November 18, 2013

ఎన్టీఆర్ పరిచయం అవసరం లేని పేరు. రాముడు,కృష్ణుడు లాంటి దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇలాగే ఉంటారేమో నని ఆయన రూపం తెలిపింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతను ఓ సంచలనం. భారత చలన చిత్ర చరిత్రలో సంచలనం. ఆ నటుడు వేయని పాత్ర లేదు. అజరామరమైన చిత్ర రాజాలను ఎన్నింటినో అందించారు. స్టూడియో అధినేతగా, నిర్మాతగా ,దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సంచలనాలను సృష్టించాడు ఎన్టీఆర్. రాష్ట్రంలో వేళ్ళూనుకు పోయిన కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ తీసాడు. తెలుగుదేశం పార్టీ ని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు ల్లోకి ఎక్కాడు. దట్ ఈస్ ఎన్టీఆర్. అంతేకాదు లోక్ సభ లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా టి డి పి ని నిలబెట్టారు ఎన్టీఆర్. భారత దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది ఒక్క ఎన్టీఆర్ వల్లే సాధ్య మైంది. రాష్ట్రంలో పెను మార్పులు రాజకీయ రంగంలో వచ్చాయంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు దగ్గరయ్యారు. జాతీయ స్థాయిలో పలు పార్టీ లను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసారు. తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్. అనితర సాధ్యమైన విజయాలెన్నింటినో అలవోకగా అందుకున్న కారణజన్ముడు ఎన్టీఆర్. సినిమా రంగంలో, రాజకీయ రంగం లో సంచలనాలను సృష్టించిన ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. రాజకీయ కారణాల వల్లే ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వలేదు. భారత రత్నకు నూటికి నూరు పాల్లు అర్హుడు ఎన్టీఆర్. ఇకనైనా ఆ మహనీయుడిని గౌరవించుకుందాం.

ఎన్టీఆర్ కు భారత రత్న ఎప్పుడు..?