April 24, 2013

రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మాదిరిగా వ్యవహరిస్తోందని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా చలనం కనిపించడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు మునిగిపోతే.. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచార యాత్రల్లో మునిగి తేలుతున్నారని, నష్టపోయిన రైతులను పరామర్శించే ప్రయత్నం కూడా చేయట్లేదని విమర్శించారు. ఈ ఏడాది అకాల వర్షాలు రావ డం ఇది నాలుగోసారని గుర్తుచేశారు.

సీఎంసహా మం త్రులెవరూ రైతులను పరామర్శించ లేదన్నారు. ఢిల్లీ లో తల్లీకొడుకుల సేవ తప్ప ఇక్కడ బాధితుల సేవ లేదని మండిపడ్డారు. రైతులకు ఈ బాధలు చాలవ న్నట్లు విత్తనాల ధరలు పెంచడం దారుణమన్నారు. రైతు బాంధవుడినని పొగిడించుకోగానే సరిపోదని, రైతులకు సున్నావడ్డీకి రుణాలివ్వాలంటే రూ.1800 కోట్లు కావాల్సి ఉంటే రూ.125 కోట్లు విడుదల చేస్తే చాలా? అని ప్రశ్నించారు. దిగుమతి అయిన సీఎంల తో పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.

వర్ష బాధితులను పట్టించుకోరా?: ముద్దు

కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు: మోత్కుపల్లి
జగన్ తప్పుకుంటారా?: కూనంనేని

నల్గొండ, ఖమ్మం

చీకటి ఒప్పందాల ద్వారా ఉద్యమాన్ని నడుపుతున్నాడని ఆరోపించారు. కాగా, బయ్యారం గనుల్లో బ్రదర్ అనిల్ బినామీ అని నిరూపిస్తే మీతోపాటు మీ అన్న జగన్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటామని, రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని చెప్పగలరా అని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు షర్మిలను ప్రశ్నించారు. ఇందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఖమ్మం బస్టాండ్ ఎదుట సీపీఐ నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్షణ స్టీల్‌తో తమకు సంబంధం లేదని చెబుతున్న షర్మిల.. ఆ సంస్థ కార్యాలయం తమ కాంప్లెక్స్‌లో ఎందుకు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు.
: కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, వైఎస్ అక్రమార్జనలో కేసీఆర్‌కు కూడా భాగస్వామ్యం ఉందని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. బయ్యారం గనులతో పాటు పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఏనాడూ మాట్లాడలేదని, డబ్బులు ముట్టటంతో నోరు మెదపకుండా ఫామ్ హౌజ్‌లో పడుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నడూ సోనియా, ప్రధాని ఎదుట తెలంగాణపై కేసీఆర్ నోరెత్తలేదన్నారు.

వైఎస్ అక్రమార్జనలో కేసీఆర్‌కు భాగం

గ్రామీణులు ద్వితీయ శ్రేణి పౌరులా?
పల్లెలకు కోతలు ఎక్కువ ఎందుకు
ఈఆర్‌సీ ఎద్ద టీడీపీ నేతల బైఠాయింపు
27న డిస్కంలతో భేటీకి ఈఆర్‌సీ హామీ

హైదరాబాద్: 'అందరికీ బాదుడు ఒకటే! కోతలు మాత్రం పల్లెలకు ఎక్కువ? ఏమిటీ అన్యాయం?' అని టీడీపీ నేతలు మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో డిస్కంలు వివక్ష పాటిస్తున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, లింగారెడ్డి, ఎమెల్సీ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డి బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ (ఈఆర్‌సీ) ముందు బైఠాయించారు. కోతలు ఎత్తివేస్తారా? లేదా కోర్టుకెళ్లమంటారా? అని ఈఆర్‌సీ సభ్యులను ప్రశ్నించారు.

"విద్యుత్ డిస్కంలు ఒకే టారిఫ్‌లో ఉన్న వినియోగదారులకు వేరువేరుగా విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. నగరాల్లో 2 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో ఏకంగా 12 గంటలు కోత విధిస్తున్నారు. గ్రామాలపై వివక్ష చూపుతున్నారు. కరెంటు కోతలతో గ్రామాల్లో తాగడానికి కూడా నీళ్లు దొరకడంలేదు. రైతులు, చేతి వృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారు'' అని పయ్యావుల పేర్కొన్నారు. "పల్లె ప్రజలంటే ద్వితీయ శ్రేణి పౌరులు కారు. పట్టణాలకు ఒక న్యాయం, పల్లెలకు మరో న్యాయమా?' అని నిలదీశారు. డిస్కంలు, బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ఈఆర్‌సీ... సామాన్య ప్రజల ప్రయోజనాల రీత్యా కోతలు ఎత్తివేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. 'ఒకే టారిఫ్‌లో ఉన్న వారికి ఒకే రకమైన సరఫరా' ఉండేలా డిస్కంలను ఆదేశించాలని ఈఆర్‌సీ అధ్యక్షుడు రఘోత్తమరావును కోరారు.

లేదంటే హైకోర్టుకు వెళ్తానని పయ్యావుల హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, మిగిలిన సభ్యులతో చర్చించాల్సి ఉందని చైర్మన్ చెప్పారు. అయితే... కోతలు ఎత్తివేయాలని డిస్కంలను ఆదేశించేదాకా కదలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో పట్టువీడాలని కమిషన్ పలుమార్లు పయ్యావులతో సంప్రదింపులు జరిపింది. రఘోత్తమరావు బుధవారమే పదవీ విరమణ చేస్తుండం, టీడీపీ బృందం పట్టువీడకపోవడంతో ఈఆర్‌సీ అత్యవరంగా సమావేశమై విద్యుత్ కోతలపై చర్చించింది. ఈ నెల 27న డిస్కంలతో సమావేశమై కోతలపై చర్చించాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరాలో వివక్ష పట్ల 29వ తేదీన తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. దీంతో టీడీపీ నేతలు ధర్నా విరమించారు.

పల్లెకు కోతలు ఎత్తేస్తారా.. కోర్టుకు వెళ్లమంటారా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీకోసం పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో 27న జరిగే బహిరంగసభకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలి వెళుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణులో ఉత్సాహం ద్విగుణీకృతం అయిందన్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సి ఉందన్నారు. జిల్లా నుంచి శుక్రవారం విశాఖపట్నానికి అనేక వాహనాల్లో పార్టీ శ్రేణలు బయలుదేరి వెళతారన్నారు. ఈ సందర్భంగా ఆయన చలో విశాఖపట్నం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు సమష్టిగా చేసిన పోరాటాల ఫలితం గా భవానీ ద్వీపం ప్రైవేటు పరం కాలేదన్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో కలిపినందుకు నజరానాగా చిరంజీవి సలహా మేరకు మంత్రి ఘంటా శ్రీనివాసరావుకు భవానీద్వీపం లీజుకిద్దామని అనుకున్నారన్నారు. కాని దీనిపై తీ వ్రంగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనుకకు తగ్గిందన్నారు. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలకు ఎంపీ రాజగోపాల్, అధికా
రపార్టీ ఎమ్మెల్యేలు అడ్డు పడుతున్నారన్నారు.

వైసీపీ నాయకులు సామినేని ఉదయ భాను, జోగి రమేష్‌లు ఇష్టాను సారం మాట్లాడుతున్నారన్నారు. జగన్ అంత అవినీతి పరుడు లేడన్నారు. పాదయా త్ర చేస్తున్న షర్మిల రక్షణ స్టీల్ విషయమై ఎందుకు మాట్లాడదన్నారు. ఆమె పాదయా త్ర ఫ్లాప్ షో అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బయ్యారం నుంచి తరలిం చిన వందల లారీల ఖనిజానికి ప్రభుత్వం సుంకం రాబట్టాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

27న టీడీపీ శ్రేణుల చలో వైజాగ్

ఇల్లు ఉంటుంది. కానీ, కప్పు ఉండదు. గోడలు ఉండవు. తలుపులూ కిటికీలూ ఏమీ ఉం డవు. అలాంటి ఇల్లు ఎక్కడ ఉన్నదంటారా?అయితే, హైదరాబాద్ సచివాలయంలో రాజీవ్ గృహకల్ప విభాగానికి వెళ్లండి. ఆ డిపార్టుమెంట్‌లో దుమ్ముపట్టిన ఏ కాగితం తిరగేసినా ఇలాంటి ఇళ్లు కోకొల్లలు.. అనకాపల్లిలో ఎంతోమందికి సొంతిళ్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. అవి ఎక్కడున్నాయో తమకూ తెలియదని..అంత కష్టంలోనూ నవ్వుతూ చెప్పారు. ఆ నవ్వులో నిర్వేదం, నిస్సహాయతే కనిపించాయి. కాయకష్టం చేసి ఇంటికి చేరిన కష్టజీవికి సొంత ఇంట్లో ఉండే ప్రశాంతత మరెక్కడా దొరకదు. వీళ్లు కోరుకున్నది అలాంటి ప్రశాంతతే. కానీ, తొమ్మిదేళ్లుగా ఈ పాలకులు వాళ్లకు ఇళ్లు కాదు కదా... కళ్ల మీద కునుకు కూడా లేకుండా చేస్తున్నారు.

రేబాక దాటి వస్తుండగా, అసంపూర్ణంగా వదిలేసిన 'గృహకల్ప' సముదాయం కనిపించింది. గుట్టల మీద కట్టారు. ఆ గుట్టలు ఎక్కడమే కష్టమయితే.. 'గృహకల్ప'లోకి దారి వెతకడం మరింత కష్టమనిపించింది. అంతర్గత రోడ్లు లేవు. మంచినీటి పైపులైన్లు లేవు. విద్యుత్ సరఫరా కూడా లేదు. మాంత్రికుడి కోటలా ఉన్న అది..'గృహకల్ప' భవన సముదాయమనే విషయం మొదట గుర్తించలేకపోయాను. ఎందుకీ పరిస్థితి అని అక్కడివారిని ఆరా తీశాను " ఒక్కొక్కరి నుంచి 10,500 చొప్పున కట్టించుకొని, కొంత మేర కట్టుబడి చేశారు. ఆ తరువాత కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు.. మరికొన్ని వేలు తెస్తేనే మిగతా నిర్మాణం పూర్తిచేసి గృహ ప్రవేశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు సార్'' అని నిట్టూర్చారు. ఈ మొండి గోడలకు మోక్షమెప్పుడో!

మెండి గోడలకు మోక్షమెప్పుడో!: చంద్రబాబు

హైదరాబాద్: జూరాల ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న 46వేల ఎకరాల్లో పంట ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణ్‌పూర్ డ్యాం నుంచి సాగునీరు విడుదలయ్యేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. జూరాల ఆయకట్టు రైతుల సమస్యను పార్టీ ఎమ్మెల్యే కె దయాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా..ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

జూరాలకు నీళ్లివ్వండి: చంద్రబాబు

పని నాస్తి..ప్రగల్భాలు జాస్తి
ప్రజలకు భయపడి హెలికాప్టర్‌లో ప్రయాణం
సీఎం కిరణ్‌పై చంద్రబాబు ఫైర్



కాపుల్లో ఎక్కువ మంది పేదలున్నారని, అధికారంలోకి వస్తే వారందరికీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐతే రిజర్వేషన్ అమలుకు శాస్త్రీయంగా సర్వే జరపాల్సి ఉంటుందని, అప్పటివరకూ ఐదు వేల కోట్లతో ఒక ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేస్తానని సీహెచ్ ఎన్ అగ్రహారంలో జరిగిన సభలో ప్రకటించారు. ఈ ప్రాంతంలో చదువుకున్న ప్రతి యువకునికి స్థానికంగానే ఉద్యోగం వచ్చేలా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి గురించి తెలుసా?' అని ఈ సమయంలో చంద్రబాబు ప్రజలను అడగగా, 'మా ఎంపీ కనిపించడం లేద'ని వారు జవాబిచ్చారు. రోజుకొకపార్టీ మారే ఆయారాం...గయారాంగా సదరు ఎంపీ మారాడని చంద్రబాబు అన్నప్పుడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు. పిల్ల కాంగ్రెస్‌కి చంచల్‌గూడ జైలే పార్టీ కార్యాలయంగా మారిందని బాటజంగాలపాలెం సభలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ప్రజలను అన్ని రకాలుగా దోచుకుని రాబందుల్లా బలిసిపోయారని రేబాక సభలో అన్నారు.

దోపిడీలో కిరణ్...వైఎస్ వారసుడిగా మారిపోయారన్నారు. కర్ణాటక ఎన్నికలకు రాష్ట్రం నుంచి భారీగా నిధులు తరలిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌దే అధికారమని జోస్యం చెప్పారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు చదువు, భద్రతకు బాధ్యత వహించేలా పథకం రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఉపాధి కరువై తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగ యువతను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే డ్వాక్రా మహిళలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, విశా ఖలో చేపట్టిన 'పాదయాత్ర' పైలాన్ నిర్మాణం పూర్తయింది. శనివారం ఆంధ్రా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ముగిం పు సభ ఏర్పాట్లను నేతలు తుమ్మల, యనమల, గరికి పాటి పరిశీలించారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యలను గాలికొదిలి హెలికాప్టర్‌లో తిరుగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యకు రావడానికి ధైర్యం చాలక గాలిలో షికార్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సీహెచ్ఎన్ అగ్రహారంలో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పోరాడి పోరాడి అలసిపోతే...వారు మాత్రం దిగమింగి దిగమింగి బాగా బలిసిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు కాకుండా సోనియాకు కిరణ్ జవాబుదారీగా ఉంటున్నారని, ఢిల్లీకి సలామ్ కొడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మల్లా తయారయ్యాయని దుయ్యబట్టారు.

పేదలకు నామం.. సోనియాకు సలాం..............సమస్యలొదిలేసి గాలిలో షికార్లు!

ముత్తుకూరు: ప్రాజెక్టుల కోసం ప్రజల గొంతు కోస్తారా అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలంలోని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం గ్రామాల మధ్య తలపెట్టిన బూడిద చెరువుల నిర్మాణ స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. గ్రామాల నడిబొడ్డున బూడిద చెరువులను నిర్మించాలనుకోవడం అమానుషమని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూడిద చెరువుల నిర్మాణస్థలాన్ని పరిశీలించేందుకు వెళుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది.

అధికారం చేతులో వుందని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజల ఉసురు తగిలి పోతారని సోమిరెడ్డి, జెన్‌కో సీఈ సత్యనారాయణపై మండిపడ్డారు. అంతకుముందు బూడిద చెరువుల విషయంపై మాట్లాడేందుకు ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, దేశం ఎమ్మెల్యేలతో కలిసి జెన్‌కో సీఈ కార్యాలయంలో సమావేశమయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు, సీఐలు గంగా వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి పరిస్థితులను పర్యవేక్షించారు.

ప్రజల గొంతు కోస్తారా?

  ఒంగోలు:'దర్శి నియోజకవర్గంలో తిష్టవేసిన ప్రజా సమస్యలను పరిశీలిస్తే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్న విషయం తేటతెల్లమవు తుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలపై అవ గాహన ఉన్న నాకు దర్శి ప్రాంత ప్రజల సమస్యలు చూసిన తర్వాత ఇక్కడ ఎంతటి దయనీయ పరిస్థితి ఉందో అర్థమైంది. నియోజకవర్గ పొలిమేర నుంచే సాగర్

కాలువ ఉన్నా తాగునీటి సమస్య తాండవించడం అందుకు నిదర్శనం. దీనంతటికీ గత పదేళ్లుగా అధికారంలో ఉన్న వారే బాధ్యత వహించాలి. రాష్ట్రం లో తెదేపా పాలనలో జన్మభూమి పథ కంతో అనేక ప్రాంతాల్లోని గ్రామ సీమ లు సిమెంట్ రోడ్లతో కళకళలాడాయి. కానీ నేటికీ ఇక్కడ గ్రామాల్లో సక్ర మంగా రోడ్లు లేని దుస్థితి నెలకొంది.

అందుకే నియోజకవర్గంలో ఏ ప్రాంతా నికి వెళ్లినా ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. నా పట్ల అపారమైన ఆద రాభిమానాలు చూపిస్తూనే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదిస్తున్నా రు. అందుకే వచ్చే ఎన్నికల్లో నన్ను ఆద రిస్తే ప్రభుత్వ నిధులు ఆశించిన స్థాయి లో అందకపోయినా సొంత డబ్బులు వెచ్చించి మంచినీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం కల్పించడం జరుగుతుందని హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టినా, బోర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నా అదం తా ప్రజల ఇబ్బందులను పరిష్కరించ డమే తప్ప ఎన్నికల్లో లబ్ధికోసం కాదు.

ఎప్పుడో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డబ్బు వెదజల్లే మనస్తత్వం నాది కాదు. అదే సమయంలో ప్రజల అవసరాల కోసం సొంత నిధులను వెచ్చించేందుకు రాజకీయాలకు అతీతం గా వ్యవహరిస్తాను. అందుకు గతంలో చీమకుర్తితోపాటు, అనేక ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలే దర్పణం పడతా యి'. ఇదీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యు డు, దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి శిద్దా రాఘవరావు వ్యక్తం చేసిన అభిప్రా యాలు.

గత కొంతకాలంగా నియోజక వర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న శిద్దా ప్రస్తుతం దర్శిలో వీధివీధినా పర్యటి స్తున్నారు. ఆ సందర్భంగా సోమవారం సాయంత్రం పాదయాత్రలో కలిసిన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో పలు అంశాల పై తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు. అందులోని ము ఖ్యాం శాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పాద యాత్ర చేపట్టారా?

నేను పాదయాత్ర ఈ రోజు చేపట్ట లేదు. ఇప్పటికే దొనకొండ, ముండ్లమూ రు మండలాల్లోని గ్రామాల్లో పర్యటిం చాను. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్ర మైన దర్శిలో పాదయాత్ర చేస్తున్నా.

ఎన్నికల లక్ష్యం కాకుంటే పాదయాత్ర ఉద్దేశం ఏమిటి?


ప్రజల జీవన విధానాన్ని, వారి ఆర్థిక, సమాజిక స్థితిగతులను, నియోజకవ ర్గంలో నెలకొన్న సమస్యలను అధ్యయ నం చేసేందుకే చేపట్టా.

ఇప్పటి వరకు మీరు ఏం గుర్తించారు?
అభివృద్ధిలో నియోజకవర్గ పరిస్థితి దయనీయంగా ఉందనేది మాత్రం ని జం. అందుకు వాడవాడలా ప్రజలు చె ప్పే సమస్యలే దర్పణం పడుతున్నాయి.

ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి?

స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా గుక్కెడు మంచినీటి కోసం ఇక్కడి ప్రజ లు పరితపిస్తున్నారు. మరోవైపు రవాణా సౌకర్యాల విషయంలోనూ నియోజక వర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. గ్రామా ల్లోనే కాదు, మండల కేంద్రాలు, నియో జకవర్గ కేంద్రంలో కూడా సరైన రోడ్ల ఏర్పాటు జరగలేదు.

ఇవి మీరు చెప్పే సమస్యలా? ప్రజలు చెప్పినవా?


ఎక్కడికెళ్లినా ప్రజలు ఈ రెండు సమ స్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో నియోజకవర్గంలోని ఏ ఒక్కప్రాంతం మినహాయింపు కాదు.

అందుకు కారణం ఏమిటనే విష యాన్ని గుర్తించారా?

గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలకులే అందుకు కారణమని కచ్ఛితం గా చెప్పగలను. తెదేపా హయాంలో జన్మభూమి కార్యక్రమం చేపట్టిన రోజు ల్లో కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిధి ఉన్నారు. అందువలన అప్పుడు చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పూర్తిగా అమలుకు నోచుకోలేదు. ఇక గత రెండు పర్యాయాలుగా ప్రభుత్వ పథకాలను అటుంచితే, స్థానికంగా అధికారంలో ఉన్న వారు మాటలతో ప్రజలను మోసం చేయడం మినహా అభివృద్ధి పనులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు.

ఇది మీ అభిప్రాయమా? ప్రజలు చెప్తున్నారా?

ఇద్దరి అభిప్రాయం. నేను చేసిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్ల మైంది. అలాగే నా పాదయాత్రలో కలు స్తున్న ప్రజల నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరి మీరేమి హామీ ఇస్తున్నారు?

నన్ను ఆదరించి గెలిపిస్తే ఈ సమస్య లను కచ్ఛితంగా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను.

స్థానికంగా మీరు గెలిచి రాష్ట్రంలో మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా మీరు చెప్పిన స్థాయి అభివృద్ధి సాధ్యమేనా?

నాకున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాబడతా. కాదూ కూడదంటే ఓ పదోపాతిక కోట్ల రూపాయలో సొంత నిధులు వెచ్చించి అయినా సమస్యలు పరిష్కరిస్తా. ఆవిషయంలో రాజీ పడేది లేదు.

ఆ సందర్భంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?


నా హామీలకు అతీతంగానే ప్రజలు తెదేపాను, నన్ను ఆదరిస్తున్నారు. అందు కు తరతమ భేదం లేకుండా అన్ని ప్రాం తాల్లో చిన్నారుల నుంచి, వృద్ధుల వరకు రోడ్డుపైకి వచ్చి నాకు స్వాగతం పలుకు తుండటం, నేను నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేయడం నిదర్శనం. చాలా ప్రాంతాల్లో మహిళలు, పెద్దలు నన్ను 'మీ సేవా భావం నచ్చింది. రాజకీయా లకు అతీతంగా మిమ్మల్ని ఆదిరిస్తాం' అంటూ ఆశీర్వదిస్తుండటం నాలో మనో ధైర్యాన్ని పెంచింది.

అలాంటి ఆదరణ ప్రజల్లో ఉంటే ప్రస్తుతం ఉచిత సేవా కార్యక్రమాలను ఎందుకు చేపట్టారు?

నేను చేపట్టిన కార్యక్రమం ఏమిటో? మీకు ఎందుకు అనుమానాలు వచ్చా యో చెప్పగలరా?

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోర్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేయ డం లేదా?

ఈ కార్యక్రమాల నిర్వహణకు, రాజకీ యాలకు ఎలాంటి సంబంధం లేదు. నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడటాన్ని గుర్తించాను. ఇప్పటికే ఎండలు మండుతుండటం, భూగర్భజల మట్టం తగ్గడంతో తక్షణ సమస్య పరిష్కారంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా. ఉన్నంతలో మరింతకాలం సమస్య పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా.

ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ పనులు చేయించాలి కదా?


ప్రజా సమస్యలను గుర్తిస్తేనో, ప్రతి పక్షాలు ఒత్తిడి చేస్తేనో గమనించి చర్య లు తీసుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభు త్వం ఉందంటే మీరు నమ్ముతున్నారా? సాగర్ కాలువల ద్వారా మంచినీటి చెరువులకు నీరందించాలన్న విషయం కూడా మా పార్టీ ఆందోళన చేస్తేనే పాలకపక్షానికి గుర్తొచ్చింది. వచ్చిన నీటిని సక్రమంగా చెరువులను నింపలేక పోయారన్న విషయం కూడా మేము చెబితే కాని అధికార యంత్రాంగానికి తెలియలేదు.

ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారానికి చర్యలు పూర్తిస్థాయిలో తీసుకోకుండా కంటితుడుపు నిర్ణయాల తో ముందుకు సాగుతున్నారు. అందు వలన దర్శి ప్రజల మేలు కోరే నేతగా సొంత నిధులు వెచ్చించి ముందుకు వారి దాహార్తిని తీరుస్తున్నా.

నిజంగా ప్రజల కోసమే అయితే గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్ర మాలు చేసి ఉండాలి కదా?

ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయ డంలో నేను కానీ, మా కుటుంబం కానీ ఎప్పుడూ ముందే ఉంటుంది.

చీమకుర్తి ప్రాంతంలో చేపట్టిన కార్యక్రమాలే అం దుకు నిదర్శనం. రాజకీయ లబ్ధిని కోరే వాళ్లం అయితే దళితులకు రిజర్వు అయి న సంతనూతలపాడు నియోజకవర్గం లోని చీమకుర్తి ప్రాంతంలో అలాంటి కార్యక్రమాలు చేసి ఉండేవాళ్లం కాదు. అంతకు మించి నా సేవా తత్పరతపై ఎక్కువ వివరణ ఇచ్చుకోవాల్సిన అవస రం లేదని భావిస్తున్నా.

దర్శిలో అభివృద్ధి దయనీయం

దర్శి: దర్శి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాద యాత్రకు విశేష స్పందన లభిం చడం పట్ల టిడిపి పోలిట్ బ్యూరో సభ్యు డు, దర్శి నియోజకవర్గ ఇన్ చార్జీ శిద్దారాఘవరావు ఆనందం వ్యక్తం చేశారు. దర్శి పట్టణంలో సోమవారం ఆటోనగర్, అద్దం కి రోడ్డు, వెలమ వారి వీధుల్లో మాజీఎమ్మెల్యే నారపుశెట్టి పాపారా వులతో కలిసి ఇంటింటికి టీడీపీ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శిద్ధారాఘ వరావు మాట్లాడుతూ ప్రజలు పాదయాత్రలో చూపిస్తున్న ఆదరణ మరు వలేనిదన్నారు.

పేద ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుం దన్నారు. కనీస వసతులు లేక ఎస్టీకాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎస్సీకా లనీలలో తాగునీటి వసతులు లేక ఇబ్బం దులు పడుతున్నామని పలువురు మహిళ లు తమ సమస్యలను శిద్దా దృష్టికి తీసు కొచ్చారు. ఎస్సీ కాలనీలకు ఖర్చు చేయా ల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు తరలిం చి తమకుతీరని అన్యాయం చేస్తున్నార ని పేర్కొన్నారు. ఎస్సీకాలనీ లలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బోర్లు మరమ్మతులు చేయిస్తామని, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయిస్తామ న్నారు. అనంతరం అద్దంకి రోడ్డుమీదు గా వెలమవారి వీధిలో పాదయాత్ర కొనసా గింది. అడుగడు గునా మహిళలు హరతులు ఇచ్చి స్వాగ తం పలికారు. ప్రజలు పూల వర్షం కురిపిం చారు. పాదయాత్రకు లభిం చిన స్పందన చూసి కార్యకర్తలు, నా యకులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్ర మంలో మాజీఎమ్మెల్యే, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు నారపుశెట్టి పాపారావు, పట్టణ అధ్యక్షుడు యా దగిరి వాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పరిటాల సురేష్, మండల అధ్య క్షుడు బల్లగిరి శీనయ్య, మాజీఅధ్యక్షుడు బొట్లకో టేశ్వ రరావు, సింగిల్‌విండో అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు సంగా తిరు పతిరావు, తెలుగుమహిళా నాయకు రాలు శోభారాణి, స్ధానిక నాయకులు రాచపూడి మోషే, మునగాశ్రీనివాసరావు, బీరం వెంకటేశ్వ రరెడ్డి, గోళ్ళపాటి మార్క్, గర్నెపూడి జోసఫ్, గూడూరి బాలగురు వయ్య, తదితరులు పాల్గొన్నారు.

శిద్దా పాదయాత్రకు విశేష స్పందన

దర్శి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని తెదేపా పొలిట్ బ్యూ రో సభ్యుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జీ శిద్దా రాఘవరావు విమర్శించారు. దర్శి పంచాయతీలోని సందువారిపాలెం, చింత లపాలెం వీధులలో మంగళవారం మా జీ ఎమ్మెల్యే నారపుశెట్టిపాపారావుతో కలిసి ఇంటింటికి టీడీపీ యాత్ర నిర్వహి ంచారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మా ట్లాడుతూ తెదేపా హయాంలో మూడేళ్లు కరువొచ్చినా ప్రకటించిన సమయం ప్రకా రం విద్యుత్ సరఫరా చేయగలిగా మన్నా రు. ప్రస్తుతం విద్యుత్ ఎప్పుడు వస్తుందో , ఎప్పడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలన్నీ నిర్వీర్యమై పోయాయన్నారు. ప్రజల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపో తుందన్నారు. మహిళలు తాగునీటి సమస్య గురించి వివరిస్తుంటే ఆయన ఉద్వేగభరితుడై నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు ట్యాంకర్లు ఏర్పాటు చేశామని అవసరనమైతే మరికొన్ని ట్యాంకర్లు సమ కూరుస్తామని హమీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికనిధులు సాధించి దర్శిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం మాత్రమే కృషి చేసిందన్నారు.

స్వర్గీయ ఎన్‌టిఆర్, టిడిపి అధినేత చంద్రబాబుల హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో అ భివృద్ధి చెందితే ప్రస్తుతం అధోగతి పాలైం దన్నారు. సందువారిపాలెం వాసులు గతంలో ఏ ఎన్నికలు వచ్చినా టిడిపికి పూర్తి అండగా నిలిచేవారిని వచ్చే ఎన్నిక లలో తెదేపా అభ్యర్థుల గెలుపునకు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు జగదీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు.

జగదీష్ మాట్లాడుతూ తెలం గాణ వస్తే ఆంధ్ర ఎడారి అవుతుంద న్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయాల కోసం పార్టీలు మారుతూ ప్రజల గురిం చి పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమం లో తెదేపా మండల అధ్యక్షుడు బల్లగిరి శీనయ్య, మాజీ అధ్యక్షుడు పి. సంజీవ య్య, దర్శి సింగిల్ విండో అధ్యక్షుడు కె. చంద్రశేఖర్, దర్శి పట్టణ అధ్యక్షుడు యాదగిరివాసు, నాయకులు సంగా తి రుపతిరావు, సందు వెలుగొండయ్య, శోభా రాణి, రాచపూడి మోషే, పఠాన్ సుభానీ, మారెళ్ళ వెంకటేశ్వర్లు, గుర్రం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలు


( రంగారెడ్డి అర్బన్) టీడీపీ అధినేత చంద్రబాబు 'మీ కోసం'పాదయాత్ర ముగించుకుని వస్తున్న సందర్భంగా ఈ నెల 28న శంషాబాద్‌లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు జిల్లా టీడీపీ అధ్యక్షుడు టి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎర్రమంజిల్ కాలనీలోని టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీకోసం యాత్రను ఈనెల 27న విశాఖ పట్నంలో ముగించుకుని, 28న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు భారీ గా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శంషాబాద్‌లో భారీ బహిరంగసభ, ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇందుకోసం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివస్తారన్నారు. దేశచరిత్రలో ఎవరూ చేపట్టని విధంగా చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని, ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనను ఆదరించారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రైతులకు రణమాఫీ, తొమ్మిది గంటలపాటు వ్యవసాయానికి కరెంటు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో మంత్రులు జైళ్లు పాలవుతున్నారని, ఏ మంత్రి ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలుచేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా ఏడు గంటలపాటు విద్యుత్‌సరఫరా చేస్తామని,కనీసం రెండు మూడు గంటలపాటుకూడా సక్రమంగా సరఫరా చేయ డంలేదన్నారు. ఎలాంటి నిధులు కేటాయించకుండా ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ పథకం ఎందుకు పెట్టారో తెలియన అయోమయ పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

అంతకుముందకు టీడీపీ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి టీడీపీ శాసనసభపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ నెల 28న టీడీపీ అధినేత రాక సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి ప్రజలను భారీగా తరలించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యక్షులుగా జి.రాంచందర్‌గౌడ్, రొక్కం భీం రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌గౌడ్, కె.చంద్రయ్య, డి.నారాయణరెడ్డి, రాజుగౌడ్, ఇ.వెంకటేశం, బి.శివలిం గం, మీర్ మహ్మద్ అలీ, కె. లక్ష్మయ్య, జి మధుసూదన్‌రెడ్డి, జి.విఠల్‌రెడ్డి, సి. బల్వంత్‌రెడ్డి, ఎ.నర్సింగ్‌రావు, రాధాకృష్ణాయాదవ్,సి.అంజిరెడ్డి, ఎస్.కొండయ్య, ఎం. రాంరెడ్డి, జగదీష్ యాదవ్, ఆర్.వెంకటేష్‌యాదవ్, జంగయ్యయాదవ్, రంగారావు, ఎస్సీ కృష్ణారెడ్డి, కె. మహేందర్‌రెడ్డి, రాజశేఖర్ ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా పార్టీ అనుబంధ జిల్లా కమిటీల అధ్యక్షులుగా తెలుగు యువత అధ్యక్షుడు గణేష్‌గుప్తా, తెలుగునాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చిలుక మధుసూదన్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా కె.శంకర్‌గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడి గా బోడ బిక్షపతి, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా రాజునాయక్, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా చింపుల సత్యనారాయణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఇ.వి.సాగర్, లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎస్.శ్రీనివాస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కొమ్ము ఉపేందర్ ఎన్నికైనట్లు వెల్లడించారు. జిల్లా కార్యవర్గంపై ఇంకా కసరత్తు జరుగుతోంది. నేడు పూర్తి వివరాలు వెలువరించినున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ పదవుల కేటాయింపుల్లో పరిగి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని మాజీ జెడ్పీటీసీ చంద్రయ్య అధిష్టానం దృష్టికి తెచ్చారు. పార్టీ అనుబంధ సంఘాల ఎంపికలో పరిగి నియోజకవర్గానికి ఒకటి కూడా కేటాయించలేదని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దీంతో పార్టీ నేతలు కల్పించుకుని ఎవరికీ అన్యాయం చేయమని,పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వస్తే హామీలన్నీ నేరువేరుస్తాం


మచిలీపట్నం-ఈడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర పూర్తి చేస్తున్న సందర్భంగా ఈనెల 27న విశాఖపట్నంలో నిర్వహించనున్న సభా కార్యక్రమాలను విజయవంతం చేయాలని మైలవరం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా పిలుపు నిచ్చారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా పార్టీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. 63 ఏళ్ళ వయస్సులో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు బాబు 2500కి.మీ. పాదయాత్ర చేశారన్నారు.

విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న బాబు అభినందన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్నారు.జిల్లాలో అవనిగడ్డ, నూజివీడు, పెనమలూరు నియోజకవర్గాలకు త్వరలో పార్టీ ఇన్‌చార్జులను నియమిస్తామన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై పార్టీ చేపట్టిన సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మండల స్థాయి కోర్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మండల స్థాయి కమిటీలకు జిల్లా నాయకులందరూ హాజరవుతారన్నారు.

రానున్న పంచాయతీరాజ్ ఎన్నికల్లో 50 శాతం మహిళలకు రిజర్వు అయినందున మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలన్నారు. చంద్రబాబును విమర్శించే కొడాలి నానికి పుట్టగతులుండవన్నారు. సినీనటుడు బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిరాజనాలు పడుతున్నారని తెలిపారు. జగన్‌కు బెయిల్ ఇవ్వాలంటే పార్టీని విలీనం చేయాలని షరతులు విధిస్తున్నారని ఉమా చెప్పారు. దీనిపై సోనియాగాంధీతో వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మాట్లాడుతూ, అంబటి బ్రాహ్మణయ్య రాజకీయాలలో నిబద్దత గల నాయకుడన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీకి అంబటి జిల్లా అధ్యక్షునిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. వర్ల రామయ్య మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. నాగుల్ మీరా మాట్లాడుతూ, ఈనెల 29న విజయవాడలో మైనార్టీ సెల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. బీసీ సెల్ నాయకుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోను బీసీ డిక్లరేషన్ పై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బందరు నియోజకవర్గం ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు బ్రాహ్మణయ్య చేసిన కృషి మరువలేమన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, మాజీఎమ్మెల్యే రావి వెంకట్రావు, కేశినేని నాని, చలసాని ఆంజనేయులు, లంకిశెట్టి బాలాజీ, చలమలశెట్టి రామాంజనేయులు, బొడ్డు వేణుగోపాలరావు, పెదబాబు, అంకయ్య గౌడ్, గొట్టిపాటి రామకృష్ణ, దేవినేని చంద్రశేఖర్, ఆళ్ళ గోపాలకృష్ణ, కుర్రా నరేంద్ర, మోటమర్రి బాబా, గోపు సత్యనారాయణ, చిలంకుర్తి తాతయ్య, కైతేపల్లి దాసు, బత్తిన దాసులు ప్రసంగించారు. తొలుత బ్రాహ్మణయ్య చిత్రపటానికి దేవినేని ఉమా తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

విశాఖ సభను విజయవంతం చేద్దాం

అనకాపల్లి/కశింకోట):తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు అనకాపల్లి నీరాజనాలు పలికింది. యువత, మహిళలు, అభిమానులు చంద్రబాబు వెంట నడిచారు. మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలకు జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. దీంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తుతూ స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు. రాత్రి పదిన్నర గంటలప్రాంతంలో అనకాపల్లి నెహ్రూచౌక్‌కు చేరుకోగా అప్పటికే నాలుగు వైపులా రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి.

'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా చంద్రబాబు విశాఖ జిల్లాలో అడుగుపెట్టి మంగళవారానికి 11 రోజులైంది. రోజురోజుకీ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. అనకాపల్లి నియోజకవర్గంలో మూడు రోజుల క్రితం అడుగిడిన చంద్రబాబు మంగళవారం కశింకోట వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి దాడి రత్నాకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలకడంతో పాదయాత్రను ప్రారంభించారు. కశింకోట నుంచి అనకాపల్లి వరకు జాతీయ రహదారి పొడవునా జనం ఆయన వెంట నడిచారు. వాహనాల్లో వెళుతున్నవారు చంద్రబాబును చూసి చేతులూపుతూ అభివాదం చేశారు. పలువురు సెల్ ఫోన్‌లతో ఫొటోలు తీసుకున్నారు.

పలుచోట్ల చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. చంద్రబాబుతో కరచలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. వృద్ధులు తమ గోడు చెప్పుకున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని పలువురు రైతులు చెప్పగా, అధికారంలోకి వచ్చిన వెంటనే పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తానని హమీ ఇచ్చారు. కశింకోట, పిసినికాడ, కొత్తూరు జంక్షన్, ఉమ్మలాడ, పూడిమడక బైపాస్, నెహ్రూచౌక్, చిననాలుగురోడ్ల జంక్షన్, పార్కు సెంటర్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది చంద్రబాబును చూసేందుకు తరలివచ్చారు.

ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి చంద్రబాబుతోపాటు స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు కూడా ప్రజలను ఆకట్టుకునే శైలిలో ప్రసంగించారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రజలు ఆయన ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. సిమ్స్ సంస్థ దగాను, ఇసుకమాఫియా కారణంగా శారదానది గ్రోయిన్లు దెబ్బతింటున్న అంశాన్ని చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో చంద్రబాబు మరిన్ని స్థానిక సమస్యలను ప్రస్తావించడానికి ఆసక్తి చూపారు. మరుగు సమస్య కారణంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. దారిలో తనకు వేచి వున్న మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.

వారి నుంచి హారతులను స్వీకరించారు. తెలుగుదే
శం అధికారంలోకి వస్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తానో వివరించారు. అనకాపల్లిలో పట్టణ ప్రజల సమస్యలు, బెల్లం ధర, రైతుల ఇబ్బందులపై చంద్రబాబు మాట్లాడారు. అనకాపల్లి రింగురోడ్డు జంక్షన్‌కు బాబు చేరుకునే సమయానికి అధికసంఖ్యలో జనం హాజరయ్యారు.

పాదయాత్రలో చంద్రబాబు వెంట నందమూరి తారకరత్నతోపాటు టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి బండారు, రెడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, అనకాపల్లి నియోజకవర్గం నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, గుత్తా ప్రభాకరచౌదరి, కశింకోట నాయకులు నిమ్మదల త్రినాథరావు, పొన్నగంటి నూకరాజు, వేగి గోపీకృష్ణ, పెదపాటి కళ్యాణి, వేగి దొరబాబు, షేక్ బాబరు, పెంటకోట రాము, బొబ్బిలి సీతారామ్, గొంతిన లోవఅప్పారావు, వేగి ప్రకాష్, ముప్పిడి అప్పారావు, మళ్ల సూర్యారావు, బత్తిన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తిన అనకాపల్లి

నర్సీపట్నం: చంద్రబాబునాయుడు పాదయాత్ర ఫలితాలు కచ్చితంగా రాబోయే స్థానిక, సాధారణ ఎన్నికల్లో కనిపిస్తాయని, భవిష్యత్‌లో ఇక టీడీపీకి తిరుగుండదని పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్ర ఘనవిజయం సాధించిన సందర్భంగా పార్టీ వర్గీయులను అభినందించేందుకు మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు. విశాఖ జిల్లా పాదయాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజవకర్గంలో ఎనిమిది రోజుల పాటు చంద్రబాబు పర్యటించడం పార్టీ అదృష్టమన్నారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్ర ఘనవిజయం కావడానికి నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు తనను అభినందిస్తున్నారని, ఆ ఘనత మీకే దక్కుతుందని అయ్యన్న ప్రశంసించారు. నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్రకు లభించిన స్పందనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, పాదయాత్ర ఫలితాలు రానున్న స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయావకాశాలు గల అభ్యర్థులను సమిష్టి నిర్ణయంతో ఎంపిక చేయాలని సూచించారు.

పంచాయతీల ఓటర్ల జాబితాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించి మిగిలిపోయిన ఓటర్లను చేర్పించాలని అయ్యన్న చెప్పారు.

ప్రతి వంద మంది ఓటర్లకు ఒక సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేసి, వారి బాధ్యతను అప్పగించాలని, తగిన నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఎంపికలో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.

భవిష్యత్‌లో మండలాలు వారీగా ఏర్పాటు చేయనున్న సమన్వయ కమిటీల పాత్ర ఎంతో కీలకం కానున్నదని అయ్యన్న అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు, తనయుడు విజయ్ పాల్గొన్నారు.

27న జనసంద్రం కానున్న విశాఖ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా... మీకోసం పాదయాత్ర ముగింపు సభ విశాఖ చరిత్రలో చెరగని ముద్ర వేయనున్నదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు.

మంగళవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 27న విశాఖపట్నం సిటీ జనసంద్రంగా మారనున్నదని, ముగింపు సభకు ఎంతమంది ప్రజలు హాజరవుతారనేది ఊహకు అందడం లేదని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడానికి వీలుగా 11 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. బస్సులు, ఇతర వాహనాలు అసంఖ్యాకమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం అప్పజెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అయ్యన్న అన్నారు.

ఎన్నికల్లో టీడీపీకి తిరుగుండదు

అనకాపల్లి రూరల్: అవినీతి సొమ్ము తిని కాంగ్రెస్ నాయకులు సుఖపడుతూ దున్నపోతుల్లా బలిశారని, కష్టాలను మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. మీ కోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి మండలంలో పిసినికాడ హైవేపై ఉన్న జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పేరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు దోచుకుతినడమే ధ్యేయంగా ఉన్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పప్
పు, ఉప్పు, కిరోసిన్, పెట్రోల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారం విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారన్నారు.

కష్టాలన్నీ మన మీదకు నెట్టి సుఖాలు మాత్రం వారు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రజలకు పప్పు, బెల్లంపెట్టి తన కుమారుడికి మాత్రం లక్షల కోట్ల రూపాయలను పంచారన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకునేందుకే తాను ఈ పాదయాత్ర ద్వారా మీ అందరి ముందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని మీ కోసం వచ్చానని ఆయన గుర్తు చేశారు.

కష్టాలు మనకి..సుఖాలు వారికి?

గాజువాక
:'క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించను.. ఎగిరెగిరి పడితే మీరేమైనా గొప్పవారు అనుకుంటున్నారా.. ఆవల్లిస్తే పేగులు లెక్కపెట్టగల సామర్థ్యం నాకుంది.. అరుపులు, కేకలు వేస్తే భయపడేది లేదు'' అని పార్టీ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మంగళవారం గాజువాక నియోజకవర్గ సమీక్షా సమావేశం వేదికపైకి కోన తాతారావును పిలవకపోవడంతో కొంతమంది కార్యకర్తలు అరుపులు, కేకలతో నిరసన తెలిపారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైవిధంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరని, ఏదైనా చెప్పాలనుకుంటే ఓ పద్ధతి వుంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసేవారు కావాలి తప్ప స్వప్రయోజనాల కోసం పార్టీని వినియోగించుకునే వారు అవసరం లేదన్నారు. పార్టీ బాగుంటే లీడర్లు, కింది స్థాయి కేడర్‌కు గుర్తింపు వస్తుంది. పార్టీని పటిష్ఠ పరిచేందుకు పనిచేసే నాయకుడే కావాలన్నారు.

నాయకుల కంటే కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకే ఈ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే పార్టీకే నష్టం వాటిల్లతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు. గాజువాక నియోజకవర్గ సమీక్షా సమావేశం వేదికపైకి తొలుత గుడివాడ నాగమణిని ఆహ్వానించారు. తర్వాత ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, హర్ష, ప్రసాదుల శ్రీనివాస్, పప్పు రాజారావులను పిలిచి, కోన తాతారావును పిలవకపోవడంతో కార్యకర్తల నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు సూచన మేరకు కోన తాతారావును వేదికపైకి ఆహ్వానించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

వర్గాలకు దూరంగా వుండండి తెలుగుదేశం పార్టీకి గాజువాక నియోజకవర్గం కంచుకోట అని, అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఐక్యంగా పనిచేయకుండా వర్గ రాజకీయాలు చేయడమేమిటని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాజువాక గొడవలు నాకు తెలుసని, నాయకుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ ఒక్క నాయకుడు ప్రజలతో మమేకమై పనిచేసే పరిస్థితి లేకపోగా, నాయకత్వం కోసం పోటీ పడడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫైవ్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. అందరిని కలుపుకొని కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత కమిటీపైనే వుందన్నారు. సక్రమంగా పనిచేయకపోతే కమిటీలు ఎందుకంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఐక్యంగా పనిచేయండి గాజువాకలో గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం, సీపీఎం బరిలోకి దిగడంతో కొన్ని సమస్యలు తలెత్తాయని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీల పొత్తుల విషయమై ఎటువంటి నిర్ణయం చేయలేదని, పార్టీ శ్రేణుల మనోభావాలకనుగుణంగా గాజువాక విషయంలో ఆచితూచి అడుగేస్తామంటూ హామీ ఇచ్చారు.

పార్టీని దిగువ స్థాయి నుంచి పటిష్ఠ పరచడంలో భాగంగా బూత్, వార్డు, ఏరియా, నియోజకవర్గ కమిటీలను మరింత ప్రక్షాళన చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలను తమకు అందజేయాలని కోరారు.

క్రమశిక్షణ రాహిత్యాన్ని క్షమించను..


కశింకోట: శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులు మంగళవారం ఆర్ఈసీఎస్ ప్రాంగణంలో బసచేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిశారు. ఎవరు ఎక్కడ ఉంటున్నారని బాబు ప్రశ్నించగా... తమది ఉమ్మడి కుటుంబమని పార్టీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ చెప్పారు. ప్రస్తుత రోజుల్లో కూడా ఉమ్మడిగా ఉంటున్నారా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? అని చంద్రబాబు ఆసక్తిగా అడిగారు. పెద్దలు, పిల్లలు కలిసి 22 మంది వున్నారని రత్నాకర్ చెప్పగా, వంట ఎవరు చేస్తారని బాబు
అడిగారు. కుటుంబ సభ్యులమే చేస్తామని దాడి వీరభద్రరావు భార్య పద్మావతి బదులిచ్చారు.

ఏ రకం వంటకాలు చేయాలని ఎవరు నిర్ణయిస్తారని బాబు ప్రశ్నించగా... నిర్ణయాలంటూ ఎవరూ చేయరని, అయితే తమ అమ్మమ్మ రమాదేవి సూచనల మేరకు వంట చేస్తారని రత్నాకర్ చెప్పారు. ఆమె వయస్సు ఎంత ఉంటుందని బాబు ప్రశ్నించగా 80 ఏళ్లు అని చెప్పారు. ఇంత వయస్సులో కూడా ఆమె ఏ వంటకాలు చేయాలో చెప్తారా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చిరునవ్వి నవ్వారు.

మా ఇంట్లో నేను, నా భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ , కోడలు ఉంటాం. కానీ నలుగురం కలిసి భోజనం చేసేది చాలా అరుదు. మీరంతా(22 మంది) ఒకేచోట కలిసి భోజనం చేయడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు.

దాడి వీరభద్రరావు తమ్ముడు కుమార్తె భారతిని ఎక్కడ ఉంటున్నావని ప్రశ్నించగా.... ఆమె ఆ్రస్టేలియాలో ఉంటున్నానని చెప్పింది. మెల్‌బోర్న్‌లో తెలుగువారిపై దాడులు జరుగుతున్నాయి కదా... మీకు ఇబ్బంది ఏమైనా ఉందా? అని బాబు ప్రశ్నించారు. తాము బ్రిస్‌బేన్ ప్రాంతంలో ఉంటున్నామని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని భారతి చెప్పారు. సంపాదన, ఖర్చులు, తదితర విషయాల గురించి ఆయన అడిగారు. అనంతరం తమ ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజన పదార్థాలను చంద్రబాబుకు అందజేశారు.

టీడీపీ అధినేతను కలిసిన వారిలో రత్నాకర్‌తోపాటు దాడి వీరభద్రరావు సతీమణి పద్మావతి, పెద్ద కుమారుడు జగన్ ప్రభాకర్, అతని భార్య షర్మిల, రెండో కోడలు రామలక్ష్మి, చిన్నకోడలు రామలక్ష్మి, వీరభద్రరావు తమ్ముడి భార్య వెంకట భాగ్యలక్ష్మి, ఆమె కుమార్తెలు, భారతి, గీత, పిల్లలు వున్నారు.

బాబును కలిసిన 'దాడి' కుటుంబం

విజయనగరం టౌన్: కార్యకర్తలే టీడీపీకి బలమని ఆ పార్టీ సీనియర్ నే త తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 27న విశాఖలో జరగనున్న చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు సన్నాహాలను ప రిశీలించేందుకు మంగళవారం ఆయన విజయనగరం వచ్చారు. ఈ సంద ర్భంగా విజయనగరం నియోజకవర్గ పార్టీ శ్రేణులను ఉద్ధేశించి మాట్లాడా రు. కార్యకర్తల బలం, ప్రజల ఆశీస్సులతోనే టీడీపీ 30 ఏళ్ల ప్రస్థానంలో 17 ఏళ్ల పాటు అధికారంలో ఉందన్నారు. ఎన్నో ప్రజోపయోగకరమైన పనులు చేసిన ఘనత టీడీపీకే దక్
కిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడంలో ముందున్నారన్నారు. 63 ఏళ్ల వయస్సులో చంద్రబాబు రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో 87 నియోజకవర్గాల పరిధిలో 2,700 కిలోమీటర్లు నడచి, ప్రజా సమస్యలు తెలుసుకోవడం ఇంతవరకూ దేశంలోని ఏ రా జకీయ నాయకుడు చేయలేదని, చేయలేరన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయన్నా రు. ప్రజా సంక్షేమాన్ని ఈ రెండు ప్ర భుత్వాలు విస్మరించాయని ఆయన ధ్వజమెత్తారు. 2014లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ, ఈనెల 27న జరిగే చం ద్రబాబు సభను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. విశాఖలో జరిగే సభకు తాను కూడా కార్యకర్తల తో పాటు బయలుదేరుతానని ప్రకటించారు. దీనికి కార్యకర్తల నుంచి హర్షం వ్యక్తమైంది. సమావేశంలో టీడీపీ నా యకులు ప్రసాదుల రామకృష్ణ, సైలా డ త్రినాథ్, ఎస్ఎన్ ఎం రాజు, డాక్ట రు వీఎస్ ప్రసాద్, మద్ధాల ముత్యాలరావు, ఎస్‌కెఎం భాషా, టీడీపీకి చెం దిన మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలే టీడీపీ బలం

అది కిరణ్ ప్రచార హస్తమే

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'అమ్మ హస్తం' సీఎం కిరణ్ ప్రచార హస్తం మాత్రమేనని టీడీపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ పార్టీ సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. నిత్యావసరాల ధరల తగ్గింపుపై దృష్టిపెట్టని సీఎం, 'అమ్మ హస్తం' గురించి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

వాస్తవానికి ఇది భస్మాసుర హస్తం పథకమని వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం కోట్లు వెచ్చించే బదులు నిత్యావసరాల ధరలు తగ్గించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అమ్మహస్తం పథకం కోసం సంచుల కొనుగోలులో భారీ కుంభకోణం చోటు చేసుకుందన్నారు.

దళితుల పాలిట నరకాసురుడు సీఎం: ముద్దుకృష్ణమ్మ

జగ్గయ్యపేటలో స్టీల్‌ఫ్యాక్టరీ యోచన వైఎస్‌దే
నిజనిర్ధారణ కమిటీకి సిద్ధమేనా?
తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపో
బయ్యారంపై టీఆర్ఎస్ రాజకీయం: తుమ్మల

హైదరాబాద్, విజయనగరం : బయ్యారం విషయమై షర్మిల సవాలును తాను స్వీకరిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపించాలనే బయ్యారం గనులను వైఎస్ మంజూరు చేసినట్లు షర్మిల చెబుతున్నారని, కానీ.. కృష్ణాజిల్లా జగ్గయ్య

ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అనుమతి పొందిన షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ బంధువైన కొండలరావుకు నిజంగా రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టే సామర్ధ్యముందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బ్రదర్ అనిల్‌కు కొండలరావు బినామీ అని వెల్లడించారు. రక్షణస్టీల్స్, బ్రదర్ అనిల్ డైరెక్టర్‌గా ఉన్న మిరాకిల్ ఫార్ములేషన్ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్‌లోని 'డి 203, ఆదిత్య ఎలైట్, బీఎస్ మక్తా, సోమాజిగూడ' అన్న చిరునామాలోనే ఉండడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

బ్రదర్ అనిల్ మతపరమైన వ్యవహారాలు కూడా ఆదిత్య ఎలైట్ చిరునామా నుంచే సాగాయన్నారు. ఇప్పటికైనా షర్మిల తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపోవాలని హితవు పలికారు. 'షర్మిల పాదయాత్ర చేసినా, క్యాట్‌వాక్ చేసినా మాకేమిటి ? కొండలరావు మీ బినామీ కాకపోతే సీబీఐ విచారణను ఎందుకు కోరలేరు?' అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త షర్మిలకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే విచారణ కోరుతూ 48 గంటల్లోగా ప్రభుత్వానికి లేఖ రాయాలని షర్మిలకు రేవంత్ సవాల్ చేశారు. కాగా, బయ్యారం గనులపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న అంశానికి టీడీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. బయ్యారం ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తరలించడానికి తాము అభ్యంతరం చెప్పడం లేదన్నారు. వైఎస్ హయాంలో ఈ గనులను గాలి జనార్దన్‌రెడ్డి ద్వారా చైనాకు కట్టబెట్టారని, అలాంటిది మన రాష్ట్రంలోనే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తరలిస్తే అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమని తుమ్మల అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు బాబే సమర్ధ నేత అని వివరించారు.

టీఆర్ఎస్‌పై ఎదురుదాడికి వ్యూహం
విశాఖపట్నం: బయ్యారం గనుల అంశంలో టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే అంశంపై టీడీపీ దృష్టిసారించింది. పాదయాత్రలో ఉన్న చంద్రబాబును మంగళవారం కశింకోటలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రేవంత్‌రెడ్డి కలిశారు. సుమారు అరగంటపాటు వీరిద్దరూ బాబుతో సమావేశమయ్యారు. బయ్యారం అంశంపైనే వారితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు.
పేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ మర్నాడే ఒప్పందం చేసుకున్న విషయం ఆమెకు తెలియదేమోనని ఎద్దేవా చేశారు. ఈ విషయాలను తాను అసెంబ్లీలో ప్రస్తావించినా, ప్రభుత్వం మందబలంతో తప్పించుకుందన్నారు.

షర్మిల సవాలుకు సై 'వైసీపీ కార్యకర్త' షర్మిలకు రేవంత్‌రెడ్డి సూచన

మచిలీపట్నం/పామర్= ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో నందమూరి కుటుంబం మధ్య ఎటువంటి స్పర్ధలు లేవని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా టీడీపీ సమావేశం మంగళవారం మచిలీపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ, గతంలో ఎప్పుడో జరిగిన వివాదానికి ఆనాడే ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పారని, అప్పటి నుంచి అందరూ కలిసి పోయారని తెలిపారు. రాకపోకలు కూడా బాగానే ఉన్నాయన్నారు.

పార్టీ పటిష్ఠానికి బాలకృష్ణ కృషి చేస్తున్నారని, దానిలో భాగంగా పలువురిని కలుస్తున్నారని వివరించారు. ఆయన నిమ్మకూరు పర్యటన కారణంగా నందమూరి కుటుంబంలో వివాదాలు ఏమీ లేవన్నారు. కాగా ఎన్టీఆర్, వెంకటరత్నం కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఆనాడే ఎన్టీఆర్‌కు వెంకటరత్నం క్షమాపణ చెప్పారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు. ఆ ఘటన తర్వాత కూడా ఎన్టీఆర్ నిమ్మకూరు వచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలో బాలకృష్ణ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పామర్రులోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

"తన స్థలంలో ప్రభుత్వాస్పత్రి నిర్మాణం జరుగుతోందని ఆగ్రహించి 1987 ఏప్రిల్ 29న నందమూరి వెంకటరత్నం దానికి అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేద్దామనుకుంటే ఆటంకాలా అని ఎన్టీఆర్ కలత చెందిన మాట వాస్తవమే. నిమ్మకూరులో అడుగు పెట్టనని అన్నమాట కూడా నిజమే. అయితే, ఆ తర్వాత నిమ్మకూరుకు చెందిన గ్రామ పెద్దలు వెంకటరత్నంను మందలించి ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పించి కోర్టులో ఉన్న కేసును ఉపసంహరింపజేశారు. ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పారు. ఎన్టీఆర్ కూడా క్షమించారు. వారి ఆహ్వానం మేరకు 1988 మే 21న ఎన్టీఆర్ నిమ్మకూరు వచ్చి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న శ్రీవెంకటేశ్వర స్వామి రాజగోపురానికి శంకుస్థాపన చేశారు కూడా. వెంకటరత్నం కుమారుడు మురళీకి నిమ్మకూరు కళాశాలలో ఉద్యోగం ఇప్పించారు.

1999లో గుడివాడ నియోజకవర్గం నుంచి హరికృష్ణ పోటీ చేయగా వెంకటరత్నం ఆయన గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పామర్రు మండలంలో ప్రచారం చేశారు'' అని రామయ్య వివరించారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే శివరామకృష్ణ ఇంటికి బాలకృష్ణ వెళ్లారని చెప్పారు. ఆ ఇంటి నుంచే నిమ్మకూరు గ్రామ పెద్దలను సమావేశపరచి టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలని కోరారన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే బాలకృష్ణ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అవినీతి రక్కసి విశృంఖల విహారం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చారన్నారు.

నాయిని ఓ పోతురాజు: టీడీపీ
టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డిని తెలంగాణలో బోనాల పండుగలో డప్పులకు అనుగుణంగా గంతులు వేసే పోతరాజుగా టీడీపీ అధికార ప్రతినిధి ఎన్.నర్సిరెడ్డి అభివర్ణించారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. "నాయినికి ఒళ్లే మందం అనుకున్నాం. మెదడు కూడా మందమైనట్లుంది' అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి గోకుడు రోగముందని, ఆ దురద పోవాలంటే ఎవరితోనైనా గీకించుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఆనాడే క్షమాపణ చెప్పారు :ఉమామహేశ్వరరావు

గుంటూరు : కేసీఆర్ దేశ ద్రోహి, ప్రజా ద్రోహి అని, టీఆర్ఎస్ దుర్మార్గపు పార్టీ అని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సినిమా, విద్య, వ్యాపార సంస్థల నుంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దండుకుంటోందని ఆరోపించారు. స్పష్టతతోనే తెలంగాణ వస్తుంది తప్ప నలుగురిని చంపితేనో...లేక నలుగురు గావుకేక పెడితేనో తెలంగాణ రాదు అని ఆయన అన్నారు.

బయ్యారం గనులను వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్‌కు దోచిపెట్టినప్పుడు నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ దోపిడీ, అవినీతి జగన్ పార్టీలను అంతమొందించేందుకు విశాఖ సభ నాంది పలుకుతోందని ఆయన తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా ఇందిరమ్మకలలు అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో తిరుగుతున్నారని కోడెల విమర్శించారు

టీఆర్ఎస్ దుర్మార్గపు పార్టీ : కోడెల

హైదరాబాద్
 'జగన్ ఒక దోపిడీ దొంగ' అని తెలుగు దేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రకరకాల దోపీడీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బాధ్యుడని గాలి ఆరోపించారు. అనేక అవినీతి పనులు చేశాడు కాబట్టే జగన్ జైల్లో ఉన్నాడు. అలాంటి అవినీతి పరుడికి బెయిల్ దాఖలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

జగన్ దోపిడీ దొంగ: గాలి ముద్దు కృష్ణమ

బెల్లం తీపి.. చక్కెర స్వీటు. ప్రతి వంటింట్లో అదోఇదో ఉండాల్సిందే. ప్రతి పదార్థం తయారీలోనూ అవి పోటీపడతాయి. 'నేనంటే నేను..' అంటూ ముందుకొస్తాయి. పాకం నుంచి ఉండల దాకా.. బెల్లమో, చక్కెరో ఉండాల్సిందే. మరి ఈ రెండూ ఒకే చోట ఒకే పరిమాణంలో అందుబాటులోకి వస్తే..? ఇక చెప్పాల్సిందేమిటి! అందువల్లే తీపి కబుర్లు వింటానని అనకాపల్లిలో అడుగుపెట్టినప్పుడు అనుకున్నాను. ఎందుకంటే.. దేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్‌యార్డు ఈ పట్టణంలో ఉంది.

అలాగే.. చెరుకు పండే ప్రధాన ప్రాంతాల్లో అనకాపల్లి కూడా ఒకటి. కానీ, ఒక్కో రైతును కలుస్తున్నకొద్దీ నోరంతా చేదైపోయినట్టు అనిపించింది. ప్రజలకు కారం పెట్టి.. ఆ తరువాత నీళ్లు తాగించే ఈ పాలకులకు వేరే రుచులేవీ రుచించనట్టుంది. పంటకు గిట్టుబాటు లేదట. గిట్టేదాకా ఉంచుకోవడానికి తగిన నిల్వ వసతులు లేవట. దళారి చెప్పిన ధరకే తెగనమ్మాల్సి వస్తున్నదట. 'చేయూత ఇవ్వాల్సిన వాళ్లే చేతులు నరికేస్తుంటే ఏమి చేయాలి సార్?' అని ఓ రైతు ప్రశ్నించాడు.

చక్కెర రైతుదీ ఇదే ప్రశ్న. పండించే పంటలో కొంతభాగం తుమ్మపాల చక్కెర కర్మాగారానికి తరలిస్తున్నారట. ఆ పరిశ్రమ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో అందరికీ అక్కరకు రాలేకపోతున్నదట. పైగా బకాయిలు పేరుకుతున్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు సర్వి రైతులదీ ఇదే పరిస్థితి. వీళ్లను ప్రభుత్వాలు కాకపోతే ఎవరు ఆదుకుంటారు?

వీళ్లను ఎవరు ఆదుకోవాలి?


రాష్ట్ర ప్రజలకు నాయకుల పాదయాత్రలు కొత్తకావు. కానీ, వాటికీ 200 రోజులకు పైగా సాగుతున్న చంద్రబాబు పాదయాత్రకు సామ్యమే లేదనేది రాజకీయవర్గాల మాట. రాష్ట్ర చరిత్రలో రెండు వేల కిలోమీటర్లకు పైగా నడిచిన మరో నేత లేకపోవడం ఒక కారణం కాగా..64 ఏళ్ల వయసులో ఆయన నడకకు సిద్ధం కావడం మరో కారణం. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను కళ్లారా చూస్తే తప్ప ఆ తీవ్రత అర్థం కాదన్న ఉద్దేశంతో గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన అనంతపురంలో పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. అప్పటినుంచీ క్షేత్రస్థాయి సమస్యలపై చూపు నిలిపి.. ప్రతి ఒక్కరి అభిమానం చూరగొన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం గాడిలో పడుతుందనే విశ్వాసాన్ని పాదుగొల్పగలిగారు. దానికి తగినట్టే..'మీ ఇంటి పెద్దబిడ్డగా వచ్చాను. ఆదరించి ఆశీర్వదించండి' అంటూ చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తికీ మంచి స్పందన లభిస్తోంది. వ్యవసాయం మూలన పడటానికి, నిరుద్యోగానికి, దారిద్య్రానికి అవినీతే కారణమన్న విషయాన్ని జనంలోకి లోతుగా తీసుకెళ్లగలిగారు. ఆదివాసీ, దళిత, బడుగు వర్గాలకోసం విరివిగా పథకాలు, డిక్లరేషన్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మధ్యతరగతి వారినీ బాగా ఆకట్టుకున్నారు. ఈసారి ఏదిఏమైనా అసెంబ్లీలోకి 'సైకిల్' దూసుకుపోవాల్సిందేనని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

బలపడుతున్న అడుగు!

రుణమే మాఫీ చేస్తా!
రైతుకు అప్పు ముప్పు తప్పిస్తా
ఆడబిడ్డల తాకట్టు వస్తువులూ విడిపిస్తా
గొంతు కోసే పథకంగా.. నగదు బదిలీ
అధికారంలోకి వస్తే మెరుగైన 'ఆరోగ్య బీమా'
విశాఖ పాదయాత్రలో చంద్రబాబు
ముస్తాబవుతున్న పైలాన్

విశాఖపట్నం/కశింకోట : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలపై వడ్డీనే కాదు..అసలునూ మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే.. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెరుగైన ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. నగదు బదిలీని ప్రజల గొంతుకోసే పథకంగా కాంగ్రెస్ పాలకులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా కశింకోట వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పిసినికాడ, కొత్తూరు జంక్షన్, పూడిమడక జంక్షన్, అనకాపల్లి, సుంకరమెట్ట జంక్షన్, శంకరం మీదుగా నడక సాగించారు.

"రైతు రుణాల మాఫీకి మా పార్టీ కట్టుబడి ఉంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకునే అప్పులన్నీ రద్దుచేస్తాం. అలాగే.. భార్యా పిల్లల నగలు తాకట్టుపెట్టి వ్యవసాయ రుణం తీసుకున్న వారినీ విముక్తులను చేస్తాం. ఆడపడుచుల వస్తువులను తిరిగి వారికి చేరుస్తాం'' అని పిసినికాడలో జరిగిన సభలో భరోసా ఇచ్చారు. వృద్ధులకు, వికలాంగులకు 600 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. 'మీ నియోజకవర్గంలో వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తామ''ని అనకాపల్లిలో హామీ ఇచ్చారు. చదువుమీద దృష్టి సారించడంతోపాటు అవినీతిపై పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దారిలో ప్రజలు చెప్పిన సమస్యలు ఆలకించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. "నగదు బదిలీ.. నకిలీ బదిలీ పథకంలా మారుతోంది. మార్కెట్‌లో 45 రూపాయలు ధర పలికే బియ్యానికి 14,15 రూపాయల ధర కట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే ఆకలిచావులు తథ్యం'' అని ఆవేదన వ్యక్తంచేశారు.

నిత్యావసర వస్తువుల ధరలు మూడు వందల రెట్లు పెంచేసి.. 'అమ్మ హస్తం' అంటూ కంటితుడుపు చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం సరిపెడుతోందని దుయ్యబట్టారు. " మహిళల కష్టాలు తొలగించేందుకు మా హయాంలో సబ్సిడీపై గ్యాస్ అందజేశాం. వంద రూపాయలకే సిలిండర్ ఇచ్చాం. కాంగ్రెస్ వచ్చి..దాని ధరను రూ.400పైగా పెంచేసింది. బ్లాక్‌లో వెయ్యి రూపాయల వరకూ అమ్ముతున్నా రు. పేదలను ఆదుకోవడానికి రూ.15 వేల కోట్లు నగదు బదిలీ కింద కేటాయించాలని కేంద్రానికి సూచించాను. కానీ, కాంగ్రెస్ పాలకులు దాన్నో ప్రహసనంగా మార్చివేశారు'' అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బంతా నాయకులకు దక్కితే, కష్టాలు ప్రజలకు మిగిలాయని విమర్శించారు. కొడుకు అక్రమాస్తులు సంపాదిస్తున్నప్పుడే అతని తల్లి విజయలక్ష్మి, తండ్రి వైఎస్ హెచ్చరించి ఉంటే జగన్‌కు జైలు గతి పట్టేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కు తాము మద్దతిచ్చామని, అయితే సీఎం కిరణ్ తానొక్కడే ఈ పథకానికి రూపకర్తనన్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కాపులు ఆర్థికం గా నిలదొక్కుకునేందుకు తమ పార్టీ ఒక ప్రణాళికను ప్రకటించిందని, బీసీ డిక్లరేషన్ వంటి అభ్యుదయ పథకాలను అధికారంలోకి వస్తే అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇదిలాఉండగా చంద్రబాబు పాదయాత్ర ముగింపునకు చిహ్నం గా అగనంపూడి టోల్‌గేటు సమీపంలోని శివాజీనగర్ వద్ద చేపట్టిన 64 అడుగుల ఎత్తయిన పైలాన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, తుమ్మల నాగేశ్వరరావు, కళా వెంకటరావు, నల్లూరి భాస్కరరావు తదితరులు దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

నిప్పులు కక్కుతున్న ఉప్పూ పప్పూ ఇంకెవరి కోసం 'అమ్మహస్తం'?