October 3, 2013


అన్నీ వై.కాంగ్రెస్ కు ముందే తెలుసు-కేశవ్

సీమాంద్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామా చేసి బయటకు రావాలని, క్యాబినెట్ లో నోట్ చించివేసి బయటకు రావాలని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.లగడపాటి రాజగోపాల్ కొద్ది రోజుల క్రితం కూడా ఇప్పట్లో విభజన జరగదని అన్నారని, ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని అన్నారు.సీమాంధ్ర మంత్రులు వైదొలగకపోతే ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లతో ఒప్పందం కుదుర్చుకుని విబజన చేస్తున్నదని ఆయన ఆరోపించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ముందుగానే తెలిసి ఈ రోజు దీక్షలకు దిగారని కేశవ్ ఆరోపించారు.ప్రతి అడుగు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ముందుగానే తెలుస్తున్నాయని, టెన్ జనపధ్ నుంచే ఈ పార్టీ ప్రధాన కార్యాలయం ఉందని ఆయన అన్నారు.సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారో వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.

సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారు.

సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ ను ఎందుకు కలిశారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్ ఏ హోదాలో కలిశారని ఆయన అన్నారు. సిబిఐ ద్వారా ఎవరిపై కేసులు పెట్టదలిచారు?లేదా ఎవరిని వదలిపెట్టదలిచారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్ధులను వేధించడానికి,సిబిఐని, ఆదాయపన్ను శాఖ అదికారులను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఆంద్రప్రదేశ్ లో జగన్ కేసులో పది ఛార్జీషీట్ లు వేయాలని చెప్పిన సిబిఐ,బెయిల్ ఇవ్వాలనుకున్న వెంటనే ఒక మెమో ఫైల్ చేయడం,కొన్ని కంపెనీలకు సంబందించి మొదట తప్పు ఉందని చెప్పినా, ఆ తర్వాత లేవని అనడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. చార్జీషీట్ లలో రాసిన విషయాలకు విరుద్దంగా ఇలా చెబుతారా అని అన్నారు. ఏ కోర్టులో కూడా దర్యాప్తు పూర్తి అయిందని ఎక్కడా చెప్పరని, అలాంటిది కేసును నిర్వీర్యం చేసే విదంగా దర్యాప్తు పూర్తి చేశారని చంద్రబాబు అన్నారు.అందువల్లనే జగన్ డి.ఎన్..ఎ ,మాది ఒకటేనని దిగ్విజయ్ సింగ్ అన్నారని,వీరప్ప మొయిలీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని అన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

సిబిఐ ద్వారా ఎవరిపై కేసులు పెట్టదలిచారు?