March 23, 2013

దళితద్రోహి వైఎస్


రాజమండ్రి: వైఎస్‌రాజశేఖరరెడ్డి దళితద్రోహి అనీ,దళిత వర్గాలకు ఏమీ చేయకపోగా ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి ఇడుపులపాయలో రోడ్లు వేసుకోవడానికి, హుస్సేన్‌సాగర్ బాగు చేయడానికి వినియోగించారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయు డు ఆరోపించారు.

రాజమండ్రిలో శుక్రవారం అమలాపురం అసెంబ్లీ ని యోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించా రు. అమలాపురానికి చెందిన పొలమూరి ధర్మపాల్ అనే దళితనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాలలకు దగా చేశారని, అవినీతి ప్రశ్నించే దళిత నేతలను అణచి వేశారని, ఇసుక కుంభకోణంపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ కూడా ఇవ్వలేదని అనడంతో చంద్రబాబు స్పందించి అవును వైఎస్ దళితులకు అన్యాయం చేశారన్నారు. నోడల్ ఏజెన్సీని, ఎస్‌సీ కార్పొరేషన్‌ను కూడా ని ర్వీర్యం చేశారని, ఎస్‌సీ,ఎస్‌టీ కమిషన్ కు కనీసం సభ్యులను కూడా నియమించలేదని బాబు ధ్వజమెత్తారు. దళితవాడల్లో బెల్ట్‌షాపులు పెట్టి, వారి జీవితాలను నాశనం చేశారని, ఇళ్లు కూడా కట్టుకోనివ్వలేదని, విద్యార్థులకు చదువుకు దూరం చేశాడని ఆరోపించారు.

తాను సామాజిక న్యాయం కోసం వర్గీకరణ తెచ్చానని, అదే సమయంలో మాలలకు ఏవిధంగా అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అమలాపురానికి చెందిన కాపువర్గానికి చెందిన నాయకులు చిక్కాల గణేష్, స్వామి నాయుడు మాట్లాడుతూ మళ్లీ కాపులకు ఆదరణ ఇవ్వాలని,తమ వర్గ పేదల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరగా, దానికి స్పందించిన చంద్రబాబు అగ్రకుల పేదలకు జనాభా ప్రాతిపదికమీద రిజర్వేషన్లు ఇస్తామని, అందులో కాపులు అధికంగా ఉంటారు కాబట్టి, ఎక్కువ ఫలితం వారికే లభిస్తుందని చెప్పారు.అంతేకాక కాపు వర్గం నుండి అనేక మంది నేతలు ఎదిగినప్పటికీ పేద కాపుల బతుకులు ఎందుకు మారలేదని ప్రశ్నించారు.

కులం వల్ల కేవలం కొందరి నాయకులకే ప్రయోజనం జరుగుతుందని, అందులోనే పేదలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇక దానిపై మనం దృష్టి పెడదామన్నారు. పిల్ల కాంగ్రెస్ నిలబడదని, అది కాంగ్రెస్‌లో కలసి పోవలసిందేనని చెప్పారు. కాంగ్రెస్ అసలు లేదనుకునే సమయంలో సహకార సంఘాలలో డబ్బుతో గెలిచి, బలం చూపిస్తుందని, కాంగ్రెస్ చాలా ప్రమాదకారి, అది ఏదైనా చేయగలదని ఆయన చెప్పారు.మనం నిలబెట్టుకునే హామీలే ఇద్దామని,గెలిచిన తర్వాత హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలను మోసం చేసినట్టు అవుతామన్నారు.రైతుల రుణమాణీ కష్టసాధ్యమని తనకు తెలిసినప్పటికీ రైతుల బతుకులు బాగు చేయడం కోసం సాహసం చేస్తున్నానని, రుణ మాఫీ చేసి చూపిస్తానన్నారు.

ఆర్టీసీకి తాము వ్యతిరేకంగా కాదని, దానిని పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని,ఆర్టీసీని కాపాడటం కోసం, కార్మికుల అభివృద్ది, సంక్షేమాల కోసం త్వరలో కొత్త పాలసీని ప్రకటించనున్నామని తెలిపారు.ఆర్టీసీ కోసం ఆస్తులు కొని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇవాళ కొన్ని డిపోలను కూడా మూసివేశారని, డీజిల్ పన్నును 22శాతం నుంచి 33శాతానికి పెంచారన్నారు.పలువురు ఆర్టీసీ కార్మికనేతలు ఆయనను కలసి విన్నవించినపుడు ఆయన ఈవిధంగా స్పందించారు. పలువురు ఆర్ఎంపి, పీఎంపి డాక్టర్లు తమ సమస్యలు చెప్పినపుడు ఆయన మాట్లాడుతూ పల్లెల్లో పేద ప్రజలకు మొదట వైద్యం చేసేది వీరేనని, గతంలో తాను గుర్తింపు ఇచ్చానని, తర్వాత వైఎస్ జీవో ఇచ్చినా అమలు కాలేదన్నారు.వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, మళ్లీ ఈవర్గాలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపారు. ప్రజలూ, కార్యకర్తలూ సిద్ధంగా ఉన్నారని, నేతలే ఐక్యంగా ఉండాలన్నారు.

తాను 15రోజుల పాటు జిల్లాలోనే ఉంటానని,ఇటువంటి సమస్యలనీ పరిష్కరిస్తానని, ఇక ఉత్సాహంగా ముందుకు వెళ్లండని పిలుపు ఇచ్చారు. మీరంతా కలసి అభ్యర్ధులను గెలిపించే బాధ్యత తీసుకుంటే తాను మీ అందరి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈసమావేశంలో మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, మెట్ల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయలచినరాజప్ప,ఆనందరావు ,చిల్లా జగదీశ్వరి , బాలయోగి తనయుడు హరీష్ మా«ధూర్ ,రమణబాబు తదితరులు పాల్గొన్నారు.