March 23, 2013

కాకినాడ:క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న 'వస్తున్నా మీ కోసం' యాత్రలో చంద్రబాబు వెంట వేలాదిమంది కార్యకర్తలు, జనం పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. బీటెక్ చదివినా ఉద్యోగం లేదని ఒక యువకుడు చెప్తే.. వికలాంగులకు కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరిగిందని మరో యువకుడు బాబుకు విన్నవిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నా కరెంటు కోతలు తప్పడంలేదంటూ ఒక మహిళ చెప్తే.. పావలా వడ్డీ అన్నారు..ఇపుడు ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదేం అన్యాయం అంటూ మరో మహిళ తన వేదన చెప్పుకొచ్చారు.

వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా మూడో రోజు రాజమండ్రిరూరల్ మండలం హుకుంపేటలో మధ్యా హ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు కార్యకర్తలు తమ సూచనలను బాబు దృష్టికి తీసుకువచ్చారు. అర్ధరాత్రి దాటినా జనం చంద్రబాబు అడుగులో అడుగువేస్తూ కదలి వస్తున్నారు. హుకుంపేట, బొ మ్మూరు, ఎర్రకొండ, ధవళేశ్వరం, వేమగిరి తదితర ప్రాంతాలలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాం గ్రెస్ దొంగల వల్ల రాష్ట్రం అధోగతి పాలయిందన్నారు. లక్ష కోట్లు దోచుకున్న జగన్ జైల్లో ఉన్నాడన్నారు. ఐఏఎస్‌లనూ జైలుకు పంపిన ఘనత వైఎస్‌దేనన్నారు.

సర్‌ఛార్జి కాదు.. అవినీతి ఛార్జి వైఎస్ సీఎంగా ఉన్నపుడు అనేక ప్రయివేటు విద్యుత్ కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకుని అత్యధిక ధరకు (యూనిట్ రూ.14) కొనుగోలు చేయడం వల్లే ఇపు డు సర్‌ఛార్జి బారం ప్రజలపై పడుతుందని చంద్రబాబు బొమ్మూరు సెంటర్‌లో వ్యాఖ్యానించారు. 'ఇది సర్‌ఛార్జి కాదు. వైఎస్., కిరణ్ కుమార్‌రెడ్డి అవినీతి ఛార్జి' అంటూ ఎద్దేవా చేశారు. కరెంటు కోతల వల్ల పరిశ్రమలు మూతప డి వేలాదిమంది రోడ్డునపడుతున్నారని.. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌కోతల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని హామీ ఇచ్చారు.

వికలాంగులకు రూ 1500 పిింఛను టీడీపీ అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ 1500 పింఛను ఇప్పించాలని ఒక వికలాంగ యువకుడు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వెయ్యి నుంచి రూ 1500 వరకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గణేష్ అనే యువకుడు తాను బీటెక్ చదివి వంద రూపాయలు కూలీ వచ్చినా పని చేయడానికి సిద్దంగా ఉన్నానని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంజనీరింగ్ చదువుకున్న వారికి ఉన్నత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చా రు. ఇలా మార్గ మధ్యలో మహిళలు, వృద్దులు, వికలాంగులు, ఆర్ఎంపీ డాక్టర్లు, ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబును కలసి తమ సమస్యలు విన్నవించారు.

మిమ్మల్నే గెలిపిస్తాం.. కష్టాలు తీర్చండి: వచ్చే ఎన్నికల్లో మీకే ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం. మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి. అని ఒక మహిళ చంద్రబాబును వేడుకుంది. ఎస్సీలకు, పేదలకు దక్కాల్సిన స్థలాలను కాంగ్రెస్ నేతలు కబ్జాలు చేశారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ వస్తే ఖచ్చితంగా ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా అనేక హామీలు కురిపించారు.

మేమూ వస్తున్నాం మీ పాదయాత్రకు

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీలో మళ్లీ బాలయోగి రోజులు ప్రారంభమయ్యాయి.దివంగత లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు జి.హరీష్‌మాథూర్ శుక్రకవారం రాజమండ్రిలో చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఆయన వెంటనే ఈచిన్న బాలయోగిని ఆహ్వానించి అమలాపుం అసెంబ్లీ కార్యకర్తల సమావేశంలో పరిచయం చేశారు.ఇక ఈబాబు బాలయోగిగా పార్టీలో పనిచేస్తారని, ఇంకా చదవుకుంటున్నారని, అయినా పార్టీలో ఉంటారన్నారు. తన తండ్రిలాగానే ఈ బాబు కూడా ఉన్నతస్థాయిలో ఉండేటట్టు చూస్తానని చంద్రబాబు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.బాలయోగి ఏంటో అందరికీ తెలుసునని, నిబద్ధతగల రాజకీయనేత అన్నారు. మంచి వ్యక్తి అనీ,అందరినీ ఆదుకునే మనస్తత్వం గల నేత అని, ఏపదవిలో ఉన్నా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నారని చెప్పారు. ఈపని చేయమంటే చాలు చేసేవారన్నారు.

ఆయన ప్రమాదంలో మృతి చెందినప్పుడు షాకయ్యానని చెప్పారు. యానాం- ఎదుర్లంక బ్రిడ్జి, పామర్రు హైవే, ఇంకా అనేక అభివృద్ధి పనులు చేశారని, ఆయన ఉంటే కోనసీమ రైలు కూడా వచ్చేసి ఉండేదన్నారు. ఇవాళ ఆయన లేని లోటును భర్తీ చేయడానికి ఆయన కుమారుడు వచ్చాడని, 23 ఏళ్ల ఈయువకుడికి మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. తనకు టచ్‌లో ఉంటాడని,భవిష్యత్‌లో ఉన్నతస్థాయిలో కరిపిస్తాడని తెలిపారు.

తెలుగుదేశం అధికారంలోకి రావాలి: హరీష్‌మాధూర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఉందని, అప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారని బాలయోగి కుమారుడు జి.హరీష్ మాథూర్ అన్నారు.తన తండ్రి ఉన్నతస్థాయికి ఎదగడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని,అటువంటి పార్టీకి ఈసమయంలో మద్ధతు ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చానని చెప్పాడు. భవిష్యత్‌లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, అది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

తెలుగుదేశంలో మరో బాలయోగి

ధవళేశ్వరం: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నాకు అధికార దాహం లేదు. పదవి కోసం కాదు ప్రజలు కోసం, రాష్ట్రం కోసం పాదయాత్ర చే స్తున్నాను. మిగులు కరెంట్, మిగులు బడ్జెట్ సా ధించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడితే కాంగ్రెస్ పాలకుల అవినీతి పాలన రాష్ట్రాన్ని అదఃపాతాళానికి దిగజార్చింది. ధవళేశ్వరం పాదయాత్రలో సాగిన చంద్రబాబు ప్రసంగం ఇది. 172వ రోజున శుక్రవారం సాయంత్రం బొమ్మూ రు మీదుగా ధవళేశ్వరం చేరిన చంద్రబాబు పాదయాత్రకు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, టీడీ పీ శ్రేణులు స్వాగతం పలికారు. పాదయాత్ర అడుగడుగునా నీరాజనాలు పలికారు.

ఎర్రకొండ మీ దుగా ధవళేశ్వరం ప్రధాన రహదారిపైకి చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నాయకులు శీలంశెట్టి శ్రీనివాస్, బొబ్బా సుబ్రహ్మణ్యచౌదరి, పుక్కెళ్ల సత్తిబాబు, మెండా సోమయ్య, విన్నకోట సత్తిబాబు, అడపా శ్రీను, కె.సుబ్బారాయుడు, ఆళ్ల ఆనంద్‌రా వు తదితర నాయకులు స్వాగతం పలికారు. బొ బ్బా సుబ్రహ్మణ్యచౌదరి ఆధ్వర్యంలో కొత్తపేట సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్ వద్ద దళిత వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ తలారి మూర్తి వందమంది యువతతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నా రు. మూర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్‌స్టేషన్ సెంటర్ వద్ద చంద్రబాబు గంటపాటు ప్రసంగించారు. రెండుసార్లు కాంగ్రెస్‌ను గెలిపించిన ప్ర జలు తమ తప్పిదాన్ని గుర్తించారని మరల అటువంటి తప్పిదానికి పాల్పడవద్దని కోరారు. టీడీపీకి అధికారాన్ని అప్పగిస్తే ఐదు సంవత్సరాల కాలం లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు.

ప్రస్తుత సబ్సిడీ రేటుకే సంవత్సరానికి పది గ్యాస్ సిలిండర్లను ఇస్తామని, పుట్టిన ప్రతీ ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసాగా 25 వేల రూపాయలు బ్యాంక్‌లో జమ చేస్తామని, ఆ టో డ్రైవర్లకు వడ్డీలేని రుణాలు కల్పించి ఓనర్లుగా మారుస్తామని హామీల వర్షం కురిపించారు. చం ద్రబాబు ప్రతీ మాటకు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. తన ప్రసంగంలో కాంగ్రెస్ అవినీతిపై, వైఎస్సార్ దోపిడీపై విమర్శలు గుప్పించారు.

పదవి కోసం కాదు.. ప్రజల కోసం పాదయాత్ర


రాజమండ్రి: వైఎస్‌రాజశేఖరరెడ్డి దళితద్రోహి అనీ,దళిత వర్గాలకు ఏమీ చేయకపోగా ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి ఇడుపులపాయలో రోడ్లు వేసుకోవడానికి, హుస్సేన్‌సాగర్ బాగు చేయడానికి వినియోగించారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయు డు ఆరోపించారు.

రాజమండ్రిలో శుక్రవారం అమలాపురం అసెంబ్లీ ని యోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించా రు. అమలాపురానికి చెందిన పొలమూరి ధర్మపాల్ అనే దళితనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాలలకు దగా చేశారని, అవినీతి ప్రశ్నించే దళిత నేతలను అణచి వేశారని, ఇసుక కుంభకోణంపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ కూడా ఇవ్వలేదని అనడంతో చంద్రబాబు స్పందించి అవును వైఎస్ దళితులకు అన్యాయం చేశారన్నారు. నోడల్ ఏజెన్సీని, ఎస్‌సీ కార్పొరేషన్‌ను కూడా ని ర్వీర్యం చేశారని, ఎస్‌సీ,ఎస్‌టీ కమిషన్ కు కనీసం సభ్యులను కూడా నియమించలేదని బాబు ధ్వజమెత్తారు. దళితవాడల్లో బెల్ట్‌షాపులు పెట్టి, వారి జీవితాలను నాశనం చేశారని, ఇళ్లు కూడా కట్టుకోనివ్వలేదని, విద్యార్థులకు చదువుకు దూరం చేశాడని ఆరోపించారు.

తాను సామాజిక న్యాయం కోసం వర్గీకరణ తెచ్చానని, అదే సమయంలో మాలలకు ఏవిధంగా అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అమలాపురానికి చెందిన కాపువర్గానికి చెందిన నాయకులు చిక్కాల గణేష్, స్వామి నాయుడు మాట్లాడుతూ మళ్లీ కాపులకు ఆదరణ ఇవ్వాలని,తమ వర్గ పేదల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరగా, దానికి స్పందించిన చంద్రబాబు అగ్రకుల పేదలకు జనాభా ప్రాతిపదికమీద రిజర్వేషన్లు ఇస్తామని, అందులో కాపులు అధికంగా ఉంటారు కాబట్టి, ఎక్కువ ఫలితం వారికే లభిస్తుందని చెప్పారు.అంతేకాక కాపు వర్గం నుండి అనేక మంది నేతలు ఎదిగినప్పటికీ పేద కాపుల బతుకులు ఎందుకు మారలేదని ప్రశ్నించారు.

కులం వల్ల కేవలం కొందరి నాయకులకే ప్రయోజనం జరుగుతుందని, అందులోనే పేదలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇక దానిపై మనం దృష్టి పెడదామన్నారు. పిల్ల కాంగ్రెస్ నిలబడదని, అది కాంగ్రెస్‌లో కలసి పోవలసిందేనని చెప్పారు. కాంగ్రెస్ అసలు లేదనుకునే సమయంలో సహకార సంఘాలలో డబ్బుతో గెలిచి, బలం చూపిస్తుందని, కాంగ్రెస్ చాలా ప్రమాదకారి, అది ఏదైనా చేయగలదని ఆయన చెప్పారు.మనం నిలబెట్టుకునే హామీలే ఇద్దామని,గెలిచిన తర్వాత హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలను మోసం చేసినట్టు అవుతామన్నారు.రైతుల రుణమాణీ కష్టసాధ్యమని తనకు తెలిసినప్పటికీ రైతుల బతుకులు బాగు చేయడం కోసం సాహసం చేస్తున్నానని, రుణ మాఫీ చేసి చూపిస్తానన్నారు.

ఆర్టీసీకి తాము వ్యతిరేకంగా కాదని, దానిని పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని,ఆర్టీసీని కాపాడటం కోసం, కార్మికుల అభివృద్ది, సంక్షేమాల కోసం త్వరలో కొత్త పాలసీని ప్రకటించనున్నామని తెలిపారు.ఆర్టీసీ కోసం ఆస్తులు కొని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇవాళ కొన్ని డిపోలను కూడా మూసివేశారని, డీజిల్ పన్నును 22శాతం నుంచి 33శాతానికి పెంచారన్నారు.పలువురు ఆర్టీసీ కార్మికనేతలు ఆయనను కలసి విన్నవించినపుడు ఆయన ఈవిధంగా స్పందించారు. పలువురు ఆర్ఎంపి, పీఎంపి డాక్టర్లు తమ సమస్యలు చెప్పినపుడు ఆయన మాట్లాడుతూ పల్లెల్లో పేద ప్రజలకు మొదట వైద్యం చేసేది వీరేనని, గతంలో తాను గుర్తింపు ఇచ్చానని, తర్వాత వైఎస్ జీవో ఇచ్చినా అమలు కాలేదన్నారు.వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, మళ్లీ ఈవర్గాలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపారు. ప్రజలూ, కార్యకర్తలూ సిద్ధంగా ఉన్నారని, నేతలే ఐక్యంగా ఉండాలన్నారు.

తాను 15రోజుల పాటు జిల్లాలోనే ఉంటానని,ఇటువంటి సమస్యలనీ పరిష్కరిస్తానని, ఇక ఉత్సాహంగా ముందుకు వెళ్లండని పిలుపు ఇచ్చారు. మీరంతా కలసి అభ్యర్ధులను గెలిపించే బాధ్యత తీసుకుంటే తాను మీ అందరి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈసమావేశంలో మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, మెట్ల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయలచినరాజప్ప,ఆనందరావు ,చిల్లా జగదీశ్వరి , బాలయోగి తనయుడు హరీష్ మా«ధూర్ ,రమణబాబు తదితరులు పాల్గొన్నారు.

దళితద్రోహి వైఎస్

కాకినాడ: టీడీపీ సీనియర్ నాయకు డు యనమల రా మకృష్ణుడు కు మార్తె దివ్య 20 14అసెంబ్లీ ఎన్నికలలో తుని నుంచి పోటీచేయడానికి సిద్దమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. యనమలను టీడీపీ శాసనమండలికి పంపడంతో తుని నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీచేస్తారు? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో దివ్య పేరు తెరపైకి వస్తోంది. యనమల పెద్దకుమార్తె దివ్య ఇప్పటికే తండ్రి నుంచి రాజకీయంగా మెళకువలు నేర్చుకుంటున్నారు. యనమల వారసురాలిగా వచ్చే ఎన్నికలలో తు ని నుంచి పోటీచేసి గెలిచి అసెంబ్లీకి పం పాలని ఇప్పటికే యనమలపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. యనమల కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

వస్తున్నా మీ కోసం పాదయాత్ర తుని నియోజకవర్గానికి చేరినపుడు దివ్య చంద్రబాబును కలిసి తన మనసులో మాట వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తుని అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో కీలక నాయకులు దివ్యఅభ్యర్ధిత్వంపై చర్చించుకుంటున్నారు. దివ్యకు సీటిస్తే యువత, మహిళ, బీసీ.. ఈ మూడు కోటాలలో ఇచ్చినట్లవుతుందన్న వాద న కూడా వినిపిస్తోంది.

తుని టీడీపీ అభ్యర్థిగా దివ్య పోటీ

ప్రత్తిపాడు: రూ.326 కోట్లు వ్యయంతో ఏలేరు ప్రాజెక్టును, సాగునీటి వ్యవస్ధను పూర్తి స్ధాయిలో ఆధునీకరించాలని డిమాండ్‌చేస్తూ పిఠాపురం, ప్రత్తిపాడు టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మండలంలోని ధర్మవరం గ్రామం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 138 కోట్లు వ్యయంతో ఏలేరు పనుల కోసం ఆవిష్కరించిన శిలాఫలకం వద్ద శుక్రవారం పిఠాపురం, ప్రత్తిపాడు టీడీపీ నాయకులు చెవులలో పువ్వులు ధరించి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పిఠాపురం, ప్రత్తిపాడు రెండు నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన టీడీపీ బృందాలు ధర్మవరం శివారు అడ్డురోడ్డు జంక్షన్ వద్ద ఉన్నఏలేరు ఆవిష్కరణ శిలాఫలకం రాయి వరకు పాదయాత్ర జరిపి అ క్కడ గంటపాటు నిరసన ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్బంగా ఆందోళనకు నాయకత్వం వహించిన పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌విఎస్ వర్మ మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.5కోట్లు నిధులతో పనులుచేపట్టి అసంపూర్తి పనులతో చేతులు దులుపుకోవాలని చూస్తుందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్ధాయి ఆధునీకరణకు రూ.326 కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు జాప్యం వలన పిఠాపురం నియోజకవర్గ రైతాంగం ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందున్నారు. ఈ ప్రాజెక్టు మరమ్మత్తు పనుల కోసం గతంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ఉద్యమాలుచేపట్టిందని వర్మ తెలిపారు. ధర్మవరంలో శిలాఫలకం ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఏలేరు ఆయకట్టు రైతులను మోసగించారని, ప్రభుత్వం ప్రస్తుతం అ రొకర నిధులు కాలయాపనలతో ఆయకట్టు రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నారని వర్మ విమర్శించారు.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతనాలుగేళ్లుగా ఏలేరుపై నోరు మెదపకుండా ప్రస్తుతం పాదయాత్రలు చేస్తున్నారని వారికి ఏలేరుపై చిత్తవుధ్ది ఉంటే వైఎస్సార్ ఆవిష్కరించిన శిలాఫలకం వద్ద ధర్నాలు చేస్తే బాగుంటుందని వర్మ వ్యాఖ్యానించారు. ఏలేరు కోసం పోరాడేదే టిడిపి పార్టీ ఒక్కటేనని ఆయన స్పష్టంచేసారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుబ్బారెడ్డి సాగ్, చంద్రబాబు సాగర్‌లను నిర్మించి టీడీపీయేనని అలాగే మెట్ట ప్రాంతానికి సాగునీటి అవసరాలు తీర్చే పుష్కర కాలువ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కృషిమేరకు మంజూరైందని వర్మ వివరించారు. చంద్రబాబు సాగర్‌ను టీడీపీ ప్రభుత్వం నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు నిర్మించలేకపోయిందని వర్మ విమర్శించారు.

ఈ ఆందోళనలో పిఠాపురం నియోజకవర్గ టిడిపి నాయకులు మాదేపల్లి రంగబాబు, అల్లుమల్లు విజయ్‌కుమార్, బవిరిశెట్టి రాంబాబు, కిల్లి రవికుమార్, బర్ల అప్పారావు, నెక్కల సత్యనారాయణ, పూడిశెట్టి చంటి, ఎలుబంటి రాజారావు, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు, దాట్లకృష్ణబాబు, దాట్ల అప్పన్నబాబు, బొల్లు కొండబాబు, సిద్దా సూరిబాబు, మదినే బాబ్జి, గాంధీ, బొల్లు వెంకట్రాజులు పాల్గొన్నారు.

ఏలేరు శిలాఫలకం వద్ద టీడీపీ నాయకుల ధర్నా

రొంపిచర్ల: కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మండలంలోని నలగార్లపాడు, మాచవరం గ్రామాలలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన పర్యటించారు. విలేకరులతో మాట్లాడుతూ రైతులు వద్ద ధాన్యం, మొక్క జొన్న, పత్తి, మిరప పంటలు ఉన్న సమయంలో ధరలు ఉండవని, దళారులు, మిల్లర్లు చేతిలోకి వెళ్ళగానే ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ కోసం రూ.100 కోట్లు ప్రకటించారని, ఇవి సరిపోవన్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రిగా వున్న రాజశేఖరరెడ్డి రూ 500 కోట్లు ప్రకటించినా అవి కేటాయించ లేదన్నారు.

రైతులు కొనుక్కొనే విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగాయన్నారు. ధరలు పెరిగితే కొనే వారికి ఇబ్బందులు వుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించు కోవటం లేదన్నారు. స్థానికంగా వున్న మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడాను అంటున్నారు కాని సాగు నీరు, తాగు నీరు ఇప్పించటంలో విఫలమయ్యారన్నారు. గ్రామంలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి డాక్టర్ కోడెల పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మెట్టు వెంకటేశ్వరరెడ్డి, చిరుమామిళ్ళ బ్రహ్మయ్య, కోనేటి శ్రీనివాసరావు, పొనుగోటి రామారావు, కుంపటి రవి, ఉడతా రమణ, వడ్లమూడి శివరామయ్య, పులిమి రామిరెడ్డి, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అబ్రహం, మరియమ్మ విగ్రహాలను

ఆవిష్కరించిన మాజీ మంత్రి డాక్టర్ కోడెల

మండలంలోని నలగార్లపాడు గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన చల్లా అబ్రహం, మరియమ్మ విగ్రహాలను మాజీమంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన అనారోగ్యంతో వున్న కంచేటి సైదయ్యను పరామర్శించారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్

చెన్నూరు: ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూ వాటి పరిష్కారం కోసం తెగువ చూపించేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ కమలాపురం ని యోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి అన్నారు. మండలంలోని కొండపే ట గ్రామంలో గురువారం అధిక సం ఖ్యలో మైనార్టీ నేతలు, యువకులు పు త్తా సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల్లో వుండే వారికే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు.

పార్టీలు మారేవారిని, ప ర్సేంటేజీల కోసం పనులు అమ్ముకునే వారిని దగ్గరకు రానివ్వొద్దన్నారు. తా ను నియోజకవర్గంలో తాగునీరు, సా గునీరు కోసం పాదయాత్ర చేస్తే ప్రజ లు తనతో కలసి రావడం మర్చిపోలేనిదన్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు నేటికి 170 రోజుల్లో 2500 కీ.మీ. పూర్తిచేశారన్నా రు. జరగబోవు ఎన్నికల్లో ప్రతి కార్యకర్త దేశం అభ్యర్థులను గెలిపించాలన్నారు.

దేశంకు కొండపేట కంచుకోట: దేశం పా ర్టీకి కొండపేట కంచుకోటని, గత ఎన్నికల్లో గ్రామంలో మెజార్టీ వచ్చిందని పుత్తా అన్నారు. పార్టీ బీసీ సెల్ జిల్లా ఉ పాధ్యక్షుడు అక్బర్ మాట్లాడుతూ ని యోజకవర్గంలో నిజమైన నీతివంతమైన నేత ఒక్క నరసింహారెడ్డినేనని అన్నారు

పుత్తాకు ఘనస్వాగతం: కొండపేటకు వచ్చిన పుత్తాకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. అనంతరం పలు సమస్యలు పు త్తా దృష్ఠికి తీసుకుపోగా సంబంధిత అ ధికారులతో మాట్లాడుతానని అన్నారు

దేశంలోచేరిక: పుత్తాసమక్షంలో గ్రామ నేతలు మాబు సహె బ్, గూడుబాషా, ఉసేన్ పీరా, రసూల్ ఖాజా రసూల్, పెద్దసుబ్బరాయుడు, దస్తగిరి, సుబా న్, సుబ్బరాయుడు, ఖాదర్ బాషా, ఖాసీంపీరా, ఖలీల్, టి.పి.ప్రసాద్, అశోక్‌రెడ్డితో పా టు స్థానికులు పెద్ద సంఖ్యలో తెదేపాలో చేరారు. కార్యక్ర మంలో దేశం నేతలు విజయభాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, ఎ.వి.బాస్కర్, షబ్బీర్, గౌస్ పీర్, పాలకొండయ్య, చలపతి, సుధాకర్ రెడ్డి, రాంమ్‌ప్రసాద్, సుబ్బారెడ్డిలతో పాటు చెన్నూరు, కొం డపేట, శివాల్‌పల్లె, కొక్కిరాయపల్లె, బలిసింగాయపల్లి, కనపర్తి దేశం నేతలు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలపై పోరాడేది తెదేపా ఒక్కటే

వర్ని: తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరుతాయని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బద్యానాయక్ స్పష్టం చేశారు. వర్ని మండలం రుద్రూర్ గ్రామంలో శుక్రవారం పాదయాత్ర, పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేతకాని కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజ లు విద్యుత్‌కోతతో అంధకారంను చవిచూస్తున్నారని ఆయన విమర్శించారు.

అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పాలకులు దోపడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చోటా లీడ రు పేరుతో కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బద్యానాయక్ పాదయాత్రకు గ్రామంలో విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో నాయకులు కిషన్‌లాల్, వి.విఠల్, పెనుమరి శ్రీహరి, బైండ బాల్‌రాజ్, సాయినాథ్, ఇందూరి ఈశ్వర్, త్రిశాల్ గంగాధర్ పాల్గొన్నారు.

'టీడీపీ పాలనతోనే ప్రజల కష్టాలు దూరం'

పాయకరావుపేట: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం పాయకరావుపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. కుమారపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు తెలిపిన సమాచారం మేరకు బాలకృష్ణ పర్యటన వివరాలు....

శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు తుని పట్టణం మీదుగా మండలంలోని పాల్తేరు పంచాయతీకి చేరుకుంటారు. తొలుత అంకంపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరంకందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం కుమారపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ ఆదేశాల మేరకు అనకాపల్లికి చెందిన పార్టీ నాయకులు బొడ్డపాటి రాజారావు, పోలిశెట్టి శ్రీను, జెర్రిపోతుల ధర్మారావు, తదితరులు శుక్రవారం మండలంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ, పాయకరావుపేట మండలంలో బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకులు, అభిమానులు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఆయా గ్రామాలను ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో పసుపుమయం చేస్తున్నారని చెప్పారు. కాగా స్థానిక నాయకులు గొర్రెల రాజబాబు, పెదిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, లాలం కాశీనాయుడు, వేజెర్ల వినోద్‌వర్మ, దేవవరపు శివ, పెదిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

నేడు 'పేట'లో బాలయ్య పర్యటన