September 4, 2013

సీమాంధ్రుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు చంద్రబాబు అక్కడ పర్యటిస్తే తప్పేంటని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. టీడీపీని కనుమరుగు చేసేందుకు వైసీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

బాబు పర్యటిస్తే తప్పేంటి? : ఎర్రబెల్లి

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ మెడలో చైన్ ఎందుకు ఉందని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రశ్నించారు. జైలులో ఉన్న వ్యక్తి మెడలో కాని ఏమి ఉండరాదని,చివరికి మొలతాడు కూడా ఉండనివ్వరాదని కాని జగన్ ను చైన్ ఎందుకు ఉండనిచ్చారని ఆయన అన్నారు. జగన్ ఆరు రోజులకే దీక్షలో అనారోగ్యానికి ఎలా గురి అవుతారని ప్రశ్నించారు.కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మిలాఖత్ అవుతున్నాయని,అక్కడ టిఆర్ఎస్ ముసుగు, ఇక్కడ టిఆర్ఎస్ ముసుగు వేసుకుని కాంగ్రెస్ రావడానిక ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు. జగన్ బెయిల్ కోసమే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిశారని ఆయన అన్నారు.గతంలో జగన్,విజయమ్మ,షర్మిలలు తెలంగాణకు అనుకూలం అని చెప్పారని ఆయన చెప్పారు.తెలంగాణలో పంచాయతీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకపోయేసరికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సమైక్యరాష్ట్రం అంటోందని ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని ముద్దు అన్నారు.

జగన్ మెడలో చైన్ ఎందుకుంది- ముద్దుకృష్ణ ప్రశ్న!

ఎందుకీ పాడు విబజన సోనియామ్మ..ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్డుమీదకు వచ్చారు..చిన్నపెద్ద వచ్చారు.మనసు మార్చుకో తల్లి ..అంటూ సోనియాగాంధీని ఉద్దేశించి టిడిపి ఎమ్.పిలు చిడతలుమోగిస్తూ పాటలు పాడారు. లోక్ సభ నుంచి సస్పెండ్ అయిన ఈ ఎమ్.పిలు భజంత్రిలతో పాటలు పాడడం ఆసక్తికరంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఇందిర మాస్కు వేసుకుని సందడి చేసిన శివప్రసాద్ గానం చేస్తుండగా మిగిలిన టిడిపి ఎమ్.పిలు తాళం వేశారు.మొత్తం మీద టిడిపి ఎమ్.పిలు విన్యాసాలు కొనసాగించారు.

టిడిపి ఎమ్.పిల చక్కభజన

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీని, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ను కలిసి విమర్శిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీ మొద్దు అబ్బాయి అయితే జగన్ దొంగ అబ్బాయి అని ఆయన విమర్శించారు. రాహుల్ ను ప్రధానిని చేయాలని సోనియాగాందీ ప్రయత్నిస్తుంటే, జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని విజయమ్మ ఆశిస్తున్నారని ఆయన విమర్శించారు. తనకు పదవీ వ్యామోహం లేదని, తాను ఇప్పటికే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించానని, ప్రజల సేవే ముఖ్యమని ఆయన అన్నారు.

రాహుల్ మొద్దబ్బాయి-జగన్ దొంగబ్బాయి


సోనియా చేతిలో ప్రధాని తోలుబొమ్మ: చంద్రబాబు