June 26, 2013

బాధితులకు టీడీపీ అండ

చార్‌ధామ్ యాత్ర బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. చార్‌ధామ్ యాత్రలో అయినవారిని కోల్పోయి విషాదంతో తిరిగి వచ్చిన మురహరిరెడ్డి కుటుంబాన్ని తూర్పు ఇబ్రహీంపట్నంలో బుధవారం ఆయన పరామర్శించారు. విపత్తు జరిగి మూడు రోజు లు గడిచినా అక్కడ ప్రభుత్వం ఎలాం టి సాయం చేయకపోవడం వల్ల ఎం తో మంది ప్రాణాలు కోల్పోయారని మురహరిరెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, తాగునీరు లేకపోయినా కనీసం చలికి తట్టుకునేందుకు దుప్పట్లు ఉన్నా తన తల్లి ప్రాణా లు దక్కేవని కన్నీళ్ల పర్యంతమయ్యారు.

తమిళనాడు, గుజరాత్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల బాధితులను ప్రత్యేక హెలికాప్టర్‌ల ద్వారా తరలించారని మన ప్రభుత్వం ఎలాంటి సహా య కార్యక్రమాలు చేపట్టలేదని వాపోయారు. టీడీపీ ఏర్పాటు చేసిన హెలికాప్టర్, కేశినేని బస్సుల ద్వారా ఇళ్లకు చేరుకున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే దేవినేని ఉమా మాట్లాడుతూ చార్‌ధామ్ యాత్రలో అచూకీ లభ్యం కాని కొల్లి రజని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రజని కుమర్తె అనూష ఇంజనీరింగ్ చదివేందుకు కళాశాల యాజమన్యంతో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఉమా వెంట టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్, లంబు వాసు, జాస్తి శ్రీనివాసరావు, నల్లమోతు ప్రసన్నబోసు, కోయ నెహ్రూ, వెలగపూడి రామకృష్ణ, జాస్తి వెంకటేశ్వరరావు, ఎం.వి.ప్రసాద్ పాల్గొన్నారు.