June 8, 2013


కాంగ్రెస్‌పై తెలుగుదేశం పార్టీ మరోసారి నిపలు చెరిగింది. రాష్ట్రంలో అవినీతికి కేంద్ర ప్రభుత్వం, సోనియా బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవినీతి ద్వారా దోచుకున్న వేల కోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో అవినీతికి మూలకారుకుడు కేవీపీ అని ఆరోపించారు. అక్రమంగా వేల కోట్లు సంపాదించిన ఆయనను కాంగ్రెస్ చంకనపెట్టుకొని తిరుగుతోందని ఎద్దేవా చేశారు. కేవీపీ బాగోతాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ అవినీతి మూటలు అందడంతోనే హైకమాండ్ కూడా నోరు విప్పడం లేదన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తుమ్మల, బొజ్జల, పెద్దిరెడ్డి విూడియాతో మాట్లాడూతూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిందని తుమ్మల ఆరోపించారు. జలయజ్ఞనాన్ని ధన యజ్ఞంగా మార్చారని ఐదేళ్ల తాము చెబుతూనే ఉన్నామని... అదే విషయంపై కేబినెట్‌లో మంత్రులు వాగ్వాదానికి దిగుతున్నారని తెలిపారు. ప్రజా సంపదను దోచుకొని కోట్లు కూడబెట్టుకున్నారని, ఆ సొమ్మును అంతా ప్రభుత్వం వెనక్కు తీసుకురావాల న్నారు. వైఎస్ జమానాలో కేవీపీ చక్రం తిప్పారని, ప్రతీ పనికి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. కేవీపీ చాంబర్ ముందు చప్రాసుల్లా వసూళ్లకు పాల్ప డ్డారన్నారు. వైఎస్ హయాంలో అవినీతికి మూలకా రణమైన కేవీపీ గురించి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైఎస్ నుంచి అవినీతి మూటలు అందుకున్నందుకే అధిష్టానం నోరెత్తడం లేదన్నారు. లక్షకోట్ల సూద్రధారి కేవీపీని కాంగ్రెస్ చంకలో పెట్టుకొని తిరుగుతోందని విమర్శించారు. కేవీపీని వెంటనే అరెస్టు చేసి, అతడి నుంచి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తాము బలైపోయామంటున్న మంత్రులు ఎవరి వల్ల బలయ్యారో చెప్పాలని సూచించారు. అవినీతి ఎపిసోడ్ లో ఎవరు బాధ్యులో మంత్రులే వెల్లడించాలని డిమాం డ్ చేశారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర కేబినెట్ మొత్తం అర్భకులతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాలనూ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని, చివరకూ ఏపీపీఎస్సీని కూడా వదిలిపెట్టలేదని బొజ్జల మండిపడ్డారు. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకుంటూ నిరుద్యోగుల ఆశలు వమ్ము చేస్తున్నారన్నారు. పేకాట రాయుళ్లు ఏపీపీఎస్సీ సభ్యులా? అని ధ్వజమెత్తారు. పథకాల ఆర్భాటంలో వైఎస్ కంటే సీఎం కిరణ్ ముదిరి పోయాడని విమర్శించారు.
కేసీఆర్‌కు డబ్బే ముఖ్యం: పెద్ది

ఇదిలా ఉంటే, టీఆర్‌ఎస్‌పై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు తెలంగాణ మూడో ప్రాధాన్యతాంశమని, డబ్బు, కుటుంబం మొదటి రెండు ప్రాధాన్యతలన్నారు. తెలంగాణపై టీడీపీ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం చలో అసెంబీే్లక కాదు.. చలో ఢిల్లీకైనా సిద్ధమని ప్రకటించారు.

అవినీతికి కాంగ్రెస్‌దే బాధ్యత

'ఉత్తరాంధ్రలో వైసీపీ బాగా వెనకబడింది. ఒకరిద్దరు గట్టి నాయకుల నియోజకవర్గాల్లోనే అది కాస్త కనిపిస్తోంది. మిగిలిన చోట్ల మనకు కాంగ్రెస్ తోనే ప్రధానపోటీ ఉంటుంది. మంత్రులు ఉండటం వల్ల కాంగ్రెస్ కొంత నిలబడింది'

ఉత్తరాంధ్రలో కాంగ్రెస్‌తోనే ప్రధాన పోటీ: చంద్రబాబు

'తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకోవడానికి సిద్ధమని కేసీఆర్ చెబుతుంటారు. టీఆర్ఎస్‌లో పనిచేస్తున్న నాగరాజు తన ఎదురుగా ఆత్మహత్యకు పాల్పడితే కేసీఆర్ పరామర్శకు కూడా వెళ్లలేదు. నాగరాజు బొంత పురుగు పాటి కూడా చేయడా' అని టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారులు కేసీఆర్ కంటికి ఆనడం లేదని ఆయన విమర్శించారు.

నాగరాజు బొంతపురుగు పాటి చేయడా?: పెద్దిరెడ్డి

హైదరాబాద్ : శాసనసభ, మండలి సమావేశాలను ఒక్కరోజు వ్యవధిలో ప్రారంభించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కుంటున్నారు. అన్ని సమస్యలపై చర్చ జరగాలంటే కనీసం 20 రోజుల పాటు సభ నిర్వహించాలని యనమల డిమాండ్ చేశారు.

ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు : యనమల

హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హతా వేటుకు రంగం సిద్ధమైంది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మార్చి15న అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత దాదాపు రెండున్నర నెలల పాటు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ విచారణ నిర్వహించారు. ఈ రోజు సాయంత్రంలోగా నిర్ణయాన్ని స్పీకర్‌ కార్యాలయం ప్రకటించే అవకాశం వుంది.

విప్ ధిక్కార ఎమ్మెల్యేలపై వేటుకు సిద్ధం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడుతున్నారు. టిడిపి నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ ముఖం చూడలేక రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. ప్రచార ఆర్భాటానికి చేస్తున్న ఖర్చులో పది పైసలు కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెట్టడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రచార ఖర్చుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందన్నారు. వ్యవసాయ పనిముట్ల వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సిఎం ప్రచార ఆర్బాటం: టిడిపి

హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రాధాన్యతలు మారిపోయాయని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. డబ్బు, కుటుంబ ప్రయోజనాల తర్వాతే తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ రాకుండా చూసుకునే పార్టీగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పందాల్లో భాగంగానే ఎంపీలు టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. కెసిఆర్ కు సోనియా దేవత అని, కె.కేశవరావు దేవదూత అని పెద్దిరెడ్డి అన్నా

కెసిఆర్ ప్రాధాన్యతలు మారిపోయాయి: పెద్దిరెడ్డి

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ నేత వర్లరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, న్యాయవ్యవస్థను కించపర్చేలా భారతి మాట్లాడారని, ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులపైనే చేయి చేసుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటే భారతికి విలాసవంతమైన భవనాలు వచ్చాయని, వైఎస్ సీఎం కాకపోతే లోటస్‌పాండ్‌లో భవనం కట్టేవారా అని ప్రశ్నించారు. జగన్ చేసిన నేరాలకు చైనాలో ఉరితీసేవారన్నారు. 2004లో ఏమీ లేని జగన్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. వైఎస్ కుటుంబానిది మొత్తం నేర చరిత్ర కాదా అని వర్లరామయ్య పేర్కొన్నారు.

వైఎస్ భారతి ప్రజలకు క్షమాపణ చెప్పాలి : వర్లరామయ్య