September 8, 2013

ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గం ఇన్ చార్జి దేవినేని ఉమా సహా టీడీపీీ నాయకులు పూజలో పాల్గొన్నారు.

వినాయక పూజలో పాల్గొన్న చంద్రబాబు

వైఎస్ మరణంపై బాబు సంచలన వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపిన ట్లయింది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ మరణంపై బాబు లేవనెత్తిన ప్రశ్నలు ప్రజల్ని మరోమారు ఆలోచింపజేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఇరకాటంలో పడేసే సూచనలు కొ్టచ్చినట్లు అగుపిస్తున్నాయి. సెప్టెంబర్ 2, 2009న రాజశేఖర్‌రెడ్డి సీఎం ె దాలో హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలో ఏర్పా టు చేసిన రచ్చబండలో పా్గనేందుకు వెళ్లిన వైఎస్ ెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విధితమే. వైఎస్ మరణంపై అప్పట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైఎస్ మరణం వెనక కుట్ర దాగి ఉందనీ వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, సన్నిహిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగానే తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. రిలయన్స్ హస్తం ఉందంటూ కూడా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ కంపెనీలపై దాడులు కూడా జరిగాయి. వైఎస్ కుమారుడు జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా వైఎస్ ెలికాప్టర్ ప్రమాదంపై తమకు కూ డా అనుమానాలున్నాయనీ విచారణ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు, కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలకు లేఖలు కూడా రాశారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్‌రెడ్డి మధ్య ఆగాధం పెరగడం...జగన్ పార్టీకి దూరం కావడం...ఆయనపై సిబిఐ కేసులు నమోదు చేయడం...అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.

2012 జూన్ నెలలో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోమారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పా్గన్న వైఎస్. విజయమ్మ, షర్మిల తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం వెనక తమకు ఇప్పటికీ అనుమానం ఉందనీ, దీని వెనక సోనియాగాంధీ హస్తం ఉందంటూ ప్రచారం కూడా చేశారు. అయితే, ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందడం కోసమే వైఎస్ విజయమ్మ ప్రచారం చేసిందన్న వాళ్లూ లేకపోలేదు. అయితే, తాజాగా వైఎస్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వైఎస్ మర ణం ఇప్పటి వరకు ఎలాంటి కామెంటు చేయని చం ద్రబాబు ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పేరిట నిర్వహి స్తున్న బస్సుయాత్రలో ఆదివారం నాడు కృష్ణాజిల్లా లో పర్యటిస్తున్న బాబు వైఎస్ మరణంపై చేసిన వ్యా ఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బాబు సంధించిన ప్రశ్నలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో వైఎస్ ఆర్ మరణం వెనక కుట్ర దాగి ఉందనీ, వైఎస్ మరణానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హస్తం ఉందనీ మాట్లాడిన వైఎస్‌ఆర్ పార్టీ నేతలు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదనీ ప్రశ్నించారు. వైఎస్ మరణంపై అనుమానాలున్నప్పుడు, ఈ కుట్ర వెనక సోనియాగాంధీ ఉందన్నప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టును ఎందుకు ఆశ్ర యించడం లేదనీ బాబు మాట్లాడిన మాటలు ఇప్పు డు అంతటా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లాలూచీపడ్డారా? లాలూచీ పడటంతోనే కోర్టుకు వెళ్లడం లేదా? అని బాబు సూటిగా ప్రశ్నించారు. వైఎస్ మరణంపై అనుమానాలున్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు న్యాయపోరాటం చేయకపోవడా న్ని ఏమనుకోవాలో తనకు అర్థం కావడం లేదన్నారు. న్యాయస్థానాన్ని ఆశయ్రిస్తే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కోర్టుకు వెళ్లడం ద్వారా వైఎస్ మరణం వెనక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా ఉందనీ తేలితే ఆమెకు శిక్ష పడుతుందనీ, లేదని తేలితే రాజకీయంగా లబ్ది పొందాలని చూసిన వారికి శిక్ష పడుతుందన్నారు. వైఎస్ మరణంపై కుట్ర దాగి ఉంటే ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించాల్సిందేననీ అన్నారు. బాబు చేసిన వ్యాఖ్యలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని డిఫెన్స్‌లో పడేసే విధంగా ఉన్నాయనీ రాజకీయ పరిశీలకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ పార్టీ నేతల స్పందన ఎలా ఉంటుందనే దానిపై అంతటా వాడి వేడిగా చర్చ సాగుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. వైఎస్ మరణంపై మొదటి నుంచీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులలలో అనుమానం వుంది. ఎందుకంటే, ప్రమాదానికి గురైన ెలికాప్టర్‌లో ఉండే వాక్‌పిక్ రికార్డర్‌లో ఏముందో ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. దీనితో వైఎస్ మరణంపై విచారణ చేపట్టాలనీ ఆ పార్టీ, వైఎస్ కుటుంబ సభ్యులు కోరడంలో ఎలాంటి తప్పుబట్టాల్సింది లేదు. మధ్య మధ్యలో రిలయన్స్ కంపెనీ యజమానులపై, సోనియాగాంధీపై కూడా అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, చంద్రబాబు చెప్పినట్లుగా న్యాయస్థానాన్ని మాత్రం ఆశయ్రించ లేకపోయారు. బాబు చెప్పినట్లుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాస్తవాలు ఏమిటో బయటపడతాయి. బాబు చెప్పినట్లుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సరేసరి. లేదంటే భవిష్యత్ రాజకీయ ‘అవసరాల’ కోసమే వైఎస్‌ఆర్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో లాలూచీ పడ్డారనీ అందరూ అనుకునే అవకాశం ఉంది. చూడాలి మరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేస్తారో?!

వైఎస్ మరణంపై బాబు లేవనెత్తిన ప్రశ్నలు ప్రజల్ని మరోమారు ఆలోచింపజేస్తున్నాయి.

" వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభనిర్విఘ్నమ్ కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.."

ఓం గం గణపతయే నమః
విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
మీ కుటుంబ సభ్యులకు సదా,
సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
సుఖసంతోషాలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

మిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు...........


మిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు..

సీమాంధ్రలో 60 లక్షల ఎకరాల ఆయకట్టు వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతోంది. రాష్ట్రాన్ని విడదీస్తే నీరు అందక ఏడారిగా మారిపోతుందని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని జిల్లా తెలుగురైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, రైతులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విన్నవించారు. ఆత్మగౌరవ యాత్రలో ఆయనను కలసి.. విభజిస్తే ఇక్కడ ఉత్పన్నమయ్యే సమస్యల గురించి వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కించి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో పూర్తిస్థాయిలో నీరు ఉన్నా ఇప్పటికీ ప్రకాశం బ్యారేజీకి నీరు రాని పరిస్థితి ఉందన్నారు. వర్షాలు పడుతున్నా ఇప్పటికీ 30 శాతం వరినాట్లు పడలేదని చంద్రబాబుకు వివరించారు. అలాగే కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులను పూర్తి చేసి, చివరి ప్రాంతాలకు సాగునీరు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబను కోరారు. రైతులకు పంట బీమా, మిర్చి, ప్రత్తికి గిట్టుబాటు ధరను కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మీకు న్యాయం చేస్తాను: చంద్రబాబు
రైతులు విన్నపాలపై చంద్రబాబు స్పందిస్తూ ఒకరికి న్యాయం చేయమం టే మరోకరికి పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏధైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటారు. కానీ కాంగ్రెస్ ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందున్నారు. సీమాం«ద్రుల హక్కుల్లో నీటి సమస్య కూడా ఒక భాగమన్నారు. మీ సమస్యలన్నింటిని పరిష్కరించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
భక్షి సిఫార్సులపై
చంద్రబాబుకు వినతి పత్రం
కో ఆపరేటివ్ సొసైటిల మనుగడ ప్రశ్నార్థకంగా మారే డాక్టరు ప్రకాష్ బక్షి సిఫార్సులను వ్యతిరేకించి రైతాంగానికి న్యా యం చేయాలని చలసాని ఆంజనేయులు, చంద్రబాబుకు సూరంపల్లిలో వినతిపత్రాన్ని అందజేశారు. ఆస్తులు, అప్పులు, షేరుధనం, బదలాయించడం వల్ల వివిధ సంఘాల నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. రైతుల కోసం గ్రామీణ స్థాయిలో ఏర్పడిన సంఘాలు ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంది. బక్షి కమిటీ నివేదిక అమలు నిలుపుదలకు కృషిచేయాలని వినతి పత్రంలో కోరారు.

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారే

తెలుగువారి ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి లక్షలకోట్ల రూపాయలు దోచుకున్నారని మా జీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, వైసీపీలపై ధ్వ జమెత్తారు. నూజివీడు మండలంలోని రావిచర్ల, పాతరావిచర్ల, బోర్వంచ గ్రామాల్లో శనివారం సాయంత్రం ఆయన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్రలో పాల్గొన్నారు. తప్పుచేసినా, చేయక పోయినా జైలుపాలు అయితే ఆత్మాభిమానం ఉన్న మనిషి సిగ్గుతో చచ్చిపోతారని, కాని ప్రస్తుత నాయకులు కొందరు అదో ఘనకార్యంగా చెప్పుకోవడం చూస్తే జాతిసొత్తు దోచుకున్నా పర్వాలేదనే ఉందన్నారు. సత్యం రామలింగరాజు ఏ తప్పుచేయకపోయినా తన సొంత సంపదనే వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చివరికి బ్యాంకులను మోసం చేయలేక తప్పు జరిగిందంటూ ఒప్పుకొని జైలుపాలు అయ్యాడన్నారు. జాతిసంపదను దోచుకోకపోయినా నేడు తలెత్తుకుని బయట తిరగలేని పరిస్థితిలో ఆయన ఉండగా, వైసీపీ నేత జగన్ కోట ్లరూపాయలు దోచుకొని, మహానేతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సంపద సృష్టించేందుకు అవిరళ కృషిసల్పి తాను జాతి సంపదను పెంచితే తదనంతరం వచ్చిన కాంగ్రెస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇప్పు డు తమ రాజకీయ అవసరాల కోసం తెలుగుజాతిని రెండుగా చీల్చేందుకు కుటిల కుయుక్తులు పన్నుతున్నారన్నా రు. రాష్ట్ర విభజన జరిగితే సాగునీరు రాదని, ఉద్యోగాలు ఉండవన్నారు. ప్రజలు అనేక భయాలతో రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారని, ఫలితంగానే తెలుగుజాతి ఆత్మగౌరవయా త్ర చేపట్టాల్సి వచ్చిందన్నారు. తాను ఎరుగని అధికారం లేదని, అధికారం కోసం యా త్రలు చేపట్టలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి, వారిలో స్థైర్యం నిం పేందుకే ఈ యాత్ర చేపట్టాల్సి వచ్చిందన్నారు.
స్థానిక సమస్యలకు పెద్దపీట
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్రలో ఆద్యంతం స్థానిక స మస్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. రావిచర్ల, పాతరావిచర్ల, బోర్వంచ గ్రా మాల్లో పర్యటన సాగగా, స్థానిక సమస్యలను పేర్కొంటూ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. రావిచర్ల, పాతరావిచర్ల గ్రామాలు ఈనాం గ్రా మాలుగా ఉండటంతో వాటిని రెవె న్యూ గ్రా
మాలుగా మార్చి వ్యవసాయ భూములకు పట్టాలు ఇస్తానని, రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు.
జోరు వర్షంలోనూ
ఎదురు చూపులు
జోరువానలోనూ అభిమాన నేత యాత్రకు స్వాగతం పలికేందుకు మహిళలు, గ్రామస్తులు బారులు తీరారు. రావిచర్ల అడ్డరోడ్డు వద్ద తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు చంద్రబా బు రాకకోసం వేచి చూశారు. మూడు గంటలు ఆలస్యంగా వచ్చినా జోరువర్షంలోనూ తమ అభిమాన నేత కోసం పార్టీ అభిమానులు, మహిళలు, కార్యకర్తలు ఎదురుచూశారు.
 

కాంగ్రెస్, వైసీపీ నేతలకు సిగ్గు లేదు

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నారాచంద్రబాబు నాయుడు ప్రచారరథంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా పొగలు లేచి కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు శనివారం రాత్రి నూజివీడు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బస్సులోనే బస చేశారు.
ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో యాత్రకు బయలుదేరటానికి సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు ప్రసంగించే ప్రచార రథంలో మైక్‌లను సరిచేస్తుండగా షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి పొగలు లేచాయి. దీంతో క్యాంపులో కలకలం రేగింది. దానికి సమీపంలోనే మరోబస్సులో చంద్రబాబు విడిది చేసి ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే పొగలు లేచాయని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే వాహనంలో ఏర్పడిన లోపాన్ని టెక్నీషియన్లు సరిచేశారు. అనంతరం చంద్రబాబు ప్రచారథం ఎక్కి ఆత్మగౌరవయాత్రకు బయల్దేరి
వెళ్ళారు.

చంద్రబాబు ప్రచారరథానికి షార్ట్‌సర్క్యూట్

సీమాంధ్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామాచేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని టీడీపీ నేత, మాజీ మంత్రి
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండు చేశారు. తిరుమలలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభను దిగ్విజయంగా నిర్వహించిన ఏపీ ఎన్జీవోల జేఏసీ చైర్మన్ అశోక్‌బాబును అభినందిస్తున్నానన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు పునరాలోచించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పాలనను గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని సోమిరెడ్డి సూచించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి జానారెడ్డి తమ అనాలోచిత ప్రసంగాలతో రాష్ట్రాన్ని చిందరవందరగా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమంలోపాల్గొనండి:సోమిరెడ్డి

తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి సమైక్య రాష్ట్రం యధాతధంగా కొనసాగడానికి ఒక సలహా ఇస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తే మూడు రోజులలో సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెబుతున్నారు. సీమాంధ్ర ఉద్యమంపై కేంద్ర మంత్రులకు,ఎమ్.పిలకు చిత్తశుద్ది లేదని ఆయన అన్నారు.తెలుగు ప్రజలను నిలువుగా చీల్చడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన అంటున్నారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచన రహితంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.తాము పార్లమెంటులో చేసిన ఆందోళనకు సీమాంధ్ర ఎమ్.పిలు తగు సహకారం అందించలేదని, వారిని చరిత్ర క్షమించదని ఆయన అన్నారు.

సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తే మూడు రోజులలో సమస్య పరిష్కారం : సుజనా చౌదరి


రాజకీయ లబ్ధి కోసం తెలుగుజాతి మధ్య అగ్గి రాజేసింది కాంగ్రెస్ పార్టీయేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆత్మ గౌరవ యాత్రలో భాగంగా కృష్టా జిల్లా, నూజివీడులో ఏర్పాటు చేసి సభలో చంద్రబాబు మాట్లాడుతూ యుపీఏ పాలన తుగ్లక్ పాలనలా ఉందని అన్నారు. ఇడుపులపాయ వియమ్మకు, ఇటలీ సోనియాకు లంకె కుదిరిందని, రాష్ట్రంలో చిచ్చు పెట్టారని, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్, డీఎన్ఏ ఒక్కటేనని ఆయన విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం చూసి కాంగ్రెస్ ఓర్వలేక కుట్ర రాజకీయాలు మొదలుపెట్టిందని చంద్రబాబు విమర్శించారు. మన పొట్టగొట్టిన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అసలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ, సీఎం కావాలన్న జగన్ కలలు కలలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టవద్దని చంద్రబాబు సూచించారు.

కాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం నాటికి ఎనిమిదవ రోజుకు చేరింది. కృష్ణా జిల్లాలో మూడో రోజు కొనసాగుతోంది.

కాంగ్రెస్సే అగ్గి రాజేసింది.. యుపీఏ పాలన తుగ్లక్ పాలన కాంగ్రెస్, వైసీపీ డీఎన్ఏ ఒక్కటే


మేం అభివృద్ధి చేస్తే...వైస్ దోచుకున్నారు : చంద్రబాబు

తెలంగాణాకు బీజం వేసింది రాజశేఖర్ రెడ్డేనని అన్నారు. తెలుగుదేశంను దెబ్బతీయడానికి దొంగమార్గాలు తప్ప రాజమార్గంలో వెళ్ళడం తనవల్ల కాదని, తొలుత సోనియా దగ్గరకు ఎమ్మెల్యేలను పంపాడు, తరువాత 2004 లో సోనియాతో టీఆర్ఎస్ కండువా వేయించి, సోనియాతో జై తెలంగాణా అని చెప్పించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టించాడన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పూటకో మాట ప్రజలకు చెబుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ పార్టీ జైలు నుంచే నడుస్తోందన్నారు. జైల్లో మాట
లు, బయట మూటలు, చెప్పేది మాత్రం నీతులు అని విమర్శించారు. ఎన్టీఆర్‌తో పాటు తాను నిజాయితీగా వ్యవహరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచామన్నారు. సింగపూర్ అభివృద్ధి చెందటానికి 50 ఏళ్ళుపడితే, తాను హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా తొమ్మిది ఏళ్ళలో మార్చానన్నారు. జగన్ ఆరోగ్యం ఎలా ఉందని రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అడిగారని ఆయన తల్లి విజయలక్ష్మి స్వయంగా చెప్పారని, ఇది దేశద్రోహులను, నేరగాళ్ళను ఈ దేశ అత్యున్నత అధికార వ్యక్తులు సమర్ధించటం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. సాక్షాత్తు సీబీఐ 45 వేల కోట్లు ఆర్ధిక నేరం జరిగిందని అభియోగం మోపిన వ్యక్తుల పట్ల ఈ ఇద్దరు నాయకులు శ్రద్ధచూపటం దేనికి సంకేతం అన్నారు. కాంగ్రెస్, వై.సి.పి రెండూ కలిసి నాటకం ఆడుతున్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోందన్నారు.దేశద్రోహులన్న ఉగ్రవాదులను ఉరితీశారు. జగన్ లాంటి ఫ్యాక్షనిస్టులు, ఆర్ధిక ఉగ్రవాదులకు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జైలులో రాజభోగాలు అందించటం సిగ్గు చేటన్నారు.

తెలంగాణకు బీజం వేసింది వైఎస్సే