February 5, 2013

న్యాయమూర్తులనూ.. బెదిరిస్తున్నారు!
పత్రికను అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్
మీడియాపైనా దాడులు
రాష్ట్ర మంతటా పులివెందుల రాజకీయం
విజయవాడ పాదయాత్రలో బాబు ధ్వజం
కేసుల మాఫీ కోసమే రాజకీయాలు
ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోయేవాడే
అధికారంలోకి వస్తే పది సిలిండర్లు ఇస్తా
గ్యాస్‌ను ఆధార్‌కు లింక్ చేస్తే ఉద్యమమే..
నేడు గుంటూరుకి 'మీ కోసం'

న్యాయ వ్యవస్థపై పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) దాడి చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. పత్రికను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నాయకులు కోర్టులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను బెదిరించడం ద్వారా తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు చూస్తున్నారంటూ.. హైకోర్టు జడ్జి ఉదంతంలో జగన్ పత్రికకి, దాని వ్యవస్థాపకుడికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలంక వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రామలింగేశ్వరనగర్, గీతానగర్, రాణిగారితోట ప్రాంతాల గుండా యాత్ర సాగించారు.

ఈ సందర ్భంగా రాణిగారితోటలోని చలసాని నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. వైసీపీ నేతలు..తమ పార్టీలో చేరని వారిని బెదిరించటమే కాకుండా, వాస్తవాలను బహిర్గతం చేసే మీడియాను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. సహకార సంఘాల ఎన్నికలలో ఆ పార్టీ సత్తా తేలిపోయిందని ఎద్దేవా చేశారు. "రేపు తల్లి కాం గ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు కలిసిపోయినా ఆశ్చర్యం లేదు. కేసుల మాఫీ కోసమే ఈ రాజకీయమంతా. రాష్ట్రమంతా పులివెందుల మార్కు రాజకీయాలు చేస్తున్నారు'' అని నిప్పులు చెరిగారు.

తన రాజకీయ చరిత్రలోగానీ, అధికారంలో ఉండగా గానీ ఏనాడూ పత్రిక కానీ, టీవీ కానీ పెట్టాలన్న ఆలోచన చేయలేదన్నారు. తనపై వైసీపీ.. సుప్రీం కోర్టుకు కూడా వెళ్లిందని, తప్పు చేయలేదు కాబట్టే కేసును తీసుకోలేదన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో గ్యాస్ నిక్షేపాలున్నా.. బయటకు వెళ్లిపోతున్నాయే తప్ప రాష్ట్రంలోని మహిళల వంటగ్యాస్ కష్టాలు మాత్రం తీరటం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 10 సిలిండర్లు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆధార్ కార్డులతో రేషన్, గ్యాస్, పెన్షన్‌లకు లింకు పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడుతుందని చెప్పారు.

నేడు గుంటూరుకి 'మీ కోసం..'
కృష్ణా జిల్లాలో పాదయాత్ర బుధవారం ఉదయంతో ముగియనుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన బస్టాండ్ సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు చేరుకుంటారు. ప్రకాశం బ్యారేజీ ఆవల చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి గుంటూరు జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటల మధ్య సమయంలో జిల్లాలోకి అడుగుపెట్టవచ్చునని భావిస్తున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సీతానగరం నుంచి ప్రారంభయ్యే చంద్రబాబు పాదయాత్ర ఐదో నెంబరు జాతీయ రహదారి వెంట కొనసాగుతుంది. మంగళగిరితో పాటు పొన్నూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో సుమారు 150 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర జరుగుతుంది. ఇంచుమించు 15 రోజులకు పైగా సాగే యాత్రలోభాగంగా, 55 గ్రామాలు, నాలుగు పురపాలక సంఘాలు, గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని 30 డివిజన్లలో నడుస్తారు. రెండువేల కిలోమీటర్ల మైలురాయిని ఈ జిల్లాలోనే అధిగమిస్తారు. ఎనిమిది నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

ఈసారి సాక్షి టార్గట్?

లోకేశ్ హాట్ హాట్ ట్వీట్‌హైదరాబాద్, ఫిబ్రవరి 5 : ట్విట్టర్‌లో తన సంక్షిప్త సందేశాలతో అప్పుడప్పుడూ రాజకీయ వేడి పుట్టిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ మంగళవారం జగన్ మీడియాపై హాట్ హాట్‌గా ట్వీట్ చేశారు. జస్టిస్ రమణ కేసులో సుప్రీం కోర్టు బెంచి జగన్ పత్రిక సాక్షిని తప్పుబట్టడాన్ని లోకేశ్ పరోక్షంగా ఈ ట్వీట్‌లో ప్రస్తావించారు. 'వేధించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, బురద చల్లడానికి సాక్షిని ఒక పనిముట్టుగా వాడుకొంటున్నారని ఇటీవల తన తీర్పులో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సాక్షీ...మీ తర్వాతి వ్యాసం సుప్రీం కోర్టు బెంచి పైనేనా' అని ఆయన ట్వీట్ చేశారు.

ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోయేవాడే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర మంగళవారం నాటికి 127వ రోజుకు చేరుకుంది. ఈరోజు పడమటలో యాత్రను ప్రారంభించారు. రామలింగేశ్వరనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శనివారం రాత్రి చంద్రబాబు యాత్ర నగరంలోకి ప్రవేశించింది. యాత్ర ప్రారంభం నుంచే జనం ఊహించని విధంగా తరలి వచ్చారు.

తొలుత పశ్చిమ నియోజకవర్గంలో భారీగా జనం జేజేలు పలికారు. ఆదివారం 'సెంట్రల్', సోమవారం 'తూర్పు' నియోజకవర్గంలోని కొంత భాగంలో అదే స్పందన కనిపించింది. ముఖ్యంగా పాతబస్తీలోనూ జనం బ్రహ్మరథం పట్టారు. సోమవారం సిద్ధార్థ సెంటర్ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు రెండు వైపులా జనం పోటెత్తటంతో 3 కిలోమీటర్ల దూరాన్ని దాదాపుగా నాలుగున్నర గంటల పాటు చేరుకోవాల్సి వచ్చింది. చుట్టగుంట శారదా కళాశాల నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్ర రావిచెట్టు సెంటర్ మీదుగా భారీ జనసందోహంతో బయలుదేరింది. సిద్ధార్థ సెంటర్‌కు వచ్చేసరికి .. అశేష జనం తరలివచ్చింది.

రామలింగేశ్వర్‌నగరలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాబు


గుంటూరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర తేదీ, సమయం ఖరారైంది. ఈ నెల ఐదో తేదీ రాత్రికే తాడేపల్లి మండలంలోని సీతానగరానికి చేరుకొని బస చేస్తారని పార్టీ వర్గాలు భావించినప్పటికీ విజయవాడలో షెడ్యూల్ ఆలస్యం కావడం వల్ల జిల్లాలోకి ప్రవేశించే తేదీ ఈ నెల ఆరుకు మారింది. టీడీపీ రాష్ట్ర నాయకుడు కంభంపాటి రామ్మోహన్‌రావు సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి వచ్చి నాయకులతో మంతనాలు జరిపినఅనంతరం చంద్రబాబు ఆరో తేదీ ఉదయం 11 గంటలకు ప్రకాశం బ్యారేజ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారని ప్రకటించారు. గత నెల 26వ తేదీనే చంద్రబాబు జిల్లాలోకి అడుగు పెడతారని నాయకులు తొలుత అంచనా వేశారు. అయితే కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబుకు కాలు నొప్పి తిరగపెట్టడంతో షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది.

కాలు నొప్పి కారణంగా పాదయాత్ర రోజుకు 10 కిలోమీటర్ల లోపే కొనసాగుతోంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ జిల్లా నాయకులు చంద్రబాబు ఈ నెల ఆరో తేదీ ఉదయం 11 గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తారని తెలిపారు. గత వేసవికాలంలో వాన్‌పిక్ భూముల్లో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇంచుమించు తొమ్మిది నెలల తర్వాత జిల్లాకు వస్తుండటం, 15 రోజుల పాటు పాదయాత్ర చేయనుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర నేతలు సమావేశమౌతూ పాదయాత్రకు జనసమీకరణపై చర్చలు కొనసాగిస్తున్నారు.

పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని 55 గ్రామాలు, నాలుగు పురపాలక సంఘాలు, గుంటూరు నగరపాలకసంస్థలోని 30 డివిజన్లలో పర్యటిస్తారు. సొసైటీ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను గెలుచుకొన్న నేపథ్యంలో సహకార విజయాలతో చంద్రబాబుకు జిల్లాలో ఘనస్వాగతం పలుకుతామని నాయకులు చెబుతున్నారు.

గుం'టూరు'కు వచ్చేస్తున్నా..మీ కోసం

గుంటూరు: రైతులు, పేదప్రజలే తన ఊపిరిగా చంద్రబాబు కొనసాగిస్తో న్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు ప్రజల నుండి అపూర్వస్పందన లభిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే పాదయాత్ర ద్వారా ఇంతమంది పేద ప్రజలను కలిసిన మరే నాయకుడు లేడన్నారు. కాంగ్రెస్, వైసిపిలు ప్రజలను కష్టాల్లోకి నెట్టాయన్నారు.కాంగ్రెస్ ప్రభు త్వం అంతర్గత కుమ్ములాటలతో ర్రాష్టా న్ని సర్వనాశనం చేస్తోందన్నారు. పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించి తొమ్మి దేళ్ల వుతున్నా ఇంతవరకూ పూర్తయ్యే పరిస్థితి కనపడలేదన్నారు. జిల్లాలో మంత్రులు అలంకారప్రాయంగా ఉండి ప్రజల ప్రయోజనాలను కాలరాస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు, నిత్యావసర వస్తువుల అధిక ధరలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మహిళలందరూ చంద్రబాబు పాదయాత్రలో పాల్గొని ఘ నస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేశం నాయకులు మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహనరావు, ఎమ్మె ల్యేలు యరపతినేని శ్రీనివాసరా వు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, తెనాలి శ్రావణ్‌కుమార్, యాగంటి దుర్గారావు, చిట్టాబత్తిన చిట్టిబాబు పాల్గొన్నారు.

రైతులు,పేదలే చంద్రబాబుకు ఊపిరి

తాడేపల్లి: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలు కంభంపాటి రామమో హనరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పరిశీలకుడు రవి యాదవ్ సోమవారం తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విచ్చేసి చంద్రబాబు బసచేయనున్న ప్రాం తాన్ని పరిశీలించారు. చంద్రబాబు మంగళవారం తేదీ రాత్రి సీతానగ రంలో బసచేసే దుర్గగుడి కాటే జీని ఆయన పరిశీలించారు. సీతాన గరంలో చంద్రబాబు తన వాహనంలోనే వెంకటే శ్వరస్వామి ఆలయ సమీపంలో వున్న స్థలంలో బసచేస్తే ఇతర వాహనాలు సీతానగరం బోటుయార్డు సమీపంలో వున్న ఖాళీస్థలంలో నిలిపితే ఎలావుం టుందన్న అంశాలను నేతలు పరిశీలించా రు. ఇక చంద్రబాబు భోజనానికి తాడేపల్లి సాయిబాబా మందిర సమీపంలోని ఖాళీ స్థలాల వద్ద లేక స్పెన్సర్ సమీపంలోని డాన్‌బోస్కో పాఠశాల వద్ద ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చించుకున్నారు.

ఈ విషయాలన్నీ బుధవారం ఉదయానికి ఖరారయ్యే సూచలు వున్నాయి. కార్య క్రమంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమా రి, దేశం నేతలు కొల్లి లక్ష్మయ్యచౌదరి, సం కా బాలాజీగుప్తా, అంకవరప్రసాద్, నందం అబద్దయ్య, తాడేపల్లి నేతలు మేకా పుల్లా రెడ్డి, కొర్రపాటి రమణ, కొల నుకొండ ఏష య్య, ఢిల్లీ రామారావు, బెజ్జం రామకృష్ణ, సురేష్, రవి, రమేష్ పాల్గొన్నారు.

బ్యారేజీ వద్దకు పుల్లారావు, మోదుగుల సోమవారం రాత్రి దేశం నేతలు ప్రత్తి పాటి పుల్లారావు, మోదుగుల వేణు గోపా లరెడ్డి, పుష్పరాజ్, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు తదితర నేతలు ప్రకాశం బ్యారేజీ వద్దకు విచ్చే శారు.

చంద్రబాబు పాదయాత్ర ప్రాంతా న్ని పరిశీలించి సీతానగరంలో బస చేసే కంటే విజయవాడ నుంచి 6వ తేదీ ఉద యం పాదయాత్రకు వచ్చి గుంటూరు జిల్లాలో అడుగు పెడితే బాగుంటుందని నేతలు చర్చించుకున్నారు. దాదాపుగా ఇదే విధంగా చంద్రబాబు పర్యటన ఖరా రు కావొచ్చని నేతలు భావిస్తున్నారు.

బాబు రూట్ మ్యాప్‌పై కంభంపాటి కసరత్తు

మంగళగిరిరూరల్/తాడేపల్లి: జిల్లాలో ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే వస్తున్నా.. మీ కోసం పాదయాత్రను విజయవంతం చే యాలని తెదేపా ఎమ్మెల్యేలు కోరారు. చంద్రబాబు బస ఏర్పాట్లను నేతలు పరిశీలించారు. ఈ సం దర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ సాయంత్రానికి చంద్రబాబు తాడేపల్లి చేరుకుంటారని తెలిపారు. సీతానగరంలో బస చేస్తారని, 6వ తేదీ ఉద యం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. చంద్రబాబు 123 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారని, ప్రస్తుతం జిల్లాలో 9 నియోజకవర్గాలు, 150 కిలోమీటర్లు, వందలాది గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తారని, ప్రజలు చంద్రబాబు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ తన ఆరోగ్యం సైతం లెక్కచేయకుండా కాలికి గాయమైనా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో రెండు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసిన దేశం నేత చంద్రబాబేనని, కాంగ్రెస్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందన్నారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, విద్యుత్ చార్జీలు భారాలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. అనంతరం దేశం నేతలు రామకృష్ణ మిషన్ హైస్కూల్‌కు వెళ్లి వాహనాలు పెట్టుకునేందుకు స్వామీజీని అనుమతి కోరగా రాజకీయ పార్టీలకు స్కూలు యాజమాన్యం అంగీకరించదని తిరస్కరించారు.

అనంతరం కొద్దిసేపు అతిథి గృహాన్ని నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేశం నేతలు జేఆర్.పుష్పరాజ్, దూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, మన్నవ సుబ్బారావు, దాసరి రాజా, సంకా బాలాజీగుప్తా, కొల్లి లక్ష్మయ్యచౌదరి, ఆరుద్ర అంకవరప్రసాద్, వల్లూరు సూరిబాబు, నందం అబద్దయ్య, ధనుంజయరావు, జంజనం సాంబశివరావు, తాడేపల్లి దేశం నేతలు కళ్లం బాపిరెడ్డి, మేకా పుల్లారెడ్డి, కొర్రపాటి రమణ, పఠాన్ ఖాశీంఖాన్, పఠాన్ జానీఖాన్, కొలనుకొండ ఏషయ్య, షేక్ రియాజ్, బెజ్జం రామకృష్ణ, కంచర్ల రంగారావు, మునగపాటి వెంకటమారుతీరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు బస ఏర్పాట్ల పరిశీలన ఈ నెల ఆరవ తేదీ నుంచి మంగళగిరి ప్రాంతంలో వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేయనున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బస ఏర్పాట్లను టీడీపీ నేతలు ఆదివారం పరిశీలించారు. చినకాకాని ఎన్నారై మెడికల్ కళాశాల బస ఏర్పాట్లను నేతలు పరిశీలించారు. ఈ బస పరిశీలన కార్యక్రమంలో , మాజీ కౌన్సిలర్లు సంకా బాలాజీగుప్తా, కళ్లం పిచ్చియ్య, మన్నెం మార్కండేయులు, షేక్ రియాజ్, గుత్తికొండ ధనుంజయరావు, వల్లూరు సూరిబాబు, మునగాల సత్యనారాయణ, వాకా మంగారావు తదితరులు వున్నారు.

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి

కొ త్తగా ఎన్నికైన సహకార సంఘాల అధ్యక్షులు రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలుగుదేశం పా ర్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సూ చించారు.  టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన సహకార సొసైటీల అధ్యక్ష, ఉ పాధ్యక్షులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుల్లారావు మా ట్లాడుతూ టీడీపీ పటిష్ఠతకు ప్రతి ఒక్క రు కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన రుణమాఫి పథకాన్ని గ్రామస్థాయిలో రైతుల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రుణమాఫి అమ లు జరుగుతుందన్న భరోసా కల్పించాలన్నారు.

కార్యక్రమంలో టీడీపీ గుంటూరు జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, దాస రి రాజా, చిట్టాబత్తిన చిట్టిబాబు, పేరేచర్ల సొసైటీ అధ్యక్షుడు గూడపాటి వీరారావు, ఉపాధ్యక్షుడు కుంటిగుర్ల ఏడుకొండలు, డైరెక్టర్ ఉడతా వెంకటరావు, ఇ క్కూరు అధ్యక్షుడు బొడ్డపాటి పేరయ్య, బోయపాటి సీతారామయ్య, కుర్రా రత్త య్య, నార్నె శ్రీనివాసరావు, పాములపాటి శివన్నారాయణ, మైనార్టీ సెల్ అ ధ్యక్షుడు దర్గా అబ్దుల్లా, హరిబ్రహ్మయ్య, ముక్కల సుబ్బారావు, పాములపాటి కృ ష్ణారావు, డి. బోసుబాబు పాల్గొన్నారు.

రైతు సమస్యల పై ఉద్యమించాలి

అరవై మూడెళ్ల వయస్సులో నేను నిస్వార్ధంగా చేస్తున్న ఈ పాద యాత్ర నా కోసం కాదు.. మీ కోసమే అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు. తూర్పు నియోజకవర్గంలో చుట్టుగంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముగిసింది. దేవినేని చంద్రశేఖర్, అనీల్‌లను చంద్రబాబు పార్టీ కండవాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో బాబు మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను, కష్టాలను దూరం చేయడానికి గాడి తప్పిన పాలనను దారిలో పెట్టడానికి నేను ఈ యాత్ర చేస్తున్నాను. కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా. ఇక్కడ చైతన్యం ఎక్కువ. అటువంటి మహాపురుషుడు పార్టీ పెట్టి ఢిల్లీ పెద్దలకు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని రుచిచూపించిన వైనం మీ కందరికి గుర్తుండే ఉంటుంది.

రాష్ట్రంలో మార్పు వచ్చిందంటే అది కృష్ణాజిల్లాలో విజయవాడ నగరం నుండే ప్రారంభం అయివుంటుందని అని చెప్పారు.అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం విజయవాడ నుంచి ప్రారంభించాల్సిఉంది. అందు కోసం ప్రతి ఒక్కరు ఒక బొబ్బిలిపులి, చండశాశనుడు, కొండవీటి సింహం కావాలని పిలుపునిచ్చారు. తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉంటూ రాక్షస పాలన చేస్తున్న తల్లి కాంగ్రెస్ ఒక పక్క, పిల్ల కాంగ్రెస్ ఒక పక్క కలిసి విషం కక్కడానికి సిద్ధం అవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలను ఇప్పటికి 29సార్లు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికుందని దుయ్యబట్టారు. గ్యాస్ కోనే పరిస్థితి లేదు. రెండు వందల రూపాయాలకు గ్యాస్‌ను నేను ఇస్తే ఇపుడు నాలుగు వందలు చేశారు. ఆరు సిలెండర్లంటారు, సబ్సిడీ బ్యాంకులో వేస్తాం అంటారు. తీరా మొత్తం ఎత్తేస్తారు జాగ్రత్త అమ్మా అంటూ మహిళలకు అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.

కృష్ణా, గోదావరి జిల్లా నుంచి గ్యాస్ వస్తోంది కానీ ఇక్కడ గ్యాస్ ధర మాత్రం ఆకాశాన్నంటుతుదన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి, బియ్యం కిలో 50 రూపాయాలయ్యాయి, ఉల్లి పాయలు కిలో 40 రూపాయాలయ్యాయి. నా హయాం లో బియ్యం కిలో 12 రూపాయాలు ఉండేవి. ఇపుడు ఉప్పు 10 రూపాయాలు. అపుడు కిలో రెండు రూపాయలే. తలుచుకుంటేనే పేద వాడి కంట్లో కన్నీరు వస్తుంది. 1994- 2004 మధ్య కరెంటు కోత అంటే ఎంటో రాష్ట్రానికి తెలియదు. మరి ఇపుడో అంటూ జనం నుంచి ప్రతిస్పందన కోరారు. దీనికి పెద్ద పెట్టున ఇపుడంతా కొతలే అంటూ నినాదాలు చేశారు. కరెంటు బిల్లులు చూస్తే గుండెలు పగిలిపోతాయి. చెన్నై కలకత్తా రహదారిని మనం వేస్తే వారు వేశామని ఇపుడు తిరుగుతున్నారంటూ ఎగతాళి చేశారు.

భవిష్యత్‌ను అంచనావేసి రోడ్లను వెడల్పుచేస్తే అప్పుడు వద్దని గొడవ చేసి ఇపుడు ఇది తమ ఘనతగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ వారిని ఎగతాళి చేశారు. చాలా ఇళ్లల్లో మరుగు దొడ్లు లేవు. కొండ ప్రాంతంలో చాలా మంది పేదలు ఉంటున్నారని వారందరికి ఇళ్ల జాగాలు ఇస్తాను, లక్షా యాభై వేలతో స్వంత ఇల్లు కట్టిచ్చి ఇస్తానని హామి ఇచ్చారు. పాచి పనులు, తోపుడు బండ్లు, ఆటోలు, లారీలు నడుపుకుంజూ జీవించే పేదలు ఇక్కడ మూడు లక్షల మంది ఉంటారు. వారందరికి మేలు చేసే కార్యక్రమాలు చేపడతానన్నారు. కొండ ప్రాంతాలలోనివాసం ఉండే ప్రజలకు ఉచితంగా ఇళ్లస్థలాలు ఇస్తాను, ఉచితంగా రిజిస్ట్రేషన్‌లు చేయిస్తానని అన్నారు. వృద్దులకు 600 రూపాయాల పెన్షన్, వితంతు, వికలాంగ ఫించన్‌లు ఇస్తానన్నారు. డ్రైవర్‌లందరికి ఐదు లక్షల విలువవైన భీమా చేయిస్తా...వారి ప్లిలలకు ఉచిత విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తానని హామి ఇచ్చారు. విజయవాడ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గుండెకాయ వంటిది, కాని కాంగ్రెస్ వచ్చాక ఈ ఇండస్ట్రీని భ్రష్ఠు పట్టించారన్నారు. కృష్ణా నది పక్కనే ఉండి కూడా ఆటోనగర్‌కు మంచినీరు ఇవ్వలేకపోవడం కంటే సిగ్గుచేటన్నారు.

నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతు రుణాల మాఫీ ఫైలు మీద, రెండోసంతకం బెల్టుషాపుల రద్దు ఫైలు మీద, మూడో సంతకం ఎన్టీయార్ సుజల స్రవంతి పేరుతో ప్రతి గ్రామానికి మంచినీటిని అందించే ఫైలు మీద సంతకం చేస్తానన్నారు.ఇక నాలుగో సంతకం డ్రైవర్‌ల కోసం ఒక ప్రత్యేక పాలసీ తీసుకొచ్చే ఫైలుమీద చేస్తానని ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల గురించి డ్రైవర్‌లు చెబుతూ డొక్కు బస్సులు తోలలేకపోతున్నామని తన దృష్టికి తీసుకొచ్చారని, తాను అధికారంలోకి వస్తే వారికి ఇబ్బందులు ఉండవని హామి ఇచ్చారు.నా ఆరోగ్యం సహకరించకపోయినా..

ఒక సదాశయం కోసం నేను పాదయాత్ర చేస్తున్నా. ఈ క్రమంలో కుడి కాలు, తరవాత ఎడమకాలు చిటికిన వేలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నా ఆగడం లేదు. మీ గురించి ఆలోచించి వత్తిడి పెరిగి వంట్లో షుగర్ లెవల్ పెరిగింది. నాకు ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమస్యలు నన్నేం చేయలేవు అని నవ్వుతు చెప్పారు.

*ప్రజలతో ముఖా ముఖి చివరలో ఆయన సభకు హజరైన వారితో ముఖాముఖి నిర్వహించారు. సభికుల నుంచిఅప్పటికపుడు కొందరికి మైకు ఇప్పించి అవినీతి నిర్మూలన మీద వారి అభిప్రాయాలను అడిగారు. ఈ సందర్భంగా ఒక మాజీ సైనికుడు మాట్లాడుతూ దేశం వెలుపల మేం కాపలా కాస్తుంటే దేశం లోపల అవినీతి పరులు పెరిగిపోతున్నారని అన్నారు. మరోక మహిళ మాట్లాడుతూ అవినీతికి అందరూ అలవాటు పడుతున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని అన్నారు. వేముల పల్లి శ్రీ లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థను మీరు మార్చాలంటే చాలా కష్టమని చెప్పింది. ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నాడు. మరో మహిళ మాట్లాడుతూ మహిళల్లో చీరలకు, పురుషుల్లో క్వార్టర్‌లకు లొంగిపోయేవారు ఉన్నంత కాలం మీలాంటి నిస్వార్ధ పరులు మరలా అధికారంలోకి రాలేరని అన్నారు. వీరందరికి బాబు తనదైన శైలిలో జవాబులు చెప్పారు.

పాదయాత్ర మీకోసమే


సహకార సంఘాల ఎన్నికలు ముగియడంతో కేసీడీసీ బ్యాంకు అధ్యక్ష పదవిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు దృష్టి సారించాయి. మొదట్లో రా జకీయ పక్షాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోయినప్పటికీ చివరికి వచ్చేసరికి ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. ప్రస్తుతానికి సహకార సంఘాల స్థాయిలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే టీడీపీ మద్దతుదార్లు రెండు దశల్లోను మెజార్టీ సాధించారు. అయితే కాం గ్రెస్, వైసీపీల మధ్య విభజన కింది స్థాయిలో ఇంకా పూర్తిగా జరగలేదు. దాంతో జిల్లా స్థాయిలో చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికకు వచ్చే సరికి వైసీపీ అధ్యక్షులు కొందరిని కలుపుకొని కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం లేకపోలేదు.పార్టీ రహితంగా రెండు విడతలుగా జరిగిన ఈఎన్నికల్లో ప్రధాన పార్టీలు బహిరంగంగానే పాలు పంచుకున్నా యి.

ఇప్పటి వరకు సొసైటీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆయా పార్టీల నాయకులు ఇకపై 18న జరగనున్న కేడీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్ష పదవులపై గురి పెట్టాయి. జిల్లాలో మొత్తం 425 సంఘాలుండగా పెనుగంచిప్రోలు సొ సైటీ మినహా మిగిలిన 424 సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అనంతరం 18 సొసైటీలకు స్టే రాగా 406 సొసైటీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వీటిలో తొలివిడతలో 89 సొ సైటీలకు ఎన్నికలు జరగ్గా, 105 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. రెం డో విడతలో భాగంగా 212 సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 119 ఏకగ్రీవం కాగా 93 సంఘాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి.

టీడీపీదే హవా సోమవారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు అధిక చోట్ల గెలుపొందారు. గుడివాడ, నూజివీడు డివిజన్లలో కలిపి 93 సంఘాలకు ఎన్నికలు జరగ్గా వాటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు 47 చోట్ల విజయం సాధించారు. మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ 17, వైసీపీ మద్దతుదార్లు 17 మంది గెలుపొందిన వారిలో ఉన్నారు. ఐదు చోట్ల స్వతంత్రులు గెలవగా, ఏడు సొసైటీల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.

రెండో దశలోనూ టీడీపీ జోరు

నూజివీడు డివిజన్‌లోని 14 మండలాల్లో సోమవారం నాడు జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిం చింది. ఎన్నికలు జరిగిన 64 సంఘాలకు 50 శాతం అనగా 32 సంఘాలను తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుని, విజయం బావుట ఎగురవేసింది. కాంగ్రెస్ కు 10 సొసైటీలు, వైసీపీ 12 సొసైటీలు, స్వతంత్ర అభ్యర్థులకు 3 సొసైటీలు దక్కగా, 5 సొసైటీల ఎన్నికలు టై కాగా, రెండు సొసైటీలు ఎన్నికల ఫలితం పెండింగ్‌లో ఉన్నాయి.ఉయ్యూరు మండలంలో 4సొసైటీల ఎన్నికలు జరగ్గా, రెండు కాంగ్రెస్‌కు, ఒక స్వతంత్ర అభర్థికి దక్కాయి. వీరవల్లి మొఖాసాగ్రామంలో కాంగ్రెస్, టీడీపీ, చెరిసగం స్థానాలు చేజిక్కించుకుని టై సాధించాయి. ముసునూరు మండలంలో 4 సొసైటీల్లో , రెండు తెలుగుదేశం, రెండు వైసీపీ, ఆగిరిపల్లిలోని 4 సొసైటీలకు 3 వైసీపీ, ఒకటి టీడీపీ దక్కించుకున్నాయి.

గన్నవరం మండలంలో 6 సొసైటీ లకు ఎన్నికలు జరగ్గా, రెండు సొసైటీల ఎన్నికల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ ఖాతాలో 2, కాంగ్రెస్ 1, స్వతంత్ర ఒకటి పడ్డాయి. తిరువూరు మండలంలో 5 సొసైటీలకు మూడు టీడీపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి వైసీపీకి దక్కాయి. విస్సన్నపేట మండలంలో రెండు సొసైటిల్లో ఒకటి టీడీపీకి దక్కగా, కొర్లమండ సొసైటిలో టీడీపీకి 6, కాంగ్రెస్‌కు 3, వైసీపీకి 3 దక్కి టై అయ్యాయి. ఉంగుటూరు మండలంలో ఐదు సొసైటిలకు 3 టీడీపీ, 2 కాంగ్రెస్ కు దక్కాయి. నూజివీడు మండలంలో ఐదు సొసైటీల్లో టీడీపీకి 2, వైసీపీకి 2, కాంగ్రెస్ కు ఒకటి, చాట్రాయి మండలంలో2 సొసైటీల్లో ఒకటి టీడీపీకి దక్కగా ఒకటి టై అయ్యింది.

బాపులపాడు మండలంలో 7 సొసైటిల్లో టీడీపీకి 4, వైసీపీకి 3, ఏ.కొండూరు మండలంలోనాలుగు సొసైటీల్లో 3 టీడీపీకి, ఒకటి కాంగ్రెస్ కు దక్కాయి. రెడ్డిగూడెం మండలంలో రెండు సొసైటీ ఒకటి కాంగ్రెస్ కు దక్కగా, శ్రీరాంపురం టై అయ్యింది. పమిడిముక్కల మండలంలో 7 సొసైటీల ఎన్నికల్లో 3 టీడీపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి వైసీపీ ఒకటి స్వతంత్రులకు దక్కగా, ఒక సొసైటీ టై అయ్యింది. గంపలగూడెం మండలంలో 7 సొసైటీలు టీడీపీకే దక్కటం విశేషం.పెండింగ్, టై అయిన వాటిలో కూడా ఎక్కువశాతం టీడీపీ ఖాతాలో జమ అయ్యేఅవకాశం కనిపిస్తోంది.ఏకగ్రీవంగా ఎన్నికైన సొసైటీల్లో తెలుగుదేశం 26, కాంగ్రెస్ 20, వైసీపీ 11, స్వతంత్ర అభ్యర్థులకు 5 దక్కాయి.

నూజివీడు డివిజన్‌లో టీడీపీ ఘన విజయం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. భారతీనగర్లోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు పనితీరు, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడినై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. తన రాకను జిల్లాలోని తెలుగుదేశం నాయకులంతా స్వాగతించారని, తాను పార్టీలోకి రావడానికి ఎవరి ప్రోద్బలం లేదన్నారు. ముందుగా నాయకులందరి సహకారంతో జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తేవడమే కాకుండా యువతను చైతన్య వంతులను చేయాలని నిశ్చయించుకున్నానన్నారు. పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా తిరిగి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధి నేడు పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఏపని చేయడానకైనా సిదంగా ఉన్నానని చెప్పారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ప్రశ్న: మీ పెదనాన్న కాంగ్రెస్‌లో ఉండగా మీరు తెలుగుదేశంలోకి వస్తున్నారేంటి జవాబు: మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు చంద్రబాబు సిద్ధాంతాలకు ఇష్టపడి పార్టీలో చేరుతున్నాను. ఎవరి సిద్ధాంతాలు వారివి అంటూ నవ్వారు ప్రశ్న: మీ తండ్రి సమ్మతంతోనే పార్టీలోకి వచ్చారా జవాబు: మా నాన్నగారి సిద్ధాంతాలు వేరు, ఆయనకు నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేదు. అయితే ఆయనను ఒప్పించుకోగలనన్న పూర్తి నమ్మకం ఉంది

ప్రశ్న: పెనమలూరు ఎమ్మెల్యే సీటు ఆశించి పార్టీలోకి వస్తున్నారా జవాబు: నేను ఏప్రాంతంలోనూ ఎమ్మెల్యే సీటు కోసం ఆశపడి పార్టీలోకి రావడంలేదు, సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి మాత్రమే వస్తున్నాను. అయితే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను

ప్రశ్న: దేవినేని అవినాష్ యూత్ కాంగ్రెస్‌లో పనిచేస్తుంటే నిన్నమొన్నటి వరకు ఆయన వెంట తిరిగి నేడు టీడీపీలోకి వస్తున్నారేంటి జవాబు: నేను ఎన్నడూ స్టేజీలు ఎక్కిఎక్కడా మాట్లాడలేదు. ఏపార్టీ జెండాను బుజాన వేసుకోలేదు.

నేటినుంచే తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన వేసుకుని కష్టపడి పనిచేయాలనిర్ణయించుకున్నాను

ప్రశ్న: మీరాకను కొంతమంది వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మీరేమంటారుజవాబు: అదేమీలేదు అందరూ ఆహ్వానిస్తున్నారు. అందరినీ కలుపుకుపోతా,అందరితోనూ కలిసి పనిచేస్తా

టీడీపీకి పూర్వ వైభవానికి కృషి చేస్తా