September 4, 2013

జగన్ మెడలో చైన్ ఎందుకుంది- ముద్దుకృష్ణ ప్రశ్న!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ మెడలో చైన్ ఎందుకు ఉందని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రశ్నించారు. జైలులో ఉన్న వ్యక్తి మెడలో కాని ఏమి ఉండరాదని,చివరికి మొలతాడు కూడా ఉండనివ్వరాదని కాని జగన్ ను చైన్ ఎందుకు ఉండనిచ్చారని ఆయన అన్నారు. జగన్ ఆరు రోజులకే దీక్షలో అనారోగ్యానికి ఎలా గురి అవుతారని ప్రశ్నించారు.కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మిలాఖత్ అవుతున్నాయని,అక్కడ టిఆర్ఎస్ ముసుగు, ఇక్కడ టిఆర్ఎస్ ముసుగు వేసుకుని కాంగ్రెస్ రావడానిక ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు. జగన్ బెయిల్ కోసమే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిశారని ఆయన అన్నారు.గతంలో జగన్,విజయమ్మ,షర్మిలలు తెలంగాణకు అనుకూలం అని చెప్పారని ఆయన చెప్పారు.తెలంగాణలో పంచాయతీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకపోయేసరికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సమైక్యరాష్ట్రం అంటోందని ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని ముద్దు అన్నారు.