July 2, 2013

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం కావడం ఖాయమని టీడీపీ మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, వైసీపీ రెండూ అవినీతిమయ పార్టీలే అని పేర్కొన్నారు. వైఎస్ మంచి నాయకుడు అని దిగ్విజయ్‌సింగ్ అనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వైఎస్ మృతి పట్ల బాధ ఉండవచ్చు గానీ, ఆయన నేరాలు మరిచిపోలేమని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనంఖాయం:మోత్కుపల్లి

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పదవికి ఒక నేత గుడ్ బై చెప్పారు.చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తనకు పార్టీలో సరైన గౌరవం లభించడం లేదని ఆయన ఆరోపించారు.తాను తల్లివంటి తెలుగుదేశం పార్టీని వదలిపెట్టి తప్పు చేశానని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

తల్లివంటి తెలుగుదేశం పార్టీని వదలిపెట్టి తప్పు చేశా : గద్దె బాబూరావు

 తల్లి, పిల్ల కాంగ్రెస్ ఒకటే అని దిగ్విజయ్‌సింగ్ చెప్పకనే చెప్పారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసేందుకు భారతి, సుబ్బారెడ్డి ప్రయత్నించిన మాటా వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ పరిస్థితి పీఆర్పీ కంటే దారుణంగా తయారైందన్నారు. వైసీపీకి తెలుగువారి క్షేమం కంటే వైఎస్ కుటుంబ సంక్షేమమే ముఖ్యమని, వరదబాధితులను ఆదుకోవలనే ఇంకిత జ్ఞానం కూడా లేదని యనమల విమర్శించారు.

తల్లి,పిల్ల కాంగ్రెస్ ఒకటే అని చెప్పకనే చెప్పారు : యనమల

తెలంగాణ ఏర్పాటుకు ఇదే కీలకమైన సమయం అని, 10 రోజుల్లో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటన చేయాలని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పనైపోయిందని ఆయన అన్నారు. ఈనెల 7న టీడీపీ ప్రాంతీయ సమావేశం నిర్వహించనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎర్రబెల్లి వెల్లడించారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

10 రోజుల్లో తెలంగాణ ప్రకటన చేయాలి : ఎర్రబెల్లి

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ దుయ్యబట్టారు. రాష్ట్ర గవర్నర్‌ నోటి వెంట కాంగ్రెస్‌ అధిషాఠనం మాటలు రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థ ఏ రకంగా పని చేస్తుందో అర్ధమవుతుందన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయని చెప్పారు.

ఎన్నికల కోసమే డిగ్గీరాజా ప్రచార ఆర్భాటాలు:పయ్యావుల

పెంచిన పెట్రో ధరలు తగ్గించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నేతలు నిడదవోలులో రాస్తారోకో చేశారు. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బొబ్బా కృష్ణమూర్తి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

పెట్రో ధరలు తగ్గించండి : టీడీపీ రాస్తారోకో


వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై తెదేపా పూర్తి స్థాయి దృష్టిసారించింది. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పంచాయితీల వారీగా ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతీయ సదస్సులలో భాగంగానే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) విశాఖలో పర్యటించనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో.. వైజాగ్ లో నిర్వహించే ఈ ప్రాంతీయ సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పంచాయితీల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే 6 ప్రాంతీయ సదస్సులలో విశాఖలో నిర్వహించే సదస్సు మొదటిది. కాగా, బాబు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ”వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర, చత్తీస్ గడ్ బాధితులను ఆదుకోవడంలో చూపిన చొరవ.. తదితర అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాకు కలసివస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

వైజాగ్ ప్రాంతీయ సదస్సులో పాల్గొననున్న బాబు..!


హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం కిరణ్‌ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

ఉద్యమ పార్టీ అయిన తెరాస, సెంటిమెంట్ మీద నడుస్తున్న వైకాపాకు పార్టీ పరంగా నిర్మాణం అట్టడుగుస్థాయిలో లేదు. వందేళ్ళ పైబడి చరిత్రగల కాంగ్రెస్‌కు బలమైన కేడర్ వుంది. అదే విధంగా ముప్పైఏళ్ళ ప్రస్తానంలో తెలుగుదేశం పార్టీ కూడా తనకంటూ సొంత బలగాన్ని అట్టడుగు స్థాయిలో కలిగివుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల సహజంగావున్న యాంటీ ఇన్‌కంబెన్సీ వల్ల ప్రధాన ప్రతిపక్షమైన తమకు స్థానిక ఎన్నికల్లో మేలు జరుగుతుందని టిడిపి విశ్వాసంతో వుంది. ఈ ఎన్నికల్లో ఏమాత్రం వెనుకబడినా దాని ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందనే భయంతో పంచాయతీ ఎన్నికలను తీవ్రంగానే పరిగణిస్తున్నారు. అందుకోసం ప్రాంతీయ సమావేశాలకు షెడ్యూలు ఖరారు చేశారు. హైదరాబాద్, వరంగల్, విశాఖ, గుంటూరు, తిరుపతిల్లో ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసి, కార్యకర్తలకు కర్తవ్యబోధలు చేయాలని నిర్ణయించారు. ప్రతి సదస్సుకు కనీసం ఇరవై వేల మంది కార్యకర్తలను సమీకరించి, బలప్రదర్శన చేయడం ద్వారా ప్రజలలోపార్టీ ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల చార్‌దామ్ బాధితులకు ప్రభుత్వం కంటే మెరుగ్గా బాధితులకు సహాయక చర్యలు అందించడంతో పాటు, పార్టీ పరంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి యాత్రికులను స్వస్థలాలకు చేర్చి మంచిపేరును తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ఆధిక్యతను చాటుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తోంది.

తెరాస, వైకాపాలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి రాష్ర్ట వ్యాప్తంగా పటిష్టమైన కేడర్ వుంది.

ఖమ్మం నగరంలో పేదలకు ఇళ్లస్థలాల సాధనకోసం మాజీమంత్రి,ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరావు సోమవారం నిరవధిక నిరహర దీక్ష చేపట్టారు. ఖమ్మం కలెక్టర్‌ కార్యాయం వద్ద చేపట్టిన దీక్షకు సిపిఐ సంఘీబావం ప్రకటించింది. జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, ఇతర నాయకులు పెద్ద ఎత్తున తుమ్మలకు మద్దతు ప్రకటించారు. ఖమ్మంలో నివసించే 9 వేల మంది పేదలు తమకు ఇళ్ల స్థలాలు కావాలని దరఖాస్తులు పెట్టుకుంటే వారీలో 7వేల మందికి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకుండా చేతులు దులుపుకున్నారని తుమ్మల విమర్శించారు. దీక్ష శిభిరం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయంలో అధికారుల తీరు గర్హనీయమన్నారు. తెలంగాణ జిల్లాలలో ఖమ్మం నగరం అన్ని రకాలుగా విస్తరించింది.

ముఖ్యంగా పేదలు నగరం బాట పట్టడంతో వారికి కనీసం ఉండేందుకు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని దుయ్యబట్టారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇవ్వలేదని అన్నారు. అనేక జిల్లాలకు మంచి నీటి పథకాలు మంజూరైనప్పటికి ఖమ్మం జిల్లాకు కాలేదని ఆరోపించారు. మంచి నీళ్లు , ఇళ్ల స్థలాలు ఇవ్వక పోగా అడ్డుపడుతున్నారని ఇదే వైఖరి కొనసాగితే కాంగ్రెస్‌కు పుట్టగతలు ఉండవని ఆయన హెచ్చరించారు. ఖమ్మంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం ముఖ్యమంత్రుల వద్ద, మంత్రుల వద్ద, ఇన్‌చార్జీ మంత్రుల వద్ద జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టర్‌ వద్ద, జాయింట్‌ కలెక్టర్‌ వద్ద మొత్తుకున్నానని ,కార్యాలయాల చూట్టు అనేక మార్లు తిరిగి బ్రతిమి లాడను, ప్రాదేయపడ్డాను ఇది నాకోసం కాదు పేదలకు న్యాయం చేయమని అడిగాను ఆయనప్పటకి ఎవరు నుంచి సరైన స్సందన రాలేదని మండి పడ్డారు.

ముఖ్యమంత్ర కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరమ్మ బాటకు వచ్చిన సందర్బంగా తాము నిరసన తెలుపుతామంటే ముఖ్యమంత్రే స్వయంగా లక్ష్మారెడ్డి అనే ఎమ్మెల్యేని తమ వద్దకు పంపించి ఖమ్మంలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తామని హామి ఇచ్చారని ఆహామి మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఆదేశాలు జారీచేసినా ఇక్కడ అధికారులు స్పందిం చటం లేదని ద్వజమెత్తారు. తమ వత్తిడి మేరకు 6 వేల మంది లబ్ది దారులకు 2007 లోనే పట్టాలు పం పించారు. కాని స్థలాలు చూపించ లేదని ఇదేక్కడ న్యాయం మని జిల్లా అధికారులను నిలదీశారు. అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య దక్కర 3 మీటింగ్‌లు జరిగాయి. ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ఇళ్లస్థలాలు వెంటనే ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. ప్లాటింగ్‌ జరిగింది. లబ్దిదారులను గుర్తించారు. ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చి స్థలం గురించి ఇవ్వకుండా కొన్ని శక్తులు అడ్డుతగులు తున్నాయని అన్నారు. పేదలకు న్యాయం జరిగే తన దీక్ష ఆగదని ఆయన స్పష్టంచేశారు.

జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర రావు మాట్లాడుతూ ఖమ్మంలో పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఉద్యమాలు, చేసిన కృషిని వివరించారు. అయినప్పటి కి స్పందించ కుండా ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఖమ్మంలో పేదలకు తెలుగుదేశం హయంలోనే స్థలాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు ఇన్‌చార్జీ మంత్రులు, నలగురు కలెక్టర్లు, ముగ్గురు ఆర్‌డిఓలు, ముగ్గురు తహసీల్దార్లు మారారని అయి నప్పటికి ఇంతవరకు పేదలకు న్యాయం జరగలేదని అన్నారు. అందు వల్లనే తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తుమ్మల దీక్షకు పూనుకున్నారని సమస్య పరిష్కారం అయ్యెవరకు దీక్ష కొనసాగుతుందని అన్నారు.

పేదల ఇళ్ళ స్థలాలకోసం మాజీమంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరావు చేపట్టిన నిరవధిక దీక్షకు సిపిఐ మద్దతు ప్రకటించింది. దీక్ష శిభిరం వద్దకు ఆపార్టీ రాష్ర్త కార్యదర్శి వర్గ సభ్యులు సిద్ది వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యాదర్శి బాగం హేమంతరావు, మహిళా సంఘం నాయకులు పోటు కళావతి, తాటి నిర్మలు వచ్చి తుమ్మ లకు మద్దతుతెలిపారు. ఈసందర్బంగా సిద్ది,భాగం మాట్లా డుతూ ఖమ్మంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం సీనియర్‌ నాయకులు జిల్లా అభివృద్దిలో తన దైన ముద్రవేసిన తుమ్మల నాగేశ్వరరావు నిరహర దీక్ష చేపట్టడం అంటే చిన్న విషయం కాదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చి దీక్షను విరమింప చేయక పోతే ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అవస రమైతే జిల్లా బంద్‌ కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఖమ్మం నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం తుమ్మల నిరాహార దీక్ష

ఉత్తరాఖండ్‌ నుండి 80 మంది వరద బాధితులతో బయలుదేరిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం రాజధానికి చేరుకుంది. డెహ్రాడూన్‌ నుండి 80 మంది వరద బాధితులతో పాటు, టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణ నగరానికి చేరుకున్నారు. వారికి టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుండి బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు టీడీపీ నాయకుడు కేశినేని నాని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

నగరానికి చేరుకున్న టీడీపీ ప్రత్యేక విమానం

వస్త్ర దుకాణాల్లో డిస్కౌంట్ ఇచ్చినట్టుగా అధిక మద్యం వినియోగించే వినియోగదారులకు 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చే విధంగా జీవోలు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సూచించారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్యం పాలసీకి మించిన చెత్త పాలసీ మరొకటి లేదని విమర్శించారు. ఖజానాను నింపుకోవడంలో శ్రద్ధ తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదా? అని ప్రశ్నించారు. దశలవారీగా మద్యం అమ్మకాలు తగ్గిస్తామని చెప్పి అమ్మకాలు పెంచుతున్నారని విమర్శించారు. నూతన మద్య విధానంపై కాంగ్రెస్ చర్చ నిర్వహిస్తే హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పర్మిట్ రూంలకు అనుమతి ఇవ్వడం ద్వారా మరింతగా మద్యం బానిసలు పెరుగుతారని అన్నారు. నూతన మద్యం పాలసీని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతమంది మరణించారు? ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రికుల్లో ఎంత మంది మరణించారో ప్రకటించాలని టిడిపి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి తొమ్మిది వందల మంది మాత్రమే మరణించారని చెబుతున్నారని, ఉత్తరాఖండ్ స్పీకర్ పదివేల మందికి పైగా మరణించారని చెబుతున్నారని, రాష్ట్రం ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా చెబుతోందని విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లి యాత్రీకుల కోసం విమానాలను ఏర్పాటు చేసిన తరువాత కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అన్నారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. కేంద్రంలో 13 మంది మంత్రులు ఉన్నా ఘోర విపత్తుపై కనీసం స్పందించలేదని విమర్శించారు. మరో రెండు పార్టీలు కనీసం స్పందించలేదని అన్నారు.

అతిగా తాగేవారికి డిస్కౌంట్ ఇవ్వండి

యువతలో దేశభక్తి రగిలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించడంతోపాటు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛం దసంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గత నెల 24న శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన జవాను యాదయ్య కుటుంబాన్ని సోమవారం చంద్రబాబు పరామర్శించారు.

ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వగ్రామం కూడా అయిన కొండారెడ్డిపల్లికి సహచర ఎమ్మెల్యేలు రాములు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎర్రశేఖర్‌లతో వచ్చిన చంద్రబాబు అరగంట పాటు యాదయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండు లక్షల రూపాయలను యాదయ్య సతీమణి సుమతమ్మకు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిబంధనల ప్రకారం అందజేసే సాయంతో పాటు అదనంగా రూ.10 లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్‌ట్రస్టు తరపున యాదయ్య ఇద్దరు పిల్లలనూ ఉచితంగా చదివిస్తామని ప్రకటించారు. అనంతరం చంద్రబాబు రేవంత్ కోరిక మేరకు ఆయన చదువుకున్న ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు, గ్రామస్థుల విజప్తి మేరకు ఎంపీ లాడ్స్ నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు

దేశభక్తి రగిలించాలి : చంద్రబాబు

సుబ్బయ్యపాలెం సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా రొంపిచర్ల మండలంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడిని వైకాపా వర్గీయులు తీసుకెళుతున్నారంటూ వైకాపా నేత గోపిరెడ్డిశ్రీనివాసరెడ్డి కారును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

సుబ్బయ్యపాలెం సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత