April 24, 2013

షర్మిల సవాలుకు సై 'వైసీపీ కార్యకర్త' షర్మిలకు రేవంత్‌రెడ్డి సూచన

జగ్గయ్యపేటలో స్టీల్‌ఫ్యాక్టరీ యోచన వైఎస్‌దే
నిజనిర్ధారణ కమిటీకి సిద్ధమేనా?
తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపో
బయ్యారంపై టీఆర్ఎస్ రాజకీయం: తుమ్మల

హైదరాబాద్, విజయనగరం : బయ్యారం విషయమై షర్మిల సవాలును తాను స్వీకరిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపించాలనే బయ్యారం గనులను వైఎస్ మంజూరు చేసినట్లు షర్మిల చెబుతున్నారని, కానీ.. కృష్ణాజిల్లా జగ్గయ్య

ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అనుమతి పొందిన షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ బంధువైన కొండలరావుకు నిజంగా రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టే సామర్ధ్యముందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బ్రదర్ అనిల్‌కు కొండలరావు బినామీ అని వెల్లడించారు. రక్షణస్టీల్స్, బ్రదర్ అనిల్ డైరెక్టర్‌గా ఉన్న మిరాకిల్ ఫార్ములేషన్ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్‌లోని 'డి 203, ఆదిత్య ఎలైట్, బీఎస్ మక్తా, సోమాజిగూడ' అన్న చిరునామాలోనే ఉండడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

బ్రదర్ అనిల్ మతపరమైన వ్యవహారాలు కూడా ఆదిత్య ఎలైట్ చిరునామా నుంచే సాగాయన్నారు. ఇప్పటికైనా షర్మిల తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపోవాలని హితవు పలికారు. 'షర్మిల పాదయాత్ర చేసినా, క్యాట్‌వాక్ చేసినా మాకేమిటి ? కొండలరావు మీ బినామీ కాకపోతే సీబీఐ విచారణను ఎందుకు కోరలేరు?' అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త షర్మిలకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే విచారణ కోరుతూ 48 గంటల్లోగా ప్రభుత్వానికి లేఖ రాయాలని షర్మిలకు రేవంత్ సవాల్ చేశారు. కాగా, బయ్యారం గనులపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న అంశానికి టీడీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. బయ్యారం ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తరలించడానికి తాము అభ్యంతరం చెప్పడం లేదన్నారు. వైఎస్ హయాంలో ఈ గనులను గాలి జనార్దన్‌రెడ్డి ద్వారా చైనాకు కట్టబెట్టారని, అలాంటిది మన రాష్ట్రంలోనే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తరలిస్తే అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమని తుమ్మల అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు బాబే సమర్ధ నేత అని వివరించారు.

టీఆర్ఎస్‌పై ఎదురుదాడికి వ్యూహం
విశాఖపట్నం: బయ్యారం గనుల అంశంలో టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే అంశంపై టీడీపీ దృష్టిసారించింది. పాదయాత్రలో ఉన్న చంద్రబాబును మంగళవారం కశింకోటలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రేవంత్‌రెడ్డి కలిశారు. సుమారు అరగంటపాటు వీరిద్దరూ బాబుతో సమావేశమయ్యారు. బయ్యారం అంశంపైనే వారితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు.
పేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ మర్నాడే ఒప్పందం చేసుకున్న విషయం ఆమెకు తెలియదేమోనని ఎద్దేవా చేశారు. ఈ విషయాలను తాను అసెంబ్లీలో ప్రస్తావించినా, ప్రభుత్వం మందబలంతో తప్పించుకుందన్నారు.