September 8, 2013

కాంగ్రెస్, వైసీపీ నేతలకు సిగ్గు లేదు

తెలుగువారి ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి లక్షలకోట్ల రూపాయలు దోచుకున్నారని మా జీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, వైసీపీలపై ధ్వ జమెత్తారు. నూజివీడు మండలంలోని రావిచర్ల, పాతరావిచర్ల, బోర్వంచ గ్రామాల్లో శనివారం సాయంత్రం ఆయన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్రలో పాల్గొన్నారు. తప్పుచేసినా, చేయక పోయినా జైలుపాలు అయితే ఆత్మాభిమానం ఉన్న మనిషి సిగ్గుతో చచ్చిపోతారని, కాని ప్రస్తుత నాయకులు కొందరు అదో ఘనకార్యంగా చెప్పుకోవడం చూస్తే జాతిసొత్తు దోచుకున్నా పర్వాలేదనే ఉందన్నారు. సత్యం రామలింగరాజు ఏ తప్పుచేయకపోయినా తన సొంత సంపదనే వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చివరికి బ్యాంకులను మోసం చేయలేక తప్పు జరిగిందంటూ ఒప్పుకొని జైలుపాలు అయ్యాడన్నారు. జాతిసంపదను దోచుకోకపోయినా నేడు తలెత్తుకుని బయట తిరగలేని పరిస్థితిలో ఆయన ఉండగా, వైసీపీ నేత జగన్ కోట ్లరూపాయలు దోచుకొని, మహానేతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సంపద సృష్టించేందుకు అవిరళ కృషిసల్పి తాను జాతి సంపదను పెంచితే తదనంతరం వచ్చిన కాంగ్రెస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇప్పు డు తమ రాజకీయ అవసరాల కోసం తెలుగుజాతిని రెండుగా చీల్చేందుకు కుటిల కుయుక్తులు పన్నుతున్నారన్నా రు. రాష్ట్ర విభజన జరిగితే సాగునీరు రాదని, ఉద్యోగాలు ఉండవన్నారు. ప్రజలు అనేక భయాలతో రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారని, ఫలితంగానే తెలుగుజాతి ఆత్మగౌరవయా త్ర చేపట్టాల్సి వచ్చిందన్నారు. తాను ఎరుగని అధికారం లేదని, అధికారం కోసం యా త్రలు చేపట్టలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి, వారిలో స్థైర్యం నిం పేందుకే ఈ యాత్ర చేపట్టాల్సి వచ్చిందన్నారు.
స్థానిక సమస్యలకు పెద్దపీట
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్రలో ఆద్యంతం స్థానిక స మస్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. రావిచర్ల, పాతరావిచర్ల, బోర్వంచ గ్రా మాల్లో పర్యటన సాగగా, స్థానిక సమస్యలను పేర్కొంటూ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. రావిచర్ల, పాతరావిచర్ల గ్రామాలు ఈనాం గ్రా మాలుగా ఉండటంతో వాటిని రెవె న్యూ గ్రా
మాలుగా మార్చి వ్యవసాయ భూములకు పట్టాలు ఇస్తానని, రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు.
జోరు వర్షంలోనూ
ఎదురు చూపులు
జోరువానలోనూ అభిమాన నేత యాత్రకు స్వాగతం పలికేందుకు మహిళలు, గ్రామస్తులు బారులు తీరారు. రావిచర్ల అడ్డరోడ్డు వద్ద తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు చంద్రబా బు రాకకోసం వేచి చూశారు. మూడు గంటలు ఆలస్యంగా వచ్చినా జోరువర్షంలోనూ తమ అభిమాన నేత కోసం పార్టీ అభిమానులు, మహిళలు, కార్యకర్తలు ఎదురుచూశారు.