April 24, 2013

వర్ష బాధితులను పట్టించుకోరా?: ముద్దు

రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మాదిరిగా వ్యవహరిస్తోందని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా చలనం కనిపించడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు మునిగిపోతే.. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచార యాత్రల్లో మునిగి తేలుతున్నారని, నష్టపోయిన రైతులను పరామర్శించే ప్రయత్నం కూడా చేయట్లేదని విమర్శించారు. ఈ ఏడాది అకాల వర్షాలు రావ డం ఇది నాలుగోసారని గుర్తుచేశారు.

సీఎంసహా మం త్రులెవరూ రైతులను పరామర్శించ లేదన్నారు. ఢిల్లీ లో తల్లీకొడుకుల సేవ తప్ప ఇక్కడ బాధితుల సేవ లేదని మండిపడ్డారు. రైతులకు ఈ బాధలు చాలవ న్నట్లు విత్తనాల ధరలు పెంచడం దారుణమన్నారు. రైతు బాంధవుడినని పొగిడించుకోగానే సరిపోదని, రైతులకు సున్నావడ్డీకి రుణాలివ్వాలంటే రూ.1800 కోట్లు కావాల్సి ఉంటే రూ.125 కోట్లు విడుదల చేస్తే చాలా? అని ప్రశ్నించారు. దిగుమతి అయిన సీఎంల తో పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.