December 6, 2013

అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కేంద్రం గద్దెదిగి రావాలంటే ఆందోళనలు తప్పవని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా అని వారు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల జేఏసీలను సంప్రదించాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చలేదన్నారు. సమస్యలుపరిష్కరించకుండా విభజన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. కేంద్ర ఏకపక్షనిర్ణయాన్ని, జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని వారు డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్లనారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు పాల్గొన్నారు.

కేంద్రం దిగిరావాలంటే ఆందోళనలు తప్పవు

December 5, 2013


 రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేబినెట్ నోట్ చూశాకే తాము స్పందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోందని, తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా అని కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని ఆరోపించారు.

తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా

కృష్ణ జిలాలపై బ్రెజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వానికి అవగాహన లేదని, అందుకే రాష్టానికి నష్టం జరుగుతున్న ఇంతవరకు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం వస్తుందని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని, తీర్పును రద్దు చేసే విధంగా పోరాడాలని మండవ కోరారు. అలాగే దీనిపై అఖిల పక్షం కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మైనపు బొమ్మలా ఉండకుండా స్పందించి, రాష్ట్రానికి న్యాయం చేయాలని మండవ పేర్కొన్నారు. తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్ అయితే, జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తప్పు పట్టడం సరికాదని ఆయన హితవుపలికారు.

తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్

 రాయల తెలంగాణ ఎవరు అడిగారని, రాయలసీమను విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివప్రసాద్,
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయమని, ఎవరూ కోరలేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తెరపైకి తీసుకు వచ్చిందని ఆయన అన్నారు.

మరో ఎంపీ మోదుగుల మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన ఓ మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు.

మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే

December 4, 2013

జూరాల వద్ద తెలుగుదేశం పార్టీ రేపు తలపెట్టిన మహాధర్నా కార్యక్రమం వాయిదా పడినట్టు సమాచారం.

జూరాల వద్ద టీడీపీ మహాధర్నా వాయిదా

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొంగనాటకాలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు.

తెలంగాణ జిల్లాల్లో గురువారం కేసీఆర్ పిలుపిచ్చిన బంద్‌కు సహకరించవద్దని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయనని చెప్పడం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు వచ్చిందని, తెలంగాణ బిల్లు రాకుండా కేసీఆరే అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తెచ్చించో ప్రజలు గమనిస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తన దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుందని కెసిఆర్ విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతామని చెప్పిన కెసిఆర్, ఇప్పుడు మాటమార్చి నాటకాలాడుతున్నారని అన్నారు.

డబ్బు సంచులు, ప్యాకేజీలు ఇక రావనే ఉద్దేశంతోనే విభజనను అడ్డుకునేందుకు కెసిఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీతో కెసిఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మ బలిదానం చేసుకుంటే.. కెసిఆర్ కోట్ల కోసం ఆశపడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నారు.

గతంలో ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ప్రయత్నిస్తే అప్పటి ప్రధాని దేవెగౌడతో పోరాడా. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వీల్లేదని 4 రాష్ట్రాల సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చింది. టీడీపీ హయాంలో రూ. 11 వేల కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తీసుకొచ్చాం. నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించి నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే’ అని బాబు అన్నారు.

ఆల్మట్టి ఎత్తు పై ప్రధాని దేవెగౌడతో పోరాడా!

 కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల 14 జిల్లాల్లో తాగు,సాగు నీటి సమస్యలు తలెత్తుతాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ వద్ద చేపట్టిన మహాధర్నాలో బాబు మాట్లాడుతూ తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ తీర్పు వల్ల మన హక్కులను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కరువులు, వరదల సమయంలో ఇబ్బందులు పడుతున్నది మనమే అని, కృష్ణానదికి తెలుగు ప్రజలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. కృష్ణా నదిపై ఇప్పటి వరకు రెండు ట్రిబ్యునళ్లు వేశారని తెలిపారు. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా బ్రిజేష్‌కుమార్ జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. 78 సంవత్సరాల డేటా 75 శాతం నీటి లభ్యతతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేస్తే....బ్రిజేష్ ట్రిబ్యునల్ 47 ఏళ్ల డేటా 65 శాతం నీటి లభ్యతను పరిశీలించి కేటాయింపులు చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టిన మహాధర్నాలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, రైతులు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.

టీడీపీ మహాధర్నా