March 22, 2013

హైదరాబాద్ : వైఎస్ హయాంలోని అవినీతి, అక్రమార్జన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావును కూడా సీబీఐ అరెస్టు చేసి విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత ముద్దు కృష్ణమ నాయుడు విలేకరులతో మాట్లాడారు. 2004 నుంచి 2009 వరకూ రాష్ట్రంలో జరిగిన అవినీతి వ్యవహారాలన్నీ కేవీపీ చేతుల మీదుగానే జరిగాయని, వీటన్నింటిలో ప్రమేయం ఉన్న ఆయనను సీబీఐ వదిలిపెట్టడానికి వీల్లేదని అన్నారు.

'దుబాయిలో కేవీపీకి షాపింగ్ మాల్స్, నివాస అపార్టుమెంట్లు ఉన్నాయి. దుబాయిలో పెట్రోలు బావులు కొనాలని ఒక షేక్‌కు రూ. 450 కోట్లు ఇచ్చి మోసపోయాడు. వాటిని రాబట్టుకోవడానికి పెద్ద పోరాటం చేసినా ఫలించలేదు. ఆయనకు ఇన్ని కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో సీబీఐ విచారించాలి' అని ముద్దు కోరారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండటంతో ఆయన అవినీతిపై కొంత ఉపేక్ష వహించారని, ఇటీవల జగన్‌తో లోపాయికారీ సంబంధాలు పెట్టుకోవడంతో సీబీఐ రంగంలోకి దిగిందని గాలి వ్యాఖ్యానించారు. 'తన దగ్గరి బంధువు పార్థసారథిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేయడం ద్వారా ఏపీఐఐసీని తన జేబు సంస్థగా మార్చుకొన్నారు.' అని ముద్దు ఆరోపించారు.

వైఎస్ అవినీతిలో కేవీపీకి భాగం:టీడీపీ

గుంటూరు: సహకార ఎన్నికల్లో వలే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెర లేపిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనే సత్తా లేని కాంగ్రెస్ పార్టీ ఓటర్ జాబితాల్లో అక్రమంగా చేర్పులను చేపడుతున్నదన్నారు. నరసరావుపేటలోని ఓటర్లను తీసుకెళ్లి టీడీపీకి పట్టు ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం చేర్చిందన్నారు. దానివల్ల రెండుచోట్ల కాంగ్రెస్ వారు ఓట్లు వేయడానికి కలుగుతుందన్నారు. ఈ అక్రమాలను సవరించకపోతే ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం : కోడెల


రాజమండ్రి: వస్తున్నా మీకోసం కా ర్యక్రమంలో భాగంగా తమపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్ర ఏప్రిల్ 27 వరకూ కొనసాగి విశాఖపట్నంలో ముగుస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు. శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడా రు. ఇప్పటివరకూ బాబు ప్రతీరోజూ 11నుంచి 12 కిలోమీటర్ల వరకూ నడిచేవారని, కానీ అర్థరాత్రి కావడంవల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందనే కారణ ంతో ఇక రోజుకు పదికిలోమీటర్లలోపే నడిచేలా నిర్ణయించామన్నారు.

రూట్‌మ్యాప్‌లో మార్పేమీ లేదని, రాత్రుల బస చేసే స్థలాలు మారతాయన్నారు.ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందన్నారు. రాజమండ్రిలో అపూ ర్వ స్పందన వచ్చిందన్నారు. పాదయ్రాతలో వివిధ వర్గాల ప్రజలు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

ఏప్రిల్ 27 వరకూ బాబు యాత్ర


 విజయవాడ:నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లాలో ఏప్రిల్ ఏడవ తేదీన పర్యటించబోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగనుంది. నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేట, గంపలగూడెం మండలాల పరిధిలో మొత్తం ఆరుగ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొంటారు. బాలకృష్ణ మార్చి 30, 31 తేదీలలో జిల్లాకు రావాల్సి ఉంది. ఎన్టీఆర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సెమినార్ ఉండటం, ముగింపు కార్య క్రమం కూడా అప్పుడే ఉండటంతో శుక్రవారం రాత్రి పర్యటన వాయిదా పడింది.

ఏప్రిల్ 7వ తేదీన జిల్లాకు రానన్నట్టు బాలయ్య హామీ ఇచ్చారు. బాలకృష్ణ పర్యటన షెడ్యూల్ వాయిదా పడటంతో విగ్రహావిష్కరణల కార్యక్రమాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించటానికి నియోజకవర్గ టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించటానికి కారణాలేమీ లేవు. వస్తున్నా .. మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి మీదుగా తిరువూరు నియోజకవర్గంలో అడుగు పెట్టాల్సి ఉంది.

ఆ తర్వాత షెడ్యూల్ మారింది. నల్గొండ జిల్లా నుంచి కోదాడ మీదుగా కృష్ణాజిల్లాలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. సత్తుపల్లి మీదుగా చంద్రబాబు వస్తున్నాడన్న ఉద్దేశ్యంతో తిరువూరు నియోజకవర్గ పార్టీ భారీ ఎత్తున బాబుతో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలు చేయించాలని ఏర్పాట్లుచేసింది. అయితే.. బాబు రూట్ మారటంతో సీన్ మారిపోయింది. ఈక్రమంలో ఇటీవల రెండో విడతగా జిల్లా పాద యాత్రకు బాబు వచ్చినప్పుడు తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆయనతో తమ నియోజకవర్గంలో చేసుకున్న ఏర్పాట్లు గురించి వివరించారు. కనీసం రెండు విగ్రహావిష్కరణలలో అయినా తాను తర్వాత పాల్గొంటానని చెప్పినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో చంద్రబాబు తన వియ్యకుండు బాలకృష్ణకు ఫోన్ చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరటంతో ఆయన అంగీకరించారు. తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వాయిదా పడిన వివరాలతో పాటు, బాలకృష్ణ ఎప్పుడు వస్తున్నదీ వివరించారు. ఏప్రిల్ ఏడవ తేదీన ఒక్క రోజే బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ముందుగా విస్సన్నపేట మండలం పరిధిలోని కలగర గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరిస్తారు. ఆతర్వాత గంపలగూడెం మండలంలోని అనుమల్లంక, కొమెర, మేడూరు, సత్యాలపాడు, పెనుగొలనులలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణల్లో పాల్గొంటారు.

పెనుగొలనులో బహిరంగసభలో బాలయ్య పాల్గొంటారు. అనంతరం నియోజవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు స్వామిదాసు ఆంధ్రజ్యోతికి చెప్పారు.

7న జిల్లాకు బాలకృష్ణ రాక

అసెంబ్లీలో విద్యుత్ సౌకర్యం నిలిపివేత
వ్యాన్లలో ఎన్టీఆర్ ట్రస్టుకు తరలించిన పోలీసులు
అక్కడ నుంచే దీక్షలు చేపడతామన్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం సభను వాయిదా వేయడంతో టీడీపీ సభ్యులు అసెంబ్లీలోనే దీక్షలు చేపట్టారు. దాదాపు 56 మంది టీడీపీకి చెందిన శాసనసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీక్షలో ఉండటంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మధ్యాహ్నం నుంచే పోలీసులు అసెంబ్లీ ఆవరణలో మోహరించారు. ఏ క్షణంలోనైనా పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారని సూచనలు కనిపించాయి. రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి అన్నీ గేట్లను మూసివేసి ఒక్క గేట్‌ను మాత్రమే తెరిచి ఉంచారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీసులు టీడీపీ సభ్యులను ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు తరలించారు.

దీక్షలో పాల్గొన్న సుమారు 56 మంది టీడీపీ సభ్యులను అర్ధరాత్రి సమయంలో వ్యాన్లలో తరలించారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలకు సూచనలు అందజేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలిస్తారనే విషయం వారికే అర్థం కాలేదు. రెండు బస్సులు, పలు కార్లలో వారిని తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న తమను ప్రభుత్వం అమానుషంగా అరెస్టు చేసిందని విమర్శించారు.

ఎక్కడికి తరలంచినా తాము అక్కడే దీక్ష చేపడతామని, అక్కడి నుంచే శనివారం అసెంబ్లీకి వెళ్లతామన్నారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అవలంభించాల్సిన వైఖరిపై చంద్రబాబు తగు సూచనలు చేశారని సమాచారం. శనివారం అసెంబ్లీలో బ్లాక్ పేపర్‌ను ప్రవేశపెట్టాలని సూచించినట్లు తెలిసింది. తాము ఏమి చేస్తే బాగుంటుందని ప్రజల నుంచి సలహాలను సేకరించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్ల ద్వారా సూచించినట్లు సమాచారం.

అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యేల తరలింపు

సర్ చార్జీల పాపం ఆయనదే
అదే దారిలో కిరణ్
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం

  కాకినాడ : వైఎస్ సీఎంగా ఉండగా ఎక్కువ రేటుకు ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన పాపం ఇపుడు పేద, మధ్యతరగతి ప్రజల్ని సర్‌చార్జీల రూపంలో వెంటాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొమ్మూరు వద్ద ఆయన శుక్రవారం పాదయాత్ర ఆరంభించారు. ధవళేశ్వరం, ఎర్రగుండ పప్పువారి సెంటర్, కాటన్‌దొర బ్రిడ్జి, వేమగిరి ఎస్సీపేట, కడియం దాకా నడిచారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్న విద్యుత్ సమస్యపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. "1994లో సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేశాను.

ఇప్పుడీ కాంగ్రెస్ దొంగలు వచ్చి రాష్ట్రాన్ని చీకటి రాజ్యంగా మార్చేశారు. సర్‌చార్జీలరూపంలో పేద, మ ధ్యతరగతి ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారం పడుతోంది'' అని పేర్కొన్నారు. కరెంటు లేకపోయినా ఈ చార్జీలేమిటని ఘాటుగా ప్రశ్నించారు. "మీరొస్తే కానీ ఈ కరెంటు కష్టాలు తీరి, మాకు ఉపాధి దొరకదు సార్!'' అని ఓ యువకుడు అనగా, "తమ్ముడూ! ఈసారి మనమే అధికారంలోకి వస్తాం'' అని ధీమాగా పలికారు.

"ప్రైవేటు కంపెనీల నుంచి వైఎస్ ముడుపులు తీసుకొని.. యూనిట్ రూ. 14కి కొనుగోలు చేశారు. విద్యుత్ రంగాన్ని అతలాకుతలం చేశారు. అదే వరసలో ఇప్పుడు కిరణ్ కూడా ప్లాంట్ల నుంచి ముడుపులు అందుకుని కరెంటు కష్టాలు తెచ్చార''ని దుయ్యబట్టారు. కాగా, పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న ఆయన.. ఇప్పటి వరకు చెల్లించిన వడ్డీనీ తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ కూడా చేస్తామన్నారు.

షెడ్యూల్‌లో స్వల్ప మార్పు: చంద్రబాబు రోజువారీ నడకలో స్వల్ప మార్పులు చేశారు. వీలైనంత త్వరగా గమ్యాన్ని చేరేందుకు ఆయన రోజుకు 12 నుంచి 16 కిలోమీటర్ల మేర నడిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాబోయే వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా చంద్రబాబు పాదయాత్రలో స్వల్ప మార్పులు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇకపై ఆయన 10 కిలోమీటర్ల లోపే పాదయాత్ర చేయరని వారు చెబుతున్నారు.

దీనివల్ల తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయన యాత్ర అదనంగా మూడు రోజులు ( 16) సాగనుంది. మరోవైపు, అర్ధరాత్రి దాటినా పాదయాత్రలో జనం రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. విద్యుత్ కోతల సమస్యను ఎక్కువగా ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. ఇదిలాఉండగా, సమీక్షల్లోనూ చంద్రబాబు కొత్త పుంతలు తొక్కు తున్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఒకటి, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

'కోత'ల కారకుడు వైఎస్సే!

బుక్కరాయసముద్రం : 'టీడీపీ ఓ కుటుంబం లాంటిది. కుటుంబమన్నా క మనస్పర్థలు, విభేదాలు సహజం. పార్టీలో ఉన్న కార్యకర్తలకు తల్లిలాం టిదాన్ని అందరికి అండగా ఉంటా' అని ఎమ్మెల్సీ శమంతక మణి భాగోద్వేగంతో మాట్లాడారు. గురువారం మం డల కేంద్రంలోని రామస్వామి దేవాలయంలో మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీతోపాటు ఆలం నరసానాయుడు హాజరయ్యారు. మండలంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు సహకార సొసైటీ ఎన్నికల నుంచి శమంతకమణితో దూరంగా ఉన్నారు. ఇటీవలే కాల్వ శ్రీనివాసులు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసార«థి, ఆలం నరసానాయుడు మండల టీడీపీ నేతలతో మా ట్లాడి, విభేదాలు వీడి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గం ఇన్‌చార్జ్ శమంతకమణికి ఎ మ్మెల్సీ పదవి ఇవ్వగా బుధవారం జరిగిన స్వాగత కార్యక్రమానికి మండలం నుంచి పలువురు టీడీపీ కార్యకర్తలు హాజరుకాలేదు.

దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ శమంతకమణి స్వ యంగా సమావేశం ఏర్పాటు చేసి మండల టీడీపీ కార్యకర్తలతో, నాయకులతో విడివిడిగా మాట్లాడారు. సహకార సొసైటీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ లేదంటూ కార్యకర్తలకు తెలిపా రు. చెన్నంపల్లి-2 డైరెక్టర్ ఫిరాయించి న విషయంలో తనకు ఎలాంటి సం బంధం లేదని ఆ రోజు పార్టీ టెలీకాన్ఫరెన్స్ జరుగుతున్నందు వల్ల మీ ఫోన్ అందుబాటులోకి రాలేకపోయిందని అందుకు క్షమించాలని వేడుకున్నారు. సహకార సొసైటీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించడానికి సహకరించిన టీడీపీ నేతలు చెన్నంపల్లి మల్లికార్జున రెడ్డి, సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలోనే ప్రకటించారు.

ఇకపై మండలంలో ఏ కార్యకర్తకీ కష్టమొచ్చినా తానుంటానని ఆమె వెల్లడించారు. గతంలో జరిగిన సంఘటనను మరచిపోయి ఒక తల్లిలా ఆదరించాలని కార్యకర్తలను వేడుకున్నా రు. ఈ నెల 31న జరిగే ప్రమాణ స్వీ కారోత్సవం కార్యక్రమానికి మండలం నుంచి భారీగా తరలిరావాలని మం డల నేతలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్కే వెంకటేశులు, మండల కన్వీనర్ అశోక్‌కుమార్, జిల్లా టీడీపీ నేతలు జొన్నారామయ్య, కేశ న్న, మాజీ సర్పంచ్‌లు లక్ష్మినారాయణ, రమేష్, లింగారెడ్డి, నారాయణస్వామి టీడీపీ నేతలు ఓబుళపతి, చెరుకూరు నారాయణస్వామి, వెంకటేష్, రామాంజినేయులు, ఆదినారాయణ, సన్నీ, సిద్దారెడ్డి, సోమశేఖర్, పరిసే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

కాకినాడ సిటీ,: 'యువత రాజకీయాలలోకి రావాలి. సమాజానికి ఉపయోగపడే రీతిలో భవిష్యత్ నాయకులుగా తయారుకావాలి. రాబోయే రోజుల్లో యువతకు మూడో వంతు సీట్లు కేటాయిస్తాం. అవినీతి, ఆశ్రితపక్షపాతం, అక్రమాలకు దూరంగా రాజకీయాలలోకి వచ్చి ప్రజా సేవ చేయాలి. అంతేకానీ జగన్‌లా దోచుకోవడం.. దాచుకోవడం.. వద్దు..పేదలకు సేవచేసి జన్మ సార్ధకం చేసుకుందాం..' అని చంద్రబాబు యువతకు పిలుపునిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' యాత్రలో భాగంగా గురువారం రాజమండ్రి రామకృష్ణ మఠం వీధిలో యువత, విద్యార్థులు ఏర్పాటుచేసిన సదస్సులో చంద్రబాబు పాల్గొని యువతను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు.

నాలు గు తరాల నేర కుటుంబానికి చెందిన వైఎస్ కుటుంబానికి అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంటారని బాబు హెచ్చరించారు. సమాజసేవ కోసం యువత కంకణబద్దులు కావాలని ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. జగన్‌ని ఆదర్శంగా తీసుకుని ఆపార్టీలో చేరితే జేబులు కొట్టడం నే ర్పి జైలుకు పంపుతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వై ఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఓ రౌడీని తయారుచేసి ప్రజల సొమ్ము దోచుకునేందుకు ప్రోత్సహించారన్నారు.

జగన్‌కు అక్రమాలలోనే అనుభవం పిల్ల కాంగ్రెస్ నేతకు రాజకీయాలలో ఏ అనుభవం ఉందని ఆయన్ని గెలిపించాలి.. అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి లక్షల కోట్లుదోచుకున్నందుకు ఆయనను ఎన్నుకోవాలా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం నాలుగు తరాల దోపిడీ కుటుంబమని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో 200 మంది టీడీపీ కార్యకర్తల్ని హత్యచేయించారని.. జగన్‌ని గెలిపిస్తే మరిన్ని దారుణాలకు పాల్పడతాడని హెచ్చరించారు.

యువత, మహిళలు టీడీపీ వైపే టీడీపీ హయాంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కాంగ్రెస్ వాళ్లు పేదలకు దక్కాల్సిన ఉద్యోగాల్ని తెగనమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్నవారికి కాంగ్రెస్‌లో మేలు జరగదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తన పాదయాత్రలో యువత, మహిళలు, పిల్లలు వచ్చి సంఘీభావం తెలుపుతుంటే ఆనం దం కలుగుతుందన్నారు. ఇది రాబోయే ఎన్నికలలో విజయానికి సంకేతమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

గ్రూపు రాజకీయాలను సహించను పార్టీ నేతలు కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పి.గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం సుమారు రెండుగంటలపాటు సాగింది. ఈసందర్భంగా ఆయా చోట్ల ఉన్న గ్రూపు తగాదాలను కార్యకర్తలు బాబు దృష్టికి తీసుకువచ్చారు. క్రమశిక్షణపాటించకపోతే చర్య లు తప్పవని నేతలను హెచ్చరించారు.

చంద్రహాసం

కాకినాడ సిటీ: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం జిల్లాకు రానున్నారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ఆయన తుని నియోజకవర్గ పరిధిలోని లోవ చేరుకుని తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో లోవ చేరుకుంటారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తునిలో మిత్రుడి ఇంట్లో బాలకృష్ణ మధ్యాహ్నం భోజనం చేస్తారు. అనంతరం పాయకరావుపేట నియోజకవర్గంలోని అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో టీడీపీ నాయకులు, ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి బహిరంగసభలో మాట్లాడతారు. అనంతరం విశాఖ విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ వెళతారని బాలకృష్ణ మిత్రుడు, టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ జహీరుద్దీన్ జిలానీ చెప్పారు.

సినీనటుడు బాలకృష్ణ జిల్లాకు రాక

రాజమండ్రి: చంద్రబాబునాయుడు రాజమం డ్రి కంబాలచెరువు సెంటర్‌లో ప్రసంగించే సమయంలో పలువురు ప్రభుత్వం తీరువల్ల ఇబ్బందు లు పడుతున్నామని చెప్పగా తానేమి చేయాలో.. మీరేమి చేయాలో చెప్పండి అని అడిగారు. దీంతో ప్రజలు స్పందిస్తూ కాంగ్రెస్‌ను గద్దెదించి తెలుగుదేశంను అధికారంలోకి తెస్తామన్నారు. మరో మహిళ మాట్లాడుతూ ఇవాళ బియ్యం బస్తా రూ.1100 అయిందని తాము బతకడం కష్టమైపోయిందని చెప్పారు. రూ.5,6 వేల జీతంతో సామాన్యులకు బతుకు భారంగా పరిణమించిందని, రాజమండ్రిలో పుట్టి పెరిగిన గజం స్థలం కూడాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ బాధపడడంకాదు పోరాడాలని, తెలుగుదేశానికి అండగా నిలబడాలని ప్రజల బతుకులు మారుస్తానని చెప్పారు.

నేనేమి చేయాలి.. మీరేమి చేయాలి


రాజమండ్రి: ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారని తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ ప్ర భుత్వం దోపిడీ చేసి దగా చేయడమే కాక పన్నులు పెంచి పీడిస్తోందని అం దువల్ల ప్రజల కోసం కచ్చితంగా మ నం గెలవాలని తెలుగుదేశం పార్టీ అ ధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో గురువారం ఆయన రాజోలు, పి.గన్నవరం, అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. పలువురు నాయకులు కొన్ని సమస్యలను చెప్పడంతో కొందరు నాయకులపై ఆరోపణ లు చేయడం ఒకరినొకరు విమర్శించుకోవడం, గ్రూపులుగా తయారవ్వడం తాను చూశానని తనకు ఏమీ తెలియదని అనుకోవద్దని ఆయన అన్నారు. జిల్లాలో అన్ని సీట్లు గెలిచే అవకాశముందని ప్రజల్లో తపన ఉందని కాని మనం వారికి నమ్మకం కలిగించాలన్నా రు.

జనం ఆమోదం ఉంటే గెలుస్తాడనే నమ్మకం ఉంటే అటువంటి అభ్యర్థిని దేవుడు కూడా మార్చలేరని మీరు మూకుమ్మడిగా వచ్చినా తాను అటువంటి వ్యక్తికే మద్దతు ఇస్తానన్నారు. ఎ మ్మెల్యేలు, ఇన్‌చార్జిలు వేర్వేరుగా గ్రూ పులు కట్టవద్దని ఆయన సూచించారు. నాయకుడు బలహీనంగా ఉంటే అక్క డ పార్టీ కూడా బలహీనంగా ఉంటుందని కొందరిలో ఆభద్రతభావం, అవగాహన రాహిత్యం, కావాలని తప్పులు చేయడం వంటివి ఉన్నాయని వాటిని సీరియస్‌గా తీసుకుంటానన్నారు. క్ర మశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తానని బహునాయకత్వం వల్ల ఇల్లు, రాష్ట్రం కూడా బాగుపడదని, ఒకే వ్యక్తి న్యాయకత్వం అవసరమన్నారు.

మన పార్టీకి కార్యకర్తలే బలమని ఇటువంటి బలం ఏపార్టీకి లేదని చెప్పారు. కార్యకర్తలంతా అభ్యర్థులను గెలిపిస్తే కార్యకర్తలను ఆదుకునే బాధ్యత తనదన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్త లు, నాయకుల సూచనలను ఆయన విన్నారు. ఇవాళ ప్రజలు నన్ను చూడటానికి వస్తున్నారంటే తానేమి సినిమా యాక్టర్‌ను కాదని, కాంగ్రెస్ పాలనలో విసుగిపోయి అవినీతి వల్ల దెబ్బతింటున్న ప్రజలు టీడీపీ కావాలని ముం దుకు వస్తున్నారని చెప్పారు. తాను చా లా బాగుండాలని అనుకుంటానని కా ని కొన్ని పరిమితులు ఉంటాయని అందువల్ల వచ్చిన అవకాశాన్ని కార్యకర్తలు, నాయకులు వినియోగించుకోవాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ వల్ల తనకు గుర్తింపు వచ్చిందని దానిని మరచిపోలేనని, కార్యకర్తలు, నాయకు లు కూడా అదేవిధంగా ఉండాలన్నా రు. సమావేశంలో పొటిట్‌బ్యూరో స భ్యుడు యనమల రామకృష్ణుడు, ము రళీమోహన్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరా వు, నిమ్మకాయల చినరాజప్ప, గన్ని కృష్ణ, రుద్రరాజు వెంకటరామరాజు, పులపర్తి నారాయణమూర్తి, బత్తుల రా ము, నామన రాంబాబు పాల్గొన్నారు.

ప్రజల కోసం మనం గెలవాలి


రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అ ధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రలోనే పలు చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు ఆయన ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను పరోక్షంగా ప్రకటించారు. రాజమండ్రికి ప్రము ఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్ ఇప్పటికే ప్రజల్లో పనిచేస్తుండగా, రాజమండ్రిలో గురువారం జరిగిన పి.గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ కా ర్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును అమలాపురం లోక్‌సభ ఇన్‌చార్జిగా నియమించినట్లు ప్రకటించారు. అంతేకాక ఈయనే అభ్యర్థి అని ప్రకటించారు.

సూర్యారావు మాజీ మంత్రిగా అనుభవం ఉండడమే కాక పలుకుబడి, సమర్థత ఉన్న నాయకుడని ఇక లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్‌చార్జిలను కలుపుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు. బాలయోగిలా పనిచేయాలని తనకు బాలయోగి అంటే ఏమిటో తెలుసునని అదేవిధంగా ధైర్యంగా పనిచేయాలని సూర్యారావుకు ఆయన సూచించారు. స మావేశంలో పొటిట్‌బ్యూరో సభ్యుడు య నమల రామకృష్ణుడు, మురళీమోహన్, గో రంట్ల బుచ్చయ్యచౌదరి, మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రా మచంద్రరావు, నిమ్మకాయల చినరాజప్ప, గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మురళీమోహన్

రాజమండ్రి: అవినీతినేతలు, ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం మీద తెలుగుదే శం అధినేత చంద్రబాబునాయుడు రెండు పిట్టకథలు చెప్పారు. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన పాదయాత్రలో చంద్రబాబు కొంగ జపం గురించి కథ చెప్పారు.అనగనగా ఓ జిత్తుల మారి కొంగ ఉంది, అది ఒక చెరువులో ఉన్న చేపలను తినేయాలనే ఆలోచనకు వచ్చిందన్నారు. ఒక ఎత్తుగడ వేసి, కొంగల దగ్గరకు వెళ్లి, ఈచెరువు ఎండిపోతుందని, మీరంతా చనిపోతారేమోననే బాధ తనకు ఉందని కన్నీళ్లు పెట్టిందన్నారు. ఈప్రమాదం నుంచి గట్టెక్కించడానికి తన వద్ద ఒక ఉపాయం ఉం దని, ఇక్కడకు కాస్త దూరంలో ఒక సరస్సు ఉందని, అక్కడ చాలా నీరుందని చెప్పి, నమ్మించిందన్నారు. తర్వాత రోజుకో చేప ను నోటకరుచుకుని వెళ్లి, దానిని తినేసేదని, అలా వరసగా అన్ని చేపలను తినేసిందని చెప్పారు.

జిత్తులమారి కాంగ్రెస్ ప్రజ ల జీవితాలను ఆర్పేస్తుందన్నారు. అవినీతి నేతల గురించి ఆయన ఓ మహిళ, పొట్టేలు కథ చెప్పారు. అనగనగా ఒక ఒక ఊళ్లో ఒ క ఆడబిడ్డ, ఒక పొట్టేలు ఉందని, పొట్టేలు కు ఆమెరోజూ గడ్డిపెట్టడం వల్ల అది ఆమె ఎక్కడికి వెళితే అక్కడ కు వెళుతుండేదన్నారు. ఒకసారి ఆమెను ఈపొట్టేలు గురించి ఆరా తీయగా, గడ్డిపెట్టడం వల్లే తన కూ డా వస్తుందని చెప్పిందన్నారు. తాను పెడతాను వస్తుందేమో చూస్తానని కాస్త గడ్డి పెట్టానన్నారు.

పొట్టేలు గడ్డిని తినేసి, మళ్లీ ఆమె కూడానే వెళ్లిపోయిందన్నారు. దానికి విశ్వాసం ఉందని, కానీ తాను అనేకసార్లు ఎమ్మెల్యేలు, మంత్రులుగా తయారు చేస్తే, అవినీతి డబ్బుకు అమ్ముడైపోయి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్నారు. అటువం టి వారు అవిశ్వాసం పెడితే తాను ఎం దుకు కలుస్తానని ఆయన చెప్పారు.

అవినీతిపై చంద్రబాబు పిట్టకథలు


బంట్వారం:వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి రైతులకు రుణమాఫీ చేస్తుందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాదవ్ అన్నారు. టీడీపీ నిర్వహించనున్న పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఒరిగిందీ ఏమీ లేదన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ

నాతవరం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏప్రిల్ 4వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలో 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర చేయనున్నారని, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. గురువారం ఆయన నాతవరం మండల నాయకులతో కలిసి చెర్లోపాలెం, డి.ఎర్రవరం, జిల్లేడపూడి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పాత్రయాత్ర ముగించుకొని ఏప్రిల్ నాలుగో తేదీన నాతవరం మండలం గన్నవరం వద్ద విశాఖ జిల్లాలో ప్రవేశిస్తారని చెప్పారు. అక్కడ భారీ ఎత్తున స్వాగతం పలుకుతామని, తరువాత ఎ.శరభవరం, శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్ మీదుగా డి.ఎర్రవరం చేరుకుని మదర్ కాలేజీలో రాత్రి బస చేస్తారని చెప్పారు.

తొలిరోజు చంద్రబాబు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఏప్రిల్ ఐదో తేదీన డి.ఎర్రవరంలో జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు. అనంతరం చెర్లోపాలెం నుంచి కోటవురట్ల మండలం కొత్తూరు మీదుగా పాములవాక వరకు పాదయాత్ర చేస్తారని, రాత్రికి పాములవాకలో బస చేస్తారని వివరించారు. ఆరో తేదీన నీలిగుంట, కొత్తపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేసి జల్లూరులో బసచేస్తారని, ఏడో తేదీన మాకవరపాలెం మండలం గిడుతూరు, మల్లవరం గ్రామాల్లో పాదయాత్ర చేసి రాత్రికి మాకవరపాలెంలో బస చేస్తారన్నారు.

మరుసటి రోజు అక్కడి నుంచి కన్నూరుపాలెం మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని అయ్యన్న తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి చంద్రబాబు పాదయాత్రను జయప్రదం చేయాలని అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు లాలం అబ్బారావు, పార్టీ నాయకులు కొండబాబు, ఎన్.విజయ్‌కుమార్, అప్పిరెడ్డి మాణిక్యం, రుత్తల శేషుకుమార్, పినిరెడ్డి జోగారావు, ఇ.దివాణం, లాలం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలి

విశాఖపట్నం : ప్రముఖ హీరో బాలకృష్ణ శుక్రవారం ఉదయం విశాఖకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రేపు(శనివారం) పాయకరావుపేటలో బాలకృష్ణ పర్యటించనున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాలలో బాలకృష్ణ పాల్గొననున్నారు.

విశాఖకు చేరుకున్న హీరో బాలకృష్ణ

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకనే రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగాయని టీడీపీ నేత తలసాని శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకునే రేపు(శనివారం) విద్యుత్ సౌధను ముట్టడించనున్నట్లు తలసాని తెలిపారు.

ప్రభుత్వానికి ముందుచూపు లేకనే విద్యుత్ కోతలు : తలసాని

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారం నాటికి వాయిదా వేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సభ వాయిదా పడినప్పటికీ సభలోనే బైఠాయించి నిరసన తెలిపారు. సభను ఎలా వాయిదా వేస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు.

మరోవైపు సభలో ఎలాంటి చర్చలు జరపకుండా వాయిదా వేసుకుంటూపోతే ప్రజాధనం వృథా అవుతుందని, అసలు ప్రజాసమస్యలపై ఇంకెప్పుడు చర్చిస్తారని సీపీఎం, టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రశ్నించారు.

అసెంబ్లీ వాయిదాపై టీడీపీ నిరసన