June 26, 2013

తెలుగువారంతా క్షేమంగా వెళ్లేవరకు సహాయం అందించండి

ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగువారందరిని క్షేమంగా వారి స్వస్థ లాలకు చేరేవరకు సహాయ, పునరావాస కార్య్ర మాలు కొనసాగించాలని పార్టీ శ్రేణులను ఆదేశించా రు. నేడు ఉత్తరాఖండ్‌ వరదలలో అమలవుతున్న సహాయ కార్యక్రమాల గురించి సమీక్షించారు. సహా య కార్యక్రమాలు అమలుచేస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, బద్రినాథ్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీలో ఉన్న నాయకులతో పాటు ఎంపీల బృందంతో టెలికా న్ఫరెన్స్‌ నిర్వహించారు. మెరుగైన సహాయక చర్యల గురించి పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు చేశారు. సేవా కార్య్ర మాలలో చురుకుగా పాల్గొంటు న్న నాయకులు, కార్యకర్తలు, ట్రస్టు ప్రతినిధులతో పాటు విరాళాలు అందజేస్తు న్న వారిని అభినందించారు. బద్రీనాథ్‌లో తెలుగువారు పడుతున్న ఇబ్బందుల ను చూసి చలించి ప్రాణాలను తెగించి బద్రీనాథ్‌కు ఎంపీ రమేశ్‌రాథోడ్‌ వెళ్లడా న్ని చంద్రబాబు అభినందించారు.

రాష్ట్రానికి చెందిన సుమారు 350మంది గత పది రోజులుగా ఇబ్బందిపడుతున్నట్లు వారిలో కొంతమందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు జోషి అనే యాత్రికుడు చంద్రబాబు దృష్టికి తీసుకవచ్చారు. డెహ్రాడూన్‌ నుంచి ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృంధాన్ని పంపించి వారికి వైద్య సేవలు అందించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, సిఎల్‌ వెంకటరావును బాబు కోరారు. బద్రీనాథ్‌తో తెలుగు వారికి భోజనం ఏర్పాటు చేసేందుకు వెంటనే రూ.4లక్షలు అందజేయాలని ఆదేశించారు. యాత్రికులను తరలించేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారందరిని క్షేమంగా స్వస్థలాలకు చేరేంతవరకు డెహ్రాడూన్‌లోనూ, ఢిల్లీలో మకాం వేసి ఎంపీల బృందం సహాయం అందించాలని సూచించారు.