March 23, 2013

తెలుగుదేశంలో మరో బాలయోగి

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీలో మళ్లీ బాలయోగి రోజులు ప్రారంభమయ్యాయి.దివంగత లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు జి.హరీష్‌మాథూర్ శుక్రకవారం రాజమండ్రిలో చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఆయన వెంటనే ఈచిన్న బాలయోగిని ఆహ్వానించి అమలాపుం అసెంబ్లీ కార్యకర్తల సమావేశంలో పరిచయం చేశారు.ఇక ఈబాబు బాలయోగిగా పార్టీలో పనిచేస్తారని, ఇంకా చదవుకుంటున్నారని, అయినా పార్టీలో ఉంటారన్నారు. తన తండ్రిలాగానే ఈ బాబు కూడా ఉన్నతస్థాయిలో ఉండేటట్టు చూస్తానని చంద్రబాబు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.బాలయోగి ఏంటో అందరికీ తెలుసునని, నిబద్ధతగల రాజకీయనేత అన్నారు. మంచి వ్యక్తి అనీ,అందరినీ ఆదుకునే మనస్తత్వం గల నేత అని, ఏపదవిలో ఉన్నా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నారని చెప్పారు. ఈపని చేయమంటే చాలు చేసేవారన్నారు.

ఆయన ప్రమాదంలో మృతి చెందినప్పుడు షాకయ్యానని చెప్పారు. యానాం- ఎదుర్లంక బ్రిడ్జి, పామర్రు హైవే, ఇంకా అనేక అభివృద్ధి పనులు చేశారని, ఆయన ఉంటే కోనసీమ రైలు కూడా వచ్చేసి ఉండేదన్నారు. ఇవాళ ఆయన లేని లోటును భర్తీ చేయడానికి ఆయన కుమారుడు వచ్చాడని, 23 ఏళ్ల ఈయువకుడికి మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. తనకు టచ్‌లో ఉంటాడని,భవిష్యత్‌లో ఉన్నతస్థాయిలో కరిపిస్తాడని తెలిపారు.

తెలుగుదేశం అధికారంలోకి రావాలి: హరీష్‌మాధూర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఉందని, అప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారని బాలయోగి కుమారుడు జి.హరీష్ మాథూర్ అన్నారు.తన తండ్రి ఉన్నతస్థాయికి ఎదగడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని,అటువంటి పార్టీకి ఈసమయంలో మద్ధతు ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చానని చెప్పాడు. భవిష్యత్‌లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, అది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.