November 20, 2012


50వ రోజు మంగళవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు ..(Andhrajyothi).20.11.2012


50వ రోజు మంగళవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు .. (Eenadu).20.11.2012









మన ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో కష్టం వస్తే ఎవరితో చెప్పుకొంటారు!? వారి కష్టాన్ని గుర్తించి, తీర్చాల్సిన బాధ్యత ఎవరిది!? తల్లిదండ్రులదే కదా! అలాగే, రైతన్నకు కష్టమొస్తే ఎవరితో చెప్పుకొంటాడు!? ప్రభుత్వానికే కదా! నిలువెత్తు కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కదా! కానీ, ఇదేం ప్రభుత్వం!? దీనికి మానవత్వమూ లేదు. బాధ్యత అంతకంటే లేదు.

ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న వార్తను చదివి కలత చెంది ఈరోజు పాదయాత్రను ప్రారంభించా. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముగ్గురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. హరితాంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఉండవని పాలకులు చెప్పిన మాటలు నీటిమూటలేనని ఆ వార్త గుర్తు చేసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసి, అప్పుల బాధలు భరించలేక చనిపోయే పరిస్థితి రావడం దారుణం. తాము చేయని తప్పులకు రైతులు బలైపోతున్నారు.

ఈ ఆవేదనతో నడుస్తుండగానే, సదాశివపేట, సంగారెడ్డి రూరల్ మండలాల్లో పత్తి, చెరకు సాగు చేసిన రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ఎదురొచ్చారు. అకాల వర్షాలు, పెరిగిన ధరలతో కుదేలైపోయామని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మదన పడ్డారు. వారి కష్టాలు విన్న తర్వాత నా ఆవేదన మరింత పెరిగింది. ఈ ప్రభుత్వ విధానాలే రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి.

దిగాలు పడిన రైతులను పరామర్శించడానికి, కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు ధైర్యం చెప్పడానికే పాదయాత్ర మొదలుపెట్టా. వారి ఆవేదన విన్న తర్వాత నా బాధ్యత రెట్టింపు అయిందనిపించింది. అందుకే, 'అన్నదాతలూ.. అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దు!' అని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నా.

మనసులో మాట -రైతన్నా.. రాలిపోవద్దు!

బాబు వెంట వికలాంగుడి యాత్ర
రెండు కాళ్లకూ కృత్రిమ అవయవాలను అమర్చినా.. చంద్రబాబు వెంట పాదయాత్రలో సాగుతూ పి. సునీల్‌కుమార్ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. సునీల్‌కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా నర్సరావుపేట. చిన్నతనంలో పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. యాత్ర ప్రారంభించి 50 రోజులు పూర్తయిన దరిమిలా చింతలపల్లి ఈద్గాకు వచ్చారు. చంద్రబాబుతో పాటు యాత్రలో పాల్గొన్నారు.

"పాదయాత్రలో పాల్గొనడం కొంత ఇబ్బందే. బాబు అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకంతో వచ్చా. వికలాంగుడినైన నేను నడవడం చూసి మరికొందరైనా నడుస్తారనుకుంటున్నా''నని 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. ముబారక్‌పూర్‌లో వృద్ధ దంపతులు బోయిని అంజయ్య, గంగమ్మలకు 2000 చొప్పున చంద్రబాబు ఇచ్చారు.

హామీలు తీరుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
పాదయాత్రలో భాగంగా చంద్రబాబు చేస్తున్న హామీలను నెరవేర్చే పనిలో ఎన్టీఆర్ ట్రస్టు తలమునకలుగా ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన రామారావు కుమారుడు మోహిత్ వైద్యం కోసం రూ.2.5లక్షలు, అదే జిల్లా పరిగికి చెందిన రాజేష్‌కు రూ.2.18 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన చిన్నారి వైద్యానికి సుమారు 3.5లక్షలు భరించేందుకు ముందుకొచ్చింది.

బాధితులను మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి పిలిపించి ఈ విషయం చెప్పినట్టు ట్రస్ట్ సీఈవో వెంకట్ మోటపర్తి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరు మధ్య ట్రస్టు ఆధ్వర్యంలో రూ.56లక్షలతో 130 వైద్య శిబిరాలు నిర్వహించి 83,869మందికి వైద్యసాయం అందించినట్లు ఆయన తెలిపారు.

బాబు వెంట వికలాంగుడి యాత్ర, హామీలు తీరుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్

నా పేరు చంద్రబాబు నాయక్
ఢిల్లీ స్థాయిలో గిరిజన గళం వినిపిస్తా
ఆదివాసీ నేతగా నిరూపించుకుంటా
తండాలకు పంచాయతీ హోదా కల్పిస్తా
పీజీ దాకా ఉచిత విద్య అందిస్తా
ఆడపిల్లల పెళ్లికి రూ.50 వేలు
లంబాడాలకు చంద్రబాబు హామీ
50 రోజులు పూర్తయిన పాదయాత్ర
మెదక్‌జిల్లా చింతలపల్లి వద్ద కేక్ కట్ చేసిన టీడీపీ అధినేత

సంగారెడ్డి, నవంబర్ 20 : " గిరిజనులను అన్ని రకాలుగా ఆదుకుని, వారికి అండగా ఉండి, చంద్రబాబు నాయక్‌గా పేరు తెచ్చుకుంటా''నని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఘనత చిరంజీవిదేనని దుయ్యబట్టారు. "అందరూ కలిసి వస్తే కాంగ్రెస్‌ను తరిమికొడదా''మని పిలుపునిచ్చారు. పశువుల కన్నా హీనంగా ఎమ్మెల్యేలను రూ.20 కోట్లకు కొనడమే విశ్వసనీయతా అని జగన్ పార్టీ నేతలను ఘాటుగా ప్రశ్నించారు. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని చింతలపల్లి ఈద్గా నుంచి మద్దికుంట చౌరస్తా వరకు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు.

యాత్ర ప్రారంభించి 50 రోజులైన సందర్భంగా కేక్ కట్ చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుక్యా సంజీవనాయక్, విద్యార్థి నేత శంకర్ నాయక్ చంద్రబాబుకు 25 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు బంజారాలకు ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. "500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా చేస్తాను. గిరిజన పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తాను.ఇంటిజాగా ఇచ్చి, రూ.1.5 లక్షలతో ఇల్లు కట్టిస్తాను. తండాల్లోని ఆడపిల్లల పెళ్లికి యాభై వేల రూపాయలు ఇస్తాను'' అంటూ వారిని ఉత్సాహపరిచారు.

దళితుల బాగు కోసం పోరాడుతున్న ఎంఆర్‌పీఎస్ నేత మందకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. "కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు 63 ఏళ్ల వయసులో మీ వద్దకు పాదయాత్రగా వచ్చాన''ని చెబుతున్నప్పుడు జనంలో విశేష స్పందన కనిపించింది. ప్రజలను చైతన్య పరిచి ప్రజాఉద్యమం నిర్మించేందుకు పవిత్రమైన మనసుతో వచ్చానని చంద్రబాబు అనగా హర్షాతిరేకాలతో స్వాగతించారు. "పది అడుగులు నాతో కలిసి రండి. సహకరించాల''ని కోరగా.. అక్కడ ఉన్నవారంతా ఉత్సాహంగా ముందుకొచ్చారు.

"మీరు ఇలాగే ఉత్సాహం చూసిస్తే మీ రుణం తీర్చుకుంటాను. మనకు కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయి. అధికారంలోకి తప్పకుండా వస్తాం. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత మేర మీ బాగుకోసమే పని చేస్తా''నని భావోద్వేగంగా పలికారు. అదే సమయంలో కేంద్ర మంత్రి చిరంజీవిపై నిప్పులు చెరిగారు. "సినిమా నటుడు చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. సామాజిక న్యాయమంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజల సంగతిని పక్కనపెట్టి తనకు న్యాయం జరిగేలా చూసుకున్నారు. మంత్రి పదవి కోసం పార్టీనే విలీనం చేశారు'' అని ఘాటుగా విమర్శించారు.

తమ అధినేత్రి సోనియా చెప్పినా సీఎం కిరణ్ వినే పరిస్థితి కనిపించడం లేదని , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇవ్వాలని ఆమె ఆదేశించినా సీఎం పట్టించుకోలేదని గుర్తు చేశారు. "ముఖ్యమంత్రి కిరికిరిరెడ్డి (కిరణ్‌కుమార్‌రెడ్డి), మాఫియా డాన్ బొత్స సత్యనారాయణలను మార్చే స్థితిలో సోనియాగాంధీ లేర''న్నారు. వారిద్దరూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి కుటుంబానికి పది సిలిండర్లు చొప్పున ఇస్తామని పునరుద్ఘాటించారు.తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.

ఢిల్లీ స్థాయిలో గిరిజన గళం వినిపిస్తా, ఆదివాసీ నేతగా నిరూపించుకుంటా

హైదరాబాద్/మెదక్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అంతా దోపిడీ, దుర్మార్గ పాలన అన్నారు. నిజమైన స్వర్గయుగం కేవలం చంద్రబాబుదే అన్నారు. అతి స్వల్ప కాలంలో వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించిందని, దానికి వారు సమాధానం చెప్పాలన్నారు.
ఈజి మనీ కోసం అలవాటు పడ్డ వారికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ రాజకీయ వేదిక అని టిడిపి నేత వేం నరేందర్ రెడ్డి వేరుగా అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకోవడమే విశ్వసనీయతా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే చంచల్‌గూడ జైలులో సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు విశ్వసనీయత గురించి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు.
పవిత్ర గ్రంథంతో అబద్దాలు చెప్పడం విజయమ్మకు సరికాదని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నో కేసులు వేసి సాక్ష్యాలు లేక ఉపసంహరించుకున్నారన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించినప్పుడు అందర్నీ కొత్తవారినే తీసుకున్నారని టిడిపి నేతలు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. కొత్తవారిని ప్రోత్సహించారే తప్ప వలసలను ప్రోత్సహించలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి తాము విశ్వసనీయత తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపి సిఎం రమేష్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానం పెట్టే తీరును చూసిన తర్వాత తాము నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారు
సంతలో పశువుల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటోదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లా పాదయాత్రలో అన్నారు. కాంగ్రెసు నేతలు పేదల సొమ్మును పందికొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు. లంబాడీలకు న్యాయం చేసి పెద్ద నాయక్‌గా పేరు తెచ్చుకుంటానని, మందకృష్ణ మాదిగలా లంబాడీలు టిడిపికి మద్దతు తెలపాలని కోరారు.
నాయకత్వ లక్షణాలు ఉన్న వారి పేర్లను సూచిస్తే పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు గిరిజనులకు అవకాశం కల్పిస్తామన్నారు. 500 మంది జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. జవాబుదారితనాన్ని ప్రజల్లో తెలుగుదేశం పార్టీయే తీసుకు వచ్చిందన్నారు. కాంగ్రెసు పాలనలో మద్యం ఏరులై పారుతోందన్నారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపుల రద్దు ఫైలుపై సంతకం చేస్తానన్నారు.

రాజశేఖర రెడ్డి పాలన అంతా దోపిడీ, దుర్మార్గ పాలన

నిబద్ధతతో పనిచేస్తున్నా
నేను పార్టీ మారతానా
వైఎస్సార్‌సీపీది మైండ్ గేమ్
కంటతడిపెట్టిన పయ్యావుల కేశవ్

హైదరాబాద్, నవంబర్ 20 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, ఆ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఖండించారు. తాను టీడీపీలో నిబద్ధతతో ఓ సైనికుడిలా పనిచేస్తున్నానని, అలాంటిది తాను పార్టీ ఎలా మారతానని ప్రశ్నించారు. టీడీపీలోనే కొనసాగుతానని, ఏ పార్టీలోకి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీది మైండ్ గేమ్అని, వారు రాష్ట్రంపై మైండ్ గేమ్ ఆడుతున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దుష్ప్రచారం జరుగుతుందని పయ్యావుల కేశవ్ తెలిపారు. జగన్ తండ్రితోనే పోరాటం చేసిన తాను ఆ పార్టీలోకి వెళ్లే సమస్యే లేదని స్పష్టం చేశారు. వ్యూహంలో భాగంగా తనపై అసత్యాలు ప్రచారం చేసి గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు కాణిపాకం వినాయకుడి ఎదుట ప్రమాణం చేసి చెప్పాలని, వైఎస్సార్‌సీపీలోకి నేను వస్తానని వాళ్ళవద్దకు వెళ్లానా, లేక వాళ్ళు నావద్దకు వచ్చారా అన్న విషయం కూడా ప్రజలకు చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు.

తాను ఉదయం వార్తలు చూడగానే కంట నీరు వచ్చిందన్నారు. మీడియా సమక్షంలో కేశవ్ కంటతడి పెట్టుకున్నారు. తనకు పార్టీలో మంచి గౌరవం ఉందన్నారు. ఇలాంటి ప్రచారం తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన, జగన్ అవినీతి పైన పోరాటం సాగిస్తానని చెప్పారు. జగన్ ఆయా జిల్లాల్లో బలమైన నేతలను టార్గెట్ చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల రెండుమూడుసార్లు ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో తాను పార్టీ మారుతాననే ప్రచారం బాధ కలిగించిందన్నారు. ఇదంతా గ్లోబెల్ ప్రచారం అన్నారు. ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం టిడిపికే లాభం అన్నారు. సంక్షోభం తలెత్తిన పలు సందర్భాలలో టిడిపి ఉవ్వెత్తున ఎగిసిందన్నారు.

ఇప్పుడు అలాగే ఉంటుందని కేశవ్ ధీమా వ్యక్తం చేశారు. తాను సంపాదనపై ఆశలేకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనకు ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడిగా పని చేస్తానన్నారు. వ్యూహాత్మకంగా తనను, టిడిపిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన పద్దెనిమిదేళ్ల రాజకీయంలో విలువలతో, సిద్ధాంతాలతో, కార్యకర్తగా, సైనికుడిగా పని చేశానన్నారు. రాజకీయాల్లో కొందరిలా ఆస్తులు సంపాదించుకునేందుకు తాను ప్రయత్నించడం లేదన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు తనను పిలిచి టిక్కెట్ ఇచ్చారన్నారు. 20 ఏళ్లు కష్టపడి పెంచుకున్న ప్రతిష్టను ఒక్క కథనంతో చెడకొట్టారు. తాను జీవితంలో బాధపడిన రోజుల్లో ఇది ఒకటి అన్నారు. సంక్షోభాలు వస్తే టిడిపి మరింత బలోపేతం అవుతుందన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచినంత మాత్రాన ఆ పార్టీలోకి వెళ్లేంత బలహీనుడిని కాదన్నారు. జగన్ తండ్రిపై పోరాటం చేశానని, ఇప్పుడు జగన్ పైన చేస్తానన్నారు. తాను టిడిపి పునాదులపై పెరిగానన్నారు. అలాంటి పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు తన వివరణ తీసుకుంటే బాగుండునని పయ్యావుల చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిని వీడటం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు.

నేను పార్టీ మారతానా,వైఎస్సార్‌సీపీది మైండ్ గేమ్


50వ రోజు మంగళవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు ..


బుధవారం పాదయాత్ర రూట్ మ్యప్...21.11.2012