October 27, 2012

మీ కోసమే వస్తున్నా
నేటి మధ్యాహ్నం నుంచి పునఃప్రారంభం
ఆదివారం 8-10 కిలోమీటర్లు పాదయాత్ర
2,3 రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న వైధ్యులు
కొనసాగింపునకే చంద్రబాబు నిర్ణయం
బాబుకు టీడీపీ నేతల పరామర్శల వెల్లువ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పునః ప్రారంభించాలని నిర్ణయించారు. ఆదివారం ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి శనివారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. డాక్టర్లు చంద్రబాబును పరామర్శించిన తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

చంద్రబాబు ప్రస్తుతం కండరాల నొప్పితో బాధ పడుతున్నారని, బీటీ రోడ్డుపై నడవడం వల్ల ఈ నొప్పి వచ్చిందని డాక్టర్లు చెప్పారని తెలిపారు. దీంతో, చంద్రబాబు పాదయాత్ర చేసే మార్గంలో రోడ్డు పక్కన మట్టి రోడ్లు వేయించాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే, తమ కార్యకర్తలే మట్టి వేస్తారని చెప్పారు. కాగా, మరో రెండు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, పార్టీ సీనియర్లు పదే పదే కోరినా యా త్ర కొనసాగింపునకే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వివరించాయి.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో శుక్రవారం రాత్రి వేదిక కూలడంతో చంద్రబాబుకు గాయాలైన సంగతి తెలిసిందే. నడుం దగ్గర హిప్ జాయింట్ భాగం ఒత్తిడికి గురైంది. అక్కడ కొంత వాపు వచ్చింది. రాయచూర్ నవోదయ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్లు శుక్రవారం అర్ధరాత్రి వచ్చి చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీశారు. ఎలాంటి ఫ్రాక్చర్లు లేవని ప్రకటించారు. నరాలు ఒత్తిడికి గురి కావడంతో నడుము భాగంలో కొంత వాపు వచ్చిందని చెప్పారు. నడిస్తే మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కనీసం మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో, శనివారం ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఇక, చంద్రబాబు కుటుంబ వైద్యులు నరేంద్రనాథ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి శనివారం పరీక్షలు నిర్వహించారు. అలాగే, శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు. నడుముకు లుంబో సాక్రల్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

గద్వాలకు భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి..
చంద్రబాబు గాయపడిన విషయం తెలిసిన వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ హుటాహుటిన గద్వాలకు చేరుకున్నారు. చంద్రబాబు బస చేసిన రైస్‌మిల్ వద్దకు చేరుకున్నారు. శనివారమంతా ఇక్కడే ఉండిపోయారు. లోకేష్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో మాట్లాడుతూ కనిపించారు. చంద్రబాబు కోడలు బ్రహ్మ ణి సాయంత్రం గద్వాలకు చేరుకుని మామయ్యను పరామర్శించారు. బాబును సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు.

సినీ నిర్మాతలు దిల్‌రాజు, బండ్ల గణేశ్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు చంద్రబాబు బస చేసిన ప్రత్యేక వాహనంలో ఉన్నారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ, మామయ్య త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. పాలన గాడి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయక త్వం కావాలన్నారు. మీరు పాదయాత్రలో పాల్గొంటారా? అన్న ప్రశ్న కు షూటింగ్ తేదీలను బట్టి భాగస్వామిని అవుతానని చెప్పారు.

టీడీపీ నేతల పరామర్శలు
చంద్రబాబును పరామర్శించేందుకు శనివారం పలువురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు గద్వాలకు చేరుకున్నారు. పార్టీ నేతలు కోడెల శివప్రసాదరావు, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తీగల కృష్ణారెడ్డి, దాడి వీరభద్రరావు, టీడీ జనార్దన్‌రావు, వీవీఎస్ చౌదరి బాబును పరామర్శించారు. రాత్రి 7 గంటలకు జిల్లా ఎమ్మెల్యేలు పరామర్శించారు. టీడీపీ హయాంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ పాదయాత్రకు తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, కానీ.. బాబు యాత్రకు రక్షణ ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని కోడెల శివప్రసాదరావు విమర్శించారు. అస్వస్థతకు గురైన వైఎస్‌కు అప్పట్లో 24 గంటలూ వైద్య సహాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.

మంత్రి అరుణకు చుక్కెదురు
టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించేందుకు మంత్రి డీకే అరుణ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే భరత్‌సింహారెడ్డి విఫలయత్నం చేశారు. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నాయకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిపక్ష నా యకుడు తన నియోజకవర్గంలో గాయపడిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు తాము ప్రయత్నం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి శోచనీయంగా ఉందని అరుణ, భరత్‌సింహారెడ్డి విమర్శించారు.

'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పునఃప్రారంభం


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర శుక్రవారం నాటితో 25 రోజులు పూర్తిచేసుకుంది. మరో పక్క సమాంతరంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర కూడా కోనసాగుతూనే వుంది.
ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు యాత్రకు జనం బ్రహ్మరధం పడుతున్నారు. ఊరూరా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. బాబు కూడా తన గత ధోరణికి భిన్నంగా  సామాన్య జనంతో మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు వింటున్నారు…. వాళ్లకు ధైర్యం చెబుతున్నారు…. తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. గతం కంటే ఆయన ప్రసంగాలు కూడా జనాకర్శకంగా సాగుతున్నాయి. పైగా ఇళ్ళల్లోకి, పొలాల్లోకి ఆయన నేరుగా వెళ్ళిపోతున్నారు…. రోడ్లపక్కనే టీ స్టాల్స్ లో టీ తాగుతున్నారు…. తెలంగాణలో బాబు యాత్రను కొనసాగనివ్వం అంటూ తెలంగాణా రాజకీయ జే ఎ సి పిలుపు ఇచ్చి, ఆ మేరకు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికి బాబు బెదరకుండా తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టారు. ఎవరూ ఊహించని విధంగా ఎం.ఆర్.పి .ఎస్ . బాబుకు అండగా నిలిచింది. గత అయిదు రోజులుగా తెలంగాణలో బాబు యాత్ర నిరాటంకంగా సాగిపోతోంది.
ఇదిలావుంటే మరోపక్క ఇడుపులపాయ లో మొదలయిన షర్మిల యాత్ర కడప జిల్లా దాటి అనంతపూర్ జిల్లాలో కొనసాగుతోంది ఈమె యాత్రకు కూడా జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఆమె ప్రసంగాలను వింటున్నారు. షర్మిల కూడా పొలాల్లోకి, ఇళ్ళల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే చంద్రబాబుతో పోలిస్తే షర్మిల లో పెద్ద మైనస్ పాయింట్ ఏవిటంటే రాజకీయ అనుభవం లేకపోవటమే… ఆమె ప్రసంగాలన్నీ కేవలం కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోయటం, తెలుగుదేశాన్ని నిందించటం తప్ప పధకాల ప్రసక్తి లేకుండా పోతోంది. ఒక పక్క చంద్రబాబు తన యాత్ర అందరికోసం అని చెబుతుంటే షర్మిల తన యాత్ర అన్న కోసం అని చెబుతున్నారు. బాబు యాత్ర పార్టీ వ్యవహారంగా వుంటే , షర్మిల యాత్ర కుటుంబ వ్యవహారంగా కనపడుతోందని రాజకీయ
విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల కు మరో పెద్ద మైనస్ పాయింట్ ఆమె గొంతు.. జనాకర్షక గొంతుక లేకపోవటం తో ఆమె ప్రసంగాలను జనం పెద్ద ఆసక్తిగా వినటం లేదని యాత్రలో పాల్గొన్న వైఎస్సార్ పార్టి నాయకుడొకరు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే
కొత్తగా ఏయే సంక్షేమ పధకాలు ప్రవేశ పెడతామో చంద్రబాబు చెబుతుంటే , తాము రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామని షర్మిల చెబుతున్నారు. పాదయాత్రకు ముందే బిసి డిక్లరేషన్, ఎస్ సి వర్గీకరణ, మైనారిటి డిక్లరేషన్ లాంటివాటిని ప్రకటించటం చంద్రబాబు రాజకీయ పరిణతికి నిదర్శనం ….. అయితే కేవలం జగన్ బైటికి రావటం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న రీతిలో షర్మిల ప్రసంగాలు కొనసాగుతున్నాయి…
మరో ప్రధాన అంశం… చంద్రబాబు వయస్సు….63 ఏళ్ల వయసులో చంద్రబాబు తన యాత్రను కొనసాగిస్తూ ఉండటంతో ప్రజల్లో ఆయన పట్ల తెలియని సానుభూతి వర్కవుట్ అవుతోంది. ఏ విధంగా చూసుకున్నా షర్మిల యాత్ర చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతో పోలిస్తే వెలా తెలా పోతోంది అనటంలో సందేహించాల్సిన అవసరంలేదు…..

షర్మిల యాత్ర చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతో పోలిస్తే వెలా తెలా పోతోంది అనటంలో సందేహించాల్సిన అవసరంలేదు…..


 

చంద్రబాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్
చెన్నై నుంచి వస్తున్న నారా రోహిత్, నారా గిరీష్
గద్వాలకు వచ్చిన కోడెల, బొజ్జల ప్రభృతులు

గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు.

మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

కాగా చంద్రబాబుకు ప్రమాదం జరిగిన వార్త తెలుసుకుని చెన్నైలో షూటింగ్‌లో ఉన్న నారా రోహిత్, నారా గిరీష్ కూడా షూటింగ్ రద్దు చేసుకుని గద్వాలకు బయలుదేరారు. ఇప్పటికే దేశం సీనియర్ నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాద్, బొజ్జల తదితరులు గద్వాల చేరుకుని బాబుని పరామర్శించారు.

చంద్రబాబును పరామర్శించిన నేతలు & పోటోలు (27.10.2012)

 file photo
అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు. ఆయన షూటింగ్‌ను వాయిదా వేసుకుని చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న గద్వాల సమీపంలోని శెట్టి ఆత్మకూరుకు వచ్చారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వెంట ఉన్నారు.
నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందేనని, అది తెలిసి మామయ్యను పలకరించడానికి వచ్చానని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మామయ్య త్వరగా కోలుకుని తాను అనుకున్న కార్యాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోలుకుని పాదయాత్ర కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు పార్టీకి, రాష్ట్రానికి పునర్వైభవం తేవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తన షూటింగులను బట్టి, తేదీలను బట్టి చంద్రబాబుతో పాదయాత్రలో పాల్గొనే విషయాన్ని నిర్ణయించుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడిగా భావించే కొడాలి నాని పార్టీ వీడిపోయిన తర్వాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం ఇదే తొలిసారు. చంద్రబాబుతో ఆయన చాలా కాలంగా విభేదిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
సభా వేదిక కూలిపోయి చంద్రబాబు గాయపడ్డారనే తెలిసిన వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు వెంట వారిద్దరు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఉన్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు ఆయన సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ కూడా రావచ్చునని చెబుతున్నారు.

మామయ్య త్వరగా కోలుకుని తాను అనుకున్న కార్యాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు....జూనియర్ ఎన్టీఆర్ 27.10.2012