March 22, 2013

చంద్రహాసం

కాకినాడ సిటీ,: 'యువత రాజకీయాలలోకి రావాలి. సమాజానికి ఉపయోగపడే రీతిలో భవిష్యత్ నాయకులుగా తయారుకావాలి. రాబోయే రోజుల్లో యువతకు మూడో వంతు సీట్లు కేటాయిస్తాం. అవినీతి, ఆశ్రితపక్షపాతం, అక్రమాలకు దూరంగా రాజకీయాలలోకి వచ్చి ప్రజా సేవ చేయాలి. అంతేకానీ జగన్‌లా దోచుకోవడం.. దాచుకోవడం.. వద్దు..పేదలకు సేవచేసి జన్మ సార్ధకం చేసుకుందాం..' అని చంద్రబాబు యువతకు పిలుపునిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' యాత్రలో భాగంగా గురువారం రాజమండ్రి రామకృష్ణ మఠం వీధిలో యువత, విద్యార్థులు ఏర్పాటుచేసిన సదస్సులో చంద్రబాబు పాల్గొని యువతను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు.

నాలు గు తరాల నేర కుటుంబానికి చెందిన వైఎస్ కుటుంబానికి అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంటారని బాబు హెచ్చరించారు. సమాజసేవ కోసం యువత కంకణబద్దులు కావాలని ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. జగన్‌ని ఆదర్శంగా తీసుకుని ఆపార్టీలో చేరితే జేబులు కొట్టడం నే ర్పి జైలుకు పంపుతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వై ఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఓ రౌడీని తయారుచేసి ప్రజల సొమ్ము దోచుకునేందుకు ప్రోత్సహించారన్నారు.

జగన్‌కు అక్రమాలలోనే అనుభవం పిల్ల కాంగ్రెస్ నేతకు రాజకీయాలలో ఏ అనుభవం ఉందని ఆయన్ని గెలిపించాలి.. అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి లక్షల కోట్లుదోచుకున్నందుకు ఆయనను ఎన్నుకోవాలా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం నాలుగు తరాల దోపిడీ కుటుంబమని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో 200 మంది టీడీపీ కార్యకర్తల్ని హత్యచేయించారని.. జగన్‌ని గెలిపిస్తే మరిన్ని దారుణాలకు పాల్పడతాడని హెచ్చరించారు.

యువత, మహిళలు టీడీపీ వైపే టీడీపీ హయాంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కాంగ్రెస్ వాళ్లు పేదలకు దక్కాల్సిన ఉద్యోగాల్ని తెగనమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్నవారికి కాంగ్రెస్‌లో మేలు జరగదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తన పాదయాత్రలో యువత, మహిళలు, పిల్లలు వచ్చి సంఘీభావం తెలుపుతుంటే ఆనం దం కలుగుతుందన్నారు. ఇది రాబోయే ఎన్నికలలో విజయానికి సంకేతమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

గ్రూపు రాజకీయాలను సహించను పార్టీ నేతలు కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పి.గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం సుమారు రెండుగంటలపాటు సాగింది. ఈసందర్భంగా ఆయా చోట్ల ఉన్న గ్రూపు తగాదాలను కార్యకర్తలు బాబు దృష్టికి తీసుకువచ్చారు. క్రమశిక్షణపాటించకపోతే చర్య లు తప్పవని నేతలను హెచ్చరించారు.