుపుకొని పోతూ అందరి అభిప్రాయాలు స్వీకరిస్తూ వెళ్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే.. 1999కి ముందు చంద్రబాబును చూస్తారు. 1999 తర్వాత కీర్తి కండూతి, ఫలితాలు త్వరగా సాధించాలన్న ఆత్రుత కొన్ని తప్పులు చేయించాయి.

కొన్ని విషయాలను పట్టించుకోలేదు. వాటినుంచి నన్ను నేను దిద్దుకొన్నాను. ఇందుకు పాదయాత్ర నాకు బాగా ఉపయోగపడింది. రాజకీయాలన్న తర్వాత పార్టీ లోపలా.. బయటా సమస్యలు ఉంటూనే ఉంటాయి. కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పులు చేసినా వాటిని దిద్దుకొని వెంట తీసుకు వెళ్తాం. పార్టీ నేతలను కూడా అలాగే తీసుకువెళ్తాను. రాకపోతే నా దారిన నేను ముందుకు వెళ్లిపోతాను.

పాదయాత్ర ఫలితం ఎలా ఉంది? 
 ఏదో చేశామని ఒక ప్రాంతంలో ఒక పార్టీ చేస్తున్న మోసపూరిత ప్రచారం నుంచి ప్రజలను బయటకు తెచ్చాను. సెంటిమెంటును అడ్డం పెట్టుకొని మరో ప్రాంతంలో మోసం చేస్తున్న వారి నుంచి కూడా ప్రజలను బయటపడవేయగలిగాం. నాకు సంతృప్తి కలిగింది. ప్రజలు, పార్టీ కార్యకర్తలకు కూడా విశ్వాసం కలిగింది. పగలబడి నవ్వడం...కన్నీళ్లు పెట్టుకోవడం మొదటిసారి చూశాం. ఇంత మార్పు ఎలా? జీవితంలో అన్నీ ఉంటాయి. కాకపోతే ఆనందంతో ఉప్పొంగిపోవడం, బాధతో కుంగిపోవడం నాకు రాదు. కానీ, ప్రజల్లోకి వెళ్లిన తర్వాత వారి బోళాతనం, కొన్ని ఘటనలు ప్రతిస్పందించేలా చేశాయి. నా కాలి చిటికెనవేలి గాయం నిజంగా నాకు రోజుల తరబడి విపరీతమైన నొప్పి కలిగించింది. ప్రజల ఆదరణ అవన్నీ మర్చిపోయి నడిచేలా చేసింది.

పాదయాత్రలో ఏం సాధించారు? ఏం గ్రహించారు? 
 ఎక్కువే సాధించాను. పాదయాత్రలో చూసిన ప్రజల సమస్యలు కళ్లల్లో తిరుగుతున్నాయి. మేం అధికారంలో ఉన్నప్పుడు సృష్టించిన సంపదను ప్రజలకు చేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎందరికి ఇళ్లిచ్చారు? కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు ఒక్కొక్కరికి నాలుగేసి ఇళ్లిచ్చారు. మూడు నెలలకే రోడ్లు దెబ్బతింటున్నాయి. రోడ్లు వేయకుండానే బిల్లులు తిన్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి, శ్రమదానం చేశా. పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లా.బాగానే చేశారు. కానీ, ఇప్పుడేమో 'ఉద్యోగులు పని చేయకపోయినా అడగను' అంటున్నారు.

అందరం కలిసి పనిచేద్దామని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని అంటున్నాను. ఆ రోజు తపనతో ఒత్తిడి చేశా. దానిని కొందరు అపార్ధం చేసుకున్నారు.2004లో ఉచిత విద్యుత్తు ఉంటే సీఎంగా మీరే కొనసాగేవారా?రాష్ట్రాన్ని వైఎస్ మోసం చేశాడు. 1994కు ముందు విద్యుత్తు కోతలుండేవి. వాటిని అధిగమించాం. సంస్కరణలు తెచ్చాం. గ్రాంట్లు తెచ్చాం. జవాబుదారీతనం పెంచాం. కోతల్లేకుండా చేశాం. రాష్ట్రం కోసమే తపన పడ్డాను.సీఎంగా ఉన్నప్పటి కంటే పాదయాత్రలోనే ప్రజల సమస్యలను ఎక్కువగా గమనించారు. సీఎంగా ఉండి కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఎవరైనా చెప్పినా వినటానికి ఇష్టపడలేదు.

1991 వరకు రాష్ట్రంలో సంస్కరణలు లేవు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఓ నమ్మకాన్ని కలిగించాం. కానీ, వైఎస్ లాంటి వాళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఓ స్టేట్స్‌మన్‌గా రాష్ట్రాభివృద్ధికి తపనపడ్డాను. అప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా దగ్గరగా తిరిగాను. ఎంత దగ్గరగా తిరిగితే అంతగా నిజాలు తెలుస్తాయి. ఈ ఏడు నెలల్లో చూసిన ప్రజల కష్టాలు ఇంకా కళ్లల్లోనే తిరుగుతున్నాయి. మిమ్మల్నో, ఇంకొకరినో నమ్మించడానికి చెప్పడం లేదు. ఈ వయసులో నేను ఎందుకు నడవాలి? రాష్ట్రం కోసం, ప్రజల కోసమే నడిచా.

మళ్లీ యాత్ర ఉంటుందా?ఉంటుంది. వచ్చే ఏడాదిలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలి. అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీ యంత్రాంగాన్ని సమర్థంగా తీర్చిదిద్డుకోవడం చేయాలి. వీటన్నింటికీ ఒక ప్రణాళిక రూపొందించుకుంటాను. నా రెండో విడత యాత్ర త్వరలోనే ఉంటుంది. సీఎం పదవి కోసం ఒకపక్క మీరు, మరోవైపు జగన్, కిరణ్.. చాన్స్ వస్తే సీఎం అవ్వాలని కేసీఆర్... మరి మీకు మాత్రమే ఎందుకు ఓటేయాలి? సీఎం పదవి నాకు కొత్త కాదు. తొమ్మిదేళ్లు సీఎంగా చేశా.

ఒకాయనవి జైలు రాజకీయాలు. అలాంటి వ్యక్తి ఎటువంటి పాలననిస్తారు? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ ఒక ప్రాంతానికే పరిమితం. కేసీఆర్ ఎక్కడి నుంచో ఊడిపడలేదు. ఇక సీఎం కిరణ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక హామీ ఇచ్చి పబ్బం గడుపుకొనేందుకే ప్రయత్నిస్తున్నారు. తప్ప సమర్థ పాలన లేదు. విద్యుత్తును కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. మంచినీళ్లు లేవు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మంచి పరిపాలన జరగాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం.

మీరు చేసిన వాగ్దానాల అమలు ఎలా సాధ్యం!?
 
 నేను ముందు రాజకీయ నాయకుడిని. తర్వాత పరిపాలకుడిని. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. అందుకే ఈ హామీలు. ఏ హామీ ఎలా సాధ్యమో ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక ప్రణాళిక విడుదల చేసి ప్రజలకు వివరిస్తాను. కాంగ్రెస్ పార్టీ 1994కు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుప్పకూల్చింది. దానిని బాగు చేయడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈసారి ఎలా అప్పగిస్తారో తెలియదు. అందుకే ఎన్నికల ముందు ప్రణాళిక ఇస్తాం.

షర్మిల పాదయాత్ర మీకు పోటీయేనా?
 
 నేను వ్యక్తుల గురించి మాట్లాడను. పదిహేనేళ్ల కిందటే నేను ప్రధాన మంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేశాను. జ్యోతిబసు, సుర్జీత్, దేవెగౌడ వంటి వారిని సమన్వయపర్చాను. జాతీయ స్థాయిలో విధానాలను నిర్ణయించాను. ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్న కిరణ్, కేసీఆర్‌ల చరిత్ర ఏమిటి? కొందరు వచ్చి నాకు ముని శాపం అంటారు. నాకు ఇంకా ఏం కావాలని అబద్ధాలు చెప్పాలి. నాకేమైనా బెయిళ్లు కావాలా? నా భార్యాపిల్లలు కష్టపడి వ్యాపారం చేసుకుంటున్నారు.

మూడు ప్రాంతాల్లో మీ పార్టీ ఎక్కడ బలంగా ఉంది? 
 రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి టీడీపీ రావాల్సిన అవసరం ఉందని మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు అనుకొంటున్నారు. దాని నుంచి ఫలితం రాబట్టడం అనేది అక్కడి పార్టీ శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. టీఆర్ఎస్‌కు మేం ఎప్పుడూ భయపడలేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తానే వచ్చి మమ్మల్ని కౌగలించుకుంది. కేసీఆర్‌కు టీడీపీ అంటే భయం. అందుకే పదేపదే మమ్మల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతుంటాడు. తెలంగాణలో ప్రతి సమస్యపైనా పోరాడింది మేం. ఆ పార్టీ చేసింది శూన్యం. తెలంగాణలో మేం బలంగా ఉన్నాం కాబట్టే నష్టపర్చాలని ప్రయత్నం.

మీ పార్టీ విధానాల్లో మౌలిక మార్పుల అవసరం ఉందా? 
 మేం ఎంచుకొన్న అభివృద్ధి నమూనా మంచిదే. సంపద సృష్టించాలి. బాగా చదివించాలి. ఉద్యోగాలు కల్పించాలన్నది మా విధానం. కానీ, ఆ విధానాలకు సంబంధించిన ఫలితాలు ప్రజలకు చేరడంలో లోపం జరిగింది. దానిని సవరించుకోవాలి. ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా? నాకు కుటుంబ బాధ్యతలు లేవు. పార్టీ కార్యకర్తలే నా కుటుంబం. ఒక కార్యకర్త ఒక సందర్భంలో 22 ఎకరాల పొలం అమ్మేశాడు. వారిని ఆదుకోవాలి. అయితే, అది కూడా చట్టప్రకారమే చేస్తాను. అక్రమంగా కాదు. నన్ను ఇంతవాడిని చేసింది ప్రజలు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను.

'ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్‌లో చంద్రబాబు

RK Big Debate With Chandrababu Naidu Part - 1

హైదరాబాద్ : వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతిపై మంగళవారం తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి మండిపడ్డారు. కోర్టు హాలులో మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదని ఆమెపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

భారతికే పిల్లలు ఉన్నారా, ఇంకెవరికీ లేరా అంటూ శోభా ప్రశ్నించారు. దివంగత వైఎస్, జగన్‌లు చేసిన అవినీతికి మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని, జైలుకు వెళుతున్నారని, వాళ్లకు పిల్లలు ఉన్నారుకదా, ఆ విషయం భారతికి గుర్తుకు రావడం లేదా అని విమర్శించారు. అసలు జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో భారతిని కూడా విచారించాలని, అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని శోభా హైమావతి అభిప్రాయపడ్డారు.

భారతిపై మండిపడ్డ శోభా హైమావతి

వేమూరు : పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమం త్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఈ నెల 7వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఈ వి గ్రహాన్ని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన ప్రముఖ శిల్పి దేవు శంకర్, ఆయన కుమారులు మయాచార్య, నాగమయ నారాయణాచార్యులు, మరో ఇద్దరు శిల్పుల సహకారంతో రూపొందించారు. టన్ను బరువు కలిగిన తొమ్మిది అడుగుల కాంస్య వి గ్రహాన్ని తయారు చేసేందుకు ఆరు నెలలు వ్యవధి తీసుకుంది.

రూ.13లక్షల విలువతో కూడిన ఈ విగ్రహాన్ని శిల్పులు వాస్తవికతను ఉట్టిపడేలా రూపొందించారు. మంగళవారం ఉదయం ఈ వి గ్రహాన్ని వేమూరులోని సత్య శిల్పశాల నుండి ఢిల్లీకి తరలించేందుకు సిద్ధం చేశారు. మాజీమం త్రి దేవినేని రాజశేఖర్, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు వి గ్రహాన్ని సందర్శించారు.

ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో ఆవిష్కరించిన ఆచార్య ఎన్‌జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను కూడా వేమూరుకు చెందిన శంకర్ రూపొందించారు. తిరిగి ఆయనకే ఎన్టీఆర్ వి గ్రహం తయారు చేసే అవకాశం దక్కడంపై ఆనందాన్ని వ్యక్త పరిచారు. మంగళవారం సాయంత్రం విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో ఢిల్లీకి తరలించారు.

పార్లమెంట్‌కు తరలి వెళ్లిన ఎన్టీఆర్ విగ్రహం

మోత్కూరు

కేసీఆర్ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారే తప్ప తెలంగాణ కోసం కాదన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం ఆరాటపడే కేసీఆర్‌తో తెలంగాణ రాదని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. ఎన్నికల్లో సీట్లు గెలిచాక, వాటిని కేసీఆర్ కాంగ్రెస్‌కు అమ్ముకుంటారన్నారు. వైఎస్ఆర్ జీవితమంతా అవినీతేనని, జగన్ దోపిడీ చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడని మోత్కుపల్లి చెప్పారు.

సీబీఐ తనిఖీల్లో దొరికిన రూ.43 వేల కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు పంచాలని నర్సింహులు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది వచ్చారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు
: వైఎస్.జగన్, కేసీఆర్ సమాజానికి పట్టిన చీడ పురుగులని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్, కేసీఆర్‌ల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆయన సూచించారు.

జగన్, కేసీఆర్ సమాజానికి పట్టిన చీడ పురుగులు : మోత్కుపల్లి

వరంగల్
: బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. బయ్యారంలోనే స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలను సీఎం కిరణ బాధ్యత వహించాలన్నారు. తాను టీడీపీ లోనే ఉంటానని కడియం స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఏ పార్టీతోనైనా చర్చిస్తానని ఆయన చెప్పారు.

సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు : కడియం