April 30, 2013

పార్లమెంటుకు ఎన్టీఆర్ విగ్రహం

రూపకర్తలు వేమూరు శిల్పులు

వేమూరు: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని మే 7వ తేదీన పార్లమెంటులో ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన శిల్పి దేవు శంకర్, ఆయన కుమారులు మయాచార్య, నాగమయ నారాయణాచార్యులు, మరో ఇద్దరు శిల్పుల సహకారంతో రూపొందించారు. టన్ను బరువు కలిగిన తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారు చేసేందుకు ఆరు నెలలు పట్టింది. రూ.13 లక్షల విలువైన ఈ విగ్రహాన్ని వేమూరులోని సత్య శిల్పశాల నుంచి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో మంగళవారం ఢిల్లీకి తరలించారు.