April 13, 2013

సీఎం వత్తాసుతోనే జగన్‌కు జైళ్లశాఖ దాసోహం

హైదరాబాద్, : చంచల్‌గూడ జైలు వైసీపీ కార్యాలయంగా మారిందని సాక్షాత్తు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారని.. దీనిపై ఏం సమాధానం చెబుతారని జైళ్ళ శాఖ ఐజీని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. చంచల్‌గూడ జైలు వైసీపీ కార్యాలయంగా మారిన వైనాన్ని తాము గతంలోనే బహిర్గతం చేశామని, తమ లేఖల్లోని అంశాలు వాస్తవమేనని మంత్రి వ్యాఖ్యలు రుజువు చేశాయని పేర్కొంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం వత్తాసుతోనే అధికారులు జగన్‌కు దాసోహమయ్యారని ఆరోపించారు.

జైలు సూపరింటెండెంట్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి: యనమల

ఒత్తిడికి లొంగారా?.. కుమ్మక్కయ్యారా?
వారిని సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారు: టీడీపీ

హైదరాబాద్ : జగన్ అక్రమార్జనకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులు ఎందుకు నోరు తెరవడం లేదని టీడీపీ ప్రశ్నించింది. వాస్తవాలు చెప్పే దమ్ములేదా? అని సవాలు చేసింది. సీఎం కిరణ్ వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడింది. శనివారం ఆ పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మరో నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ కొడుకు రాష్ట్రాన్ని దోచాడని చెబుతున్న మంత్రులు ఆ దోపిడీదారులపై తీసుకొన్న చర్యలేమిటని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

"కళంకిత మంత్రులు ఎవరిదైనా ఒత్తిడితో ఫైళ్ళపై సంతకాలు చేశారా? లేక కుమ్మక్కై చేశారా? ఆనం రామనారాయణ రెడ్డో మరొకరో మాట్లాడటం కాదు. మీరెందుకు మాట్లాడరు?'' అని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో నితీష్ ప్రభుత్వం అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకొని.. వారి ఇళ్ళలో పాఠశాలలు పెడుతోందని, రాష్ట్రంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. "చంచల్‌గూడ జైలును జగన్ పార్టీ కార్యాలయం మాదిరిగా వాడుకొంటున్నారని మంత్రి ఆనం అంటున్నారు. కనీసం జైళ్ళను కూడా నియంత్రించలేనంత నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందా?'' అని తుమ్మల ప్రశ్నించారు.

"ముఖ్యమంత్రి చీఫ్ విప్‌గా అసెంబ్లీలో ఆయన జగన్‌ను నాడు వెనకేసుకొని రాలేదా? జగన్‌ను హత్య కేసులో రక్షించానని ఆయనే చెప్పారు. ప్రజలు ఇవేవీ మర్చిపోలేదు'' అని చెప్పారు. ధర్మాన, సబిత ఇరుక్కొన్న తర్వాత ఆనంకు జగన్ దోపిడీ గుర్తుకు వచ్చిందని, కోర్టులు ఆదేశించేంతవరకూ ప్రభుత్వంలోని వారు ఈ దోపిడీపై ఏం చేశారని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. "అవినీతిపరుల ఆస్తుల స్వాధీనానికి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న మంత్రులను ఇంకా మంత్రి పదవుల్లో ఎలా కొనసాగిస్తున్నారు? కేసుల్లో నిందితురాలిగా ఉన్న హోంమంత్రికి డీజీపీ సెల్యూట్ చేస్తే పోలీసులకు ఇక ఏం గౌరవం మిగులుతుంది? ముఖ్యమంత్రి, మంత్రులు ఆత్మ విమర్శ చేసుకోవాలి'' అని సోమిరెడ్డి సూచించారు.

కాగా.. "వైఎస్‌నాటి మంత్రివర్గమే ఇప్పుడూ కొనసాగుతోంది. ఒకరిద్దరు తప్ప మంత్రులందరూ కళంకితులే. 26 జీవోల వ్యవహారంలో ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టే నోటీసులు పంపింది. ఒక మంత్రి జైలుకెళ్ళాడు. సీబీఐ చార్జిషీటులో 4వ నిందితురాలిగా హోంమంత్రే నమోదైన దుస్థితి రాష్ట్రానికి దాపురించింది'' అని యనమల మండిపడ్డారు.

వైఎస్ హయాంలో జరిగిన తెరవెనుక భాగోతాల గురించి గతంలో కొందరు మంత్రులు మాట్లాడారని, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా వెల్లడించారని అన్నారు. మైనింగ్ అక్రమ సంపాదనను ఆర్ఆర్ గ్లోబల్ సంస్థ ద్వారా జగతి పబ్లికేషన్స్‌లోకి మళ్ళించిన గాలి జనార్ధన రెడ్డి, అక్రమంగా సొమ్ము సంపాదించిన జగన్.. ఇద్దరూ తోడు దొంగలేనని యనమల వ్యాఖ్యానించారు. కాగా.. తెలియకుండా సంతకాలు చేశామంటే ఎలా అని, అసలప్పుడు ఏం జరిగిందో వాస్తవాలు బయట పెట్టాలని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.

కళంకిత మంత్రులు నోరు తెరవరేం?

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు సోమవారం చంద్రబాబును కలవనున్నారు. వచ్చి కలవాలని చంద్రబాబు కోరడంతో వెళ్లి మాట్లాడాలని దాడి నిర్ణయించుకొన్నారు. అధ్యక్షుడు తనను దూరం పెడుతున్నారని దాడి నొచ్చుకొన్నారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దాడి మనస్తాపానికి గురయ్యారని 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన కథనం చూసిన తర్వాత చంద్రబాబు స్పందించారు.

ఆయన సూచనపై పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు శనివారం దాడితో మాట్లాడారని సమాచారం. రెండు మూడు విషయాలు తనను బాధించాయని దాడి ఆయనతో అన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పాత విషయాలు వదిలేయాలని, అధ్యక్షుడికి అండగా నిలవాలని కళా ఆయనకు విజ్ఞప్తిచేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ మరికొందరు సీనియర్లు దాడితో మాట్లాడారు.

పార్టీ వెబ్‌సైట్‌లో దాడి పేరు తొలగింపు కిందిస్థాయిలో అనుకోకుండా జరిగిందని, కొత్తగా ముగ్గురు ఎమ్మెల్సీలు ఎన్నిక కావడంతో పాతవారి పేర్లను కార్యాలయ సిబ్బంది తమకు తాముగా తొలగించారని, ఎవరో చెప్పి చేయించింది కాదని నేతలు ఆయనతో చెప్పారు. రెండు మూడు గంటలపాటు ఆయన పార్టీ కార్యాలయంలోనే గడిపారు. 'కొంత అగాధం ఏర్పడిన విషయం నిజం. కానీ అది తగ్గుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన పార్టీ అధ్యక్షుడిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతారు. అధ్యక్షుడు కూడా ఆయనను పిలిచారు. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.

రేపు బాబు వద్దకు దాడి వీరభద్రరావు

రెండు రోజుల విరామం
రేపటి నుంచి పాదయాత్ర పునఃప్రారంభం
బాబును చూసేందుకు వచ్చిన భువనేశ్వరి
బాబు వెన్నంటి అయ్యన్న, దాడి తనయులు

విశాఖపట్నం, నర్సీపట్నం : కండరాల నొప్పి తీవ్రంగా ఉన్నా.. పంటిబిగువున భరించి తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబు.. వైద్యుల సలహా మేరకు పాదయాత్రకు రెండు రోజుల విరామం ఇచ్చారు. విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం సమీపంలోని కొబ్బరితోటలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సలహా మేరకు సోమవారం సాయంత్రం వరకు చంద్రబాబు విశ్రాంతి కొనసాగుతుందని టీడీపీ నాయకులు గరికిపాటి మోహనరావు, అయ్యన్నపాత్రుడు తెలిపారు.

సోమవారం సాయంత్రం చంద్రబాబు శృంగవరం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించి అదే మండలంలోని డి.ఎర్రవరంలో రాత్రి బసచేస్తారు. చంద్రబాబును చూసేందుకు ఆయన భార్య భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం శృంగవరం గ్రామానికి విచ్చేశారు. అంతకుముందు చంద్రబాబుకు విజయవాడకు చెందిన ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దాంతో నాయకులెవ్వరినీ కలవకుండా చంద్రబాబు తన ప్రత్యేక వాహనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చంద్రబాబును కలిసేందుకు వచ్చినా ఆమెకు అనుమతి లభించలేదు. అయ్యన్నపాత్రుడు, మోహనరావు మాత్రమే చంద్రబాబుతో కొద్ది నిమిషాలు మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం చంద్రబాబు బసచేసిన శిబిరం వద్ద ఏర్పాటుచేయనున్న కార్యక్రమంలో అంబేద్కర్‌కు చంద్రబాబు నివాళి అర్పించనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గ సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

యువతకు పెద్దపీట
చంద్రబాబు తన పాదయాత్రలో యువనేతలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. సీనియర్ నేతల కుమారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్న మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, అయ్యన్నపాత్రుడు కుమారులు రత్నాకర్, విజయ్‌బాబు ఇద్దరూ పాదయాత్ర తొలిరోజున చంద్రబాబుకు కుడిఎడమల నడిచి, ప్రధానాకర్షణగా నిలిచారు.

వీరభద్రరావు తనయుడు రత్నాకర్‌కు ఇటీవలే రూరల్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించగా, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌బాబుకు త్వరలో తెలుగుయువత రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు సైతం వాళ్లు చెప్పిన విషయాలు వింటూ.. బహిరంగసభల్లో వేదికపైకి ఆహ్వానిస్తూ తగు ప్రాధాన్యం కల్పించారు. వీరి బాటలోనే మరికొందరు నాయకుల వార

పైలాన్ స్థలం కోసం అన్వేషణ
పాదయాత్ర ముగింపు సందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించే పైలాన్ నిర్మాణానికి మరో స్థలం కోసం టీడీపీ నేతలు అన్వేషణ ప్రారంభించారు. పైలాన్ కోసం గాజువాక సమీపంలోని వడ్లపూడిలో స్థలం కొనుగోలు చేసి భూమిపూజ కూడా చేశారు. అయితే అది ఇప్పుడు వివాదంలో పడింది. ఆ స్థలం విశాఖ స్టీల్‌ప్లాంటుకు చెందినదని, అందులో నిర్మాణాలు చేపట్టొద్దని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. దీంతో మరో స్థలం కోసం నేతలు అన్వేషిస్తున్నారు.

ఈనెల 27న చంద్రబాబు పైలాన్‌ను ఆవిష్కరించాలి. అంటే మరో 13 రోజుల సమయమే వుంది. అప్పటిలోగా పైలాన్ నిర్మాణం పూర్తవుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే స్థలం ఎంపిక, నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే శనివారం యనమల రామకృష్ణుడు, మోహనరావు తదితరులు కూర్మన్నపాలెంలో ఒకటి, టోల్‌గేటు వద్ద రెండు స్థలాలను పరిశీలించారు.

ఆదివారానికి స్థల ఎంపిక పూర్తికావచ్చునని పార్టీ నేత ఒకరు తెలిపారు. పైలాన్ నిర్మించాలని గత నెలలోనే నిర్ణయించినా ఏర్పాట్లు మాత్రం అందుకు తగినట్లు జరగలేదు. జిల్లా, నగర నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్థలం ఎంపికలో హడావుడి చేశారు తప్ప సీనియర్ల సలహాలను తీసుకోవడం విస్మరించారు. నాయకులు కలిసికట్టుగా వ్యవహరించలేదు. వడ్లపూడిలో ఎంపికచేసిన స్థలం ప్రభుత్వానిదంటూ కొందరు పార్టీ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేశారు.
సులు కూడా రాజకీయ ప్రవేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబుకు ఎక్కువైన కండరాల నొప్పి వైద్య నిపుణుల పరీక్షలు.

కోటనందూరు: రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగం గా విశాఖజిల్లాకు బయలుదేరే మందు కాకరాపల్లి శివారులోని ఇటుకబట్టి కార్మికులతో మాట్లాడారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడుకు వివిధ జిల్లాల నుంచి ఇటుక బట్టి కూలీలు పలు సమస్యలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినవెంటనే పేదవారికి లక్ష రూపాయలకే ఇల్లు, పింఛ న్లు, ఇళ్ల స్థలాలు, ఉచితంగా విద్యను అందిస్తామని తెలిపా రు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. దీనిపై మహిళలు స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

అడుగడుగునా బాంబు స్క్వాడ్ తనిఖీలు


వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా శుక్రవారం కాకరాపల్లి శివారులో బస చేయడంతో అణువు అణువు బాంబు స్క్వాడ్ గాలించింది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్‌తో సమీక్ష సమావేశం మొత్తం ఏరియాలను పరిశీలించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.

తుని: జిల్లాలో 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కాకరాపల్లి రాత్రి బస వద్ద జిల్లా డిక్లరేషన్‌ను ప్రకటించారు. అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యమిస్తునే.. అవసరమైతే మార్పులు, చేర్పులూ కూడా చేస్తామని బాబు స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టు భూములకు నీరందజేస్తామన్నారు. ఏలేరు ఆధునికీకరణ పూర్తి చేయడం, పుష్కర, చాగల్నాడు పథకాలను పూర్తి చేసి ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందిస్తామని చెప్పారు. గోదావరి డెల్టాను పూర్తిగా ఆధునికీకరిస్తామన్నారు. కాకినాడ, రాజమండ్రి, పట్టణాల్లో ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసి వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో చ దివిన వారికి జిల్లాలోనే ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోస్టల్ కారిడార్ అభివృద్ధికి కాకినాడ నుంచి విశాఖ పట్టణానికి ఆరు లేన్ల రోడ్డు వేస్తామన్నారు.

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించి వారి ఉపాధికి చర్యలు చేపడతామన్నారు. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అ మలాపురంలో కొబ్బరిబోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర తీసుకువస్తామని తెలిపారు. కో నసీమ, కడియంలలో ప్రపంచ శ్రేణి నర్సరీలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను ఏర్పాటు చేస్తామన్నారు. కేజీ బే సిన్ నుంచి పైపులైన్లను ఏర్పాటు చేసి ఇం టింటికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని చెప్పా రు.

కత్తిపూడి పామర్రు 214వ నంబరు జా తీయ రహదారిని పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ-రాజమండ్రిలను అవుటర్ రింగ్‌రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టును మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

జిల్లా డిక్లరేషన్ పట్ల టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు పర్వత చిట్టిబాబు, పెందుర్తి వెంకటేష్, నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కోనసీమ అభివృద్ధికి డిక్లరేషన్‌లో చోటు కల్పించడం పట్ల బాబును దుశ్శాలువ కప్పి సత్కరించారు.

మీ కోసం .. మళ్లీ వస్తా!


గద్వాలఅర్బన్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫోటోతో కూడిన ఫ్లెక్సీలను వైసీపీ నా యకులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఏర్పాటు చేయడం తెదేపాకు శిరోభారంగా తయారైన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గొడవ గద్వాలను తాకడంతో రెండు పార్టీల మధ్య ప్ర చ్ఛన్న యుద్ధం రాజేసింది. గురువా రం వైసీపీ నాయకుడు షపీవుల్లా ఎన్టీ రామారావు, వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఫో టోల మధ్య వైసీపీ అధ్యక్షుడు జగన్ ఫోటోతో పాటు స్థానిక నాయకుల ఫో టోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చే యడం గద్వాల్లో చర్చనీయాంశమైం ది.

ఎన్టీ రామారావు చిత్రపటం, వైసీపీ నాయకుల పక్కన ఉండటాన్ని జీర్ణించుకోలేని స్థానిక తెదేపా కార్యకర్తలు శుక్రవారం మధ్యాహ్నం పాక్షికంగా దానిని చించివేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గద్వాలలో ఉద్రిక్తతలకు చోటు కల్పించేందుకే పథకం ప్రకారం విజయవాడ రాజకీయాలను గద్వాలలో రాణిస్తున్నారని వాపోతున్నారు. ఏది ఏమైనా ఏ పార్టీ పేరు లేకుండా ఫ్లెక్సీలను ఏ ర్పాటు చేయడం వైసీపీ నాయకులకే చె ల్లిందనిప్రజలుఅభిప్రాయపడుతున్నారు.

గద్వాలకు పాకిన ఎన్టీఆర్ ప్లెక్సీల గొడవ

ఉలవపాడు: హోం మంత్రి రాజీనా మా లేదా ఆమెను భర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాయకొండలో శుక్రవారం టీడీపీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతగా మా రింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామ చర్ల జనార్దన్‌తోపాటు కొండపి నియో జకవర్గం పార్టీ ఇన్‌ఛార్జీ డీబీఎన్ఎస్. స్వామి, జిల్లా పాల డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని పోలీసుల వాహనాల్లో ఎక్కించి ఉల వపాడును పోలీస్‌స్టేషన్‌కు తీసుకు పోక పోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. దీంతో మండలంలోని కె.రాజుపాలెం జాతీయరహదారిపై వీరిని తరలిస్తున్న వాహనమును అడ్డగించారు.

తమ నాయకులను ఎక్కడికి తీసుకెళుతున్నా రంటూ రాస్తారోకోకు చేపట్టారు. దీం తో వాహనాలు కిలోమీటరు దూరం ఆగిపోవటంతో పోలీసులు నాయకుల ను తిరిగి ఉలవపాడు పోలీస్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడకు వారిని వదిలివేయకపోవటంతో పోలీస్టేషన్ వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అయితే సింగరాయకొండలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటం వల్ల దామచర్ల తదితరులను రాత్రికి వదిలి వేశారు. కార్యక్రమంలో సింగరా య కొండ టీడీపీ పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, మాజీ అధ్యక్షుడు చీమకుర్తి వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకుడు సంధానిబాష, నాయకుడు కూనపురెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నేతల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో

గుజరాతీపేట: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. తీవ్రతరమైన విద్యుత్ కోతలపై ఆ పార్టీ నిరసన జోరు కొనసాగిస్తోంది. విద్యుత్ కోతలపై ప్రజల నుంచి సంతకాల సేకరణలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం బలగమెట్టు ప్రాంతంలో టీడీపీ నేతలు లాంతర్లు, కొవ్వొత్తులతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. చీకట్లోనే జనం నుంచి సంతకాలను సేకరించారు. విద్యుత్ కోతలతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని, కోతలు ఎత్తివేసేవరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందన్నారు.

పెంచిన విద్యుత్ చార్జీలు, కరెంట్‌కోతకు నిరసనగా శుక్రవారం స్థానిక బలగమెట్టు ప్రాంతంలో టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. దీనిలో భా గంగా క్యాండెల్ ర్యాలీ, సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా మాజీమం త్రి గుండ అప్పలసూర్యనారాయణ, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలన లో విద్యుత్ చార్జీలే కాకుండా నిరంతరంగా కరెంట్ కోతలు ఎక్కువయ్యాయన్నా రు. అధికార పార్టీ గద్దె దించేందుకు ఇంకా కొద్దిరోజులే గడువు ఉందన్నారు. టీడీ పీ హయాంలో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

సమావేశంలో స్వల్ప వాగ్వాదం సమావేశంలో గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎక్స్ కౌన్సిలర్ రెడ్డి మోహన్ ఆవేశంగా స్టేజ్‌వద్దకు వచ్చి తనకు మైకు ఇ వ్వాలని గుండ అప్పలసూర్యనారాయణతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ ఏపార్టీ హయాంలో అభివృద్ది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మంత్రి ధర్మానను తీసుకొని రావాలని ఆయన గంభీరంగా మాట్లాడారు. ఈ సమావేశంలో దేశం పార్టీ నేతలు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణ్, బుక్కా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

చీకట్ల పాపం కాంగ్రెస్‌దే

 రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత మహిళపై దాడి జ రిగి మూడు రోజులైనా ప్రభుత్వం ప ట్టించుకోకపోవడం శోచనీయమని తెదే పా జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్సీపేటలోని కమ్యూనిటీ హా లులో పట్టణ తెదేపా ఎస్సీసెల్ సమావేశం జరిగింది. సమావేశంలో ముం దుగా తెనాలిలో మానవ మృగాల చే తిలో అశువులు బాసిన దళిత మహి ళ బేతాల సునీల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం రాజ్‌కుమార్ మా ట్లాడుతూ తెనాలి సంఘటనతో దళితు లు, దళితవాడలపై ప్రభుత్వానికి, పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువైందన్నా రు. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రా తినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సభ్యసమాజం సిగ్గు పడేలా ద ళిత మహిళలపై దాడి జరిగి మూడు రోజులు కావస్తున్నా నేటికీ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, స్పీకర్ కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి సబ్‌ప్లాన్ నిధులతో ప్రచా రం చేసుకునే నైతికహక్కు లేదని విమర్శించారు.

తెదేపా పట్టణ అధ్యక్షుడు ముస్తఫా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మా త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 123వ జ యంతిని తెదేపా ఆధ్వర్యంలో ఎస్సీపేటలోనే నిర్వహిస్తామని, తెదేపా అధినే త చంద్రబాబునాయుడు దళితుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ ప్రాముఖ్యతను దళితవాడలోనే వి నిపిస్తామన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు దల్లి కృష్ణారెడ్డి మాట్లాడు తూ అంబేద్కర్ జయంతి రోజున వం ద మంది వృద్ధులకు చీరలు పంచడం, తెదేపా ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ ప్రా ముఖ్యతను వివరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నంబూరి రా మచంద్రరాజు, మద్దిపాటి నాగేశ్వరరా వు, పెసరగంటి జయరాజు, పాతూరి అంబేద్కర్, వెంపల రాజు, తోట కృ పావరం, కొత్తూరి సిద్ధయ్య, కొత్తూరి బోసుబాబు, కొత్తపల్లి వీర వెంకటేశ్వరరావు, కొత్తూరి రామయ్య, షేక్ యా కూబ్, మన్యం దుర్గారావు, పామర్తి రా మారావు, ముప్పిడి గంగరాజు, కొత్తూ రి గంగయ్య, తడికల ధర్మయ్య, గెద్దల శ్రీనివాసరావు, తలారి యుగంధర్, చి ట్టూరి బాలకృష్ణ పాల్గొన్నారు. అనంత రం ఆర్డీవో ఎన్‌వీవీ.సత్యనారాయణకు వినతి పత్రం అంజేశారు.

చట్టాలున్నా ఆగని అరాచకాలు..

మహి ళల రక్షణ కోసం ఎన్ని చట్టా లు పుట్టుకొస్తున్నా వారిపై అరాచకాలు మాత్రం ఆగడం లేదని మహిళా చైత న్య సమాఖ్య కన్వీనర్ కాసర లక్ష్మీసరోజారెడ్డి అన్నారు. శుక్రవారం సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం లో లక్ష్మీసరోజారెడ్డి మాట్లాడుతూ ఇ టీవల పలు ప్రాంతాల్లో మహిళలపై జ రుగుతున్న దాడులు సభ్యసమాజం సి గ్గుపడేలా ఉన్నాయంటూ అవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వం అనేక చట్టాల ను ప్రవేశపెడుతున్నా అవి ఏ మాత్రం ఉపయోగపడడం లేదన్నారు. రాత్రి స మయాలలోనే కాకుండా పట్టపగలు కూడా మహిళలపై దాడులు జరగడం దారుణమన్నారు. నిపుణులు, మేధావు లు, రాజకీయ విశ్లేషకులు, మహిళల ర క్షణపై కట్టుదిట్టమైన చర్యలు, చట్టాలు తీసుకురావాల్సి ఉందన్నారు. సమావేశంలో పాలపర్తి భారతి, దాట్ల అన్నపూ ర్ణ, బొబ్బిలి పద్మిని, ఉమాదేవి, తిరువీ ది వరలక్ష్మి, ప్రమీల, శశికళ, కాళహస్తి సరోజిని, జీర్రెడ్డి నాగలక్ష్మిపాల్గొన్నారు.

దళితుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి..


విశాఖపట్నం: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాలో 25 రోజుల పాదయాత్ర ముగించుకుని శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లాలో అడుగిడినప్పుడు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. చంద్రబాబు కాళ్లనొప్పులతో బాధపడుతున్నందున జిల్లాలో పాదయాత్ర వాయిదా పడుతుందంటూ శుక్రవారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది.

హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం చంద్రబాబును పరీక్షించి పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించినప్పటికీ ఆయన తిరస్కరించారు. తనకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశాఖ జిల్లా ప్రజలు, పార్టీ నేతలను నిరుత్సాహపర్చడం ఇష్టం లేదంటూ చంద్రబాబు ఆరోగ్యం సహరించకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పాదయాత్రను కొనసాగించారు. తమ జిల్లాలో 25 రోజులపాటు గడిపిన చంద్రబాబును తూర్పుగోదావరి జిల్లా నాయకులు యనమల రామకృష్ణుడు తదితరులు బరువెక్కిన హృదయంతో విశాఖ జిల్లా నేతలకు అప్పగించారు.

పర్యటనలో మార్పు


శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లా సరిహద్దుల్లో ప్రవేశించిన చంద్రబాబు పాదయాత్ర వాస్తవానికి నాతవరం మండలం డి.ఎర్రవరం వరకు కొనసాగాల్సి ఉంది. అయితే వైద్యుల సూచనల మేరకు పాదయాత్ర దూరాన్ని 12 కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్లకు తగ్గించి అదే మండలంలోని శృంగ

పాదయాత్ర రెండు రోజులు వాయిదా

చంద్రబాబు కాళ్లనొప్పుల కారణంగా పాదయాత్రకు శని, ఆదివారాలు విరామం ఇచ్చారు. సోమవారం నుంచి ఆయన పాదయాత్ర పునఃప్రారంభం కానున్నది. అయితే ఆదివారం నర్సీపట్నంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్వగృహానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే తుది కార్యక్రమం శనివారం వెల్లడించే అవకాశం ఉంది.
వరం గ్రామంలో రాత్రిబస చేసేలా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. డి.ఎర్రవరం బదులు శృంగంవరం గ్రామ ప్రారంభంలో గల కొబ్బరితోటలో చంద్రబాబు రాత్రిబసకు ఏర్పాట్లు చేశారు.

ఉద్విగ్న క్షణాలు

విశాఖపట్నం: తాను జీవితంలో అనుకున్నది సాధించేవరకు రాజీ పడేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. కాళ్ల నొప్పులతో నరకయాతన అనుభవిస్తున్నా.. మీ అభిమానం చూస్తే ఇంకా ముందుకెళ్లాలన్పిస్తుందన్నారు. చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గన్నవరంలో మాట్లాడుతూ, హిందూపురంలో ప్రారంభించిన పాదయాత్ర 193వ రోజుకు 16వ జిల్లాలోకి అడుగుపెట్టడం జరిగిందన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే కొండలైన బద్దలు కొట్టగలనన్పిస్తుందన్నారు.

ఇంతవరకు బండి లాగానని, అయితే ఎడమ కాలు మెలి పడడంతో భరించలేనంత నొప్పిగా ఉందన్నారు. దీంతో రెండు రోజులు యాత్రకు విరామం ఇచ్చి తిరిగి మరలా కొనసాగిస్తామన్నారు. తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగించిందని, కరెంటు, వీధి దీపాలు వంటి సౌకర్యాలు కూడా ప్రజలకు లేకుండా చేసిందన్నారు. రాత్రి పూట గ్రామాల్లో గాడాంధకరం నెలకొందని, విద్యార్థులు చదువుకోవటానికి నానా అవస్థలు పడుతున్నారన్నారు. రైతులు పంపుసెట్ల వద్ద కాపురం చేస్తున్నారని 1994 కంటే ముందు కరెంటు కొరత ఉండేది కాదన్నారు.

జవాబుదారీతనం పెంచామని మిగులు కరెంటు, మిగులు బడ్జెట్ ఇచ్చామని, చార్జీలు స్పల్పంగా పెంచామని, భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లలో ప్రతిరోజు తొమ్మిది గంటల చొప్పున పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇళ్లకు కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి చేస్తున్నారని, గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఆరుకి తగ్గించేశారని ఒక్కొక్క బండ రూ.475కు పెంచారన్నారు. ఆరు దాటితే ఒక్కొక్క సిలిండర్ రూ.1030కి కొనుగోలు చేయమంటున్నారని, దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆధార్ ఉంటే తప్ప సబ్సిడీ ఇవ్వమంటున్నారని, కిలో బియ్యం రూ.10 నుంచి 45కు పెంచారని, కేజీ పప్పు రూ.22 నుంచి 75 చేశారని, చక్కెర రూ.12 నుంచి రూ.45 చేశారని , ఉప్పు రెండు నుంచి రూ.12 చేశారని, ఈ ముఖ్యమంత్రితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చివరకు డీఏపీ, యూరియా బస్తా రూ.420 నుంచి రూ.1275కు పెంచారని, ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని, ఆ ఫైల్ పైనే తాను ముఖ్యమంత్రిని అయితే తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారుస్తామని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, 9 గంటలు విద్యుత్ ఇస్తామని టీడీపీ చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ అవినీతికి మారుపేరని నిరూపిస్తున్నామన్నారు. బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పట్టణాల్లో తాగునీటి కల్పిస్తామని, వృద్ధులకు, వితంతువులకు రూ.600 పెన్షన్ సదుపాయం కల్పిస్తామని, వికలాంగులకు వెయ్యి నుంచి రూ.1300 వరకు పింఛన్లు అందజేస్తామన్నారు. యువతకు భారీగా ఉద్యోగాలు, పేదలకు ఉచితంగా ఇళ్లు కేటాయిస్తామన్నారు. ప్రతీ ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని, బీఈడీ విద్యార్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నర్సీపట్నం, అనకాపల్లిలో వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు సీఎంఈవై పథకాన్ని పునరుద్ధరిస్తామని, డ్వాక్రా సంఘాలకు వడ్డీ మాఫీని చేస్తామని ప్రకటించారు. వడ్డీలేని రుణాలిచ్చి పురుషులకు దీటుగా మహిళల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బాలిక సంరక్షణ పథకం పునరుద్ధరణ చేసి పెళ్లి సమాయానికి రెండు లక్షలు అందే ఏర్పాటు చేస్తామన్నారు.బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రూ.10 వేల కోట్లతో రుణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎస్సీలకు వర్గీకరణ తీసుకొస్తామని, మాలలకు, మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. రూ.2500 కోట్లతో ముస్లీంలకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తాను ఏ స్వార్ధంతోనూ పాదయాత్ర చేయడం లేదని, పదవి కోసం రాలేదని, మీ కోసమే మీ సమస్యలు వినడానికి వచ్చానని, మీ ఇంట్లో పెద్ద కొడుకుగా భావించి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మీ సేవకుడిగా ఉంటానని, మీకు సకల సౌకర్యాలు కల్పిస్తానని, జై..జన్మభూమి..అంటూ ముగించారు.
పాదయాత్రకు విరామం

విశాఖపట్నం: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం రాత్రి శృంగవరంలో బస చేశారు. సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి నుంచి విశాఖ జిల్లా గన్నవరంమెట్టలో అడుగుపెట్టిన చంద్రబాబునాయడు గన్నవరంమెట్ట, మన్యపురట్ల జంక్షన్, శరభవరం వరకూ మూడు చోట్ల మాట్లాడారు. మొత్తం ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు శృంగవరం గ్రామానికి ముందు కొబ్బరి తోటలో రాత్రి బస చేశారు.

జీవితంలో అనుకున్నది సాధించే వరకు రాజీ లేదు

గన్నవరంమెట్ట (విశాఖపట్నం జిల్లా): 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లాకు ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అపూర్వస్వాగతం లభించింది. సరిగ్గా సాయంత్రం 6.15 గంటలకు తూర్పుగోదావరి-విశాఖ జిల్లాల సరిహద్దు గ్రామమైన గన్నవరంమెట్ట శివార్లలో చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 23 మంది వేదపండితులు చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

చంద్రబాబునాయుడుకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పార్టీ రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వెలగలపూడి రామకృష్ణబాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సింహరాజు, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్, తదితరులు స్వాగతం పలికారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు గన్నవరంమెట్ట తరలివచ్చారు. మండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు మినహా దాదాపు పార్టీ నాయకులంద
రూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్యాలు

ఉత్తరాంధ్ర జిల్లాల సంస్కృతిని చాటిచెప్పేరీతిలో కోలాటాలు, గంగిరెద్దు వేషాలు, థింసా నృత్యం, పలు వాయిద్యాలతో వేలాది మంది ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. గన్నవరంమెట్ట ప్రాంతంలో చంద్రబాబు సుమారు గంటపాటు ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు.

చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

అనంతపురం : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, శమంతకమణి, కాలువ శ్రీనివాసులు, వరదాపురం సూరని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది.

అనంతపురంలో పలువురు టీడీపీ నేతల గృహ నిర్బంధం

సోమవారం పాదయాత్ర పునఃప్రారంభం
బాబు అరికాళ్ల మంటతో బాధపడుతున్నారు : వైద్యులు

విశాఖపట్నం:రెండు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. "వస్తున్నా..మీకోసం'' పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబు ప్రస్తుతం శరభవరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఇవాళ, రేపు పాదయాత్రకు విరామం ప్రకటించారు.

ప్రస్తుతం విరామం తీసుకోకపోతే చంద్రబాబుకు ఆ తర్వాత మరిన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమస్యకు విరామమే పరిష్కారమని వారు చెప్పారు. అందుకు అతి కష్టం మీద బాబు అంగీకరించారు. సోమవారం పాదయాత్ర పునఃప్రారంభించినా, ఆయన తారు, సిమెంటు రోడ్డుపై గాక రోడ్డు ప్రక్కన మట్టి మార్గంలో నడవడం మేలు అని వారు సూచించారు.
: కాలి నొప్పితో బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు డాక్టర్లు శనివారం ఉదయం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించారు. బాబు అరికాళ్ల మంటతో బాబు బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు, చీలమండ దగ్గర వాపు వచ్చిందని, ఈ వాపు వల్ల రక్తప్రసరణ సమస్య తలెత్తుతోందని ఆర్థోపెడిక్ డాక్టర్లు చెప్పారు.

బాబుకు రెండు రోజులు విశ్రాంతి