July 22, 2013

పంచాయితీ ఎన్నికల్లో తల్లి, పిల్ల కాంగ్రెస్‌ పార్టీలు కలిసిపోయాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విరుచుపడ్డారు. పంచాయితీ ఎన్నికల్లో అత్యధికంగా తమ మద్దతుదారులు ఎన్నికయ్యారని వైస్సార్సీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పంచాయితీ ఎన్నికల్లో అసలు ఆ పార్టీ ఎక్కడుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు. సర్పంచ్‌ అభ్యర్థులు దొరక్క తల్లి కాంగ్రెస్‌తో కలిసిపోయి, పిల్ల కాంగ్రెస్‌ నేతలు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో ఏ గ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థులు జాబితాను విడుదల చేసేందుకు తాము సిద్ధమని, కాంగ్రెస్‌, వైస్సార్సీపీలు సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు.

స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా కృషి చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు నిధులు, విధులు కేటాయిస్తే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకొక్కటిగా కోత పెట్టిందన్నారు. సర్పంచ్‌లకు 64 అధికారాలను కట్టబెడుతూ టీడీపీ హయాంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గ్రామ సచివాలయాలను నామారూపాలు లేకుండా చేసి, సర్పంచ్‌లకిచ్చిన 54 అధికారాలను లాగేసుకున్నారని శివాలెత్తారు. ఇసుకవేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్థానిక సంస్థలకు వినియోగించాలని టీడీపీ హయాంలో నిర్ణయించగా, కాంగ్రెస్‌ పార్టీ తిరిగి మైనింగ్‌శాఖకు కట్టబెట్టి మాఫియాలను పెంచిపోషిస్తోందన్నారు.

శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని పంచా యితీలపై పెంచడం ద్వారా గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామ ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే లేక పలె ్లసీమలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచా యితీ ఎన్నికల్లో నిజాయితీపరులైన అభ్యర్థులను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని చంద్రబాబు ప్రజ లను కోరారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే సుపరిపాలన అందించే బాధ్యత తమదని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో పంచాయితీల బలోపేతానికి తీసుకున్న పలు నిర్ణయాలను చంద్రబాబు విలేక రులకు వివరించారు.

2002లో గ్రామ పంచాయితీలలో రెవిన్యూశాఖ అధికారుల విధులు విలీనం చేయడం
గ్రామ పంచాయితీలకు రెవిన్యూ అధికారా లతో పాటు 64 అధికారాలనిచ్చి సర్పంచ్‌లకు గౌరవం, గుర్తింపుకు కృషి
గ్రామపంచాయితీలకు సర్పంచ్‌లకు అడంగల్‌, పహాణీ, ఎఫ్‌ఎమ్‌బీ వంటి భూమి రికార్డుల అప్పగింత
ఇసుక వేలం కమిటీలలో సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీచైర్మన్లను సభ్యులుగా నియామకం
సర్పంచ్‌ల అధ్యక్షతన ఫించన్లు, ఇళ్లు, పట్టాలు, గ్యాస్‌ పొయ్యిల లబ్ధిదారుల ఎంపిక.

తల్లీ పిల్ల కాంగ్రెస్‌ కలిసిపోయాయి

కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేయవద్దని ఇతర పార్టీలను టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరితే ఆ విషయంపై ఆలోచన చేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఈ ఆరు నెలలకాలం కోసం ఎన్నికలలో పోటీచేసి వ్యయప్రయాసలెందుకని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.సిటింగ్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన వ్యక్తి కనుక ఆయన కుమారుడు హరిబాబు రంగంలో ఉంటున్నందున ఆయనపై పోటీపెట్టకుండా ఉంటేనే బెటర్ అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు.

కాంగ్రెస్ కూడా అందుకు సిద్దపడవచ్చు.కాంగ్రెస్ అభ్యర్ధి మండలి బుద్ద ప్రసాద్ ప్రస్తుతం క్యాబినెట్ హోదా కలిగిన తెలుగు భాషా సంఘం అద్యక్షుడుగా ఉన్నారు.ఆయన రంగంలో దిగవలసి వస్తే ఆ పదవిని వదలుకోవలసి వస్తుంది.ఇదంతా పెద్ద ప్రయాస అవుతుంది.అయితే టిడిపి అదినేత చంద్రబాబు కోరితే ఈ విషయంపై ఆలోచించాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ భావిస్తోంది.చంద్రబాబు నేరుగా కోరతారా?లేక బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు కోరతారా అన్నది చూడాలి.

చంద్రబాబు కోరితే అవనిగడ్డ లో పోటీచేయం