April 13, 2013

టీడీపీ నేతల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో

ఉలవపాడు: హోం మంత్రి రాజీనా మా లేదా ఆమెను భర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాయకొండలో శుక్రవారం టీడీపీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతగా మా రింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామ చర్ల జనార్దన్‌తోపాటు కొండపి నియో జకవర్గం పార్టీ ఇన్‌ఛార్జీ డీబీఎన్ఎస్. స్వామి, జిల్లా పాల డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని పోలీసుల వాహనాల్లో ఎక్కించి ఉల వపాడును పోలీస్‌స్టేషన్‌కు తీసుకు పోక పోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. దీంతో మండలంలోని కె.రాజుపాలెం జాతీయరహదారిపై వీరిని తరలిస్తున్న వాహనమును అడ్డగించారు.

తమ నాయకులను ఎక్కడికి తీసుకెళుతున్నా రంటూ రాస్తారోకోకు చేపట్టారు. దీం తో వాహనాలు కిలోమీటరు దూరం ఆగిపోవటంతో పోలీసులు నాయకుల ను తిరిగి ఉలవపాడు పోలీస్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడకు వారిని వదిలివేయకపోవటంతో పోలీస్టేషన్ వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అయితే సింగరాయకొండలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటం వల్ల దామచర్ల తదితరులను రాత్రికి వదిలి వేశారు. కార్యక్రమంలో సింగరా య కొండ టీడీపీ పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, మాజీ అధ్యక్షుడు చీమకుర్తి వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకుడు సంధానిబాష, నాయకుడు కూనపురెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.