May 22, 2013

 రాజకీయ బిక్ష పెట్టిన టీడీపీని కాదని కేవలం పదవీ వ్యామోహంతోనే కేసీఆర్‌తో కడియం శ్రీహరి దోస్తి చేస్తున్నాడని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యా లయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ 25 ఏళ్లుగా జిల్లాలో కడియం నాయకత్వంలో పనిచేస్తే పార్టీకి ద్రోహం చేయడంతో పాటు, తమపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఘాటుగా విమర్శించారు. ఎన్టీఆర్‌ను పొగుడుతూ బాబును విమర్శిస్తున్న నీకు, నాడు టికెట్‌ ఇచ్చే ముందు ఎన్టీఆర్‌ ఏమైన్నాడో గుర్తుందా అని ప్రశ్నించారు. కడియం ఏనాడైనా పార్టీని మోసం చేస్తాడనే విషయాన్ని ఆనాడే ఎన్టీఆర్‌ గుర్తిం చారని, అంతేకాదు కడియం మోహం ముందే అన్నారని ఆయన తెలిపారు.

నాగం జనార్ధన్‌రెడ్డి, దేవెందర్‌ గౌడ్‌లను రెచ్చగొట్టి పార్టీనుంచి పంపించిన నీవు పార్టీని ఎందుకు వీడలేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవికి ఆశపడి పార్టీలో ఉన్న విషయం వాస్తవం కాదా అని అన్నారు. కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా విమర్శించి కుటుంబ పాలన అని అన్న నీవు ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరావన్నారు. తెలంగాణపై టీడీపీకి స్పష్టత లేదంటూ పదే పదే అం టున్న కడియం, షిండేకు పార్టీ తరుపున స్క్రిప్టు రాసింది నీవు కాదా అన్నారు. అఖిల పక్ష సమావేశం తర్వాత టీడీపీ లేఖను షిండే మినిట్స్‌ రాసుకున్నాడని, తెలంగాణపై పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని బాబును పొగిడిన నీవు ఇప్పుడు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

తెలంగాణపై పార్టీ తరుపున రెండో తీర్మా నం చేయాల్సిన అవసరం లేదన్న కడియం, ఇప్పుడు మహనాడులో తెలం గాణపై తీర్మానం చేయాలని ఎలా అడుగుతున్నాడో అర్ధం కావడంలేదన్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాటతో ద్వంద్వ విధానం సరికాదన్నారు. టీడీపీ అధి కారంలోకి రాదని పార్టీ వీడావా, లేదా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మరోసారి ఓటమి తప్ప దనే భయంతో వెళ్లావా అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎలాంటి పదవులు ఆశించకుండా ఉద్యమం చేస్తే కడియం శ్రీహరిని ప్రజలు నమ్ముతారని లేక పోతే రాజకీయ పతనం కాక తప్పదని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.

పదవి కోసమే కేసీఆర్‌తో కడియం దోస్తి?

కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. యూపీఏ పాలన అంతా అవినీతిమయంగా మారిందని ఎద్దేవా చేసింది. ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పథకాన్ని నకిలీ బదిలీ పథకంగా మార్చారని మండిపడ్డారు. నల్లధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం జైలులో కూర్చొని రాజకీయం చేసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత, అక్రమాల రహిత భారత్ కోసం తాము పోరాడుతామని ప్రకటించారు. బుధవారం చంద్రబాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ హయామంతా కుంభకోణాల మయమని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే సామాన్యుడి జీవితం ఎంతో మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం జైలులో కూర్చొని రాజకీయాలు చేసే పరిస్తితి వచ్చిందన్నారు. జైలు నుంచే సెటిల్మెంట్‌లో చేసే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వెయ్యి రూపాయల నోట్లు, రూ.500 నోటల మూలంగా చాలా అనర్థాలు వస్తున్నాయని, అవి ముద్రించగానే.. నల్లధనంగా మారుతున్నాయని, విదేశాలకు వెళ్లిపోతున్నాయన్నా రు. ఆడబ్బతోనే అరాచకం, అవినీతి, అశాంతి వంటివి ఏర్పాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నిరోధించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. గతంలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి దాపురిస్తే.. 1969లో నిక్సన్ వంద డాలర్ల నోట్లను రద్దు చేశారని, దీంతో నల్లధనం సమస్య పోయిందన్నారు. మన దేశంలోనూ ఈ సమస్య పోవాలంటే రూ1000, రూ.500 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రూ.70 లక్షల కోట్ల నల్లధనం ఉందని అంచనా అని, అవినీతి మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుందన్నారు. అలాగే నేరస్తులు సెటిల్మెంట్లు చేస్తున్నారని, చివరకు క్రీడలను కూడా అక్రమ లావాదేవీలకు వాడుకుంటున్నారని, యువత జీవితాలతో ఆడుకుంటున్నారని వాపోయారు. వీటన్నిటిపైనా చర్చించడానికి అర్ధక్‌రాంతి సంస్థ వారు కసరత్తు చేస్తున్నారని, వారితో తాను మాట్లాడానని చెప్పారు. దీనిపై త్వరలోనే చర్చ చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు. మన కరెన్సీలో 33 శాతం రూ.1000 నోట్లు ఉన్నాయని, 49 శాతం రూ.500 నోట్లు, మిగతావి రూ.100 కన్నా తక్కువగి ఉన్నానయన్నారు. రూ.500, రూ.1000 నోట్లు కేవలం డబ్బున్న వారికి, నేరప్రవృత్తి ఉన్న వారికే ఉపయోగపడుతున్నాయని, అందుకే వాటిని నియంత్రించాలని తెలిపారు. బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని, పెద్దనోట్లను రద్దు చేస్తే అవినీతి, నల్లధనం తగ్గుతుందన్నారు. జగన్ కేసులో ఆర్థిక నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని.. వీటిని సీరియస్‌గా పరిగనించాలని చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవినీతిపై మహానాడులో ఒక విధానం రూపొందించడానికి యత్నిస్తామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చకు పెట్టి, కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తామన్నారు. అవినీతి రహిత భారత్‌ను తయారు చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నల్లధనాన్ని నియంత్రించాలి అవినీతి రహిత భారత్ కోసం పోరాటం: చంద్రబాబు

అట్లాంటా : అమెరికాలోని అట్లాంటాలో ఈనెల 19న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతలు మల్లిక్‌ మేదరమెట్ల అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఎన్టీఆర్‌ 90వ జయంత్యుత్సవాలను నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు.

అట్లాంటాలో మినీ మహానాడు


హైదరాబాద్‌ : మహానాడు కమిటీలతో టీడీపీ చీఫ్‌ చంద్రబాబు భేటీ అయ్యారు. మహానాడులో చేపట్టాల్సిన తీర్మానాలపై చర్చ చేశారు. కాసేపట్లో నిజామాబాద్‌ అర్బన్‌ నేతలతో బాబు భేటీ కానున్నారు.

మహానాడు కమిటీలతో బాబు భేటీ


వాళ్ల గుప్పిట్లో నేనున్నానా!..అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు కార్పొరేట్ల గుప్పిట్లో చంద్రబాబు ఉన్నారని ఒక పత్రిక రాసిన కధనంపై ఆయన మండిపడ్డారు.నేను కొత్తగా రాజకీయాలలోకి వచ్చానా?వారు వచ్చారా?ఒకే కొందరు స్థితిమంతులు కూడా రాజకీయాలలోకి సేవ చేయడానికి రావచ్చు. వారు ఉంటారు.పార్టీలో మిగిలినవారు కూడా ఉంటారు.అంతమాత్రాన వారి గుప్పిట్లో ఉంటానా అని ఆయన ప్రశ్నించారు.కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.

నేను కార్పొరేట్ల గుప్పిట్లో ఉన్నానా!


హైదరాబాద్ : నల్లధనాన్ని నియంత్రణ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. నల్లధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన బుధవారమిక్కడ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగదు వ్యవహారాలు బ్యాంకుల ద్వారా జరిపితే నల్లధనాన్ని అరికట్టవచ్చన్నారు.

దేశంలోని 1000, 500 రూపాయిల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరెన్సీలో 33 శాతం వెయ్యి రూపాయిల నోట్లే ఉన్నాయని ఆయన అన్నారు. దేశంలో రూ.70 లక్షల కోట్ల నల్లధనం ఉందనే అంచనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

అవినీతి రహిత భారతదేశం ఏర్పడేవరకూ పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. నల్లధనం చివరకు క్రీడల్ని కూడా శాసిస్తోందని బాబు వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పధకాన్ని కాంగ్రెస్ నకిలీ బదిలీగా మార్చిందని ఆయన విమర్శించారు.

నల్లధనాన్ని నియంత్రించాలి: చంద్రబాబు