August 1, 2013


ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై కొంత మంది మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఉసిగొల్పుతోందని టీఎన్ఎస్ఎఫ్ ధ్వజమెత్తింది. ఇక మీదట చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించేది లేదని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇ. ఆంజనేయగౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా రాజకీయ డ్రామాలను కట్టిబెట్టి, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి శాస్త్రీయ పద్ధతుల్లో పరిష్కారం కనుగొనాలని హితవు పలికారు. ఆగస్ 1 నుంచి నిర్వహించ తలపెట్టిన ఫీజుల ఉద్యమాన్ని రాష్ట్రంలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకుంటున్నట్లు ఆంజనేయ గౌడ్ తెలిపారు.

చంద్రబాబును విమర్శిస్తే సహించం : టీఎన్ఎస్ఎఫ్

కేంద్రం సెపరేట్ తెలంగాణ రాష్ట్రం ప్రకటన పాపం చంద్రబాబుదే అని చాలా మంది ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. అది శుద్ద అవివేకం. ఆయన మనసులోని నిగూడమైన భావాలు అర్ధం చేసుకునేవారు అలా అనలేరు!. సీమాంధ్ర ప్రజలు బ్లాక్ డే గా అభివర్ణించిన జూలై 30వ తేది సాయంత్రం చంద్రబాబు పెదవి విప్పి తన మనసులోని మాట చెప్పారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో సీమాంధ్ర ప్రజలు గమనించలేకపోయారు.

సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్ర రాష్ట్రం కోసం నిర్మించుకోవాలని చెప్పారు. ఆ మహానగరం నిర్మాణం కోసం 5 లక్షల కోట్లు కేంద్రాన్ని ఇవ్వవలసిందిగా ఆయన డిమాండ్ చేస్తారట! కాబట్టి 5 లక్షల కోట్లతో సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్ ను మించిన నగరాన్ని నిర్మించుకోవచ్చు. హైదరాబాద్ లోని ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కంటే గొప్ప ఎయిర్ పోర్ట్ ని నిర్మించుకోవచ్చు.

పరిశ్రమలు ఇక్కడ వందల సంఖ్యలో ఐ.టి కంపెనీలు ఉంటే ఆ మహానగరంలో వేల సంఖ్యలో ఐ.టి కంపెనీలు, పరిశ్రమలు స్థాపించబడేలా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఇతరవి ఇక్కడ ఉంటే వీటికంటే ఎక్కువగా అక్కడ ఉండేలా సీమాంధ్ర ప్రజలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే 5 లక్షల కోట్ల రూపాయలు సామాన్యమైన డబ్బు కాదు. మరి అంతా డబ్బు కేంద్రం ఇస్తుందా? అంటే చచ్చినట్టు ఇస్తుంది. ఎందుకంటే అక్కడ అడబ్బుని డిమాండ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు కదా! రాష్ట్ర విభజన సమయంలోమౌనంగా ఉన్నందుకైనా కేంద్రం చంద్రబాబు డిమాండ్ కి తల ఒగ్గి 5 లక్షల కోట్లు కోట్లు మరో రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు కల సాకారం కావడానికి 10సంవత్సరాలు కూడా అక్కర్లేదు. నాలుగైదు సంవత్సరాల కాలం చాలు. అపర చాణుక్యుడైనా చంద్రబాబుకి సమైఖ్య ఆంధ్ర ప్రజలు ఎంతైన రుణపడి ఉన్నారు.

ఆత్మబంధువు చంద్రబాబు