December 6, 2013

కేంద్రం దిగిరావాలంటే ఆందోళనలు తప్పవు

అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కేంద్రం గద్దెదిగి రావాలంటే ఆందోళనలు తప్పవని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా అని వారు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల జేఏసీలను సంప్రదించాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చలేదన్నారు. సమస్యలుపరిష్కరించకుండా విభజన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. కేంద్ర ఏకపక్షనిర్ణయాన్ని, జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని వారు డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్లనారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు పాల్గొన్నారు.