October 28, 2012

బీసీలకు ఇంత అన్యాయమా?
జనాభాలో సగం ఉన్నా ఒక్కటే పదవా?
కేంద్ర కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నిప్పులు
తెలంగాణకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటన

  కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెనకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం బీసీ జనాభా ఉండగా, ఒకరికే అవకాశం కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. నాలుగు మంత్రి పదవులను కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల శివారు ప్రాంతం నుంచి 'వస్తున్నా..మీ కోసం' పాదయాత్రను చంద్రబాబు ఆదివారం పునః ప్రారంభించారు. 8.8 కిలోమీటర్ల మేర నడిచారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్రకు సిద్ధమైన చంద్రబాబుకు ముఖ్యనేతలు స్వాగతం పలికారు. డప్పుల మోతలు, శ్రేణుల కేరింతల మధ్య యాత్రను ఆయన పునఃప్రారంభించారు. గద్వాల మండలం చిట్టిఆత్మకూర్, ఈదుగోనిపల్లి, పెద్దపాడు గ్రామాల్లో స్థానికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

చిట్టి ఆత్మకూర్ వద్ద మహిళలు ఖాళీ బిందెలు చూపిస్తూ చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. తమకు ఏడాది నుంచి తాగునీరు లేదని వాపోయారు. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ సుజల పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని తండాలకు, పంచాయతీలకు మంచినీటిని సరఫరా చేస్తామని చంద్రబాబు వారికి హామీనిచ్చారు. "అధికారంలోకి వచ్చిన తొలిరోజు తొలి సంతకం రుణ మాఫీ ఫైలుపైనే చేస్తాను. రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపై, మూడో సంతకం ఎన్టీఆర్ సుజల పథకం అమలుపై ఉంటుంద''ని పేర్కొన్నారు. "గద్వాలలో వేదిక కూలడంతో నడుము కండరాలు బిగించుకు పోయాయి.

డాక్టర్లు మూడు రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని దయవల్ల మళ్లీ నడవగలుగుతున్నాను'' అని తెలిపారు. అక్కడే ఉన్న లక్ష్మణ్ అనే నిరుద్యోగ యువకుడి మాటలు చంద్రబాబును ఆకట్టుకున్నాయి. "మీరు తెలంగాణకు మద్దతు ఇస్తే అంతకంటే అదృష్టం లేదు సార్'' అని అన్నారు. తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని వందసార్లు చెప్పామని, మళ్లీ అదే చెబుతున్నానని లక్ష్మణ్‌కు ఆయన స్పష్టం చేశారు. తాగునీటి, నిరుద్యోగ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్లను ఎందుకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం లేదని ప్రశ్నించారు.

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెనకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది,బీసీలకు ఇంత అన్యాయమా? ...27వ రోజు పాదయాత్రలో చంద్రబాబు

.. ఒక రోజు విరామం తరువాత నడక మొదలుపెట్టాను. అడుగేయడం మొదట్లో కష్టంగానే అనిపించింది. కాలు సాగడానికి చాలాసేపు పట్టింది. మా నేతలను, డాక్టర్లను ఒప్పించి బయట పడేసరికి సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. అప్పటికీ యాత్రలో వేగం పెరగకుండా అడుగడుగునా మావాళ్లు కాళ్లకు అడ్డం పడుతూనే ఉన్నారు. "సార్.. యాత్రను ఎలాగూ మీరు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా!. వేగం తగ్గినా ఫరవాలేదు. కిలోమీటర్ తక్కువా ఎక్కువా అనేదీ పట్టింపు కాదు.

చిన్నగానే వెళతాం. ఈ కొద్ది రోజుల పాటైనా మా మాట ఆలకించండి'' అంటున్న మా వాళ్లను కాదని అడుగు పెంచడం ఎప్పటిలా ఈసారి కుదరదనిపించింది. వేదిక కూలి కిందపడినప్పటి నడుం నొప్పి, మధ్య మధ్యలో "నేనున్నా'నని చెబుతోంది. దానికి కండరాల నొప్పులు కలవడం, కాళ్లకు ఒక రోజుపాటు విశ్రాంతి ఇవ్వడం, మధ్యాహ్నం నుంచి యాత్ర మొదలుపెట్టడంతో పెద్ద దూరమేమీ నడవలేకపోయాను. "సార్, కొంతకాలం ఇంతే. మీ నడక దూరం తగ్గించేశాం'' అంటున్న మా వాళ్ల ఆజ్ఞలను నవ్వుతూ పాటించక తప్పుతుందా?

తలాటున జూరాల. కానీ పొలం గానీ, పొలమారిన గొంతు గానీ తడవవు. జూరాలకు ఆరు కిలోమీటర్ల దూరంలోని శెట్టి ఆత్మకూరులో ఆ రైతును కలిసినప్పుడు.. "నేను చెప్పడం ఎందుకు సారు.. ఎదురుగ్గా కనిపిస్తుంటే'' అంటూ నన్ను తన ఆముదం పొలంలోకి తీసుకెళ్లాడు. కష్టాలను ఓర్చుకోవడం, కన్నీరు మింగేయడం అలవాటైనట్టుంది. తనను తాను తమాయించుకోడానికి తాయన్న ప్రయత్నించాడు.

"ఎంత సార్..రెండు తడులు..బంగారం పండేది'' అని చెబుతూనే నాతోపాటు మట్టిరోడ్డుపై కొద్దిదూరం నడిచాడు. ఆ తరువాత కొద్ది దూరంలోనే ఆడపడుచులు ఖాళీ బిందెలతో ఎదురుపడినప్పుడు అడక్కుండానే వాళ్ల సమస్య తెలిసిపోయింది. ఈ జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ప్రకటించిన 'ఎన్టీఆర్ సుజల' సాకారం కోసం నీళ్లింకిన ఇలాంటి ఎన్నో కళ్లు ఎదురు చూస్తున్నాయనిపించింది.

ఒక రోజు విరామం తరువాత నడక మొదలుపెట్టాను. అడుగేయడం మొదట్లో కష్టంగానే అనిపించింది.

చంద్రబాబు 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర సోమవారం ధరూర్ మండలం భీంపురంలో ప్రారంభమవుతుంది. ఎంలోనిపల్లి క్రాస్‌రోడ్, రేవులపల్లి క్రాస్‌రోడ్, మనాపురం క్రాస్‌రోడ్, చిన్నచింతరేవుల ద్వారా నందిమల్ల చేరుకుంటుంది. సుమారు 13 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది.

బాబు పాదయాత్ర - నేటి షెడ్యూల్

ఈద్గాలో అపచారం!
బూట్లు ధరించి షర్మిల ప్రార్థనలు

 
అనంతపురం, అక్టోబర్ 28 : మరో ప్రజా ప్రస్థానం యాత్రలో వైఎస్ షర్మిల ముందు నడుస్తున్నారు. ఆ సమయంలో పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బడన్నపల్లి ప్రాంతం చేరుకుంది. అక్కడికి సమీపంలోనే 'ఈద్గా' ప్రార్థనా ప్రదేశం కనిపించింది. ఆ రోజు బక్రీద్ అన్న విషయం గుర్తుకు వచ్చింది. అంతే.. షర్మిల అడుగులు అటువైపు సాగాయి.

పాదయాత్ర కోసం ధరించిన బూట్లతోనే దువా (ప్రార్థన) ముగించారు. ఆ సమయంలో ఆమె వెంట వైసీపీ పార్టీకి చెందిన పలువురు మైనారిటీ నాయకులు ఉన్నా ఆమెను వారించడానికి ప్రయత్నించలేదు. వివాదం ముదరకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు గానీ, షర్మిలతో ప్రకటన చేసేందుకు గానీ వైసీపీ పార్టీ నేతలు ప్రయత్నించలేదు. తిరుమల పవిత్రతకు ఆమె అన్న, వైఎస్ జగన్ అపచారం తలపెట్టారన్న వివాదం సమసిపోకముందే,

ఆయన సోదరి దాదాపు అలాంటి వివాదంలోనే చిక్కుకోవడం గమనార్హం. నిజానికి, ఏ మతం వారైనా ఏ దేవుడిని ప్రార్థించేటప్పుడు.. చెప్పులు కానీ, బూట్లు కానీ వేసుకోరు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా షర్మిల కొందరు ముస్లింలతో కలిసి ప్రార్థన చేయడాన్ని ముస్లిం మైనారిటీ వర్గాలు తప్పుబట్టాయి. మరోసారి ముస్లిం మనోభావాలను దెబ్బతీయొద్దని టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు లాల్ జాన్ బాషా హెచ్చరించారు.

రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టొద్దన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని బేషరతుగా ఆమె క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేత ఖలీకుల్లాఖాన్ డిమాండ్ చేశారు. కాగా అసలు వివాదమేమీ లేదన్నట్టు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మత అపచారానికి పాల్పడ్డారని వాదించే ప్రయత్నమూ చేశారు. "హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ ఘని సమక్షంలోనే గతంలో చంద్రబాబు బూట్లతోనే ఖురాన్‌ను అందుకున్నారు'' అని జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాలార్‌బాషా చెప్పుకొచ్చారు.

ఈద్గాలో అపచారం! బూట్లు ధరించి షర్మిల ప్రార్థనలు




Chandrababu Naidu Padayatra 28 - 10 - 12


After one day rest, Chandrababu Naidu to resume his Padayatra from today


TV9 - Chandrababu Naidu speaks at 26th day padayatra

27వ రోజు చంద్రబాబు నాయుడు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర టి.వి కవరేజ్..

View 10 Photos Slideshow

chandrababunaidu_vastunnameekosam_photos_28.10.2012

27వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు..(చిన ఆత్మకూరు,మహబుబ్ నగర్ జిల్లా)


28వ రోజు పాదయాత్ర రూట్ మ్యాప్...పత్రికా ప్రకటన..(telugudesam party office)

పాలమూరు నుంచి వలసలు అరికడతాం
ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదో చెప్పండి
అవినీతి ప్రభుత్వంవల్ల పనులు జరగడంలేదు 

  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు నుంచి వలసలను అరికడతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పనులు లేక చాలామంది వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి, ప్రజల కష్టాలు స్వయంగా చూసి, మీకు అండగా ఉండేందుకు పాదయాత్ర ప్రారంభించానని ఆయన పేర్కొన్నారు.

ఒక్క రోజు విరామం తర్వాత జిల్లాలోని శెట్టి ఆత్మకూరు నుంచి ఆదివారం మ«ధ్యాహ్నం చంద్రబాబు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఆ ప్రాంతంలో బాబు అడుగుపెట్టగానే మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గద్వాల ప్రమాదంలో నడుము కండరాలు స్పల్పంగా కదిలాయని, డాక్టర్లు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, అయినా ఒక్కరోజే విశ్రాంతి తీసుకుని మీకోసం వచ్చానని అన్నారు.

జురాల ప్రాజెక్టు పక్కనే ఉన్న గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అంటేనే పేదలు ఎక్కువగా ఉండే జిల్లా అని వ్యాఖ్యానించారు. జురాల ప్రాజెక్టుకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య పౌండేషన్ వేశారని, ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత దీనిని ప్రారంభించారని, నేను (చంద్రబాబునాయుడు) ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుకు రూ. 600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అవినీతి ప్రభుత్వం కారణంగా పనులు జరగడంలేదని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలులేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పావలా వడ్డీ పేరు చెప్పి రూ. 2 వడ్డీ వసూలు చేసి మహిళలను అప్పుల పాలు చేశారని ఆరోపించారు. భవిష్యత్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదో మీరు చెప్పాలని చంద్రబాబు ప్రజలనుద్దేశించి అడిగారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు కొనియాడారు.

( ఆదివారం మధ్యాహ్నం 27వ రోజు పాదయాత్ర ప్రారంభం) పాలమూరు నుంచి వలసలు అరికడతాం- చంద్రబాబు 28.10.2012

అనంతపురంజిల్లా పాదయాత్రలో బూట్లు వేసుకోని నమాజ్..ముస్లింల వేదన..షర్మిలకి ఇతర మతలపై ఏ మాత్రం గౌరవం ఉందో ఈ విడీయెలో తెలుస్తుంది చూడండి.
..

షర్మిల అపచారం...అనంతపురంజిల్లా పాదయాత్రలో బూట్లు వేసుకోని నమాజ్..


టీడీపీని ఏర్పాటు చేసిన తర్వాత గద్వాల పర్యటనకు వచ్చిన సందర్భంగా అప్పటి అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న చైతన్య రథం పట్టణంలోని ప్రధాన రహదారిలో వెళ్తుండగా, వాహనంపైనే ఉన్న ఎన్టీఆర్ గొంతుకు టెలిఫోన్ తీగ అడ్డుపడింది. దీంతో ఆయన వెనక్కి పడిపోయారు. తీగలు తెగిపోయాయి. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. స్థానికులు శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రసంగించిన వేదిక కుప్పకూలిన ఘటనను గతంలో ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాద ఘటనతో పోల్చి చూస్తున్నారు.
టీడీపీని ఏర్పాటు చేసిన తర్వాత గద్వాల పర్యటనకు వచ్చిన సందర్భంగా అప్పటి అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న చైతన్య రథం పట్టణంలోని ప్రధాన రహదారిలో వెళ్తుండగా, వాహనంపైనే ఉన్న ఎన్టీఆర్ గొంతుకు టెలిఫోన్ తీగ అడ్డుపడింది. దీంతో ఆయన వెనక్కి పడిపోయారు. తీగలు తెగిపోయాయి. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. స్థానికులు శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రసంగించిన వేదిక కుప్పకూలిన ఘటనను గతంలో ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాద ఘటనతో పోల్చి చూస్తున్నారు.

అప్పట్లో ఎన్టీఆర్ గద్వాల పర్యటనలో ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

chandrababunaidu_vastunnameekosam_padayatra

చంద్రబాబు నాయుడు కోలుకోవాలని సర్వమత ప్ర్రార్ధనలు...పోటోలు( 27.10.2012)


పరిమితికి మించి జనం వేదికపైకి రావడం, తోపులాట జరగడమే శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రసంగించిన వేదిక కూలడానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి, 16్ఠ30 సైజులో వేదికను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ సైజు వేదికపై 30 నుంచి 40 మంది వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ, శుక్రవా రం రాత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత కొంతమంది స్థానిక నా యకులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు.

అప్పటికే వేదిక కిక్కిరిసి ఉండటంతో ఎమ్మెల్యేల వ్యక్తిగత భద్రత సిబ్బంది ఇద్దరు, ముగ్గురు కిందపడిపోయారు. మిగతా సిబ్బంది అప్రమత్తమై వేదికపైకి వస్తున్న వారిని అడ్డుకున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. అదే సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వేదిక మెట్లపై నుంచి కాకుండా, వెనక నుంచి, పక్కల నుంచి పైకి ఎక్కారు.

దాంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన జరిగే సమయానికి వేదికపై సుమారు 70 నుంచి 80 మంది ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో నారాయణరెడ్డిని కలెక్టర్ గిరిజా శంకర్ ఆదేశించారు.

వేదిక కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో నారాయణరెడ్డికి కలెక్టర్ గిరిజా శంకర్ ఆదేశం