January 10, 2013



 
మాజీ సీఎం చంద్రబాబునాయు డు నేను రైతు బిడ్డనే అంటూ రైతులు, కూలీలను ఆత్మీయంగా పలకరించారు. వస్తున్నా మీకోసంపాదయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బచ్చోడు నుంచి బంధంపల్లి , బీరోలు పాదయాత్ర చేసిన బాబుకు గ్రామాల సమీపంలోని పత్తి, మిరప చేలల్లోకి వెళ్లారు పంటల దిగుబడి వారికష్టాల గురించి అడిగితెలుసుకున్నారు.

కూలీల మొర:

పంటపొలాల్లో వ్యవసాయపనులు చేస్తున్న కూలీలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుతో సమస్యలపై మొరపెట్టుకన్నారు. బచ్చొడుకు చెందిన అంగిరేకుల ఉపేంద్ర, రామనబోయిన కలమ్మ, బొల్లం సాయమ్మ, గంధం చంద్రకళతో చంద్రబాబు మాట్లాడి వారి సమసయలు అడిగారు. కరెంట్ కొరతతో ప ంటలు నిలువునా ఎండిపోతున్నాయని వారు మొరపెట్టుకన్నారు. అధైర్యపడవద్దు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కాంపాటి పుల్లయ్య అనే రైతుతో బాబు మాట్లాడి వారి సమస్యలను అడిగారు. విద్యుత్ కోతలతో 3 ఎకరాల్లో సాగుచేసిన మిర్చితోట ఎండిపోయిందని అని బోరున విలిపించారు. బంధంపల్లికి చెందిన భూక్యా మంచా మిర్చి కల్లాన్ని చంద్రబాబు సందర్శించి రైతుతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరెంట్ సక్రమంగా రావడంలేదనని ఫలితంగా వేలాది రూపాయాలు పె ట్టుబడులు పెట్టి సాగుచేసిన తోట నిలువునా ఎండిపోయిందని నేనెలా బతకాల ని అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు అవకాశం ఇవ్వండి మీస మస్యలు పరిష్కరిస్తానని బాబు కోరరా. బంధంపల్లికిచ ఎందిన డ్వాక్రా కూలీలతో మాట్లాడి వారి సమస్లయు అడిగారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఏమికొనేటట్టు లేదని బాబు దృష్టికి తెచ్చారు. మీ సమస్యలు పరిష్కరిస్తానని తనకు ఒక్కసారిఅవకాశం ఇవ్వానలి కోరారు. ఒక వృద్దురాలు రూ.200లు పెన్షన్ వస్తుందని, ఆ పెన్షన్ ఏమూలకు సరిపోవడంలేదని కాళ్లకు దండంపెడుతూ బాబువద్ద మొరపెట్టుకుంది. త్వరలోనే మంచిరోజులు వస్తాయని బాబు ఆమెకు భరోసా ఇచ్చారు.

నేనూ రైతు బిడ్డనై..!



ఈరోజు నా జీవితంలోనే ప్రత్యేకమైనది. నా రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు! హిందూపురంలో మొదలైన నా పాదయాత్ర 1600 కిలోమీటర్లు దాటి 100 రోజుల మైలురాయిని చేరుకుంది! నాడు ఎన్టీఆర్ ఇదే రోజున తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించారు. కాకతాళీయమే అయినా.. నిజామాబాద్ జాడీ జమాల్‌పూర్‌లో 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ బస చేసిన ప్రాంతంలోనే.. అదే తేదీన నేనూ బస చేయడం.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజునే వంద రోజుల మైలురాయిని చేరుకోవడం సంతృప్తినిచ్చింది. ఇలాంటివన్నీ సెంటిమెంట్ పరంగా నాకూ, మా పార్టీ శ్రేణులకూ ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. ఈ వంద రోజుల్లో వేలగ్రామాల్లో లక్షల మంది గుండె చప్పుళ్లు విన్నాను. పేదల బతుకులు ఎలా చితికిపోయాయో కళ్లారా చూశాను. దిక్కుతోచని స్థితిలో ఉన్న జనానికి నేను పెద్ద దిక్కుగా ఉంటానన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను.

పోరాటాలకు నెలవైన ఖమ్మం జిల్లాలో.. నా పాదయాత్ర వందో రోజున అడుగుపెట్టాను. ఈ ప్రస్థానంలో వ్యక్తిగతంగా ఎన్నో కష్టనష్టాలు వచ్చినా ఉదాత్త ఆశయంతో మొదలైన నా యాత్ర నిర్విఘ్నంగా కొనసాగించాలని పట్టుదలతో ముందుకు కదిలాను. నా యాత్ర విజయవంతంగా సాగడం వెనుక ఎందరో వ్యక్తుల కృషి ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన తరుణమిది. ఈ 100 రోజుల యాత్ర ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుతా. మరికొన్ని లక్షల మంది ప్రజలను కలుస్తా. వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారిలో ఒకడిగా ముందుకు అడుగు వేస్తా!!

నోట్: చంద్రబాబు 2012, అక్టోబర్ 2న పాదయాత్ర ప్రారంభించారు. నాటి నుంచి బుధవారానికి సరిగ్గా 100 రోజులు పూర్తయ్యాయి. ఇందులో బాబు విశ్రాంతి తీసుకున్న రోజులు, ఎర్రన్నాయుడు హఠాన్మరణం నేపథ్యంలో పరామర్శకు వెళ్లిన రోజులూ ఉన్నాయి.

నా జీవితంలో ప్రత్యేకమైన రోజు



నాన్న అధికారంలోకి వస్తారు!
లోకేష్ ట్వీట్

 చంద్రబాబు పాదయాత్ర వంద రోజులకు చేరుకోవడంతో ఆయన తనయుడు నారా లోకేష్ ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చరిత్ర పునరావృతం కానుంది. ప్రజలు బాధల్లో ఉన్నారు. ఆశలు అడుగంటాయి. 30 ఏళ్ల కిందట ఇదే రోజున 'అన్న'గారు అధికార పగ్గాలు చేపట్టారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర ద్వారా నాన్న (చంద్రబాబు) కూడా పార్టీని అధికారంలోకి తెస్తారు'' అని ట్వీట్ చేశారు. ముప్పయ్యేళ్ల కింద (1983 జనవరి 9న) ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ అధికారం చేపట్టిన విషయాన్ని లోకేష్ ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. నాడు టీడీపీ స్థాపనకు ముందు ఉన్న పరిస్థితులే నేడు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు.

అన్నగారి చరితర పునరావృతం కానుంది




విద్యుత్ పెంపుపై సర్కారుకు టీడీపీ అల్టిమేటం
దశలవారీ ఆందోళనకు రాష్ట్రస్థాయి భేటీలో చంద్రబాబు పిలుపు

 ఎడాపెడా చార్జీలు పెంచుతున్న కాంగ్రెస్ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తారో.. లేక ప్రజాగ్రహానికి గురై ఇంటికి పోతారో తేల్చుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో గురువారం జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృతస్థాయి సమావేశం.. కరెంట్ చార్జీలపై పోరాడాలని నిర్ణయం తీసుకుంది.

ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ చార్జీల భారంపై రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీని ప్రకారం ఈ నెల 21న రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహిస్తారు. 25వ తేదీన విద్యుత్ ఏడీఈ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు జరుగుతాయి.

ఫిబ్రవరి 4న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ స్థాయి పికెటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారం రూ.31వేల కోట్లు ఉందని చంద్రబాబు మండిపడ్డారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోను ఇంత భారం మోపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. "చార్జీలు పెంచాల్సిన అవసరం లేకుండా విద్యుత్ వ్యవస్థను సంపూర్ణంగా సంస్కరించి మిగులు కరెంట్‌తో వారికి అప్పగించాను. అయితే తొమ్మిదేళ్లలోమొత్తం నాశనం చేశారు'' అని ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి వచ్చిన సమస్యలన్నీ ఇప్పడు కొత్తగా వచ్చినవి కావని, వైఎస్ హయాం నుంచి మొదలైన పతనం ఇప్పడు పరాకాష్టకు చేరిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆరునెలలుగా తెలంగాణలో టీఆర్ఎస్ విశ్వసనీయత కోల్పోయిందని, తన పాదయాత్రను అడ్డుకోవాలని రక రకాలుగా ప్రయత్నించి విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనకు సంతాప సూచకంగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.

ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నందమూరి హరికృష్ణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దాడి వీరభద్రరావు, కేఈ కృష్ణమూర్తి, కడియం శ్రీహరి, ఉమా మాధవరెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాగా.. బాబు పాదయాత్ర 100 రోజుల మైలురాయి చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు గురువారం అభినందన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి..

పని చేయకపోతే టికెట్లు లేవు!
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వరంలో కాఠిన్యం పెంచారు. ఈ ఏడాదిలో మంచి పనితీరు చూపించిన వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని, పనిచేయకపోతే టికెట్లు లేవని తేల్చి చెప్పారు. ఈమేరకు మాదిరిపురంలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులను పరోక్షంగా హెచ్చరించారు. ఇంట్లో కూర్చుంటే ఎవ్వరూ గెలవరని, అందుకే పనిచేసే వారికే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

చార్జీలు తగ్గిస్తారా.. ఇంటికి వెళతారా?




అవినీతి సర్కారుపై తిరగబడండి
విద్యుత్ పాపం వైఎస్‌దే
బొగ్గు దిగుమతులో కిరణ్ రూ.400 కోట్లు మింగారు
ప్రజల కష్టాలను సర్కారు అసమర్థమే కారణం
ప్రజాభిమానం ఉంటే కొండలనైనా పిండీ చేస్తా
ఎంత దూరమైనా పాదయాత్ర చేస్తా
ఓటేసే రోజు నాకివ్వండి.. ఐదేళ్లు సేవచేస్తా
మాదిరిపురం బహిరంగ సభలో చంద్రబాబు

అవినీతి సర్కారుపై ప్రజలు, యువత.. బొబ్బలిపులులై, కొండవీటి సింహాలై తిరగబడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యుత్ సక్రమంగా లేనప్పుడు బిల్లులెందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు. ప్రజాభిమానం అండగా ఉన్నంత వరకు ఎంత దూరమైనా పాదయాత్ర సాగిస్తానని స్పష్టం చేశారు అన్నారు. 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

ప్రజాభిమానమే తనకు కొండంత బలాన్నిస్తోందని, దీనివల్లే హిందూపురం నుంచి ప్రారంభించిన పాదయాత్రను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించగలుగుతున్నానని చెప్పారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంతవరకు ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా పాదయాత్ర చేయగలనన్నారు. 1600 కిలోమీటర్ల పాదయాత్రలో దారిపొడవునా రైతులు, పేదల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, వీటన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని ప్రజలు గుర్తించాలని చెప్పారు.

తమ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి చెప్పినన్ని గంటలు నాణ్యమైన విద్యుత్ అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ దొంగలు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో విద్యుత్ వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం అంధకారంలో చిక్కుకుపోవడానికి అప్పటి సీఎం వైఎస్ కారణమని, వారి అవినీతి కారణంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని విమర్శించారు. రోశయ్య హయాంలోనూ అవినీతే తప్ప అభివృద్ధి మచ్చుకైనా కానరాలేదని చంద్రబాబు విమర్శించారు. సకల జనుల సమ్మె సమయంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసి రూ.400 కోట్లు మింగిన పాపం కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని ఆరోపించారు. కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు సరఫరానే సక్రమంగా లేనప్పుడు బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వం విద్యుత్‌పై శ్వేతపత్రం ప్రకటించాలని లేకపోతే తమ పార్టీనే నల్లపత్రం విడుదల చేస్తామని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికి 22సార్లు కేంద్రప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని, సామాన్యులు.. ఇక ద్విచక్రవాహనాలు పక్కనపెట్టి సైకిల్ ఎక్కాలని చమత్కరించారు.

సైకిల్‌తో ఆరోగ్యంతోపాటు ఖర్చు కూడా ఉండదని, అందుకే ఎన్టీఆర్ ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను ఎంచుకున్నారని గుర్తు చేశారు. నిత్యావసర ధరలు పెరిగిన తీరును కూడా చంద్రబాబు సభలో సోదాహరణంగా వివరించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో యువకిశోరాల్లా బొబ్బిలిపులులై, కొండవీటి సింహాలై ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నగదు బదిలీ ఇస్తుందని, పాలన గాడిలో పెడుతుందని, నిరుద్యోగులకు భృతి ఇస్తుందని హామీ ఇచ్చారు.

వైసీపీ, టీఆర్ఎస్‌పై నిప్పులు
వైసీపీ, టీఆర్ఎస్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంగా తన అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వైఎస్.. రూ.లక్షా 43వేల కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు ఆయన కుమారుడు ఈ దోపిడీని కొనసాగించేందుకు జైలు నుంచే పథక రచన చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పనికి రాని పార్టీ అని, ఆ పార్టీ వల్ల ఒరిగేదీమీలేదన్నారు.
మీ పెద్దకొడుకుగా ఉంటా

ఇంటికి పెద్దకొడుకు ఎలా ఆసరాగా ఉంటాడో..అలాగే తాను కూడా ప్రతీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి వారి కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఓటేసే ఒక్క రోజు తనకు కేటాయిస్తే ఐదేళ్లు సేవ చేస్తానని, ఇది ధర్మపోరాటమని దీనికి అందరూ కలిసి కట్టుగా సహకరిస్తే చరిత్ర తిరిగి రాద్దామని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో మాదిరిపురం గ్రామం పసుపురంగునద్దుకుంది.

కరెంటు లేదు.. బిల్లెందుకు కట్టాలి?: చంద్రబాబు