January 12, 2013

 
టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర శుక్రవారం ఉదయం 11.30కి మొదలై అర్ధరాత్రి తర్వాత ముగిసింది. కూసుమంచి ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటన సాగింది. తెల్లవారే నిద్రలేచిన బాబు యథావిధిగా కాల కృత్యాలు, యోగా అనంతరం స్నానం చేశారు. నల్గొండ, తదితర జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు రావడంతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం 9గంటలకు ముందుగా ఇచ్చిన అపాయింట్‌మెంట్ మేరకు షార్ట్‌ఫిల్మ్ షూటింగ్‌కు హాజరయ్యారు. ఫిల్మ్ షూటింగ్ ఉదయం 11గంటలకు ముగిసింది. పదకొండుగంటల నుంచి 11.30 వరకు మరలా ఇతర జిల్లాల నేతలతో మాట్లాడటం, వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బస నుంచి బయల్దేరి ప్రాంగణం లో తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం పాదయాత్రకు బయల్దేరారు.

కొద్ది సేపు అనంతరం కూసుమంచి సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. తదుపరి క్షౌరశాలను, నాగన్న హోటల్‌ను సందర్శించారు. స్వాగతించిన ఎస్ వీ ఎస్ కళాశాల విద్యార్థులతో దారిలోకొద్ది సేపు ముచ్చటించారు. లోక్యా తండా క్రాస్ రోడ్ వద్ద పైలేరియా బాధితులు వచ్చి బాబును కలిసారు బోదకాలు ఆపరేషన్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చటం తోపాటు పింఛన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నారు.

కూలీలను పలుకరిస్తూ..

దారి పొడవునా బాబు పత్తి, మిరప కూలీలను పలకరిస్తూ వారి కష్ట నష్టాలు తెలుసుకుంటూ నడిచారు. దారిలో ఎదురైన మహిళా రైతులు తమ దీనగాథను బాబుకు వినిపించారు. నీలం తుపాను ధాటికి గురై పంటలు పూర్తిగా నాశనం కావటంతో కూలీలుగా మారామని వాపోయారు. వారి కష్టాన్ని విని చలించిన బాబు ఆదుకుంటాం అధైర్య పడవద్దని అభయ మిచ్చారు. ఆదిలక్ష్మి అనే యువతి ఎదురై బాలకార్మికురాలిగా ఉన్న తనను మీప్రభుత్వ హయాంలో బడిలో చేర్చటంతో ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నానని చెప్పటంతో బాబు సంతోషించారు. నాసిరకం విత్తనాలు, నకిలీపురుగు మందులు మార్కెట్లలో దళారుల దోపిడీ పై రైతులు కూలీలు బాబుకు ఫిర్యాదు చేసారు. అనంతరం మధ్యాహ్నాం 2 గంటలకు లోక్యా తండాలో ఎన్టీ ఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగించారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు యాత్ర మళ్లీ మొదలయ్యింది. కోక్యా తండా, నేలపట్లలో ఎన్టీ ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. సభల్లో మాట్లాడారు. అగ్రహారం మీదుగా యాత్ర రాత్రి 8.30కి ఖమ్మం రహదారిపై ఉన్న జీళ్ల చెరువుకు చేరింది. అక్కడి నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు , పొన్నేకల్ మీదుగా బాబు బస ప్రాంతం మద్దులపల్లి చేరింది.

అలుపెరుగని పయనం..ఆర్ధరాత్రి శయనం




టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్రకు పార్టీ శ్రేణులు బాసటగా నిలుస్తున్నాయి. ఆయన పర్యటన ఆద్యంతం ప్రత్యేక పం«థాలో పాదయాత్రకు ఎలంటి ఆటంకంలేకుండా అన్నిచర్యలు తీసుకంటున్నారు. పాదయాత్రజరిగే రహదారి శుభ్రంచేయడమేకాకుండా భోజన ఏర్పాటు, బస వంటి అన్నిసౌకర్యాలను చేపడుతున్నారు. కొంతమందినేతలు తెరవెనుక ఉండి అన్నీ తామై యాత్ర ను ముందుకు నడిపిస్తున్నారు. వారు తెరవెనుక ఉన్నా వారు చేస్తున్న కృషి ఫలితంగానే యాత్రదిగ్విజయంగా - గరికపాటి రాంమోహన్‌రావు చంద్రబాబు పాదయాత్ర మొత్తానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అన్నివిభాగాలను సమన్వయపరుస్తున్నారు.

- నల్లమల వెంకటేశ్వరరావు అందరికి వసతి కలిపించడం, రాత్రి బస చేసే ప్రదేశం అనువుగా ఉందోలేదో చూసి వసతి ఏర్పాటుచేయడం ఈయన పని.

- యూసఫ్ పాదయాత్రలో పాల్గొంటున్న వారందరికి పూర్తిగా మంచినీరు అంది స్తూ దాహం తీరుస్తున్నారు. ఈమంచినీటిని హైదరాబాదుకు చెందిన రంగారెడ్డి అం దిస్తున్నారు. పాదయాత్ర రోడ్డువెంబడి ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు.

- శ్రీశైలం ఈయన పాదయాత్రలో బాబును కలవడానికి వచ్చిన వారందరికి వసతి సౌకర్యాన్ని కలిపిస్తున్నారు. దీపక్‌రెడ్డి, ప్రకాశ్ నాయుడు వలంటీర్ల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. వీఎన్ మోహన్, సత్యనారాయణరాజు బాబు వెంటే ఉంటున్నారు.

తెరవెనుక వీరే..!



జిల్లాలో చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాద యాత్రకు శుక్రవారం రాత్రి రూరల్ మండలం తల్లంపాడులో ప్రజలు లాంతర్లతో స్వాగతం పలికారు. విద్యుత్ కోతకు నిరసనగా ప్రజలు ఇలా వినూత్నంగా బాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగిస్తూ టీడీపీ పాలనలో వర్షాభావ పరిస్థిలు ఏర్పడి వరస కరువులు వచ్చినా తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

అధికారంలో కొస్తే కుంటుంబంలో ఓ అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల ప్రజా ధనాన్ని రాజశేఖరరెడ్డి తన కుమారుడికి కట్టబెట్టారని విమర్శించారు. వైఎస్ క్యాబినెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అవినీతి మకిల అంటినవారేని విమర్శించారు. బయ్యారంలో లక్షా కోట్ల విలువైన ఇనుపరాయిని తన అల్లుడికి రాసిచ్చాడని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పెద్దలంతా ప్రజా ధనాన్ని పందికొక్కులా దోచుకుతింటున్నారిని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీ ఆవిర్భవించిందని తెలిపారు. బాబుకు లాంతర్లతో స్వాగతం పలికిన వారిలో టీడీపీ మండలాధ్యక్షులు బెల్లవేణు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మండల కార్యదర్శి ధరావత్ రామ్మూర్తి, తెలుగు యువత అ«ధ్యక్షుడు గూడా సంజీవరెడ్డి, కొప్పుల ఆంజనేయులు, పంతులు, మల్లాచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకులు స్వాగతం పలికారు.

అన్నగా .. అండగా ఉంటా..



ఢిల్లీలో సొంత పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నా కనీసం కరువు సాయం కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వంగా కిరణ్ సర్కారు తయారైందని టీడీపీ ధ్వజమెత్తింది. 'మహారాష్ట్ర, కర్ణాటకకు భారీగా కరువు సహాయమిచ్చిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం పైసా విదల్చలేదు. తెలుగు ప్రజలు గెలిపించిన ఎంపీల సాయంతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది.. నడుస్తోంది. కాని తెలుగువారికి మాత్రం కేంద్రం నుంచి సాయం రాదు. రాష్ట్ర ప్రభుత్వం కరువు సాయం కోసం నివేదికలు పంపకపోవడం వల్లే తాము నిధులు ఇవ్వలేదని కేంద్ర మంత్రులు బహిరంగంగా చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రజలను కరువు వేధిస్తుంటే ప్రభుత్వాన్ని ఆలోచనలు, ఆచరణ.. చివరకు నివేదికల కరువు వేధిస్తున్నట్లు కనిపిస్తోంది' అని ఆ పార్టీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లలో కేంద్రాన్ని రూ.15, 500 కోట్లు సాయం అడిగితే.. రూ.1540 కోట్లు మాత్రం వచ్చాయని చెప్పారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఇక్కడి ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఢిల్లీ నుంచి సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నేతలంతా పరిగెత్తుకు వచ్చారంటూ ఇప్పుడు మాత్రం ఇటు తిరిగి చూడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. 'కరువు సాయం కోసం కేంద్రాన్ని అడగటంలోనే కాకుండా ఇక్కడ కరువు మండలాల ప్రకటనలో కూడా ప్రభుత్వ పనితీరు ఘోరంగా ఉంది.

మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ నివేదిక ఇస్తే కేవలం ఐదు మండలాలు మాత్రం ప్రకటించారు. ఇదే పరిస్ధితి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా ఉంది. కలెక్టర్లు పంపిన నివేదికలను కనీసం తెరిచి కూడా చూడలేదు. దమ్ముంటే కలెక్టర్ల నివేదికలను బహిర్గతం చేయాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది నెలకొన్న కరువు అనేక జిల్లాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల నడుం విరగగొట్టిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టాలని జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.

కరువు సాయం కూడా తేలేని అసమర్థ ప్రభుత్వం



పురుగుమందు మనిషిని చంపినంతగా పురుగును చంపలేదు. కరెంటు రైతును కాటేసినంతగా కాంతిని పంచలేదు. రోడ్లు నరకద్వారాలే గానీ నడిచేందుకు పనికిరావు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం స్ఫూర్తి ఏ గ్రామంలోనూ నాకు కనిపించలేదు. ఈ రోజు ఎక్కువగా తండాలు, గూడేల మీదుగా సాగాను. ఎక్కడ చూసినా మురికికూపాలే.

డ్రైనేజీలు లేక మురుగంతా రోడ్లపై ప్రవహిస్తోంది. కరెంట్ వైర్లు చూస్తే భయపడే పరిస్థితి. కొన్నిచోట్ల చేతికి అందేంతగా తీగలు వేలాడుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు. పారిశుద్ధ్యం లేదు. వీధిలైట్లు లేక అంధకారంలో ఉన్నాయి. నేను ఎక్కడకు వెళ్లినా కరెంటు గురించే అడుగుతున్నారు. "కరెంటు చాలాముఖ్యం. మీరు ఎలా చేస్తారో తెలియదు. కరంటు ఇప్పించమని'' కోరుతున్నారు. ఎంత కష్టం!

పాలేరు రిజర్వాయర్ ఉన్నా సమీప గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. గొంతెండే ఇలాంటి గ్రామాలనెన్నింటినో చూశాను. ఈ చలికాలంలో చిన్న చద్దరు కూడా లేని మనుషులను చూశాను. తల దాచుకోడానికి గూడూ లేదు. కొన్ని గ్రామాల అంతర్గత రహదారుల గురించి చెప్పాల్సిన పనిలేదు. బాగున్న దారి మచ్చుకు ఒక్కటీ కనిపించలేదు. ఇలా గ్రామాలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని ఎవరిని అడగాలో తెలియక ప్రజలు దిక్కుతోచకుండా ఉన్నారు.

పంచా యతీలకు ఎన్నికలు లేవు. సర్పంచ్‌లు లేరు. స్పెషల్ ఆఫీసర్లూ లేనట్టే. స్వపరిపాలన ఎండమావి. సొంత పాలకులు వేస్తున్న పాచికలకు పల్లెలు తెల్లబోతున్నాయి. పెద్దదిక్కు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పుడు పల్లెల పరిస్థితి అలా ఉంది. టీడీపీ హయాంలో గ్రామాలు అద్దంలా ఉండేవి. ఊరిలో ప్రతి వీ«ధికి చక్కని సిమెంట్ రోడ్లు ఉండేవి. గ్రామ గ్రామానికి మంచినీటి పథకాలు ఉండేవి. పచ్చదనం, పరిశుభ్రతలతో గ్రామాలు ఆదర్శవంతంగా ఉండేవి. ఆనాటి పాలనారీతిని ఈ తరానికి అందించాలనేదే నా ఆశయం.

పెద్దదిక్కు లేని ఇల్లులా పల్లెలు!