March 22, 2013

అవినీతిపై చంద్రబాబు పిట్టకథలు

రాజమండ్రి: అవినీతినేతలు, ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం మీద తెలుగుదే శం అధినేత చంద్రబాబునాయుడు రెండు పిట్టకథలు చెప్పారు. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన పాదయాత్రలో చంద్రబాబు కొంగ జపం గురించి కథ చెప్పారు.అనగనగా ఓ జిత్తుల మారి కొంగ ఉంది, అది ఒక చెరువులో ఉన్న చేపలను తినేయాలనే ఆలోచనకు వచ్చిందన్నారు. ఒక ఎత్తుగడ వేసి, కొంగల దగ్గరకు వెళ్లి, ఈచెరువు ఎండిపోతుందని, మీరంతా చనిపోతారేమోననే బాధ తనకు ఉందని కన్నీళ్లు పెట్టిందన్నారు. ఈప్రమాదం నుంచి గట్టెక్కించడానికి తన వద్ద ఒక ఉపాయం ఉం దని, ఇక్కడకు కాస్త దూరంలో ఒక సరస్సు ఉందని, అక్కడ చాలా నీరుందని చెప్పి, నమ్మించిందన్నారు. తర్వాత రోజుకో చేప ను నోటకరుచుకుని వెళ్లి, దానిని తినేసేదని, అలా వరసగా అన్ని చేపలను తినేసిందని చెప్పారు.

జిత్తులమారి కాంగ్రెస్ ప్రజ ల జీవితాలను ఆర్పేస్తుందన్నారు. అవినీతి నేతల గురించి ఆయన ఓ మహిళ, పొట్టేలు కథ చెప్పారు. అనగనగా ఒక ఒక ఊళ్లో ఒ క ఆడబిడ్డ, ఒక పొట్టేలు ఉందని, పొట్టేలు కు ఆమెరోజూ గడ్డిపెట్టడం వల్ల అది ఆమె ఎక్కడికి వెళితే అక్కడ కు వెళుతుండేదన్నారు. ఒకసారి ఆమెను ఈపొట్టేలు గురించి ఆరా తీయగా, గడ్డిపెట్టడం వల్లే తన కూ డా వస్తుందని చెప్పిందన్నారు. తాను పెడతాను వస్తుందేమో చూస్తానని కాస్త గడ్డి పెట్టానన్నారు.

పొట్టేలు గడ్డిని తినేసి, మళ్లీ ఆమె కూడానే వెళ్లిపోయిందన్నారు. దానికి విశ్వాసం ఉందని, కానీ తాను అనేకసార్లు ఎమ్మెల్యేలు, మంత్రులుగా తయారు చేస్తే, అవినీతి డబ్బుకు అమ్ముడైపోయి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్నారు. అటువం టి వారు అవిశ్వాసం పెడితే తాను ఎం దుకు కలుస్తానని ఆయన చెప్పారు.