October 28, 2012

వేదిక కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో నారాయణరెడ్డికి కలెక్టర్ గిరిజా శంకర్ ఆదేశం


పరిమితికి మించి జనం వేదికపైకి రావడం, తోపులాట జరగడమే శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రసంగించిన వేదిక కూలడానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి, 16్ఠ30 సైజులో వేదికను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ సైజు వేదికపై 30 నుంచి 40 మంది వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ, శుక్రవా రం రాత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత కొంతమంది స్థానిక నా యకులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు.

అప్పటికే వేదిక కిక్కిరిసి ఉండటంతో ఎమ్మెల్యేల వ్యక్తిగత భద్రత సిబ్బంది ఇద్దరు, ముగ్గురు కిందపడిపోయారు. మిగతా సిబ్బంది అప్రమత్తమై వేదికపైకి వస్తున్న వారిని అడ్డుకున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. అదే సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వేదిక మెట్లపై నుంచి కాకుండా, వెనక నుంచి, పక్కల నుంచి పైకి ఎక్కారు.

దాంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన జరిగే సమయానికి వేదికపై సుమారు 70 నుంచి 80 మంది ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవో నారాయణరెడ్డిని కలెక్టర్ గిరిజా శంకర్ ఆదేశించారు.
No comments :

No comments :