June 26, 2013

యాత్రికుల తరలింపునకు ఎన్టీఆర్‌ ట్రస్టు వ్యయం రూ.85 లక్షలు

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపు ప్రక్రియలో ఇప్పటి దాకా సుమారు 85 లక్షల రూపాయలను వ్యయం చేసినట్లు ఎన్టీఆర్‌ ట్రస్టు సీఈఓ మొటపర్తి వెంకట్‌ తెలిపారు. ఆయన బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 20 మంది వైద్యులు పెద్ద మొత్తంలో మందులు తీసుకుని వెళ్లి సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఏపీ భవన్‌, డెహ్రాడూన్‌, బద్రీనాథ్‌లో వారు సేవలను అందిస్తున్నారన్నారు. బాధితుల్లో అధికులు చర్మ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారని చెప్పారు. తమ వైద్య బృందం ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ నేతృత్వంలో సోమవారం బద్రీనాథ్‌లో విస్తృతంగా సేవలందించిందన్నారు. తాము ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రోజు అయిదారు వందల ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అక్కడ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బృందాలకు చక్కని సహకారం అందిస్తోందని వివరించారు. ట్రస్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎల్‌. రమణ 50వేల రూపాయల విరాళం అందించారని తెలిపారు. చివరి తెలుగు బాధితున్ని తీసుకువచ్చేదాకా ట్రస్టు సేవలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. బాధితుల తరలింపు కోసం విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

నమ్మకం లేకే...

కాంగ్రెస్‌ ప్రభు త్వంపై నమ్మకం లేనం దువల్లే తమ నేత చంద్ర బాబు నాయుడు ఉత్తరా ఖండ్‌ తరలిపోయారని విలేక రుల సమావేశంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చెప్పారు. స్వచ్ఛందంగా బాధితుల శ్రేయస్సు కోసం కృషి చేస్తోన్న తమ నేత పట్ల అనుచిత విమర్శలు చేస్తే సహించమని ఆమె హెచ్చరించారు. బాధిత మహిళల పట్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరిగా లేదని దుయ్యబట్టారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే దిశలో తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందని రాజకుమారి చెప్పారు.