June 20, 2013

రాష్ట్రంలో నేరమయ రాజకీయాలపై టిడిపి ధర్నా

భూకబ్జాలకు పాల్పడు తూ బెదిరింపులకు పాల్పడున్న వారిపై చర్య తీసుకోవాలని, నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టిడిపి గన్‌పార్క్ వద్ద ధర్నాకు దిగింది. ఈమేరకు అసెంబ్లీలో కూడా నేరమయ రాజకీయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మాణాన్ని ఇచ్చింది. ఈసందర్బంగా టిడిపికి చెందిన ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ గతంలో వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేసుకుని, కొనగోలుదా రులను బెదిరిస్తూ వ్యాపారం చేశారని ఆరోపించారు. రాయలసీమకు చెందిన రౌడీలను రంగంలోకి తీసుకువ చ్చి బెదిరింపులకు పాల్పడడమేకాక, కబ్జాలకు పాల్పడ్డ సంఘటనలున్నాయన్నారు. తీవ్ర భయోత్పా తాన్ని సృష్టించిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నా యన్నారు. అదే తరహాలో నేడు టిఆర్‌ఎస్ సైతం తెలంగాణా సెంటిమెంట్ పేరుతో భూకబ్జాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటోందని ఆరోపించారు. కొత్తగా ఏదైనా సంస్థ వచ్చిందంటే నేడు టిఆర్‌ఎస్‌కు పంటగానే ఉందని ఆరోపించారు. ఈవివరాలు తెలుసుకుని పత్రికా ప్రకటనలు ఇవ్వడం, వారిదగ్గరకు నేరిగా వెళ్లి బెదిరింపులకు పాల్పడడం సర్వసాధారణం గా సాగుతోందన్నారు. తెల్లారేసరి సంచులు ముట్టగానే సైలెంట్ అయి పోతున్నారని ఆరోపించారు. కళాశాలలు, సినిమా రంగం వారిని సైతం విడిచి పెట్టడం లేదని ఆరోపించారు. సెటిల్‌మెంట్ ముసుగులో ఆర్థిక సంపదను పెంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారని సండ్ర తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోను, నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో మెట్రో రైల్వే విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు. క్రికెట్ బుకీలకు కూడా టిఆర్‌ఎస్ నేతలు నేరుగా పాల్గొన్నారని ధ్వజమెత్తారు. కేటిఆర్ వ్యవహారంపై ఓచానల్ బయటపెడితే చర్చించకుండా బెదిరింపులకు పాల్పడడమేకాక, తపదారి పట్టించేలా తెలంగాణ ఉద్యమం, సెంటిమెంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నా రని ఆరోపించారు. టిడిఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణా రావడం కేసిఆర్‌కు, టిఆర్‌ఎస్‌కు ఇష్టం లేనే లేదన్నారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దండుకోవాలనేదే వారి తపనగా ఉందన్నారు. నిన్నటికి నిన్న సకల జనుల సమ్మె సందర్బంగా మరో నాలుగైదు గంటలు ఓపిక పడితే తెలంగాణాపై కేంద్రం ప్రకటన చేసేదన్నారు. సోనియాగాంధీతో మాట్లాడుకుని వేలకోట్ల రూపాయలను పుచ్చుకుని ఉద్యమాన్ని నాశనం చేశాడని కేసిఆర్‌పై నిపలు చెరిగారు. ఈ వ్యవహారంపై గత రెండే ల్లుగా తాను చెపుతున్నా కూడా పట్టించుకున్న నాథుడులేడన్నారు. టిఆర్‌ఎస్ హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలను బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్న వివరాలు చెప్పగలనన్నారు. తన వద్ద వందమంది పేర్లున్నాయని, పాపం వారు బయపడిపోతున్నారన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని, నేరమయ రాజకీయాలను అవలంబిస్తున్న వారిపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఎబిఎన్ చానల్‌లో వస్తున్న వార్తలలో బాదితుడిగా ఉన్న సతీష్ టిఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తిగాదా అని, కేటిఆర్‌కు దగ్గరి మిత్రుడు కాదా అని నిలదీశారు. కేసిఆర్ అవినీతి టిఆర్‌ఎస్ బెదిరింపులకు మాత్రమే తాము వ్యతిరేకమని, తెలంగాణా రాష్ట్రం విషయంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పార్లమెంట్‌లో బిల్లుపెట్టి రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. 200లో ఇచ్చిన లేఖేక కట్టుబడి ఉన్నామని ఇప్పటికే చంద్రబాబు మహానాడులో ప్రకటించారన్నారు.