June 26, 2013


ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే క్రమంలో తమ ఎంపీలపై కాంగ్రెస్‌ ఎంపీలు విహెచ్‌, బలరాం నాయక్‌ తదితరులు అడ్డుకోవడం విచారకరమని టీపీపీ నేతలు ఈ. పెద్దిరెడ్డి, యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో విమర్శించారు. గత 10 రోజులుగా డెహ్రాడూన్‌, బదరీనాథ్‌, హార్సిలీ పర్వతాల్లో చిక్కుకున్న తెలుగువారి సమాచారం తెలుసుకుని, వాతావరణ అనుకూలించనప్పటికీ పార్లమెంటు సభ్యులు రమేష్‌రాథోడ్‌ బదరీనాథ్‌ చేరి అక్కడ బాధితుల యోగక్షేమాలు తెలుసుకొన్నారు. బాధితులను డెహ్రాడూన్‌ తీసుకువచ్చి వీలైనంత త్వరగా విశాఖపట్టణానికి తరలించే యత్నం చేయగా కాంగ్రెస్‌ నాయకులు ఎంపీ హన్మంతరావు, మంత్రి బలరాంనాయక్‌ బస్సులో ఎక్కిన యాత్రికులను ఏయిర్‌ పోర్టుకు రాకుండా అటకాయించి నేరుగా విశాఖపట్నం వెళ్లే యాత్రికులను హైదరాబాద్‌లో దించే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నాయకుల దిగజారుడు తనాన్ని, నీచ రాజకీయ సంస్కృతిని తీవ్రంగాఖండిస్తున్నామన్నా రు. అలసి సొలసిన తెలుగు ప్రయాణికులను తాము నేరుగా వారి గమన్యస్థానాలైన విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తే.. మధ్యలో కాంగ్రెస్‌ ఎంపీలు వచ్చి అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేయలేని పనిని తెలుగుదేశం పార్టీ చేయడం వల్ల ప్రజల్లో వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకే వారు తమ ఎంపీలపై దాడికి పూనుకున్నారని మండిపడ్డారు.

వీహెచ్‌ది అత్యుత్సాహం : టీడీపీ నేత టీడీ జనార్ధనరావు
కాంగ్రెస్‌ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీలు రమేష్‌ రాథోడ్‌ తదితరుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు విమర్శించారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.

వీహెచ్‌,బలరాం నాయక్‌లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు తాము ప్రత్యేక విమానం పెట్టినందుకే ప్రభుత్వం తమకు పోటీగా విమానం ఏర్పాటు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సేవా భావంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఉంటే స్వాగతించేవారమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే వరకు తాను ఉత్తరాఖండ్‌లోనే ఉంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో ఉన్న తెలుగువారందరినీ రాష్ట్రానికి చేర్చే బాధ్యత తమదేనన్నారు. డెహ్రాడూన్‌ నుండి విశాఖ వెళ్లే యాత్రికులను హైదరాబాద్‌ తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

బుధవారం డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. చార్‌ధామ్‌ యాత్రికులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదట పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఉంటే తాము ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే అవసరమే వచ్చేది కాదన్నారు. తమకు వనరులు లేక పోయినా యాత్రికులను ఆదుకునేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశామన్నారు.

విహెచ్‌ది అత్యుత్సాహం ః

టీడీపీ నేత టీడీ జనార్ధనరావు కాంగ్రెస్‌ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు అన్నారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.

సేవా భావంతో ప్రభుత్వం ముందుకు వచ్చుంటే స్వాగతించేవారం

ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగువారందరిని క్షేమంగా వారి స్వస్థ లాలకు చేరేవరకు సహాయ, పునరావాస కార్య్ర మాలు కొనసాగించాలని పార్టీ శ్రేణులను ఆదేశించా రు. నేడు ఉత్తరాఖండ్‌ వరదలలో అమలవుతున్న సహాయ కార్యక్రమాల గురించి సమీక్షించారు. సహా య కార్యక్రమాలు అమలుచేస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, బద్రినాథ్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీలో ఉన్న నాయకులతో పాటు ఎంపీల బృందంతో టెలికా న్ఫరెన్స్‌ నిర్వహించారు. మెరుగైన సహాయక చర్యల గురించి పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు చేశారు. సేవా కార్య్ర మాలలో చురుకుగా పాల్గొంటు న్న నాయకులు, కార్యకర్తలు, ట్రస్టు ప్రతినిధులతో పాటు విరాళాలు అందజేస్తు న్న వారిని అభినందించారు. బద్రీనాథ్‌లో తెలుగువారు పడుతున్న ఇబ్బందుల ను చూసి చలించి ప్రాణాలను తెగించి బద్రీనాథ్‌కు ఎంపీ రమేశ్‌రాథోడ్‌ వెళ్లడా న్ని చంద్రబాబు అభినందించారు.

రాష్ట్రానికి చెందిన సుమారు 350మంది గత పది రోజులుగా ఇబ్బందిపడుతున్నట్లు వారిలో కొంతమందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు జోషి అనే యాత్రికుడు చంద్రబాబు దృష్టికి తీసుకవచ్చారు. డెహ్రాడూన్‌ నుంచి ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృంధాన్ని పంపించి వారికి వైద్య సేవలు అందించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, సిఎల్‌ వెంకటరావును బాబు కోరారు. బద్రీనాథ్‌తో తెలుగు వారికి భోజనం ఏర్పాటు చేసేందుకు వెంటనే రూ.4లక్షలు అందజేయాలని ఆదేశించారు. యాత్రికులను తరలించేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారందరిని క్షేమంగా స్వస్థలాలకు చేరేంతవరకు డెహ్రాడూన్‌లోనూ, ఢిల్లీలో మకాం వేసి ఎంపీల బృందం సహాయం అందించాలని సూచించారు.

తెలుగువారంతా క్షేమంగా వెళ్లేవరకు సహాయం అందించండి

గౌరీకుండ్‌ ప్రాంతంలో సహాయ చర్యల్లో పాల్గొంటున్న భారత వాయుసేన హెలికాప్టర్‌ కూలిపోయి 19మంది దుర్మరణం పాలవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. అపశ్రుతి చోటుచేసుకున్నా ముక్కవోని ధైర్యంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్న సైనిక సిబ్బందిని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు వరద బాధితుల సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

హెలికాప్టర్‌ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భాంతి

'ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో చొరవ చూపి సహాయం అందించిన చంద్రబాబు నాయుడును చూసి తెలుగుదేశం పార్టీలో మేం అంతా గర్వపడుతున్నాం. ఆయనను అభినందిస్తున్నాం. ఆయనను అనవసరంగా కాంగ్రెస్ నాయకులు విమర్శించాలని చూస్తే సహించేది లేదు' అని టిడిపి అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. బుధవారం ఆమె ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు తమ పదవులు, రాజకీయ ఎత్తుగడల కోసం తిరుగుతున్నారని, చంద్రబాబు వెళ్ళడం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక అయినా వచ్చి బాధితులను పట్టించుకోవడం మొదలు పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు.

'ముగ్గురు మహిళా మంత్రులు రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొన్న మహిళల పరిస్ధితి ఎలా ఉందో పట్టించుకోలేదు. బాధితులను పరామర్శించలేదు. మగవారు గోచీ పెట్టుకొని అయినా తిరగగలరు. మహిళల పరిస్ధితి అది కాదు. వారికి కనీసం కట్టుకోను చీర ఉందో లేదో కూడా పట్టించుకోలేదు. ఒక మహిళా మంత్రి పనబాక లక్ష్మి తన నియోజకవర్గానికి చిరంజీవిని తీసుకువెళ్ళి అక్కడ సంబరాలు చేస్తోంది. ఇదేనా వీరి బాధ్యత? ఉత్తరాఖండ్ విలయం భోపాల్ ఘటనను మించిందని అంటుంటే ప్రభుత్వంలో ఉన్నవారి స్పందన చాలా నాసిగా ఉంది. అధికారం, ముఠా కుమ్ములాటలపై ఉన్న శ్రద్ధ బాధితులపై లేదు' అని ఆమె విమర్శించారు.

చంద్రబాబును చూసి గర్వపడుతున్నాం: నన్నపనేని

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాధ్‌లో చిక్కుకొన్న యాత్రికుల వద్ద భోజన ఖర్చులకు డబ్బులు లేవని తెలియడంతో వారికి రూ. నాలుగు లక్షలు పంపాలని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాహకులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి పార్టీ నేతలు, ట్రస్టు నిర్వాహకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

బద్రీనాధ్‌లో ఉన్న టిడిపి ఎంపీ రమేష్ రాధోడ్ అక్కడ ఉన్న యాత్రికులతో ఈ సందర్భంగా టెలిఫోన్లో మాట్లాడించారు. అక్కడ 350 మంది తెలుగువారు గత పది రోజులుగా చిక్కుకొని ఉన్నారని, వారిలో కొందరు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఉన్నారని జోషి అనే యాత్రికుడు చంద్రబాబుతో చెప్పారు. అక్కడకు వెంటనే ఒక వైద్య బందాన్ని పంపాలని చంద్రబాబు ఆదేశించారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడి బద్రీనాధ్‌లో ఉన్న వారిని తరలించే ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఎంపీలకు సూచించారు. ప్రాణాలకు తెగించి బద్రీనాధ్ వెళ్ళిన ఎంపీ రాధోడ్‌ను ఆయన అభినందించారు. బద్రీనాధ్‌లో ఉన్న వారి వివరాలు వెబ్‌సైట్లో పెట్టి వారి బంధువులకు వివరాలు తెలపాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

బద్రీనాధ్ యాత్రికులకు టిడిపి ఆర్ధిక సాయం

చార్‌ధామ్ యాత్ర బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. చార్‌ధామ్ యాత్రలో అయినవారిని కోల్పోయి విషాదంతో తిరిగి వచ్చిన మురహరిరెడ్డి కుటుంబాన్ని తూర్పు ఇబ్రహీంపట్నంలో బుధవారం ఆయన పరామర్శించారు. విపత్తు జరిగి మూడు రోజు లు గడిచినా అక్కడ ప్రభుత్వం ఎలాం టి సాయం చేయకపోవడం వల్ల ఎం తో మంది ప్రాణాలు కోల్పోయారని మురహరిరెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, తాగునీరు లేకపోయినా కనీసం చలికి తట్టుకునేందుకు దుప్పట్లు ఉన్నా తన తల్లి ప్రాణా లు దక్కేవని కన్నీళ్ల పర్యంతమయ్యారు.

తమిళనాడు, గుజరాత్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల బాధితులను ప్రత్యేక హెలికాప్టర్‌ల ద్వారా తరలించారని మన ప్రభుత్వం ఎలాంటి సహా య కార్యక్రమాలు చేపట్టలేదని వాపోయారు. టీడీపీ ఏర్పాటు చేసిన హెలికాప్టర్, కేశినేని బస్సుల ద్వారా ఇళ్లకు చేరుకున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే దేవినేని ఉమా మాట్లాడుతూ చార్‌ధామ్ యాత్రలో అచూకీ లభ్యం కాని కొల్లి రజని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రజని కుమర్తె అనూష ఇంజనీరింగ్ చదివేందుకు కళాశాల యాజమన్యంతో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఉమా వెంట టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్, లంబు వాసు, జాస్తి శ్రీనివాసరావు, నల్లమోతు ప్రసన్నబోసు, కోయ నెహ్రూ, వెలగపూడి రామకృష్ణ, జాస్తి వెంకటేశ్వరరావు, ఎం.వి.ప్రసాద్ పాల్గొన్నారు.

బాధితులకు టీడీపీ అండ

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపు ప్రక్రియలో ఇప్పటి దాకా సుమారు 85 లక్షల రూపాయలను వ్యయం చేసినట్లు ఎన్టీఆర్‌ ట్రస్టు సీఈఓ మొటపర్తి వెంకట్‌ తెలిపారు. ఆయన బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 20 మంది వైద్యులు పెద్ద మొత్తంలో మందులు తీసుకుని వెళ్లి సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఏపీ భవన్‌, డెహ్రాడూన్‌, బద్రీనాథ్‌లో వారు సేవలను అందిస్తున్నారన్నారు. బాధితుల్లో అధికులు చర్మ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారని చెప్పారు. తమ వైద్య బృందం ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ నేతృత్వంలో సోమవారం బద్రీనాథ్‌లో విస్తృతంగా సేవలందించిందన్నారు. తాము ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రోజు అయిదారు వందల ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అక్కడ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బృందాలకు చక్కని సహకారం అందిస్తోందని వివరించారు. ట్రస్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎల్‌. రమణ 50వేల రూపాయల విరాళం అందించారని తెలిపారు. చివరి తెలుగు బాధితున్ని తీసుకువచ్చేదాకా ట్రస్టు సేవలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. బాధితుల తరలింపు కోసం విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

నమ్మకం లేకే...

కాంగ్రెస్‌ ప్రభు త్వంపై నమ్మకం లేనం దువల్లే తమ నేత చంద్ర బాబు నాయుడు ఉత్తరా ఖండ్‌ తరలిపోయారని విలేక రుల సమావేశంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చెప్పారు. స్వచ్ఛందంగా బాధితుల శ్రేయస్సు కోసం కృషి చేస్తోన్న తమ నేత పట్ల అనుచిత విమర్శలు చేస్తే సహించమని ఆమె హెచ్చరించారు. బాధిత మహిళల పట్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరిగా లేదని దుయ్యబట్టారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే దిశలో తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందని రాజకుమారి చెప్పారు.

యాత్రికుల తరలింపునకు ఎన్టీఆర్‌ ట్రస్టు వ్యయం రూ.85 లక్షలు

డెహ్రాడూన్ లో తెలుగుదేశం సహాయక చర్యలను అడ్డుకోవడంపై హరిక్రిష్ణ స్పందించారు. టిడిపి ఎంపీలు రాథోడ్ రమేష్, కొనగళ్ల నారాయణలపై కాంగ్రేస్ ఎంపీ వి.హన్మంతరావు చేయి చేసుకున్నంత పని చేయడం, వారిని తోసేయడంపై హరిక్రిష్ణ మండి పడ్డారు.

దమ్ముంటే సహాయం చేయాలి కాని, చేసే వారిని నిలవరించడం దారుణమని హరిక్రిష్ణ ఆక్షేపించారు. ఇది దురదృష్టకరమని ఆయన వాఖ్యానించారు. కాంగ్రేస్ వారి దుష్ట రాజకీయం మరోసారి బయటపడిందన్నారు.

తెలుగుదేశం ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగడం తగదు:హరికృష్ణ

డెహ్రాడూన్ లో జరిగిన ఘటనను దురదృష్టకరంగా టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాధితులు ఏ విమానంలో వెళ్లదలుచుకుంటే వెళ్లవచ్చని ఆయన అన్నారు. దేశస్థాయిలో పరువు పోయే విధంగా ఘటన జరగడం బాధ కలిగిస్తున్నదని ఆయన అన్నారు.ఎవరైనా సేవలో పోటీ పడాలి తప్ప గొడవలు పడడం తగదని ఆయన అన్నారు.ఇక్కడ ఉండే బాధితులు అందరూ క్షేమంగా వెళ్లేవరకు తాను ఇక్కడే ఉంటానని చంద్రబాబు అన్నారు.తాము నేరుగా విశాఖపట్నం వరకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు.

దురదృష్టకరం-చంద్రబాబు

డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఏపీ తెదేపా, కాంగ్రెస్ ఎంపీల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎంపీల గొడవపై బాబు మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ వరద బాధితులను తరలించడంలో ప్రభుత్వం తెదేపాను అడ్డుకుంటుందని పేర్కొన్నాడు. కాంగ్రెస్ నిజంగా బాధితులను ఆదుకుంటామంటే.. మాకేమీ అభ్యంతరం లేదని, కానీ వారు అలా చేయకుండా బురద రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఏపీ భవన్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైద్యులను బాధితులకు చికిత్స అందించకుండా అడ్డుకున్నారు. ఇప్పుడేమో.. ప్రయాణికులు విశాఖపట్నం వెళ్తారని చెబుతామంటే.. హైదరాబాద్ కు చేరుస్తామని.. చెబుతున్నారంట. మేము ప్రయణికులకు వైజాగ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని బాబు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని బురద రాజకీయాలకు దిగినా.. బాధితులను తరలించే వరకూ ఇక్కడే ఉంటాని బాబు స్పష్టం చేశారు.

కావాలనే అడ్డుకుంటున్నారు : బాబు

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రీకులను తరలించడంలో కాంగ్రెస్, తెదేపా ఎంపీల మధ్య పోటీ నెలకొంది. డెహ్రాడూన్ విమాన్రాయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెదేపా ఎంపీ రమేష్ రాథోడ్ లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఓ దశలో వీరి మధ్య తోపులాట చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వీరిని అదుపుచేశారు. ఈ ఘటనతో బాధితులు అయోమయానికి గురయ్యారు. ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు… అదే విమానంలో బాధితులను తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిందని బాధితులను మేము తరలిస్తామని కాంగ్రెస్ నేతలు అడ్డుపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన కేంద్ర మంత్రి బలరాం నాయక్, తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో జరగడం విశేషం. నేతల మధ్య పోటీతో యాత్రీకులు సైతం రెండు విడిపోయి నినాదాలు చేసినట్లు సమాచారం. యాత్రీకులను తరలించడం మాట అటుంచితే.. ఏపీ రాజకీయ నేతల వాగ్వాదంతో తెలుగు వారి పరువును మాత్రం తీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాధితుల తరలింపులో.. నేతల బురద రాజకీయం..!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా తెలివైన వాడు. సైలెంట్ గా తన వ్యవహారాలు తాను చక్కబెట్టుకోవడంలో దిట్ట. అయితే చంద్రబాబు ఇంకా తెలివైనవాడు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఆయన అందరికన్నా ముందుంటారు. ఉత్తరాఖండ్ దుర్ఘటన ప్రభావాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా అంచనావేయలేకపోయారు. పైగా ఎవరో కొందరు పర్యాటకులు వెళ్లి వుంటారు. చిక్కుకుని వుంటారు. అధికారులు చూసుకుంటారు అని ధీమా పడ్డారు. ఆయనే కాదు పర్యాటక మంత్రి చిరంజీవి కూడా ఫొటోలకు ఏరువాక ఫోజులిస్తూ, కాలక్షేపం చేశారు. అయితే ముందు దూకడంలో, జనాల్ని ముందుకు దూకించడంలో అద్భుతంగా వ్యవహరించగల మేనేజ్ మెంట్ గురూ.. చంద్రబాబు ఉత్తరాఖండ్ వ్యవహారాన్ని సరిగ్గా పసిగట్టాడు. క్షణాల్లో ఢిల్లీ చేరిపోయారు. హడావుడి చేశారు. ఆంధ్రాభవన్ లో హల్ చల్ చేసారు. చంద్రబాబు సరిజోడు ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ వెంకట్. 108 అంబులెన్స్ నెట్ వర్క్ ను ఆంధ్రాలో పరిచయం చేయడం వెనక మేథస్సు ఆయనది. చంద్రబాబుకు ఆయన తోడు రావడంతో, చకచకా ప్రణాళికలు రచించారు. వైద్య శిబిరాలు, ప్రత్యేక విమానాలు.. ఇలా ఆ దిశగా బాబు దూసుకుపోయారు.బాబు హుషారు, దానికి వచ్చిన ప్రతి స్పందన చూసి, మిగిలిన నాయకులు కూడా పాదం కలిపారు. దీంతో మొత్తం సీను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తిరిపోయింది.
ఇది సహించలేని బొత్సబాబు, దానం నాగేందర్, శవరాజకీయాలు చేస్తున్నారంటూ, బాబుపై మండిపడ్డారు. కానీ ప్రతిగా జనం మండిపడ్డారు. చేసేవారిని కూడా చేయనివ్వారా? అని. దాంతో కిరణ్ హూటా హుటిన ఢిల్లీ వెళ్లక తప్పలేదు. కానీ, పాపం , కిరణ్ అడుగు, చంద్రబాబు వెనకనే తప్ప, ముందు కాలేకపోయింది. వ్యూహరచనలో ఒక్క క్షణం ఆలస్యంగా ఆలోచించినా ఫలితం ఇలాగే ఉంటుంది. కిరణ్ కొంచెం ఆలస్యంగా ఆలోచించడం సరే. మరి అనుభవం పండిన బొత్స దానంల ప్రకటనలేమిటి? జనం మండిపడ్డారంటే, పడరా? పైగా దీనివల్ల మరో మైనస్ కూడా తప్పలేదు. కేంద్ర కాంగ్రెస్ ట్రక్కుల కొద్దీ సహాయ సామగ్రిని ఉత్తరాఖండ్ కు పంపింది. అదంతా ఇప్పుడు బాబు హవా ముందు కొట్టుకుపోయింది. ఆ సంగతి కూడా పాపం, కాంగ్రెస్ వారికి తెలియదేమో, కనీసం ఆ ప్రస్తావన కూడా లేదు వారి మాటల్లో. ఇప్పుడు బాబు మరో అడుగు ముందుకు వేసి, వాడవాడలా సంతాప ప్రదర్శనలకు దిగారు. కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందో?

బాబు వెనుక కిరణ్

రాజకీయ ప్రత్యర్థులపై తెదేపా అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మరోసారి చురకలంటించారు. ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడానికి, అదేవిధంగా రక్షించబడి ఏపీ భవన్ లో చికిత్స పొందుతున్న వారికి సరైన వైద్యం అందేలా.. తెదేపా అధినేత చేస్తున్న సహాయ సహకారాలను అధికార కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికోసమే అని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే.. “చింతా చచ్చినా.. పులుపు చావదాయె” అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు.
కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో భిన్నంగా స్పందించారు. “ఉత్తరాఖండ్ వరదబాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడం రాజకీయమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయమే అనుకుంటే… ఆయన రాజకీయం బాధితులకు అన్నం పెట్టేలా చేసిందని” అభిప్రాయపడ్డారు.
నిన్న బాబు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాలపై ఓ వార్తా పత్రిక వార్తను కూడా అందులో ఉంచారు. ’బాబు వచ్చే.. పప్పూ, కూర వచ్చే! అనే వార్త ఓ పత్రికలో వచ్చింది. దానిని కూడా లోకేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని ఎపి భవన్‌కు బాబు రాకముందు సాంబరు అన్నం, పెరుగు మాత్రమే పెట్టేవారని… బాబు ఫిర్యాదు చేయడంతో రాత్రికి రాత్రే మెనూ మారిపోయిందని, అన్నం, పప్పు, పెరుగులతో పాటు కూరగాయలు పెడుతున్నారని అందులో పేర్కొన్నారు.
ట్విట్టర్ లో పోస్ట్ తో లోకేష్ ఊరుకోలేదు విలేకర్ల సమావేశంలో పెట్టి మరీ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. లోకేష్ విలేకర్లతో మాట్లాడుతూ.. బాధితులకు ఎలా చేయాలో తాము చేసి చూపించామని, రాజకీయ లబ్ధి కోసమనే విమర్శలు సరికావని, తాము సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. కాగా, తెలుగుదేశం పార్టీ బాధితుల కోసం ప్ర్తత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు.. చికిత్స కోసం వైద్య బృందాన్ని పంపించిన విషయం తెలిసిందే.

బాబు వచ్చే.. పప్పూ, కూర వచ్చే!

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా నిలిచింది. ఏపీ భవన్ లో చికిత్సపొందుతున్న తెలుగువారిని ఆదుకునేందుకు తెదేపా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తారఖండ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను హైదరాబాద్ తీసుకుని వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.హైదరాబాదులో వరదబాధితుల సహాయార్ధం ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. 040 30269999, 040 39156425 నంబర్లకు బాధితుల బంధువులు ఫోన్ చేయాల్సిందిగా సూచించింది. అంతేకాకుండా సికింద్రాబాద్, ఖాజీ పేట, విజయవాడ రైల్వేస్టేషన్లలో పార్టీ యంత్రాంగం ద్వారా సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిన్న ఏపీ భవన్ లో తెలుగు వారిని పరామర్శించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా నిలిచింది.

ఢిల్లీలోని ఏపీ భవన్ లో టీడీపీ నాయకులతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకుఅందుతున్న సహాయక చర్యల వివరాల గురించి బాబు అడిగి తెలుసుకున్నారు. ఏపీ భవన్ నుంచి తెలుగు వారిని స్వస్థలాలకు చేర్చే బాధ్యతను ఎంపీలు రమేష్ రాథోడ్, నారాయణలకు అప్పగించారు. ప్రత్యేక విమానాల ద్వారా లేదా అవసరమైతే.. విమాన టికెట్లు కొనివ్వమని బాబు నేతలకు సూచించారు.

ప్రత్యేక విమానాల ద్వారా లేదా అవసరమైతే.. విమాన టికెట్లు కొనివ్వమని బాబు నేతలకు సూచించారు.

బదరీనాథ్ లోని బాధితులతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. బాధితులు అనారోగ్యానికి గురైనట్టు బాబుకు చెప్పారు. దీంతో.. ఇద్దరు వైద్యులతో కూడిన బృందాన్ని ప్రత్యేక హెలీకాప్టర్ లో పంపుతున్నట్టు బాబు తెలిపారు. బాధితుల్లో తెలుగువారు తీవ్ర వివక్షకు గురౌతున్నారని పలువురు ఆరోపిస్తున్న నేపధ్యంలో బాబు సేవల్ని అందరూ కొనియాడుతున్నారు. కాగా, మొదటి నుంచి కూడా బాధితులను ఆదుకోవడంలో బాబు చూపివకు చొరవ సర్వత్రా అభినందనలు అందుకుంటోంది.

బాధితులను ఆదుకోవడంలో బాబు భేష్..!

పరామర్శించనున్నారు. ఆయన వెళ్లిన విమానంలోనే తెలుగు యాత్రికులు రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. తెలుగువారిని రాష్ట్రానికి తరలించే వరకు బాబు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.

డెహ్రాడూన్ బయల్దేరిన చంద్రబాబు

బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. మరోవైపు డెహ్రాడూన్ నుంచి యాత్రికులతో క లిసి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

బాధితులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు అక్కడి వెళ్లిన టీడీపీ ఎంపీలు రమేష్‌రాథోడ్, కొనకళ ్ళ నారాయణ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే బద్రీనాథ్‌లో ప్రాంతంలో 350 మంది, చినజీయర్ మఠంలో 50 మంది యాత్రికులను తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదని, వాతావరణం అనుకూలించే వరకు ఇక్కడు ఉండి యాత్రికులను తీసుకువస్తామని ఎంపీలు తెలిపారు.

యాత్రికులను తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదు : రమేష్, కొణకళ్ల

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని తీవ్ర అవస్థలకు గురైన యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. 160 మంది యాత్రికులను డెహ్రాడూన్ నుంచి బుధవారం సాయంతం 5 గంటలకు విమానంలో తరలించనున్నారు.

బాధితుల కోసం ప్రత్యేక విమానం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ నుంచి హుటాహుటిన డెహ్రాడూన్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ తెలుగు బాధితులు ఆందోళనలో ఉన్నట్లు తెలియడంతో ఆయన బయలుదేరి వెళ్ళారు. హెలికాఫ్టర్‌లో ఎక్కడానికి తెలుగు బాధితులకు టోకెన్లు ఇవ్వడం లేదని, వారు తిందితిప్పలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ సీఎం విజయబహుగుణ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు.

బధిరీనాథ్, కేధార్‌నాథ్‌లో తెలుగు బాధితులను అధికారులు పట్టించుకోవడంలేదని, భోజన వసతి కూడా కల్పించడంలేదని బాధితులు వాపోయారు. ఈ పరిస్థితిని అక్కడ సిఎం దృష్టికి తీసుకువెళ్ళి బాధితులను ఆదుకోవాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేయనున్నారు. అవసరమైతే అక్కడ ధర్నా చేయడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఉత్తరాఖండ్ సీఎం చేతులు పైకిఎత్తివేస్తే చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసి తెలుగు బాధితులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నారు. ఇందు కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది.

అంతకు ముందు బుధవారం ఉదయం బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

డెహ్రాడూన్ నుంచి టీడీపీ నేత రమేష్ రాథోడ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ బధిరీనాథ్‌లో తెలుగు బాధితుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని హెలికాఫ్టర్‌లో ఎక్కేందుకు టోకెన్లు ఇవ్వడంలేదని అన్నారు. భోజన సదుపాయం కూడా లేదని, వారి బాధను చూసి చలించిపోయానని ఆయన చెప్పారు. ఏది ఏమైనా తెలుగు బాధితులను ఆంధ్రప్రుదేశ్ తరలించే వరకు ఇక్కడే ఉంటామని, వారికి సహాయం అందిస్తామని రాథోడ్ అన్నారు.

బధిరీనాథ్‌లో సుమారు 250 మంది తెలుగు బాధితులు ఉన్నారని, వారిలో షుగర్, బీపీ రోగులు ఉన్నారని, వారికి వైద్య సదుపాయం కూడా లేదని రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు బాధితులు అందరూ వారి స్వస్థలాలకు వెళ్లే వరకు ఇక్కడే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మరికొద్ది సేపట్లో తమ నేత చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్ చేరుకోనున్నారని రాథోడ్ చెప్పారు.

హుటాహుటిన డెహ్రాడూన్ బయలుదేరిన చంద్రబాబు