June 20, 2013

భూకబ్జాలకు పాల్పడు తూ బెదిరింపులకు పాల్పడున్న వారిపై చర్య తీసుకోవాలని, నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టిడిపి గన్‌పార్క్ వద్ద ధర్నాకు దిగింది. ఈమేరకు అసెంబ్లీలో కూడా నేరమయ రాజకీయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మాణాన్ని ఇచ్చింది. ఈసందర్బంగా టిడిపికి చెందిన ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ గతంలో వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేసుకుని, కొనగోలుదా రులను బెదిరిస్తూ వ్యాపారం చేశారని ఆరోపించారు. రాయలసీమకు చెందిన రౌడీలను రంగంలోకి తీసుకువ చ్చి బెదిరింపులకు పాల్పడడమేకాక, కబ్జాలకు పాల్పడ్డ సంఘటనలున్నాయన్నారు. తీవ్ర భయోత్పా తాన్ని సృష్టించిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నా యన్నారు. అదే తరహాలో నేడు టిఆర్‌ఎస్ సైతం తెలంగాణా సెంటిమెంట్ పేరుతో భూకబ్జాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటోందని ఆరోపించారు. కొత్తగా ఏదైనా సంస్థ వచ్చిందంటే నేడు టిఆర్‌ఎస్‌కు పంటగానే ఉందని ఆరోపించారు. ఈవివరాలు తెలుసుకుని పత్రికా ప్రకటనలు ఇవ్వడం, వారిదగ్గరకు నేరిగా వెళ్లి బెదిరింపులకు పాల్పడడం సర్వసాధారణం గా సాగుతోందన్నారు. తెల్లారేసరి సంచులు ముట్టగానే సైలెంట్ అయి పోతున్నారని ఆరోపించారు. కళాశాలలు, సినిమా రంగం వారిని సైతం విడిచి పెట్టడం లేదని ఆరోపించారు. సెటిల్‌మెంట్ ముసుగులో ఆర్థిక సంపదను పెంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారని సండ్ర తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోను, నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో మెట్రో రైల్వే విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు. క్రికెట్ బుకీలకు కూడా టిఆర్‌ఎస్ నేతలు నేరుగా పాల్గొన్నారని ధ్వజమెత్తారు. కేటిఆర్ వ్యవహారంపై ఓచానల్ బయటపెడితే చర్చించకుండా బెదిరింపులకు పాల్పడడమేకాక, తపదారి పట్టించేలా తెలంగాణ ఉద్యమం, సెంటిమెంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నా రని ఆరోపించారు. టిడిఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణా రావడం కేసిఆర్‌కు, టిఆర్‌ఎస్‌కు ఇష్టం లేనే లేదన్నారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దండుకోవాలనేదే వారి తపనగా ఉందన్నారు. నిన్నటికి నిన్న సకల జనుల సమ్మె సందర్బంగా మరో నాలుగైదు గంటలు ఓపిక పడితే తెలంగాణాపై కేంద్రం ప్రకటన చేసేదన్నారు. సోనియాగాంధీతో మాట్లాడుకుని వేలకోట్ల రూపాయలను పుచ్చుకుని ఉద్యమాన్ని నాశనం చేశాడని కేసిఆర్‌పై నిపలు చెరిగారు. ఈ వ్యవహారంపై గత రెండే ల్లుగా తాను చెపుతున్నా కూడా పట్టించుకున్న నాథుడులేడన్నారు. టిఆర్‌ఎస్ హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలను బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్న వివరాలు చెప్పగలనన్నారు. తన వద్ద వందమంది పేర్లున్నాయని, పాపం వారు బయపడిపోతున్నారన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని, నేరమయ రాజకీయాలను అవలంబిస్తున్న వారిపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఎబిఎన్ చానల్‌లో వస్తున్న వార్తలలో బాదితుడిగా ఉన్న సతీష్ టిఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తిగాదా అని, కేటిఆర్‌కు దగ్గరి మిత్రుడు కాదా అని నిలదీశారు. కేసిఆర్ అవినీతి టిఆర్‌ఎస్ బెదిరింపులకు మాత్రమే తాము వ్యతిరేకమని, తెలంగాణా రాష్ట్రం విషయంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పార్లమెంట్‌లో బిల్లుపెట్టి రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. 200లో ఇచ్చిన లేఖేక కట్టుబడి ఉన్నామని ఇప్పటికే చంద్రబాబు మహానాడులో ప్రకటించారన్నారు.

రాష్ట్రంలో నేరమయ రాజకీయాలపై టిడిపి ధర్నా


కన్నబాబు వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆక్షేపించారు. సామాజిక న్యాయం కోసం పీఆర్పీని స్థాపించిన చిరంజీవి ఇదే సభలో పంచెలు ఊడదీస్తామన్నారని, పీఆర్పీ అంటే పరాయి పార్టీ అని ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేసి నేడు సూర్యున్ని హస్తమింపచేశారని విమర్శించారు. పీఆర్పీ మూడు ముక్కలయ్యిందని టీడీపీ, పీఆర్పీపై చర్చకు తాము సిద్ధమేనని రావుల డిమాండ్‌ చేశారు.

ఉదయించే సూర్యుడు అస్తమించాడు: రావుల

తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్‌ కోట్లాది రూపాయలు దండుకున్నాడని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆయన గురువారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ టి.ఆర్‌.ఎస్‌. పై విమనాస్త్రాలు సంధించారు.కేసీఆర్‌ మరో నిజాం లాగా ప్రవర్తిస్తున్నారని మోత్కుపల్లి దుయ్యబట్టారు. గత పన్నెండేళ్ళుగా కార్పోరేట్‌ సంస్థల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా కేసీఆర్‌ పెట్టుకున్నారని, అలాంటి వ్యక్తి ప్రజల మనోభావాలను గౌరవించకుండా సొంత ఎజెండాతో ముందుకు పోవడం విడ్డూరంగా వుందని విమర్శించారు. కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్‌ పార్టీ కుమ్మక్కయ్యిందని, అసెంబ్లీ జరుగకుండా పోడియం వద్దకు దూసుకుపోయి సభను స్తంభింపజేయడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. కేసీఆర్‌కు తెలంగాణ బిల్లు అక్కర లేదని అన్నారు. టి.డి.పి. వాళ్ళు ఎక్కడ మాట్లాడుతారోనని ముందే సభ జరుగ కుండా యత్నించారని ఆరోపించారు. తెలంగాణ ఇప్పుడు,అప్పుడు వస్తుందని ప్రజలను మోసపుచ్చడమే పనిగా పెట్టుకున్నారని అంటూ తాజాగా కెటిఆర్‌ డబ్బుల కోసం కక్కుర్తి పడి దౌర్జన్యం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కేసీఆర్‌ మరో నిజాం

దివంగత వైఎస్‌ఆర్‌ మార్కు అవినీతి కార్యకలాపాలను రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం విరుచుకుపడింది. ఆ పార్టీ గురువారం గన్‌పార్క్‌లో భూ ఆక్రమణలకు, సెటిల్‌మెంట్లకు వ్యతిరేకం గా ధర్నా నిర్వహిం చింది. ఆ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సండ్ర వెంకట వీరయ్య తదితరులు మాట్లాడారు. అనేక మంది పారిశ్రామిక వేత్తలను దోచుకున్న ఘరానా దొంగ కేసీఆర్‌ అని తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ రౌడీ మూకలు హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు చేసేవి. ఇప్పుడా పనిని ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ చేస్తోంది. నగరంలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఒక విద్యా సంస్థ, ఆస్పత్రిని నిర్మించాలన్నా టీఆర్‌ఎస్‌ వారికి ముడుపులు చెల్లించాల్సిం దేనని చెప్పారు. తొలుత వారికి వ్యతిరేకంగా ఒక ప్రకటన జారీ చేస్తారు. ఏదో విధంగా వారిని కాళ్ల బేరానికి తీసుకువస్తారు. తెలంగాణ భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని అందినంతా దండుకుంటున్నా రని నిప్పులు చెరిగారు. చివరకు ఏ సినిమా ఏ థియేటర్లో ఎన్ని రోజులు ఆడాలో కూడా టీఆర్‌ఎస్‌ వారే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని పక్కకుబెట్టి ఆ పార్టీ ఆర్థిక అరాచకాలకు పాల్పడుతోందన్నారు. ఉద్యమాలా? వసూళ్లా? వేటిని ఆచరిస్తారో టీఆర్‌ఎ-స్‌ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై తొలుత చేసిన ప్రకటన ఏమిటి? ఒకటి రెండు రోజుల్లోనే దానిని గాలికి వదలడం వెనక మతలబు ఆ పార్టీనే తెలపాలన్నారు. కేసీఆర్‌, అతని కుటుంబ సభ్యులను నమ్మరాదని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌పై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పలేక తెలంగాణ వాదులపై ప్రతిదాడికి ఆ పార్టీ పాల్పడుతోందన్నారు. తెలంగాణ రావడం కేసీఆర్‌కు అస్సలు ఇష్టం లేదు. ఆయనకు కావల్సింది కేవలం డబ్బులేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే సమయంలో సకల జనుల సమ్మెను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దని దుయ్యబట్టారు. తాను పోగేసిన అక్రమ సంపాదనను నెల్లూరుకు చెందిన బడా బిల్డర్‌ సుబ్బారెడ్డి దగ్గర దాయడం అబద్దమా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కేసీఆర్‌ను విశ్వసించడం లేదన్నారు. తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

నాడు వైఎస్‌ఆర్‌.. నేడు కేసీఆర్‌ వసూల్‌రాజాలు

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ రౌడీలు భూ దందాలు చేస్తూ సెటిల్‌మెంట్ల పేరుతో దోచుకున్నారని, ఇప్పుడు టిఆర్‌ఎస్ నాయకులు అదే విధంగా దోచుకుంటున్నారని టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. గన్‌పార్క్‌వద్ద గురువారం టిడిపి ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కెసిఆర్‌కు తెలంగాణ ఏర్పడాలని లేదని, తెలంగాణ వాదం పేరుతో డబ్బులు సంపాదించాలని ఉందని విమర్శించారు. చివరకు ఒక భవనం నిర్మించుకోవాలన్నా కెసిఆర్‌కు డబ్బు చెల్లించాలనే డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం మొదలు పెట్టిందని అన్నారు. సినిమా వారిని, పరిశ్రమల వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. (చిత్రం) గురువారం గన్‌పార్క్ వద్ద ధర్నా చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు

నాడు సీమ రౌడీలు నేడు టిఆర్‌ఎస్ దోచుకున్నారు


  తెలుగుదేశం పార్టీ హయాంలో ఐఎంజీ భూకేటాయింపులపై వైఎస్‌ మొదలుకుని విజయమ్మ వరకు కోర్టునాశ్రయిస్తే చివాట్లు పెట్టిన విషయాన్ని విస్మరించి, వైసీపీ నేతలు తిరిగి విచారణ చేపట్టాలని కోరడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ సీనియర్‌ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. టీడీపీ హయాంలో జరిగిన భూకేటాయింపులపై వైఎస్‌ నుండి మొదలుకుని విజయమ్మ వరకు అంతా కోర్టుకు వెళ్లారని, అయినా ఎటువంటి పోరపాట్లు జరగలేదని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయని గుర్తు చేశారు. ఇంతవరకు ఐఎంజీ భూకేటాయింపులను న్యాయస్థానం తప్పుపట్టిన సంఘటనలు లేవన్నారు. టీడీపీ పాలనపై జరిగిన భూకేటాయింపులపై ఏర్పాటు చేసిన సభాసంఘాలు, విచారణ కమిటీల్లోనూ ఏమి తేల్చ లేకపోయారన్నారు.

గురువారం టీడీఎల్పీ కార్యాలయంలో కేశవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాబు నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంకా ఎన్ని కోర్టులు కావాలంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ కోర్టులు ఏమైనా కావాలా? అని అపహాస్యం చేశారు.చంద్రబాబు హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణకు ఆదేశిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, నిజ, నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. అలాగే వైఎస్‌ ఆరేళ్ల పాలనలో జరిగిన భూకేటాయింపులపైనా వైసీపీ నేతలు విచారణ కోరితే బాగుంటుందన్నారు. ఐఎంజీ వ్యవహారంలో సీబీసీఐడీ నివేదికను విజయమ్మ చదవాలని సూచించారు. ఐఎంజీ భూకేటాయింపుల్లో ఎటువంటి పోరపాట్లు జరగలేదని సాక్షాత్తు వైఎస్‌ సర్కారే తేల్చి చెప్పినప్పటికీ, నిసిగ్గుగా వైస్సార్సీపీ నేతలు అసెంబ్లీలో విచారణకు పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అసెంబ్లీ వేదికగా కొత్త నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు.

బాబుకు కోర్టులు క్లీన్‌చిట్టిచ్చాయి


సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేసిన పీఆర్పీని కాంగ్రెస్‌పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేశారని టీడీపీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. పార్టీని నడిపేందుకు చేతకాకుండా పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేసినా అదే పార్టీలో ఉంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం సిగ్గుచేటన్నారు. ఎన్టీరామారావు చనిపోగా పార్టీలో చీలికలు వచ్చిన ఓ వర్గంలో ఉన్నానని అప్పుడు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి నా ఇంటికి వచ్చి బతిమిలాడి పార్టీలో చేర్చుకున్నారని గాలి వివరించారు. 1999 స్థానిక ఎన్నికల్లో ఆరు జడ్పీటీసీలకు గాను 5 గెలుచుకొని జిల్లాలో కాంగ్రెస్‌పార్టీని బతికించానని, అనంతరం తనను పావుగా వాడుకోవటాన్ని సహించలేక టీడీపీలో చేరినట్లు తెలిపారు.

చంద్రబాబు 2020 విజన్‌ను చూసి కాంగ్రెస్‌పార్టీ నేతలు బెంబేలెత్తారన్నారు. జైపాల్‌రెడ్డి, ఉపేంద్రలాంటి ఎంతో మంది కాంగ్రెస్‌ను తిట్టిపోసినవారేనని నేడు ఆపార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సభ పక్కదారి పట్టడాన్ని గమనించిన డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క పద్దుపైనే చర్చించాలని రూలింగ్‌ ఇచ్చారు.

పీర్పీని కాంగ్రెస్‌కు అమ్మేశారు: ముద్దు


హైదరాబాద్: పీపుల్స్ అకౌంట్ కమిటీ చైర్మన్‌గా టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి పేరును ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు.

పీఏసీ కొత్త చైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి


తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు దొంగల్లా శాసనసభలో కూర్చున్నారని తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. టిఆర్ఎస్ సభ్యులు అనూహ్యంగా సభలో ప్రశాంతంగా కూర్చోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మాచ్ ఫిక్సింగ్ బట్టబయలైందని అన్నారు. కెటిఆర్ దందాలను పక్కదారి పట్టించేందుకే శాసనసభలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణవాదాన్ని పక్కనబెట్టారని ఆయన అన్నారు.కెసిఆర్ కుటుంబం నిజాంను తలపిస్తోందని ఆయన అన్నారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల్లా కూర్చున్నారు:మోత్కుపల్లి