January 10, 2013

రైల్వే ధర పెంపును ఉపసంహరించాలి: చంద్రబాబు



కేంద్రం రైల్వే చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపడం దారుణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదాయం పెంచుకునేందు కు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సింది పోయి ప్రజలపై భారం మోపడం సమంజసం కాదన్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు జరుగుతుం టే, అవినీతి పరులను శిక్షించి ఆ సొమ్మును రికవరీ చేసి ప్రజా సంక్షేమానికి వినియోగించకుండా కేంద్రం సామాన్యులనే లక్ష్యంగా చేసుకుంటోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే తొమ్మిదేళ్లలో 28 సార్లు పెట్రోల్/ డీజిల్ ధరలను పెంచి రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగేలా చేసిందని ఆక్షేపించారు.